nizam rulers
-
Telangana Liberation Day 2022: మందు పాతరలు.. చివరి అస్త్రం
సాక్షి, హైదరాబాద్: భారత ప్రధాన సైన్య విభాగం బొల్లారం చేరకుండా చివరి ప్రయత్నంగా నిజాం సైన్యం మందుపాతర్లను ప్రయోగించింది. షోలాపూర్–హైదరాబాద్ రహదారి మీదుగా వస్తున్న మేజర్ జనరల్ చౌదురీ నేతృత్వంలోని సైనిక బృందాన్ని హతమార్చేందుకు నిజాం సైన్యం సికింద్రాబాద్‌కు 20 మైళ్ల దూరంలో పెద్ద సంఖ్యలో మందుపాతర్లను అమర్చింది. అదే సమయంలో భారత సైన్యానికి పట్టుబడ్డ కొందరు నిజాం సైనికులు ఈ విషయాన్ని వెల్లడించారు. వాటిని తొలగించాల్సిందిగా భారత సైన్యం ఆదేశించింది. కానీ, వాటిని జాగ్రత్తగా వెలికితీసే విధానంపై అవగాహన లేకపోవడంతో ఆ సైనికులు చేతులెత్తేశారు. దీంతో భారత సైన్యంలోని నిపుణులు ఐదు గంటలు కష్టపడి వాటిని గుర్తించి, నిర్వీర్యం చేశారు. ఈ మందుపాతర్ల వ్యవహారం వల్ల భారత సైన్యం ఐదు గంటలు ఆలస్యంగా బొల్లారం చేరుకుంది. సాయంత్రం నాలుగున్నరకు సికింద్రాబాద్ శివార్లలో నిజాం సైన్యాధ్యక్షుడు మేజర్ జనరల్ ఎడ్రూస్ ఎదురేగి చౌదురీ బృందానికి స్వాగతం పలికాడు. నిజాం సేనల లొంగుబాటు పత్రాన్ని సమర్పించాడు. ఇండియన్ ఆర్మీని తోడ్కొని భారత ప్రభుత్వ ప్రతినిధి మున్షీ భవనానికి తీసుకెళ్లాడు. 20 మంది భారత సైనికులు మృతి హైదరాబాద్ సంస్థానాన్ని స్వాధీనం చేసుకునేందుకు జరిగిన ఆపరేషన్‌లో భారత సైన్యం 20 మంది జవాన్లను కోల్పోయింది. అతి తక్కువ ప్రాణనష్టంతో గొప్ప విజయాన్ని సాధించినట్టయింది. 600 మంది నిజాం సైనికులు, 1,000 మందికిపైగా రజాకార్లు ఈ ఆపరేషన్ పోలోలో మరణించినట్లు అప్పట్లో లెక్కలు తేల్చారు. (క్లిక్ చేయండి: అణచివేతపై సాయుధ పోరాటం!) కృత్రిమ వరదలకు కుట్ర భారత సైన్యాన్ని అడ్డుకునే క్రమంలో మూసీ నదిలో రజాకార్లు కృత్రిమ వరదలు సృష్టించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్‌కు మంచినీరు సరఫరా చేసే హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల గేట్లను ధ్వంసం చేసి మూసీలోకి భారీగా వరద వచ్చేలా చేశారు. నదిలో వరద నిండుగా ఉంటే భారత సైన్యం ముందుకు రాలేదన్నది వారి ఆలోచన. కానీ, ఈ ప్రతిబంధకాలను విజయవంతంగా అధిగమించి భారత సైన్యం నగరంలోకి చొచ్చుకొచ్చింది. రజాకార్ల దుశ్చర్యతో హైదరాబాద్‌ను కొంతకాలం పాటు తాగునీటి కష్టాలు చుట్టుముట్టాయి. (క్లిక్: జిన్నా చనిపోయిన రోజే ముహూర్తం.. చకచకా పావులు కదిపిన సర్దార్ పటేల్) -
భారీ వర్షం: ఇమేజ్.. డ్యామేజ్..
1908 సెప్టెంబర్ 27వ తేదీ అర్ధరాత్రి వర్షం మొదలైంది.. 24 గంటలు దాటేసరికి వర్షం మరింత పెరిగింది.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన 36 గంటల్లో దాదాపు 17 సెం.మీల వర్షపాతం నమోదైంది. మూసీ 60 అడుగుల ఎత్తువరకు నీరు పారింది. అఫ్జల్‌గంజ్ వద్ద వంతెనపై 11 అడుగులపైన ఎత్తులో నీరు ప్రవహించడంతో మూసీపై ఉన్న అఫ్జల్, ముస్లింజంగ్, చాదర్‌ఘాట్ వంతెనలు కొట్టుకుపోయాయి. కొస్లావాడి, ఘాన్సీబజార్ ప్రాంతాలతో పాటు 80 వేల ఇళ్లలోకి నీరు చేరింది. వేల మంది ప్రాణాలు కోల్పోగా.. లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. 2020 అక్టోబర్ 13వ ఉదయం నుంచి వర్షం మొదలైంది.. సాయంత్రం 4 గంటల నుంచి అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురవడంతో నగరం అస్తవ్యస్తంగా మారింది. మూసీకి వరదలు వచ్చిన 112 ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో మూసీ ప్రవహించింది. ఇరువైపులా ఉన్న కాలనీల్లోకి నీరు చేరింది. నగరంలోని చెరువులు తెగిపోయి వందల కాలనీల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. దీంతో ప్రజలను బోట్లలో సురక్షిత ప్రాంతాలకు తరలించారు. కొంతమంది ప్రాణాలు కోల్పోగా.. వాహనాలు, ఇళ్లలోని వస్తువులు ధ్వంసమయ్యాయి. సాక్షి, హైదరాబాద్: 1908 వరదల తర్వాత పురానాపూల్, నయాపూల్, చాదర్‌ఘాట్ వంతెనలు నిర్మించారు. భారీ వర్షం కురిసి మూసీ ప్రవాహం పెరిగినా ప్రజల రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఇటీవల కురిసిన భారీ వర్షానికి పురానాపూల్ బ్రిడ్జి పిల్లర్‌కు బీటలు రావడంతో వెంటనే అధికారులు రాకపోకలను నిలిపివేశారు. 400 ఏళ్లకు పైగా ఘన చరిత్ర కలిగిన హైదరాబాద్‌లో ప్రస్తుతం చాలా నిర్మాణాలు కనీస మరమ్మతులు లేక శిథిలావస్థకు చేరుకుంటున్నాయి. అంతేగాకుండా నగరంలోని చాలా కట్టడాల గోడలు కూలుతున్నాయి. దీనిపై ‘సాక్షి’ విజిట్ నిర్వహించింది. చదవండి: (ప్రతి ఇంటికి రూ.10 వేలు..) తడుస్తున్న పురానీ హవేలీ గోడలు హైదరాబాద్ సంస్థానాన్ని దాదాపు 200 ఏళ్లు పాలించిన నిజాం పాలకుల నివాసం పూరానీ హవేలీ.. ప్రస్తుతం ఇందులో నిజాం మ్యూజియం కొనసాగుతోంది. ఇందులో విలువైన వస్తువులు ఉన్నాయి. ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ వాడిన ప్రపంచంలోనే అతిపెద్ద వాడ్రోబ్ ఉంది. నిర్వహణ సరిగా లేక గోడల్లోకి నీరు చేరుతోంది. డ్రైనేజీ వ్యవస్థతో అవస్థ మక్కా మసీదులో ఎక్కడ చూసినా నిర్లక్ష్యం కనిపిస్తోంది. అక్కడ నిర్వహణ సరిగ్గా లేక పైనుంచి గోడల ద్వారా నీరు కిందకు వస్తోంది. మక్కా మసీదులో డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేక ప్రాంగణంలో నీరు నిల్వ ఉంటోంది. మరమ్మతులు మాత్రం సరిగా సాగడం