not distribute
-
అ‘డ్రస్’ లేదు
– యూనిఫాం పంపిణీలో సందిగ్ధం – ఇప్పటిదాకా ఇండెంట్ కూడా తీసుకోని అధికారులు – గత తప్పిదాలు పునరావృతం ముదిగుబ్బ మండలంలో దాదాపు 80 స్కూళ్లు ఉన్నాయి. వీటిల్లో 1–8 తరగతుల విద్యార్థులు 6,900 మంది దాకా ఉన్నారు. 2016–17 విద్యా సంవత్సరంలో కేవలం ఏడు స్కూళ్ల విద్యార్థులకు మాత్రమే యూనిఫాం పంపిణీ చేశారు. తక్కిన స్కూళ్ల విద్యార్థులకు నేటికీ అందలేదు. జిల్లాలోని యూనిఫాం అందని ఇలాంటి స్కూళ్లు చాలానే ఉన్నాయి. జిల్లా విద్యాశాఖ అధికారులు ఈ ఏడాది కూడా యూనిఫాం పంపిణీపై ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం మండలాల నుంచి ఇండెంట్కూడా తెప్పించలేదు. దీంతో యూనిఫాం పంపిణీపై ఈ ఏడాది కూడా సందిగ్ధం నెలకొంది. - అనంతపురం ఎడ్యుకేషన్ ప్రభుత్వ పాఠశాలలు ఈ నెల 12న పునఃప్రారంభమయ్యాయి. సర్వశిక్షా అభియాన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1–8 తరగతుల విద్యార్థులకు సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ద్వారా ఏటా రెండు జతల యూనిఫాం సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 3,844 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలు ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో సుమారు 2,99,632 మంది విద్యార్థులు 1–8 తరగతుల విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్కరికి రెండు జతల ప్రకారం 5,99,264 జతల యూనిఫాం అవసరం. 1–7 తరగతుల బాలురకు చొక్కా నిక్కర్, బాలికలకు చొక్కా స్కర్టు ఇవ్వాలి. 8వ తరగతి బాలురకు షర్టు, ప్యాంటు, బాలికలకు పంజాబీ దుస్తులు ఇవ్వాలి. ఏటా పాఠశాలలు ప్రారంభమైన రెండు నెలలోపు ఈ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. అయితే ఈసారి ఇప్పటిదాకా కనీసం ఎంతమంది విద్యార్థులున్నారు... ఎంత వస్త్రం అవసరం అనే ఇండెంట్ కూడా మండల విద్యాశాఖ అధికారుల నుంచి తీసుకోలేదు. పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో విద్యార్థులు కొత్త యూనిఫాం ఇప్పట్లో అందే పరిస్థితి కనిపించడం లేదు. మండల విద్యాశాఖ అధికారుల ద్వారా ఇండెంట్ తీసుకుని ఆప్కో నుంచి వస్త్రం సరఫరా చేసి, కుట్టు పూర్తయి విద్యార్థులకు అందాలంటే 4–5 నెలల సమయం పట్టే అవకాశం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఏటా ఇదే తంతు ప్రైవేట్, కార్పొరేట్ పాఠశాలల విద్యార్థులు పాఠశాల ప్రారంభం రోజునుంచే యూనిఫాంతో తరగతులకు వెళ్తుండగా...సర్కారు బడుల్లోని విద్యార్థులకు మాత్రం ఈ పరిస్థితి లేదు. పాఠశాల నుంచి రాష్ట్రస్థాయి అధికారుల వరకు అలసత్వం కారణంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల యూనీఫాం పంపిణీలో ప్రతిసారీ ఆలస్యం జరుగుతోంది. ఇండెంట్ తెప్పిస్తున్నాం యూనిఫాంకు సంబంధించి అన్ని మండలాల విద్యాశాఖ అధికారుల నుంచి ఇండెంట్ తెప్పించుకుంటున్నాం. ఇప్పటిదాకా 20 మండలాల నుంచి వివరాలు అందాయి. ఈ నెల 28వ తేదీ వరకు గడువు ఇచ్చాం. ఇండెంట్ రాగానే రాష్ట్ర అధికారులకు పంపుతాం. ఇండెంట్ మేరకు వస్త్రం సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటాం. – సుబ్రమణ్యం, పీఓ, ఎస్ఎస్ఏ -
అధోగతి
