nit srinagar
-
ఎన్ఐటీలో స్థానికేతరుల ర్యాలీ
అడ్డుకున్న భద్రతా బలగాలు శ్రీనగర్: తమ డిమాండ్లను పరిష్కరించాలని శ్రీనగర్ ఎన్ఐటీలోని స్థానికేతర విద్యార్థులు వరుసగా నాలుగో రోజూ ఆందోళనలను కొనసాగించారు. శుక్రవారం విద్యార్థులు చేపట్టిన ఆందోళన క్యాంపస్‌ను కుదిపేసింది. వారు క్యాంపస్‌లో ప్రధాన ద్వారం వద్దకు ర్యాలీగా బయలుదేరగా భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. క్యాంపస్ బయటున్న మీడియాతో మాట్లాడనివ్వాలని విద్యార్థులు కోరినట్లు అధికారులు చెప్పారు. జాతి వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న ఎన్ఐటీ అధికారులపై, లాఠీచార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని, క్యాంపస్‌ను కశ్మీర్ నుంచి తరలించాలని నినాదాలు చేశారన్నారు. స్థానిక, స్థానికేతర విద్యార్థుల మధ్య ఘర్షణలతో క్యాంపస్‌లో ఉద్రిక్తత నెలకొనడం తెలిసిందే. స్థానికేతరుల డిమాండ్లను స్థానిక విద్యార్థులు వ్యతిరేకించారు. క్యాంపస్‌లో బలగాలను శాశ్వతంగా ఉంచితే చదువుకు ఇబ్బంది అవుతుందన్నారు. తాము జాతి వ్యతిరేకులమంటూ వస్తున్న ఆరోపణలను పోలీసులు తోసిపుచ్చారు. -
విద్యార్థులకు భద్రత కల్పిస్తాం: రాజ్ నాథ్
శ్రీనగర్: శ్రీనగర్ ఎన్ఐటీలో ఇతర రాష్ట్రాల విద్యార్థులకు రక్షణ కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ భరోసాయిచ్చారు. నాన్ విద్యార్థులపై దాడులు జరిగిన నేపథ్యంలో కేంద్రం స్పందించింది. కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీతో మాట్లాడినట్టు ఆయన వెల్లడించారు. విద్యార్థులకు భద్రతకు తగిన చర్యలు చేపడతామని తనకు ముప్తీ తెలిపారని చెప్పారు. మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ముఫ్తీని కలిసి మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారని అన్నారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు డైరెక్టర్ స్థాయి ఇద్దరు అధికారులను కశ్మీర్ ఎన్ఐటీకి పంపాలని మానవ వనరుల శాఖ కార్యదర్శిని ఆదేశించినట్టు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఇద్దరు సభ్యుల బృందం విద్యార్థులను అడిగి వివరాలు సేకరిస్తుందని కశ్మీర్ విద్యాశాఖ మంత్రి నయీమ్ అక్తర్ చెప్పారు. టీ20 ప్రపంచ కప్‌లో టీమిండియాకు మద్దతుగా నాన్ లోకల్ విద్యార్థులు సెలెబ్రేషన్స్ చేసుకోగా, స్థానిక విద్యార్థులు టీమిండియాకు వ్యతిరేకంగా పాకిస్థాన్‌కు మద్దతుగా సంబరాలు చేసుకున్నారు. ఈ విషయంలో లోకల్, నాన్ లోకల్ విద్యార్థులు ఘర్షణ పడటంతో వారం రోజులుగా ఉద్రిక్తత కొనసాగుతోంది. -
శ్రీనగర్ వరదల్లో చిక్కుకున్న ముఖేష్ క్షేమం
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ వరదల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థి ముఖేష్ సురక్షితంగా ఉన్నాడు. కాలేజీ క్యాంపస్‌లోకి భారీగా వరద నీరు చేరడంతో కొట్టుకుపోయిన ముఖేష్ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. సురక్షిత ప్రాంతంలో ఉన్నట్టు సమాచారం అందించాడు. కాగా నిరాశ్రయుడు కావడంతో తన దగ్గర డబ్బులు లేవని, సాయం చేయాల్సిందిగా ముఖేష్ ప్రభుత్వాన్ని కోరాడు. అనంతపురం జిల్లా కొత్తచెరువు ప్రాంతానికి చెందిన ముఖేష్ శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో చదువుకుంటున్నాడు. జమ్మూకాశ్మీర్‌లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంతంలో భారీగా వరద నీరు చేరింది. ఈ పరిస్థితిని గమనించిన ఎన్ఐటీ అధికారులు.. వెంటనే విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అయితే ముఖేష్ వరదల్లో చిక్కుకుపోవడంతో సహ విద్యార్థులతో పాటు అతని కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. అతను సురక్షితంగా ఉన్నాడని సమాచారం రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో ముంచుకొచ్చిన వరదల్లో 60 మంది తెలుగు వాళ్లు చిక్కుకున్నారు. -
శ్రీనగర్ వరదల్లో తెలుగు విద్యార్థి గల్లంతు
జమ్ము కాశ్మీర్ ప్రాంతంలో ముంచుకొచ్చిన వరదల్లో 60 మంది తెలుగు వాళ్లు చిక్కుకున్నారు. తాజాగా శ్రీనగర్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ప్రాంతంలో కూడా భారీగా వరద నీరు చేరుకుంది. అనంతపురం జిల్లా కొత్తచెరువు ప్రాంతానికి చెందిన ముఖేష్ అనే ఎన్ఐటీ విద్యార్థి ఈ వరద నీటిలో పడి గల్లంతు అయినట్లు తెలిసింది. దాంతో ముఖేష్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఈ పరిస్థితిని గమనించిన ఎన్ఐటీ అధికారులు.. వెంటనే విద్యార్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ప్రాంతానికి చెందిన ఓ విద్యార్థి ఇలాగే సురక్షిత ప్రాంతానికి చేరుకున్నట్లు అతడి తల్లిదండ్రులు తెలిపారు.