no ration
-
కొత్త కార్డులకు అందని ‘కానుక’
- సంక్రాంతి కానుకల పంపిణీలో పలువురికి మొండిచేయి - అందరికీ ఇస్తామన్న మంత్రి మాటలు నీటిమూటలే - సర్కారు తీరుపై ప్రజల పెదవివిరుపు అనంతపురం అర్బన్ : జిల్లాలో చాలామంది రేషన్‌కార్డుదారులకు సంక్రాంతి కానుకలు అందలేదు. మరీముఖ్యంగా కొత్త కార్డుదారులకు అందకపోవడంతో వారు ప్రభుత్వ తీరుపై పెదవి విరుస్తున్నారు. కొత్త కార్డుదారులకూ కానుకలు ఇస్తామని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత, జిల్లా అధికారులు ఘనంగా ప్రకటించారు. ఇది ఉత్తిదేనని క్షేత్రస్థాయిలో పరిస్థితిని చూస్తే అర్థమవుతోంది. జిల్లాలో 11,20,323 పాత రేషన్‌కార్డులు ఉన్నాయి. కొత్తగా 84,419 కార్డులు మంజూరయ్యాయి. వీటిలో 72,531 కార్డులను ఇటీవల ముగిసిన నాల్గో విడత జన్మభూమిలో పంపిణీ చేసినట్లు అధికారులు చెబుతున్నారు. అంటే పాత, కొత్త కార్డులు కలిపి 11,92,854 లబ్ధిదారుల వద్ద ఉన్నాయి. వీటిలో శుక్రవారం నాటికి 10,46,342 కార్డులకు సంక్రాంతి కానుకలు పంపిణీ చేశారు. దీన్నిబట్టి చూస్తే పాతకార్డుదారులకే ఇంకా పూర్తిస్థాయిలో అందజేయలేదని స్పష్టమవుతోంది. మొత్తమ్మీద 1,46,512 కార్డులకు సంబంధించి కానుకలు పంపిణీకి నోచుకోలేదు. దీనిపై పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ (డీఎం) శివశంకర్‌రెడ్డిని వివరణ కోరగా..కొత్తకార్డుల్లోనూ దాదాపు 30 వేల కార్డులకు సంక్రాంతి కానుకలు పంపిణీ చేసినట్లు తమకు సమాచారం ఉందన్నారు. పూర్తిస్థాయి వివరాలు అందితే గానీ కచ్చితమైన లెక్కలు చెప్పలేమన్నారు. -
కూపన్లు సరే.. రేషన్ ఏదీ?
తెనాలి అర్బన్, న్యూస్‌లైన్ :అర్హులందరికీ సంక్షేమ పథకాలు..రేషన్ కార్డులు, పింఛన్లు ఇలా ఒకటేమిటీ అన్నీ ఇచ్చేస్తామంటూ రచ్చబండలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఊదరగొట్టారు. ఆచరణలో కార్యరూపం దాల్చకపోవడంతో లబ్ధిదారులు లబోదిబో మంటున్నారు. పేదలకు సంక్షేమ పథకాలంటూ ఇప్పటికి మూడువిడతలుగా ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమం నిర్వహించింది. మూడో విడతలో జిల్లా వ్యాప్తంగా 62వేల మందికి రేషన్ కూపన్లు పంపిణీచేశారు. రెండో విడత రచ్చబండలో స్వీకరించిన 77 వేల రేషన్‌కార్డుల దరఖాస్తులకుగాను ఈ మొత్తాన్ని పంపిణీ చేయగా, మరో 15 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. డిసెంబర్ నుంచి వచ్చే జూన్ వరకు ఈ కూపన్లను లబ్ధిదారులకు అందించారు. ఈ కూపన్లు పట్టుకుని లబ్ధిదారులు డీలర్ల చు ట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. డిసెంబర్ నెలకు సంబంధించి వీరికి ఇప్పటివరకు రేషన్రాలేదు. ఎప్పుడు వస్తుందన్నదీ డీలర్లు కూడా చెప్పలేకపోతున్నారు. అడ్రస్ ఒక ఊరిలో.. రేషన్ షాపు మరో ఊరిలో.. తొలివిడత రచ్చబండలో స్వీకరించిన రేషన్‌కార్డుల దరఖాస్తులకు రెండోవిడత రచ్చబండలో కూపన్లు పంపణీచేశారు. వీటిలో అన్నీ తప్పుల తడకలే. లబ్ధిదారు అడ్రస్ ఒక గ్రామంలో ఉంటే, వారికి కేటాయించిన రేషన్ షాపు మరో గ్రామంలో ఉంది. తెనాలి మండల పరిధిలోని హాఫ్‌పేట, కొలకలూరు గ్రామాల్లో జరిగిన గందరగోళం నిదర్శనంగా చెప్పవచ్చు. రెండో విడత రచ్చబండలో పంపిణీ చేసిన కార్డుల్లో హాఫ్పేటకు చెందిన 40 మంది కార్డులకు కొలకలూరు షాపు నంబరు, మూడో విడతలో 37 కార్డులకు ఖాజీపేట షాపును కేటాయించారు. రెండో విడతలో పంపిణీచేసిన వాటిలో కొలకలూరుకు చెందిన 15, మూడోవిడతలో పంపిణీ చేసినవాటిలో 20 కార్డులకు హాఫ్‌పేట షాపును కేటాయించారు. వీటిని యథాస్థానాలకు మార్చాలని తహశీల్దార్‌ను కోరారు. ప్రజావాణిలో అర్జీలు పెట్టుకున్నా ఫలితం లేదు. రేషన్ పంపిణీలో జాప్యం వాస్తవమే రేషన్ కేటాయింపుల్లో జాప్యం జరగుతున్న మాట వాస్తవమే. పాతకార్డుల లబ్ధిదారులకు మరో నాలుగురోజుల్లో రేషన్ అందే అవకాశం ఉంది. కొత్త కూపన్లకు సంబంధించి కేటాయింపుల అంచనాలు డీఎస్వోకు పంపాం. అవి కమిషనర్ ఆమోదం పొందిన తదుపరి రేషన్ కేటాయింపులు జరుగుతాయి. కొంచెం సమయం పడుతుంది. -మల్లన్న, తెనాలి డివిజన్ ఏఎస్వో