nonstop flights
-
హైదరాబాద్–లండన్ మధ్య నాన్‌స్టాప్ ఫ్లయిట్
హైదరాబాద్: ఎయిరిండియా హైదరాబాద్– లండన్ మధ్య నాన్‌స్టాప్ విమాన సరీ్వస్‌ను ప్రారంభించింది. తొలి విమానం గురువారం హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కానుంది. ఇదే విమానం తిరిగి 10వ తేదీన (శుక్రవారం) లండన్ బయల్దేరి వెళుతుంది. 256 సీట్ల సామర్థ్యం (బిజినెస్క్లాస్ 18, ఎకానమీ క్లాస్ 238 సీట్లు) కలిగిన బోయింగ్ 787 డ్రీమ్‌లైనర్ ఎయిర్‌క్రాఫ్ట్‌ను వారానికి రెండు సరీ్వసుల కింద ఎయిరిండియా నడపనుంది. హైదరాబాద్ నుంచి ప్రతీ సోమవారం, శుక్రవారం లండన్‌కు విమాన సరీ్వస్ ఉంటుందని ఎయిరిండియా తెలిపింది. ప్రయాణ సమయం 10.30 గంటలు. అదే లండన్ నుంచి హైదరాబాద్ మార్గంలో ప్రయాణ సమయం 9.20 గంటలుగా ఉంటుందని పేర్కొంది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, అమృత్సర్, కొచ్చి, అహ్మదాబాద్, గోవా విమానాశ్రయాల నుంచి లండన్‌కు ఎయిరిండియా నాన్‌స్టాప్ సరీ్వసులను నిర్వహిస్తోంది. -
యూఎస్‌కు నాన్‌స్టాప్ ఫ్లైట్స్: విస్తారా కన్ను
ముంబై, సాక్షి: కోవిడ్-19 మహమ్మారి ప్రపంచ దేశాలను వణికిస్తున్న నేపథ్యంలో తాజాగా ఎయిర్‌లైన్స్ సంస్థ విస్తారా.. యూఎస్‌కు నాన్‌స్టాప్ సర్వీసులను నిర్వహించాలని యోచిస్తోంది. ఇందుకు తగిన కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. సుప్రసిద్ధ టాటా గ్రూప్, సింగపూర్ ఎయిర్‌లైన్స్ మధ్య ఏర్పాటైన ఈ భాగస్వామ్య సంస్థ(జేవీ) త్వరలో యూఎస్‌కు డైరెక్ట్ సర్వీసులను ప్రారంభించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన కరోనా వైరస్ నేపథ్యంలో నాన్‌స్టాప్ సర్వీసులకు భారీ డిమాండ్ నెలకొన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అయితే ప్రస్తుతానికి ఎప్పటిలోగా సర్వీసులను ప్రారంభించాలన్న అంశాన్ని నిర్ణయించుకోలేదని కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ వినోద్ కన్నన్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. 20-30 శాతం వరకూ నాన్‌స్టాప్ విమాన సర్వీసుల నిర్వహణకు సంబంధించి వివిధ ప్రణాళికలను పరిశీలిస్తున్నట్లు వినోద్ తెలియజేశారు. ఇందుకు విమానాలకున్న ఆవశ్యకత, తదితరాలపై కసరత్తు ప్రారంభించినట్లు పేర్కొన్నారు. 2023కల్లా కంపెనీకున్న మొత్తం సీట్ల సామర్థ్యంలో 20-30 శాతం వరకూ అంతర్జాతీయ రూట్లకు కేటాయించాలని విస్తారా భావిస్తున్నట్లు తెలుస్తోంది. గతేడాది ఇందుకు 10 శాతాన్నే వినియోగించింది. ఇదేవిధంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) చివరికల్లా విమానాల సంఖ్యను 70కు పెంచుకునే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం విస్తారా 48 విమానాలతో సర్వీసులు అందిస్తున్నట్లు తెలియజేశాయి. -
16.23 గంటలు.. 14,535 కి.మీ.
అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే విమానం ప్రారంభం వెల్లింగ్టన్: ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే నాన్‌స్టాప్ విమాన సర్వీసును ఖతార్ ఎయిర్వేస్ ఆదివారం ప్రారంభించింది. దోహా విమానాశ్రయం నుంచి ఆదివారం ఉదయం గం.5.02 నిమిషాలకు (స్థానిక కాలమానం) బయలుదేరిన క్యూఆర్920 విమానం సోమవారం ఉదయం గం.7.25 నిమిషాలకు (స్థానిక కాలమానం) న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌కు చేరుకుంది. 16 గంటల 23 నిమిషాల్లో 14,535 కి.మీ పయనించి, ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించే విమానంగా రికార్డు నెలకొల్పింది. విమానంలో నలుగురు పైలట్లు, 15 మంది సిబ్బంది ఉన్నారు. ఆక్లాండ్‌లో విమానానికి ఘనస్వాగతం పలికారు. ఆకాశమార్గంలో కొలిచినపుడు ఎయిరిండియాకు చెందిన ఢిల్లీ–శాన్ ఫ్రాన్సిస్కో విమానాన్ని అత్యంత ఎక్కువ దూరం ప్రయాణించేదిగా చెబుతారు. భూపరితలంపై దూరాన్ని కొలిస్తే మాత్రం ఖతార్ ఎయిర్వేస్ విమానమే ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది.