Non resident indian telugu people
-
టొరంటోలో తీన్మార్ సంక్రాంతి ఘన వేడుకలు
తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో తీన్మార్ సంక్రాంతి 2022 సాంస్కృతిక ఉత్సవాలు కెనడాలోని టొరంటోలో ఘనంగా జరుపుకున్నారు. వర్చువల్‌గా నిర్వహించిన ఈ సంబరాలలో 200 పైగా కెనడాలో ఉన్న తెలంగాణ వాసులు పాల్గొన్నారు. టీసీఏ సహాయ కార్యదర్శి జితేందర్ ఆయన భార్య కాంతిలు జ్యోతి ప్రజ్వాలన చేసి తీన్మార్ సంక్రాంతి 2022 సంబరాలను ప్రారంభించారు. కోవిడ్ నిబంధనలు అతిక్రమించకుండా అందరూ సహకరించి కెనడాలో సంక్రాతి సంబరాలను ఘనంగా నిర్వర్తించారు ఈ సంబరాలు తెలంగాణ కెనడా అసోసియేషన్ కార్యనిర్వాహాక కమిటీ ఆధ్వర్యంలో జరిగాయి. బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, ఫౌండేషన్ కమిటీ సభ్యులు సహకారం అందించారు. ఈ కార్యక్రమములో భోగి పళ్ళు, పిల్లలు సంప్రదాయ వేడుకలు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు, ఈ ముగ్గుల పోటీలకు ఉమా సలాడి, జయ కందివనం న్యాయనిర్థేతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇండియా కన్సులేట్ జనరల్ అపూర్వ శ్రీవాస్తవ పాల్గొన్నారు. టీసీఏ 2022 క్యాలెండరును ఆమె ఆవిష్కరించారు. టీసీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న కమ్యూనిటీ సర్వీస్‌లను ఆమె కొనియాడారు. ఈ సందర్భంగా రాజేష్, ప్రెసిడెంట్ టొరంటో కెనడా తెలంగాణ అసోసియేషన్ మాట్లాడుతూ... ఏ దేశ మేగినా ఎందు కాలిడినా మన భారత సంప్రదాయాలను బలోపేతం చేయాలని కోరారు. ప్రవాస భారతీయ సంస్కృతి సంరక్షణ లో భాగం కావాలని కోరారు. -
కొత్త కవిత - అంతర్జాతీయ కవి సమ్మేళనం
వంశీ ఇంటర్నేషనల్, శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్, తెలుగు కళా సమితి ఒమన్, సంతోషం ఫిలిం న్యూస్ వారి ఆధ్వర్యంలో డాక్టర్ ఆళ్ల శ్రీనివాసరెడ్డి అమెరికా సహకారంతో వర్చువల్‌గా అంతర్జాతీయ కవి సమ్మేళనం నిర్వహించారు. 12 గంటలపాటు నిర్విరామంగా నిర్వహించిన ఈ అంతర్జాతీయ కవి సమ్మేళనంలో 20 దేశాల నుంచి సుమారు 190 మంది కవులు పాల్గొని తమ కొత్త కవితలు వినిపించారు. సినారే జయంతి సందర్భంగా డాక్టర్ సీ నారాయణరెడ్డి గారి 90 వ జయంతిని పురస్కరించుకొని ఈ కవి సమ్మెళనం ఏర్పాటు చేశామని ఈ కార్యక్రమ ముఖ్య నిర్వాహకులు వంశీ రామరాజు అన్నారు. వంశీ ప్రచురణలో ప్రతి సంవత్సరం వస్తున్న "కొత్త కథలు" సంకలనం తరహాలో ఇక నుంచి కొత్త కవిత పేరుతో కవితా సంకలనం తీసుకువస్తామన్నారు. ముఖ్య అతిధిగా ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు కేవీ రమణ ముఖ్య అతిథిగా ప్రారంభోపన్యాసం అందించారు. గౌరవ అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధ ప్రసాద్ , ప్రత్యేక అతిథులుగా తెలంగాణ సారస్వత పరిషత్ కార్యదర్శి జె. చెన్నయ్య, వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా అధ్యక్షులు వంగూరి చిట్టెన్ రాజు, ఒమన్ తెలుగు కళా సమితి కన్వీనర్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. న్యూజిలాండ్ నుంచి శ్రీలత మగతల, సౌదీ అరేబియా నుండి రావి దీపిక మరియు వివిధ దేశాల తెలుగు సంఘాల అధ్యక్షులు పాల్గొని కవులకు శుభాభినందనలు తెలియజేశారు. ప్రత్యేక అతిధులు భారతదేశం నుండి ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రముఖ సినీ కవులు భువనచంద్ర, సుద్దాల అశోక్ తేజ, రసరాజు, వడ్డేపల్లి కృష్ణ, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొని నారాయణ రెడ్డి గారికి కవితానివాళులు అర్పించారు. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, సింగపూర్, మలేషియా, హాంకాంగ్, ఇండోనేషియా, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, బహ్రెయిన్, మారిషస్, దక్షిణాఫ్రికా, యుగాండా, యునైటెడ్ కింగ్డమ్, నార్వే, కెనడా, అమెరికా దేశాలనుండి ఎంతో మంది కవులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆనందంగా ఉంది తొలిసారి నిర్వహించిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో పెద్ద ఎత్తున కవులు, కవయిత్రులు పాల్గొనడం తమ సంస్థకు గర్వకారణంగా ఉందని శ్రీ సాంస్కృతిక కళాసారథి సింగపూర్ అధ్యక్షులు కవుటూరు రత్న కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. -
ప్రవాస ఆంధ్రులకు రూ.10 లక్షల ప్రమాద బీమా
సాక్షి, అమరావతి: విదేశాల్లో నివసించే ప్రవాస భారతీయులకు తక్కువ ప్రీమియంతో ఏపీ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీ) ప్రమాద, వైద్య బీమా సౌకర్యాన్ని కల్పిస్తోంది. విదేశాల్లో పనిచేస్తున్న, చదువుకుంటున్న తెలుగువారు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాల్పిందిగా ఏపీఎన్ఆర్టీ అధ్యక్షుడు వెంకట్ ఎస్ మేడపాటి బుధవారం తెలిపారు. ఉద్యోగస్తులు మూడేళ్ల కాలానికి రూ.550 ప్రీమియం చెల్లిస్తే రూ.10 లక్షల ప్రమాద బీమా రక్షణతో పాటు, చికిత్స కోసం లక్ష రూపాయలు అందిస్తామన్నారు. అలాగే మరణించిన వారి మృతదేహాలను తీసుకురావడానికి విమాన ఖర్చులు, మహిళకు ప్రసూతి ఖర్చుల కింద గరిష్టంగా రూ.50,000 వరకు బీమా రక్షణతో పాటు అనేక ప్రయోజనాలను అందిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థులు రూ.10 లక్షల ప్రమాద బీమా రక్షణ కోసం ఏడాదికి రూ.180 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఆర్థికంగా బాగా వెనుకబడి ఉన్న వారికి ఆయా దేశాల దాతల సహకారంతో బీమా ప్రీమియంలు చెల్లించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. ఏపీఎన్ఆర్టీ వెబ్సైట్ ద్వారా పాలసీ తీసుకోవచ్చన్నారు. చదవండి: ప్రవాసాంధ్రుల్లారా ఆపత్కాలంలో ఏపీకి అండగా నిలవండి అమెరికా: జార్జియాలో తెలుగుకు దక్కిన ఖ్యాతి -
మూలాలు మరచిపోని ఆంధ్రులు
ప్రతి సంవత్సరంలాగే ఈసారి జనవరి 7-9 మధ్య భారత ప్రభుత్వం ప్రవాస భారతీయ దివస్ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా అమెరికాలో తెలుగువారి కృషి; స్వదేశానికీ, స్వస్థలాలకు వారు అందిస్తున్న చేయూతలను గురించి గుర్తుచేసుకోవాలి. జనవరి 9,1914న గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన రోజు. ఆ రోజునే ఈ కార్యక్రమం కోసం భారత ప్రభుత్వం ఎంచుకుంది. 1960 నుంచే అమెరికాలో తెలుగువాళ్ల సంఖ్య పెరగడం మొదలైంది. సాఫ్ట్వేర్ బూమ్ తరువాత 2000 సంవత్సరంలో తెలుగువారైన సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పెద్ద ఎత్తున అమెరికా వెళ్లారు. ఇప్పుడు అమెరికా సం యుక్త రాష్ట్రాలలో తెలుగువారి సంఖ్య పది లక్షలకు చేరుకుందని అంచనా. పరాయి దేశం. భాష వేరు. సంస్కృతి వేరు. అక్కడ మాతృభాషను, సంస్కృతిని పరిరక్షించుకోవాలన్న తపన తెలుగువారందరిలో కనిపిస్తుంది. తెలుగునాట కొన్ని కళలను మరచి పోయి ఉండవచ్చు గానీ, అమెరికా తెలుగువారు మాత్రం అన్ని కళలను ఆదరిస్తున్నారు. మాతృభాషను మరచిపోకుండా నిత్య జీవి తంలో ఒక