లేదు. శిథిలావస్థలో చరిత్ర కుతుబ్‌షాహీ, ఆసీఫ్జాహీ కాలంలోని నిర్మాణాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. వారం, పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో చార్మినార్, మక్కా మసీదుల గోడల్లోంచి నీరు కారుతోంది. నిజాంల నివాసంలోనూ గోడలు తడిసిపోయాయి. చార్మినార్ పైకప్పు నుంచి నీరు కిందకు వచ్చేందుకు ఏర్పాటు చేసిన పైపుల్లో మట్టి పేరుకుపోవడంతో నీళ్లు కిందకు రావడం లేదు. దీంతో గోడలు తడిసిపోతున్నాయి. పురానా పూల్ వంతెనకు బీటలు 1992 ఫ్రిబవరి 28వ తేదీ పురానా పూల్ వంతెనకు పక్కనే మరో కొత్త వంతెన నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇటీవల భారీ వర్షాలతో హిమాయత్‌సాగర్ గేట్లు తెరిచి మూసిలోకి వరద నీటిని వదిలారు. వంతెన పిల్లర్లకు బీటలు పడ్డాయి. పార్థివాడ నుంచి జియాగూడ వైపు వచ్చే వంతెన పిల్లర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. దీంతో అర్ధరాత్రి నుంచి వంతెనపై రాకపోకలు నిలిపివేశారు. మరుసటి రోజు సాయంత్రం చిన్న వాహనాలకు అనుమతించారు. నిజాం కాలంలో నిర్మించిన పురానా, నయాపూల్, చాదర్ఘాటల్ వంతెనలు తప్ప మిగతావి 1990 తర్వాత నిర్మించినవే.. కూలుతున్న గోల్కొండ కోట గోడలు గోల్కొండ: 500 ఏళ్ల క్రితం నిర్మితమైన గోల్కొండ కోట భారీ వర్షాలకు దెబ్బతింటోంది. కోట గోడలు కూలుతున్నాయి. కోట ప్రవేశ ద్వారాల తలుపు రెక్కలు సైతం పాడయ్యాయి. 13వ శతాబ్దంలో కాకతీయ రాజులు నిర్మించిన గోల్కొండ కోటలో 1518 బహమనీ వంశస్తుడైన సుల్తాన్ కులీ కుతుబ్ ఉల్‌ముల్క్ 1518లో రాతి కోటగా మార్చాడు. అనంతరం కులీకుతుబ్‌షా కోటను మరింత పటిష్టం చేసేందుకు నయాఖిలాను నిర్మించాడు. కాగా ప్రస్తుతం గోల్కొండ కోటతో పాటు నయాఖిలాలోని కోట గోడలు, బురుజులు భారీ వర్షాలకు కూలుతున్నాయి. కోటలో రాణివాసంతో పాటు కోటలో నివాసం ఉండేవారికి నీరు అందించే చారిత్రక కఠోర హౌస్ కట్టడానికి చెందిన ప్రహరీ నేలకూలింది. గోల్కొండ కోట రాజులు, మంత్రి, సైన్యాధిపతి కోట పైభాగంలోని దర్బారు వద్దకు వెళ్లేందుకు కోట గోడ పొడవునా గుర్రాల దారిని నిర్మించారు. 5 మీటర్ల వెడల్పు ఉన్న ఈ మార్గాన్ని భారీ బండరాళ్లు, మట్టి, సున్నపు డంగుతో నిర్మించారు. నిన్నటి భారీ వర్షానికి గోడ నేలకూలింది. ఈ నెల మొదటి వారంలో భారీ వర్షాలకు నయాఖిలాలోని మజ్నూ బురుజు కూడా నేలకూలింది. 8 మీటర్ల వెడల్పు గల ఈ బురుజుపై నుంచి శత్రు సైన్యంపై ఫిరంగి గుళ్లు వదిలేవారు. నిర్వహణ లోపంతో ఈ బురుజు కూలింది. ఒకప్పుడు సుగంధాలు వెదజల్లిన కఠోర హౌజ్ తటానికి ఉన్న ప్రహరీ సోమవారం ఓ వైపునకు ఒరిగి తటాకంలో కూలింది. 200 మీటర్ల పొడవు గల ఈ గోడ భారీ శబ్దంతో కూలిపోయింది. -
వరద: నిజాంల ‘ప్లాన్’ బెస్ట్!