- 42 వేల కుటుంబాలకు అందని బియ్యం కార్డులు - పేదలై ఉండీ ప్రభుత్వ పథకాలకు దూరం - రుణాలకు అనర్హత.. నిస్పృహలో నిరుద్యోగ యువత అనంతపురం అర్బన్ : కరువు జిల్లాగా పేరుగాంచిన అనంతలో 42 వేల పేద కుటుంబాలు ఏ రకంగానూ ప్రభుత్వ సాయం అందక అధోగతి పాలవుతున్నాయి. ప్రభుత్వ పథకాలన్నీ రేషన్ కార్డుతో ముడిపడి ఉండటం వల్ల వీరికి ఈ దుస్థితి ఏర్పడింది. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జిల్లాలో దాదాపు లక్షకు పైగా రేషన్‌కార్డులను తొలగించింది. కొత్తకార్డులు పంపిణీ చేస్తామని చెప్పడంతో 60 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. వాటిలో అనర్హత పేరిట పది వేల దరఖాస్తులను తిరస్కరించారు. 8 వేల మందికి మాత్రమే కార్డులు అందజేశారు. ఇంకా 42 వేల మంది రెండేళ్లకు పైగా ఎదురు చూస్తూనే ఉన్నారు. ప్రస్తుతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, కాపు కార్పొరేషన్ల ద్వారా స్వయం ఉపాధి కోసం సబ్సిడీ రుణాలు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో రేషన్‌కార్డు లేక ఆయా కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువత అర్హత కోల్పోయి నిస్పృహకు గురవుతోంది. 2014కు ముందు రేషన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకుంటే విచారణ చేసి అర్హులైతే మంజూరు చేసేవారు. అంతే కాకుండా ప్రతి ఏడాదీ కోటా విడుదల చేసేవారు. దీంతో అర్హులైన పేదలందరికీ కార్డులు అందేవి. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దరఖాస్తు చేసుకున్న వారు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్నా కార్డులు అందడం లేదు. రెండేళ్లుగా కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయకపోవడంతో దరఖాస్తుల సంఖ్య చేంతాడులా పెరిగిపోతోంది. అదిగో ఇదిగో అంటూ ప్రభుత్వం కప్పదాట్లతో కాలం వెళ్లదీస్తుండటం వారి పాలిట శాపంగా మారింది. పేదల సంక్షేమంపై ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదనేందుకు రేషన్‌కార్డుల మంజూరులో చూపిస్తున్న నిర్లక్ష్యమే నిదర్శనమని బాధిత కుటుంబాల నిరుద్యోగ యువత ఆవేదన వ్యక్తం చేస్తోంది. -
యూ'నో'ఫాం
ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనందించేందుకు ప్రభుత్వ పెద్దలు అపసోపాలు పడుతున్నా.. క్షేత్రస్థాయిలో బాలారిష్టాలే దాటలేదు. ముఖ్యంగా అందరికీ సకాలంలో యూనిఫాం పంపిణీ చేయడం ప్రభుత్వానికి అధికారులకు గగనంగా మారుతోంది. ఏళ్లు గడుస్తున్నా.. ఈ సమస్యనే అధిగమించలేకపోతున్నారు. పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు గడిచినా యూనిఫాం గురించి అతీగతీ లేదు. జిల్లా విద్యాశాఖాధికారులు యూనిఫాంకు ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రభుత్వం నుంచి అనుమతి లభించకపోవడంతో ఇంకా క్లాత్ కొనాలా వద్దా అంటూ మీనమేషాలు లెక్కిస్తున్నారు. షరా మూమాలే ! • యూనిఫాం పంపిణీలో తీరుమారని వైనం • స్కూళ్లు పునఃప్రారంభమై రెండునెలలైనా అతీగతీ లేదు • పాత, చిరిగిన దుస్తులతో వస్తున్న విద్యార్థులు అనంతపురం ఎడ్యుకేషన్ : ఈ ఫొటోలో ఉన్న విద్యార్థులు అనంతపురం రూరల్ పాపంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న విద్యార్థులు. వీరు వేసుకున్న స్కూల్ డ్రెస్ చూస్తే కొత్తగా కనిపిస్తోంది కదూ ! అచ్చు ప్రభుత్వం ఇచ్చే సరఫరా చేసే ఉచిత దుస్తుల్లా ఉన్నా.. ఇవి ప్రభుత్వం ఇచ్చినవి కాదు.. ఆ విద్యార్థుల తల్లిదండ్రులే కొనుగోలు చేసి కుట్టించారు. ఈ విద్యార్థి పేరు సుధాకర్ అదే పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. యూనీఫాం లేక పోవడంతో గతేడాది ఇచ్చిన అంగీ వేసుకున్నాడు. గతేడాది ఇచ్చిన ప్యాంటు బిగుతు కావడంతో ప్రస్తుతం రంగుది ధరించాడు. ఇదీ.. జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల యూనిఫాం పరిస్థితి. సర్వశిక్ష అభియాన్ (ఎస్ఎస్ఏ) ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 1–8 తరగతుల విద్యార్థులకు ఏటా రెండు జతల యూనిఫాం సరఫరా చేస్తున్నారు. జిల్లాలో 3,844 ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలు ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో సుమారు 2,82,845 మంది 1–8 తరగతుల విద్యార్థులు ఉన్నారు. ఒక్కొక్కరికి రెండు జతల ప్రకారం 5,65,690 జతల యూనిఫాం అవసరం. 1–7 తరగతుల బాలురకు చొక్కా నిక్కరు, బాలికలకు చొక్కా స్కర్టు ఇవ్వాలి. 8వ తరగతి బాలురకు షర్టు, ప్యాంటు, బాలికలకు పంజాబీ దస్తులు ఇవ్వాలి. గతేడాది (2015–16)కి సంబంధించిన యూనిఫాం నేటికీ కొన్ని పాఠశాలలకు ఇవ్వాల్సి ఉంది. ఇక ఈ విద్యా సంవత్సరం సంగతి దేవుడికెరక. గతేడాదికి సంబంధించి ఫిబ్రవరిలో దుస్తులు ఇచ్చారని.. ఈసారి కూడా 2017 ఫిబ్రవరి, మార్చిలో ఇస్తారని చెబితేనే ప్రైవేట్‌గా కొనుగోలు చేస్తున్నామని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా చాలామంది విద్యార్థులు పాత, చిరిగిన యూనిఫాంతో పాఠశాలలకు వస్తున్నారు. ఇండెంట్‌తో సరి పెట్టారు : విద్యార్థులకు అవసరమైన యూనిఫాం క్లాత్ కొనుగోలుకు పాఠశాలల వారీగా ఎస్ఎస్ఏ అధికారులు ఇండెంట్ తెప్పించుకున్నారు. ప్రభుత్వానికి నివేదిక పంపారు. అక్కడి నుంచి ఇప్పటిదాకా ప్రతిస్పందన కరువైంది. క్లాత్ కొనుగోలు చేయాలా వద్దా .. ప్రభుత్వమే సరఫరా చేస్తుందా .. అనే విషయంలో నేటికీ స్పష్టత లేదు. ప్రతి ఏటా జూన్, జూలై మాసాల్లో ఈ పక్రియ పూర్తి అవుతున్నా.. ఈసారి ప్రభుత్వమే పెండింగ్ పెడుతూ వస్తోంది. పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో విద్యార్థులు యూనిఫాం ధరించే పరిస్థితి కనిపించడం లేదు. ప్రభుత్వం నిర్ణయం తీసుకుని క్లాత్ సరఫరా చేసి, కుట్టు పూర్తయి విద్యార్థులకు అందాలంటే సుమారు 4–5 నెలలు పట్టే అవకాశం ఉందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఇదిలా ఉండగా ఏటా ఇతే తంతు అని, ప్రతిసారీ ఆలస్యం జరుగుతోందని ఉపాధ్యాయ సంఘాల నేతలు మండిపడుతున్నారు. -
రంగు దుస్తులే దిక్కు
♦ ప్రభుత్వ పాఠశాలలకు అందని యూనిఫాం ♦ ఎదురుచూస్తున్న 11,500 మంది విద్యార్థులు హిందూపురం రూరల్ : పిల్లల్లో స్నేహభావం పెంపొందించి వారిలో పేద, ధనిక భేదాభిప్రాయాలు రాకుండా చూసేందుకు విద్యార్థులు యూనిఫాంలో పాఠశాలకు వెళ్తుంటారు. ప్రభుత్వం ప్రతి ఏటా విద్యాసంవత్సర ఆరంభంలోనే పాఠశాలలకు ఉచితంగా పంపిణీ చేస్తుంది. కానీ ఈ ఏడాది మండలంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు ఇంకా రంగు దుస్తులతోనే బడికి వెళ్తున్నారు. పాఠశాలలు ప్రారంభమై నెలలు గడుస్తున్నా ఇంకా దుస్తులు కొనుగోలు, కుట్టే పని ప్రారంభం కాలేదు. పాఠశాలల్లో