Nirahara Deeksha
-
హరిజనాభ్యుదయానికి నిరాహార దీక్ష
ఇక్కడ కనబడే ఫోటో గమనించారా? ఆంధ్ర రాష్ట్రం సాధించడానికి మొదలు పెట్టిన దీక్ష ముందు రోజు అంటే 1952 అక్టోబరు 18న మదరాసులో తీసిన ఫోటో ఇది! కుర్చీలో కూర్చున్న ఆ వ్యక్తి 52 ఏళ్ళ పొట్టి శ్రీరాములు. ఈ ఫొటో దాదాపు మనందరికీ పరిచయం కానిదే! ఇదే విధంగా ఆ మహానుభావుడి గురించి తెలియని విషయాలు చాలా ఉన్నాయనిపిస్తుంది. ఉత్తర భారత దేశంలో హిందూ–ముస్లిం మతపరమైన విభేదాలే అతి పెద్ద సమస్య అని ఆ తరం మహానాయకులంతా భావించారు. అయితే దక్షిణ భారతదేశంలో అంటరానితనంతో దాపురించిన అట్టడుగు వర్గాల అధ్వాన్న స్థితి చాలా పెద్ద అవరోధమనీ, ఆ సమస్య గురించి ఆలోచించాలనీ నాలుగుసార్లు నిరాహారదీక్షలు చేసినవారు అమరజీవి పొట్టి శ్రీరాములు! బ్రిటిష్ పాలనలో 1946 మార్చి 7వ తేదీన పది రోజులపాటు నెల్లూరు మూలాపేట వేణు గోపాల స్వామి గుడిలో నిరాహారదీక్ష చేసి హరిజన ప్రవే శాన్ని సాధించారు. అటు సింహాచలం నుంచి ఇటు తిరు మల దాకా తెలుగు ప్రాంతాలలోనే కాక; మదరాసు ప్రెసి డెన్సీలోని తమిళ, కన్నడ ప్రాంతపు దేవాలయాలన్నింటిలోనూ హరిజనులకు ప్రవేశం కల్గించే బిల్లును ఆమో దింపచేయడానికి అదే 1946 నవంబర్ 25 నుంచి 19 రోజులపాటు నిరాహారదీక్ష చేసి విజయం సాధించారు. నిజానికి 1944 అక్టోబరు 2 గాంధీజీ 75వ జన్మ దినోత్సవ సందర్భంగా అస్పృశ్యతకు వ్యతిరేకంగా కావ లిలో వివిధ కార్యక్రమాలు ప్రారంభించారు. దానికి ముందు శ్రీరాములు సబర్మతీ ఆశ్రమంలో మూడు సంవత్స రాలుండి నూరుపాళ్ళు గాంధేయవాదిగా మారారు. మేన మామ, తన భార్య సీతమ్మ తండ్రి అయిన గునుపాటి నర్సయ్య తీవ్ర అనారోగ్యానికి లోను కావడంతో, 1937 నుంచి నెల్లూరు జిల్లాతోపాటు ఇతర తెలుగు ప్రాంతాలు పొట్టి శ్రీరాములుకు కార్యక్షేత్రాల య్యాయి. హరిజనులకు దేవా లయ ప్రవేశంతో అన్ని సమ స్యలు తీరవని ఖాదీ ప్రచారం, మద్యపాన నిషేధం. జైళ్ళ సంస్కరణలు, వివాహ సంప్ర దాయాలలో మార్పులు వంటి వాటికి సంబంధించి కృషి చేస్తూ వచ్చారు. తన స్ఫూర్తిదాత గాంధీజీ మరణించడంతో కలత చెందిన శ్రీరాములు, ఆయన స్మృతి కోసం ఒక ప్రణాళికను సిద్ధం చేశారు. ఆ ప్రతిపాదనలను ఉమ్మడి మదరాసు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. దానితో ఏడు న్నర దశాబ్దాల క్రితం అంటే 1948 సెప్టెంబర్ 10న మద రాసులో అప్పటి ముఖ్యమంత్రి కార్యాలయం ఎదుట శ్రీరాములు నిరాహారదీక్ష ప్రారంభించారు. మన సమాజానికి చాలా కీలకమైన తేదీగా సెప్టెంబర్ 10ని గుర్తు పెట్టుకోవాలి. స్వాతంత్య్రం సంపాదించుకున్న భారతదేశంలో పొట్టి శ్రీరాములు చేసిన తొలి దీక్ష కూడా ఇది. హరిజనుల అభ్యున్నతి కోసం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మొదలైన ఈ దీక్ష ఫలితంగా న్యూసెన్స్ యాక్ట్ కింద మదరాసులోనే శ్రీరాములు నెలరోజుల శిక్ష మీద జైలు పాలయ్యారు. జైల్లో కూడా అలాగే దీక్ష కొనసాగించారు. జైలులో రక్తాన్ని కక్కుకునే పరిస్థితి కూడా దాపురించింది. అలాంటి స్థితిలో విడుదలైతే మరల దీక్షకు పూనుకోకుండా తనను వికలాంగుణ్ణి చేయాలని ప్రభుత్వం యత్ని స్తున్నట్టు పొట్టి శ్రీరాములు (1948 సెప్టెంబర్ 29 ఆయనే రాసిన ఉత్తరంలో) భావించారు. దాంతో ఆయన అర్ధంతరంగా దీక్షను ఆపివేసినపుడు జైలు నుంచి విడుదల