సాక్షి, హైదరాబాద్: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరం అంతా అతలాకుతలమైంది. కానీ కుతుబ్‌షాహీ, ఆసఫ్‌జాహిల కాలంలో ఏర్పడ్డ బస్తీ లు కొన్ని ఇప్పటికీ చెక్కుచెదరకుండా.. వరద ముప్పు లేకుండా ఉన్నాయి. పాత బస్తీలోని పలు పాత మొహల్లాల నివాసితులు తమ ప్రాంతాలకు ఇప్పటికీ వరద ముప్పు లేదని, దానికి నాటి నిజాం పాలకులు, ఇంజినీర్ల కృషే కారణమని అంటున్నారు. చార్మినార్, మొఘల్‌పురా, ఖిల్వాట్, షా అలీ బండా, ఫతే దర్వాజా, పురాని హవేలి, నూర్ఖాన్ బజార్, హుస్సేనీ ఆలం, దూద్‌బౌలి, ఇంజిన్ బౌలి, కోట్ల అలీజా, పత్తర్‌గట్టి, పంజేషా పంచ మొహల్లా, చంచల్‌గూడ, ఖాజీపురా, కార్వాన్, జియాగుడ, అఫ్జల్‌గంజ్, ఫీల్‌ఖానా, జుమేరాత్ బజార్ తదితర ప్రాంతాలు నిన్నమొన్నటి భారీ వరదల్లోనూ ముంపునకు గురికాలేదు. నిజాం కాలం నాటి డ్రైనేజ్ జనాభా అనేక రెట్లు పెరిగినప్పటికీ వందేళ్ల క్రితం నిజాం కాలంలో నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ ఇప్పటికీ సమర్థవంతంగా పనిచేస్తోంది. వర్షం పడిన గంట, అరగంటలోపే పాతబస్తీలోని అత్యధిక బస్తీల్లో నీరు డ్రైనేజీ ద్వారా వెళ్లిపోతోంది. 1908లో మూసీ వరద విపత్తు తర్వాత నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యను సంప్రదించి హైదరాబాద్ నగరాన్ని వరద నుంచి రక్షించేందుకు..నీరు సాఫీగా వెళ్లేందుకు డ్రైనేజీ వ్యవస్థను సిద్ధం చేయాలని కోరారు. హైదరాబాద్ నగర పునర్నిర్మాణంలో సలహాలు ఇవ్వాలని, వరదల నుంచి నగర భవిష్యత్ రక్షణ కోసం ప్రతిపాదనలు రూపొందించాలని, నీటిపారుదలకు సంబంధించి సర్వం సిద్ధం చేయాలని కోరారు. 1911లో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ మరణించారు. అనంతరం అధికారంలోకి వచ్చిన నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ నగరంలో మెరుగైన పౌర సౌకర్యాలను అందించడానికి ‘సిటీ ఇంప్రూవ్మెంట్ బోర్డు’ను స్థాపించి మోక్షగుండం విశ్వేశ్వరయ్య సూచనలు అమలు చేశారు. ఆ కాలంలోనే పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థతో పాటు, వర్షపు నీరు వెళ్లడానికి రోడ్లపై ప్రత్యేక భూగర్భ నీటిపారుదల కోసం లైన్స్ ఏర్పాటు చేశారు. విశ్వేశ్వరయ్య ప్లాన్‌లోని ముఖ్యాంశాలివీ.. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకుని డ్రైనేజీ నిర్మాణం మూసీ వరదల నివారణకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక అమలు పురానాపూల్ నుంచి చాదర్‌ఘాట్ æవరకు మూసీనది పరీవాహక ప్రాంతంలో రక్షణ గోడలు ఏర్పాటు డ్రైనేజీ మాస్టర్‌ప్లాన్ పనుల పర్యవేక్షణకు నిపుణుల కమిటీ ఏర్పాటు. సకాలంలో పనులు పూర్తి ఓపెన్ డ్రైనేజీని భూగర్భ డ్రైనేజీ వ్యవస్థగా మార్చడం ట్రంక్ సీవర్ మొయిన్స్, లేటరల్స్, సబ్మొయిన్స్, మురుగు కాల్వల డిజైన్లు సిద్ధం చేశారు లోతట్టు ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లో డ్రైనేజీ వ్యవస్థ ఎలా ఉండాలో దిశానిర్దేశం చేశారు జాయింట్స్, మలుపుల వద్ద పైప్‌లైన్ వ్యవస్థ ఎలా ఉండాలో డ్రాయింగ్స్ ద్వారా ముందస్తుగా కసరత్తు చేసి నిర్మాణాలు చేపట్టారు నిజాం కాలంలో పకడ్బందీగా నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థ నేటికీ చెక్కు చెదరకుండా ఉంది. దీంతో పాటు భూగర్భ అంతర్గత పైప్లైన్ల డిజైన్ వ్యవస్థ నేటికీ ఆయా ప్రాంతాలను వరద ముప్పు నుంచి కాపాడుతోంది. -
తుడుం మోగుతూనే ఉంటుంది మళ్లీ మళ్లీ
బాబేఝరీ... జోడేఘాట్... నిజాం ప్రభువును ఉలిక్కిపడేలా చేసిన గోండు గూడేలు. ఆంధ్రమహాసభ అప్పుడప్పుడే రాజకీయాంశాలపై మాట్లాడు తున్న సమయంలో కొమురం భీం జల్, జంగిల్, జమీన్‌పై హక్కు కోసం పోరాడాడు. ఆదివాసులకు నేతృత్వం వహించి స్వయం పాలన డిమాండ్‌తో నిజాం పాలకుల వెన్నులో వణుకు పుట్టించాడు. ‘మా ఊళ్లో మా రాజ్యం’ అంటూ ఆదిలాబాద్ జిల్లా అసిఫాబాద్ తాలూకాలోని జోడెన్ ఘాట్, పట్నా పూర్, బాబేఝరి, నర్సాపూర్, కల్లెగాం మొదలైన 12 గూడేల గోండులు జాబేఝరీ లొద్దులో తుడుం మోగించారు. 1940 సెప్టెంబర్ 16న 200 మం ది నిజాం పోలీసులు గాఢ నిద్రలో ఉన్న గోండులపై విచ్చలవిడిగా కాల్పులు జరిపారు. వెతికి మరీ కాల్చి చంపారు. కొమురం భీం నవల రచయితలు అల్లం రాజయ్య, సాహు పేర్కొన్నట్టు సెప్టెంబర్ 1 నాటికే గోండుల తిరుగు బాటు అణచివేతకు గురికాలేదు. ఆ రోజునే భీం చనిపోలేదు. ఆ పోరాటం సెప్టెంబర్ 16 వరకు సాగి, భీంతోపాటు మరో 30 మంది అమరత్వంతో ఆగి పోయింది. స్థానిక వకీళ్లు, విచారణ కమిటీలు వెల్లడించిన విషయాలతో పాటు, కమ్యూనిస్టు నాయకుడు బద్దం ఎల్లారెడ్డి రాసిన నివేదిక, గోలకొండ పత్రికలో వచ్చిన వార్తలు, స్థానిక న్యాయవాదుల ప్రకటనలు సెప్టెంబర్ 16వ తేదీనే సరైనదని సూచిస్తున్నాయి. ఆదివాసులు పవిత్ర దినంగా భావించే పౌర్ణమినాడు భీం అమరుడయ్యాడని ప్రచారంలో ఉంది. తిథిని బట్టి చూసి నా ఆ ఏడాది సెప్టెంబర్ 16 పూర్వ భాద్రపద పౌర్ణమి రోజే. గోలకొండ పత్రిక అసిఫాబాద్ విలేకరి 1940 అక్టోబర్ 17న రాసిన ‘గోండుల గోడు... కొత్తగా తెలిసిన సంగతులు’ అనే కథనం ప్రకారం...ఒక్క బాబేఝరీలో మాత్రమేగాక మొత్తం జిల్లావ్యాప్తంగా ఘర్పట్టీ, నాగర్పట్టీ, చౌబీనా, బంచ రాయి తదితర శిస్తులను తగ్గించాలని, మాఫీ చేయాలని కోరుతూ భీం తన నలుగురు అనుచరులను పంపాడు. భీం దూతలుగా వచ్చిన ఆ నలుగురిని తాలూక్దార్ మోసంతో బంధించి, ఆ తర్వాత రాత్రి బాబేఝరిపై అమానుష దాడికి పాల్పడ్డాడు. మృతుల సంఖ్య 20 నుంచి 30 మంది వరకు ఉం డొచ్చని అంచనా. 75 ఏళ్ల క్రితం కొమురం భీం రాజేసిన నెగడు ఇంకా మండుతూనే ఉండటానికి కారణం అడవిపై, నీళ్లపై, నేలపై ఆదివాసు లకు హక్కు ఇంకా దక్కకపోవడమే కారణం. 1/70 చట్టాన్ని ధిక్కరించి వేలాది ఎకరాల ఆదివాసి భూములను ఆక్రమించుకున్న వారిని వెళ్లగొ ట్టలేని ప్రభుత్వాలు అడవి బిడ్డలను మాత్రం అడవిలోకి అడుగుపెట్టనివ్వడం లేదు. బాక్సైట్ ఖనిజాల కోసం, ఓపెన్‌కాస్ట్ గనుల కోసం, పోలవరం వంటి ప్రాజెక్టుల కోసం ఆదివాసుల చిరకాల ఆవాసమైన అడవులను కబళిస్తూ సాగి స్తున్న మహావిధ్వంసానికి సమిధలవుతున్నది కూడా వారే. అడవి బిడ్డలను అడవుల నుంచి తరిమేస్తున్నంత కాలం బాబేఝరీ, జోడెన్ ఘాట్లు పునరా వృతమవుతూనే ఉంటాయి. బాబేఝరీ తిరుగుబాటుకు 75 ఏళ్లు నిండిన సందర్భంగా... నుగునూతుల యాకయ్య వరంగల్. ఫోన్: 9010200249