
స్మృతి ఇరానీ కార్యాలయం ముట్టడి!
న్యూఢిల్లీ: హెచ్‌సీయూలో దళిథ విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్యకు నిరసనగా దేశ రాజధాని ఢిల్లీలో విద్యార్థులు ఆందోళన నిర్వహించారు. వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర హెచ్చార్డీ మంత్రి స్మతి ఇరానీ కార్యాలయం ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకొని పలువురిని అరెస్టు చేశారు.
వేముల రోహిత్‌ది ఆత్మహత్య కాదు హత్య అని విద్యార్థులు ఆరోపించారు. కేంద్రమంత్రి దత్తాత్రేయ స్మతి ఇరానీకి లేఖ రాయడం వల్లే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని పేర్కొన్నారు. స్మృతి ఇరానీ కార్యాలయం ఎదుట విద్యార్థుల ఆందోళనతో ఉద్రిక్తత నెలకొంది.