nose ring
-
దుర్గమ్మ మొక్కు తీర్చుకున్న సీఎం కేసీఆర్
-
దుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించిన కేసీఆర్
సాక్షి, విజయవాడ: విజయవాడ కనకదుర్గ అమ్మవారిని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం దర్శించుకున్నారు. కుటుంబసమేతంగా ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారికి చేయించిన ముక్కుపుడకను నెత్తిన పెట్టుకుని మేళతాళాల మధ్య కేసీఆర్ ఆలయంలోనికి ప్రవేశించారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన కేసీఆర్ ముక్కుపుడకను సమర్పించారు. అనంతరం వేద పండితులు కేసీఆర్ దంపతులకు ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్ సతీమణి, కోడలు మనవడు, పలువురు బంధువులు, తెలంగాణ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, నాయిని నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, కేసీఆర్‌ను చూసేందుకు భక్తులు పెద్ద ఎత్తున వచ్చారు. ఈ పర్యటనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతకుముందు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబం గన్నవరం విమానాశ్రయం చేరుకుంది. వారికి ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు స్వాగతం పలికారు. అక్కడి నుంచి కేసీఆర్ కుటుంబం నేరుగా ఇంద్రకీలాద్రికి చేరుకుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ దేవుళ్లకు వరుసగా మొక్కులు చెల్లించుకుంటూ వస్తున్నారు. ఇది వరకే తిరుపతి వెంకన్నకు కంఠహారం, సాలగ్రామహారం సమర్పించారు. కురవి వీరభద్రస్వామికి కోరమీసం, వరంగల్ భద్రకాళి అమ్మవారికి కిరీటం సమర్పించారు. ఇప్పుడు బెజవాడ కనకదుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం బంగారం, విలువైన రాళ్లు, రతనాలు పొదిగి ప్రత్యేకంగా తయారు చేయించిన ముక్కు పుడకను సమర్పించారు. ఈ ముక్కుపుడక 11.29 గ్రాముల బరువు ఉంది. -
ముక్కుపుడక తెచ్చిన తంటా!
చెన్నై: మగువుల సౌందర్యాన్ని ఇనుమడింపజేసే ముక్కుపుడక ఓ పెద్దావిడ ప్రాణం మీదికి తెచ్చింది. కేవలం అలంకరణ కోసమే కాకుండా.. మహిళలు సాంప్రదాయకంగా ముక్కు పుడకలు ధరించడం ఆనవాయితీ. అలా పెట్టుకున్న ముక్కుపుడక కాస్త ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. అది కాస్తా ప్రమాదవశాత్తు ఊపిరితిత్తుల్లో చేరి అపాయకరంగా మారిన ఘటన తమిళనాడు మదురై లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వెల్లమ్మాళ్ (78) అనే మహిళ ముక్కు పుడకను తొలగించడానికి బంధువులు ప్రయత్నిచినపుడు పొరపాటున దాని సీల నోట్లోకి జారి, ఊపిరితిత్తుల్లో అడ్డుపడింది. ఆ తర్వాత వారు ఆవిషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆమె అస్వస్థతకు గురైంది. తీవ్రమైన శ్వాస సమస్యతో గత నెలరోజులుగా ఇబ్బంది పడుతుండటంతో వైద్యులను సంప్రదించింది. ఈ నేపథ్యంలో ఎక్స్ రే తీసినపుడు బంగారు ముక్కుపుడక స్క్రూ ఎడమ ఊపిరితిత్తిలో నిలిచిపోయినట్టు గమనించారు. ఆమెకు ఊపిరి తీసుకోవడం మరింత ఇబ్బంది కరంగా మారడంతో దాన్ని తొలగించాలని వైద్యులు నిర్ణయించారు. ఈ క్రమంలో థొరాసిక్ సర్జరీ ద్వారా నుంచి దానిని తొలగించారు. బ్రాంకో స్కోపీ (శ్వాస నాళ అంతర్దర్శిని) సహాయంతో ఫోర్ సెప్స్‌తో దానిని బయటకు తీసారు. ఆపరేషన్ అనంతరం వెల్లమ్మాళ్ ఆరోగ్యం నిలకడగా ఉందని , సాధారణంగా శ్వాస తీసుకోకలుగుతోందని మెడికల్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైద్యులు తెలిపారు. సంక్లిష్టమైన ఈ ఆపరేషన్ కోసం గంట సమయం పట్టిందన్నారు.