చేశారు. తన లక్ష్య సాధన కోసం దీక్షా రంగస్థలాన్ని వార్ధా ఆశ్రమానికి మార్పు చేసి, 1949 జనవరి 12 నుంచి మళ్ళీ ప్రారంభించారు. ఈ నాలుగో సత్యాగ్రహ దీక్ష 28 రోజుల పాటు చేసి ఉమ్మడి మద రాసు ప్రభుత్వంతో ప్రతి నెల 30వ తేదీ (ఫిబ్రవరి నెల అయితే 28 లేదా 29) ‘హరిజన సేవా దినోత్సవం’గా జరిపేలా చట్టం చేయించి, అట్టడుగు వర్గాల అభ్యున్నతిని వాంఛించారు. ఆ చట్టమయితే వచ్చింది కానీ ఫలితం మాత్రం హుళక్కి! డా‘‘ నాగసూరి వేణుగోపాల్ వ్యాసకర్త ఆకాశవాణి మాజీ ఉన్నతోద్యోగి మొబైల్: 94407 32392 -
YS Sharmila Deeksha: నేను ఎందుకు వెనక్కి తగ్గాలి?: వైఎస్ షర్మిల
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్టీపీ ఆధ్వర్యంలో ‘టీ–సేవ్’ నిరుద్యోగ దీక్షను ఆ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బుధవారం ఇందిరాపార్కు వద్ద చేపట్టారు. ఈ దీక్షలో ప్రజా సంఘాలు, విద్యార్ధి సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా వైఎస్ షర్మిల మాట్లాడుతూ, ‘‘నేను ఎందుకు వెనక్కి తగ్గాలి. రాజకీయాలంటేనే చీదరించుకునే దానిని.. మాకు పోలీసులతో గొడవ పెట్టుకోవడానికి ఏం అవసరం. తెలంగాణ యువత కోసం పోరాడుతున్నా. నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి తేవడానికి వైఎస్ హయాంలో పోలీసులు పనిచేశారు. సెల్ఫ్ డిఫెన్స్‌లో చేశాను తప్ప.. పోలీసులను కించపరచాలని కాదు’’ అని పేర్కొన్నారు. ‘‘బంగారు తెలంగాణ ఎక్కడ?. కల్వకుంట్ల కుటుంబం బంగారు తెలంగాణగా మారింది. సిట్ విచారణ కొండను తవ్వి ఎలుకను పట్టే విధంగా ఉంది. సిట్ విచారణలో సూత్రధారులను వదిలేశారు. రెండోసారి అధికారంలోకి వచ్చాక కేసీఆర్ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ప్రభుత్వ శాఖల్లో సమాచారం తీసుకోవడం అంత సులభమా?. ఐపీ అడ్రస్, పాస్వర్డ్ తెలిస్తే చాలా?. కేటీఆర్ తనకేమీ సంబంధం అంటున్నారు. ఐటీశాఖ బాధ్యతలు ఏంటో మీకు తెలుసా?. ఐటీ చట్టం-2000 వరకు అన్ని శాఖల్లో వాడే కంప్యూటర్లకు ఐటీ శాఖదే బాధ్యత. 2018లో టీఎస్పీఎస్సీలో కంప్యూటర్లు కొన్నారు.. ఐటీశాఖ సైబర్ సెక్యూరిటీ ఆడిట్ ఎప్పుడైనా చేసిందా?’’ అని షర్మిల ప్రశ్నించారు. ‘‘సైబర్ సెక్యూరిటీ ఆడిట్ జరిగి ఉంటే పేపర్ లీకేజీ జరిగేది కాదు. సిట్ అధికారులను ప్రగతిభవన్ గుప్పెట్లో పెట్టుకున్నారు. తీగలాగితే ఐటీ డొంక కదులుతుంది. కేటీఆర్‌ను కాపాడటానికే సిట్ ప్రయత్నం చేస్తుంది. దమ్ముంటే సీబీఐ దర్యాప్తు కోరండి. కేసీఆర్‌కు 10 ప్రశ్నలతో కూడిన ప్రశ్నాపత్రం పంపుతున్నా’’ అని షర్మిల అన్నారు. చదవండి: TS: వాతావరణశాఖ హెచ్చరిక.. ఆరు జిల్లాలకు భారీ వర్ష సూచన -
రవీంద్ర నాయక్ కుటుంబానికి అండగా వైఎస్ షర్మిల
-
వైరల్: ‘నారప్ప’ సినిమా.. వెంకీ అభిమాని నిరాహార దీక్ష
కరోనా వ్యాప్తి కారణంగా తెలుగు రాష్ట్రాల్లో లాక్డౌన్ విధించిన సంగతి తెలిసిందే. దీంతో థియేటర్లన్నీ మూత పడ్డాయి. ప్రస్తుతం కోవిడ్ కేసులు పరంగా కాస్త కుదుటపడగా, ప్రభుత్వాలు అన్‌లాక్ ప్రక్రియను మొదలు పెట్టాయి. కానీ డెల్టా వైరస్ తాకిడి నేపథ్యంలో ధియేటర్లను ఇప్పట్లో తెరిచే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో రిలీజ్‌కు రెడీగా ఉన్న సినిమాలన్నీ ఓటీటీ వైపే అడుగులేస్తున్నాయి. తాజాగా వెంకటేష్ నటించిన ‘నారప్ప’ సినిమా కూడా ఓటీటీ వైపే మొగ్గు చూపగా, వెంకి అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల్లో వెంకటేష్ నటించిన నారప్ప, దృశ్యం 2 సినిమా లను ఓటీటీ ద్వారా విడుదల చేసేందుకు సురేష్ బాబు సుముఖంగా ఉండడంతో పాటు సన్నాహాలు కూడా పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో వరంగల్ కు చెందిన అల్లుడు కిరణ్ తమ అభిమాన హీరో వెంకటేష్ సినిమా నారప్పను థియేటర్లోనే చూడాలని కోరుకుంటున్నాడు. అందుకు బదులుగా అతను ఓటీటీ రిలీజ్ కు వ్యతిరేకంగా ఒక్క రోజు నిరాహార దీక్ష ను చేపట్టాడు. వెంకీ సినిమాను థియేటర్లలోనే విడుదల చేయాలంటూ అతన ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాడు. అందుకు ఫ్లకార్డు పట్టుకుని నిల్చున్న ఫోటోను కిరణ్ షేర్ చేయగా అది ప్రస్తుతం వైరల్‌గా మారి నెట్టింట హల్ చల్ చేస్తోంది. A protest against... #Narappa OTT release by @VenkyMama Fan Please @SBDaggubati Sir.. We demand @SureshProdns #WeWantNarappaInTheatres@Alludukiran2@theVcreations pic.twitter.com/Mhjeh6TPHT — Krish Narappa (@Krish_kaval) June 29, 2021 చదవండి: ఆర్ఆర్ఆర్ పోస్టర్‌పై ‘డాక్టర్ బాబు’.. ఇదేం వాడకం బాబోయ్ -
సడలని దీక్ష
రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఢిల్లీలో వైఎస్సార్సీపీ ఎంపీలు చేపట్టిన ఆమరణ దీక్షకు సంఘీభావంగా జిల్లాలో ఆ పార్టీ నాయకులు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రెండో రోజైన ఆదివారమూ కొనసాగాయి. పట్టు సడలకుండా దీక్షల్లో పాల్గొని హోదా నినాదాన్ని హోరెత్తించారు. పార్టీ నాయకులకు జనం కూడా తోడు కావడంతో ఉద్యమం ఉద్ధృతమైంది. చిత్తూరు, సాక్షి : జిల్లాలో వైఎస్సార్ సీపీ నాయకులు చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. ఆదివారం రిలే నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, వంటా వార్పులతో నిరసన తెలియజేశారు. నగరి ఎమ్మెల్యే ఆర్కే.రోజా స్థానిక క్లాక్‌టవర్ సమీపంలో రిలే నిరాహార దీక్ష చేశారు. నగరి మున్సిపల్ చైర్పర్సన్ కేజే శాంతి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. హోదాతోనే రాష్ట్రానికి భవిష్యత్ ఉంటుందని రోజా అన్నారు. తంబళ్లపల్లి నియోజకవర్గం బి.కొత్తకోటలో పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష జరిగింది. దీక్ష అనంతరం జ్యోతిచౌక్‌లో రాస్తారోకో నిర్వహించారు. కుప్పం సర్కిల్లో జరిగిన రిలే నిరాహార దీక్షలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. సత్యవేడు, నాగలాపురంలో జరిగిన దీక్షల్లో నియోజకవర్గ సమన్వయకర్త ఆదిమూలం పాల్గొన్నారు. చిత్తూరు గాం«ధీ సర్కిల్లో వైఎస్సార్ బీసీ, ఎస్సీ సెల్ యువజన విభాగం ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పార్టీ చిత్తూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు, జ్ఞానజగదీశ్, పురుషోత్తంరెడ్డి పాల్గొన్నారు. పార్టీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గాయత్రీదేవి వంటావార్పు కార్యక్రమం చేపట్టారు. చంద్రగిరి నియోజకవర్గం తుమ్మలగుంటలో జరిగిన దీక్షలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు దామినేటి కేశవులు పాల్గొన్నారు. ఈ దీక్షకు ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు మేరుగ నాగార్జున సంఘీభావం తెలిపారు. శ్రీకాళహస్తి, రేణిగుంట, ఏర్పేడు మండలాల్లో ఆ పార్టీ నాయకులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో వైఎస్సార్ విద్యార్థి విభాగం నాయకులు హరిప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు జరిగాయి. ఆ పార్టీ కార్యకర్త వాసుమయ్య గుండు కొట్టుకొని టీడీపీ, బీజేపీ ఎంపీలకు పిండ ప్రదానం చేశారు. తుడా సర్కిల్లో మహిళలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పలమనేరులో వైఎస్సార్ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో దీక్ష చేపట్టారు. జీడీ నెల్లూరు నియోజకవర్గం పెనుమూరు, వెదురుకుప్పం కార్వేటినగరం, ఎస్సార్‌పురం మండలాల్లో రిలే నిరాహారదీక్షలు నిర్వహించారు. పెనుమూరు, వెదురుకుప్పంలో జరిగిన దీక్షలకు మాజీ ఎంపీ జ్ఞానేంద్రరెడ్డి సంఘీభావం తెలిపారు. పుంగనూరు నియోజకవర్గంలో పుంగనూరు, రొంపిచెర్లలో రిలే నిరాహార దీక్షలు జరి గాయి. రొంపిచెర్లలో జరిగిన దీక్షకు మైనారిటీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఇబ్రహీంఖాన్ పాల్గొన్నారు. పుంగనూరులో రెడ్డెప్ప పాల్గొన్నారు. పూతలపట్టు నియోజకవర్గం తవణంపల్లిలో మండల నాయకులు వంటావార్పు, రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. పీలేరులో జరిగిన వైఎస్సార్ విద్యార్థి విభాగం దీక్షకు పెద్దిరెడ్డి సుధీర్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. మదనపల్లె అన్నమయ్య సర్కిల్లో వైఎస్సార్సీపీ నాయకులు వంటావార్పు కార్యక్ర మం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. -
స్పష్టం చేసిన ఎమ్మెల్సీ ... వెనుతిరిగిన మంత్రి
అనంతపురం: ప్రభుత్వాసుపత్రిలో మౌలిక వసతులపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్ష విరమించేది లేదని ఎమ్మెల్సీ గేయానంద్ స్పష్టం చేశారు. బుధవారం ప్రభుత్వాసుపత్రి వద్ద ఆయన దీక్షకు ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయి. ఆయనకు సంఘీభావంగా ఆయా సంఘాలు ఆందోళనలో పాల్గొన్నాయి. అయితే దీక్ష చేస్తున్న గేయానంద్‌ను కలిసేందుకు వచ్చిన మంత్రి పల్లె రఘునాథ రెడ్డిని ప్రజా సంఘాలు అడ్డుకున్నాయి. ఆ క్రమంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌తో గేయానంద్‌ను మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఫోనులో మాట్లాడించారు. దీనిపై స్పష్టమైన హామీ ఇచ్చే వరకు దీక్ష విరమించే ప్రసక్తే లేదని గేయానంద్ మంత్రి కామినేనితో స్పష్టం చేశారు. దీంతో మంత్రి పల్లె రఘునాథరెడ్డి వెనుదిగిరి వెళ్లిపోయారు. అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మౌలిక వసతులు కల్పించాలని గత కొంతకాలంగా ప్రభుత్వాన్ని ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా... స్పందించకపోవడంతో ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ ఆసుపత్రి ఎదుట నిరాహార దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. -
రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న జగన్ అన్నను సపోర్ట్ చేస్తాం
-
ట్రిబ్యునల్ తీర్పుకు నిరసనగా విజయమ్మ దీక్ష