భాగం చేసుకున్నారు. అక్కడ ఏటా సాహిత్య ఉత్సవాలను జరుపుకుంటున్నారు. పెద్ద పెద్ద నగరాలలో కవి సమ్మేళనా లు జరుగుతున్నాయి. వంగూరి ఫౌండేషన్, అప్పాజోస్యుల, విష్ణుభట్ల, కిదాంబి ఫౌండేషన్ ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. అమెరికా నలుమూలలా ‘మనబడి’ని ఏర్పా టు చేసి తెలుగు పిల్లల కోసం ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. రెండో తరంలో కూడా తెలుగు నిలబడి ఉందంటే కారణం ఇవే. అమెరికాలో తెలుగు పత్రికల నిర్వహణ కూడా దిగ్విజయంగా సాగుతోంది. అట్లాం టాకు చెందిన పెమ్మరాజు వేణుగోపాలరావు, గవరసాన సత్యనారాయణరావు ‘తెలుగు భాష పత్రిక’ను స్థాపించి, భాషా సేవ చేశారు. విజ్ఞాన శాస్త్ర అంశాలను తెలుగులో అందించడమే ఈ పత్రిక ఉద్దేశం. 1968 నాటి ‘కంప్యూటర్లు’ పుస్తకం ఇందులో ధారావాహికంగా వెలువడింది. వేమూరి వెంకటేశ్వరావు రాసిన ఈ రచన కంప్యూటర్ల మీద వచ్చిన తొలి తెలు గు పుస్తకంగా ఖ్యాతి చెందింది. ‘ఈమాట’ (1998, మొదటి తెలుగు వెబ్ మ్యాగజైన్), ‘తెలుగుజ్యోతి’ (1983, కిడాంబి రఘునాథ్), ‘బ్రాహ్మి’ (శొంఠి శారదాపూర్ణ) పత్రికలను అక్కడ నుంచి ప్రచురిస్తున్నారు. ‘తెలుగునాడి’ (జంపాల చౌదరి), ‘తెలుగు అమెరికా’ (దండమూడి రామమోహనరావు) కొద్దికాలం వెలువడినాయి. ‘తెలుగు టైమ్స్’ పదేళ్ల నుంచి వెలువడుతోంది. అమెరికాలో ప్రతి నగరంలోను తెలుగు సంఘాలు ఉన్నాయి. వీటిలో ఉత్తర అమెరికా తెలుగు సంఘ (తానా),అమెరికా తెలుగు సంఘం (ఆటా), ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా), ఉత్తర అమెరికా తెలుగు అసోసియేషన్ (నాట్స్) ప్రముఖంగా సేవలు అందిస్తున్నాయి. తెలుగువారి విద్యాభివృద్ధి, భాష, సంస్కృతుల పరిరక్షణకు ఇవన్నీ రకరకాలుగా పాటు పడుతున్నాయి. ప్రవాసాంధ్రులు సొంత గడ్డకు సేవలందించడంతో పాటు, రాష్ట్ర రాజకీయాలలో కూడా కీలకమైన స్థాయికి చేరుకున్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించిన నాటి నుంచి ఈ ధోరణి బలపడింది. చంద్రబాబు చేపట్టిన జన్మభూమి వీరికి మరింత ఊతమిచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించిన తరువాత చాలామంది జగన్ వైపు మొగ్గారు. వీరంతా ఒకప్పుడు కాంగ్రెస్ అభిమానులు. ఆత్మచరణ్‌రెడ్డి, మధుయాష్కీ ఎంపీలుగా ఎన్నికయ్యారు. గల్లా అరుణ, జితేందర్‌రెడ్డి కూడా ఇలాంటి సేవలోనే ఉన్నారు. జయరాం కోమటి, సతీష్ వేమన, పాలెం శ్రీకాంత్‌రెడ్డి, ఎం. వెంకటరమణ (టీడీపీ), మహేశ్ సలాడి, గడ్డం దశరథరామిరెడ్డి, నాగేశ్వరరావు (కాంగ్రెస్), డాక్టర్ ప్రేమ్‌సాగర్ రెడ్డి, వీరారెడ్డి, సురేశ్ ఉయ్యూరి, నగేశ్ (వైఎస్ఆర్సీపీ), చవ్వా విజయ్, జానకి రామరెడ్డి, రాజు చిం తల (టీఆర్ఎస్) వంటి వారు రాష్ట్ర రాజకీయాలలో కీలకంగా ఉన్నారు. అమెరికాలో పారిశ్రామికవేత్తలుగా తమ లక్ష్యాలు నెరవేరిన తరువాత స్వస్థలాలకు చేరుకున్న వారూ ఉన్నారు. గల్లా రామచంద్రనాయుడు, రవి రెడ్డి సన్నారెడ్డి ఇలాంటి వారే. స్వచ్ఛంద సేవకు ముందుకొచ్చిన ప్రవాసులు కూడా ఎందరో ఉన్నారు. డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి, డాక్టర్ హనిమరెడ్డి, జయరాం కోమటి, మోహన్ నన్నపనేని, కాట్రగడ్డ కృష్ణప్రసాద్ వంటి వారు కోట్లు వెచ్చించి తమ తమ ప్రాం తాల అభివృద్ధికి పాటుపడుతున్నారు. తమ మూలాలను మరచిపోని ప్రవాసాంధ్రులు ఇంకా ఎందరో! చెన్నూరి వెంకటసుబ్బారావు, (‘తెలుగు టైమ్స్’ సంపాదకుడు, ఎండీ) (జనవరి 9 ప్రవాసీ భారతీయ దివస్)