తెలంగాణ కెనడా అసోసియేషన్ (TCA) ఆధ్వర్యంలో తీన్మార్ సంక్రాంతి 2022 సాంస్కృతిక ఉత్సవాలు కెనడాలోని టొరంటోలో ఘనంగా జరుపుకున్నారు. వర్చువల్‌గా నిర్వహించిన ఈ సంబరాలలో 200 పైగా కెనడాలో ఉన్న తెలంగాణ వాసులు పాల్గొన్నారు. టీసీఏ సహాయ కార్యదర్శి జితేందర్ ఆయన భార్య కాంతిలు జ్యోతి ప్రజ్వాలన చేసి తీన్మార్ సంక్రాంతి 2022 సంబరాలను ప్రారంభించారు. కోవిడ్ నిబంధనలు అతిక్రమించకుండా అందరూ సహకరించి కెనడాలో సంక్రాతి సంబరాలను ఘనంగా నిర్వర్తించారు
ఈ సంబరాలు తెలంగాణ కెనడా అసోసియేషన్ కార్యనిర్వాహాక కమిటీ ఆధ్వర్యంలో జరిగాయి. బోర్డ్ ఆఫ్ ట్రస్టీ, ఫౌండేషన్ కమిటీ సభ్యులు సహకారం అందించారు. ఈ కార్యక్రమములో భోగి పళ్ళు, పిల్లలు సంప్రదాయ వేడుకలు, మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు, ఈ ముగ్గుల పోటీలకు ఉమా సలాడి, జయ కందివనం న్యాయనిర్థేతలుగా వ్యవహరించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఇండియా కన్సులేట్ జనరల్ అపూర్వ శ్రీవాస్తవ పాల్గొన్నారు. టీసీఏ 2022 క్యాలెండరును ఆమె ఆవిష్కరించారు. టీసీఏ ఆధ్వర్యంలో జరుగుతున్న కమ్యూనిటీ సర్వీస్‌లను ఆమె కొనియాడారు.
ఈ సందర్భంగా రాజేష్, ప్రెసిడెంట్ టొరంటో కెనడా తెలంగాణ అసోసియేషన్ మాట్లాడుతూ... ఏ దేశ మేగినా ఎందు కాలిడినా మన భారత సంప్రదాయాలను బలోపేతం చేయాలని కోరారు. ప్రవాస భారతీయ సంస్కృతి సంరక్షణ లో భాగం కావాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment