శ్రీనగర్: శ్రీనగర్ ఎన్ఐటీలో ఇతర రాష్ట్రాల విద్యార్థులకు రక్షణ కల్పిస్తామని కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ భరోసాయిచ్చారు. నాన్ విద్యార్థులపై దాడులు జరిగిన నేపథ్యంలో కేంద్రం స్పందించింది. కశ్మీర్ సీఎం మెహబూబా ముఫ్తీతో మాట్లాడినట్టు ఆయన వెల్లడించారు. విద్యార్థులకు భద్రతకు తగిన చర్యలు చేపడతామని తనకు ముప్తీ తెలిపారని చెప్పారు.
మానవ వనరుల శాఖ మంత్రి స్మృతి ఇరానీ ముఫ్తీని కలిసి మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారని అన్నారు. వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు డైరెక్టర్ స్థాయి ఇద్దరు అధికారులను కశ్మీర్ ఎన్ఐటీకి పంపాలని మానవ వనరుల శాఖ కార్యదర్శిని ఆదేశించినట్టు రాజ్ నాథ్ సింగ్ తెలిపారు. ఇద్దరు సభ్యుల బృందం విద్యార్థులను అడిగి వివరాలు సేకరిస్తుందని కశ్మీర్ విద్యాశాఖ మంత్రి నయీమ్ అక్తర్ చెప్పారు.
టీ20 ప్రపంచ కప్లో టీమిండియాకు మద్దతుగా నాన్ లోకల్ విద్యార్థులు సెలెబ్రేషన్స్ చేసుకోగా, స్థానిక విద్యార్థులు టీమిండియాకు వ్యతిరేకంగా పాకిస్థాన్కు మద్దతుగా సంబరాలు చేసుకున్నారు. ఈ విషయంలో లోకల్, నాన్ లోకల్ విద్యార్థులు ఘర్షణ పడటంతో వారం రోజులుగా ఉద్రిక్తత కొనసాగుతోంది.
విద్యార్థులకు భద్రత కల్పిస్తాం: రాజ్ నాథ్
Published Wed, Apr 6 2016 5:44 PM | Last Updated on Fri, Nov 9 2018 4:10 PM
Advertisement
Advertisement