nizambad collector
-
అద్దె కట్టు; తహసీల్దార్ ఆఫీస్కు తాళం..!
సాక్షి, నిజామాబాద్ : జిల్లాలోని మోపాల్ మండల తహసీల్దార్ ఆఫీసుకు తాళం పడింది. తన ఇంట్లో నిర్వహిస్తున్న తహసీల్దార్ ఆఫీసుకు అద్దె చెల్లించకపోవడంతోనే తాళం వేశాయని యజమాని గుంగుబాయి స్పష్టం చేశారు. ఏడాది కాలంగా అద్దె ఇవ్వడం లేదని ఆవేదన వెళ్లగక్కాడు. ఈ విషయంపై కలెక్టర్ రామ్మోహన్ రావు దృష్టికి ఫిర్యాదు చేశానని కానీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని గంగుబాయి అసహనం వ్యక్తం చేశాడు. -
28 వేల హెక్టార్లలో పంట నష్టం
నిజామాబాద్: నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా వరదల వల్ల ఏడుగురు మృతిచెందారని కలెక్టర్ యోగితారాణా తెలిపారు. 28 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందన్నారు. 10 పునరావాస కేంద్రాల్లో 1100 మందికి ఆశ్రయం కల్పించామని చెప్పారు. 4వేల ఇళ్లు పాక్షికంగా, 530 ఇళ్లు పూర్తిగా ధ్వంసమయినట్టు ఆమె వెల్లడించారు. జియో సర్వే ద్వారా పంట నష్టం అంచనా వేస్తామని యోగితారాణా అన్నారు.