
విద్యార్థిని నుంచి స్మృతికి ఊహించని ప్రశ్న
విజయవాడ: విజయవాడ పర్యటనకు వచ్చిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి స్మృతీ ఇరానీకి ఊహించని ప్రశ్న ఎదురైంది. మంగళవారం కేబీఎన్ కాలేజీలో స్మృతి విద్యార్థులతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా దుర్గ అనే విద్యార్థిని మాట్లాడుతూ.. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించింది. అయితే ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వని కేంద్ర మంత్రి తన శాఖ పరిధిలోనే విషయాలు చెప్పారు.
ఆంధ్రప్రదేశ్కు ఏడాదిలోనే 11 కేంద్ర విద్యాసంస్థలను మంజూరు చేశామని స్మృతి చెప్పారు. ఏపీ ప్రజలు కోరుకుంటున్న ప్రతి ఒక్క అభ్యర్థనను నెరవేర్చుతామని అన్నారు.