దుస్తులు అందజేస్తారనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కూడా పిల్లలకు కొత్త దుస్తులు (యూనిఫాం) కుట్టించకపోవడంతో పేద విద్యార్థులు చిరిగిన చొక్కాల్లోనే బడికి వెళ్తున్నారు. హిందూపురం మండలంలో 88 ప్రాథమిక పాఠశాలలు, 15 ప్రాథమికోన్నత ,18 జిల్లా ఉన్నత పాఠశాలల్లో 1 నుంచి 8వ తరగతి వరకు 11,500 మంది విద్యార్థులు ఏకరూప దుస్తుల (దుస్తులు) కోసం ఎదురుచూస్తున్నారు. రెండు జతలు ఇవ్వాలి ప్రతి ఏటా 1 నుంచి 8వ తరగతి వరకు చదివే విద్యార్థులకు రెండు జతలు చొప్పున ఏకరూప దుస్తులు అందిస్తారు. విద్యాసంవత్సరం ఆరంభానికి ముందుగానే కొలతలు తీసుకుని పాఠశాలలు పునఃప్రారంభ సమయానికి పిల్లలకు దుస్తులు పంపిణీ చేసేవారు. కాగా గతేడాది కూడా విద్యాసంవత్సరం ముగిసే సమయంలో యూనిఫాం పంపిణీ చేశారు. ఈ దఫా ఇప్పటికీ అతీగతీ లేదని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. జూన్ నెల లోపు విద్యార్థుల సంఖ్య తెలిపే ఇండెంట్లు ఇవ్వాలని ఉన్నతాధికారులు కోరగా ఉపాధ్యాయులు హడావుడిగా పంపినట్లు సమాచారం. ఉపాధ్యాయులు పంపిన నివేదికల ఆధారంగా ఆయా పాఠశాలలకు దుస్తులు సరఫరా అవుతాయి. ఇంకా ఎలాంటి ఆదేశాలు రాలేదు : గంగప్ప, ఎంఈఓ, హిందూపురం ప్రభుత్వం అందిస్తున్న ఉచిత యూనిఫాం అందజేయడానికి ఉన్నతాధికారుల నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ పాఠశాలకు కూడా ఇంకా అందజేయలేదు. ఆప్కో సంస్థ వారే క్లాత్‌ను ఎంపిక చేసి మహిళా సంఘాలకు పంపుతారు. అనంతరం పిల్లల కొలతలు తీసుకుని అందజేయడం ప్రతి ఏటా జరుగుతోంది. -
వెలగని దీపం!
మంజూరైన కనెక్షన్లు 70వేలు ఒక్కో నియోజకవర్గానికి 5వేలు వచ్చిన దరఖాస్తులు 1.80లక్షలు లబ్ధిదారుల ఎంపికలో జాప్యం నేటికీ కొలిక్కిరాని అర్హుల జాబితా పాలమూరు: దారిద్య్రరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు దీపం పథకం ద్వారా ఉచితంగా ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లు అందించాలన్న సర్కారులక్ష్యం అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతోంది. కనెక్షన్లు మంజూరై రెండు నెలలు గడిచినా ఇప్పటివరకు ఏ ఒక్కరికీ గ్యాస్ అందకపోవడం గమనార్హం. గత ఏప్రిల్‌లో నియోజకవర్గానికి ఐదువేల చొప్పున జిల్లాలోని 14 నియోజకవర్గాలకు 70వేల కనెక్షన్లను ప్రభుత్వం మంజూరుచేసింది. దరఖాస్తులు స్వీకరించి మూడునెలలైనా అర్హుల జాబితా ఇంతవరకు ఖరారుకాలేదు. కలెక్టర్ చైర్మన్‌గా ప్రత్యేకకమిటీ లబ్ధిదారులను ఎంపికచేస్తుంది. మండలస్థాయిలో ఆ బాధ్యతను ఎంపీడీఓలకు కట్టబెట్టారు. గ్రామస్థాయిలో వచ్చిన దరఖాస్తులను గ్రామసభల ద్వారా ఎంపిక చేయాలన్న నిబంధనలకు స్వస్తి పలికారు. స్థానిక అధికార పార్టీ నాయకుల సిఫార్సులు, సర్పంచ్ల జాబితా మేరకు ఎంపీడీఓలు లబ్ధిదారుల తుదిజాబితా రూపకల్పనలో జాప్యం చేస్తున్నారు. అయితే ఇప్పటివరకు జిల్లా అధికార యంత్రాంగానికి జాబితా చేరలేదు. గ్రామాల నుంచి వచ్చిన వాటిని ఆధార్ ప్రామాణికంగా డేటాఎంట్రీ పూర్తిచేసి జిల్లా పౌరసరఫరాల కార్యాలయానికి పంపించాల్సి ఉంది. జిల్లాలో ఏ మండలంలో కూడా జాబితా రూపకల్పన మొదలుపెట్టకపోగా గ్రామసభల ద్వారా ఎంపికచేసిన జాబితా కూడా చేరలేదని తెలుస్తోంది. కొలిక్కిరాని పంపిణీ ప్రక్రియ జిల్లాలో సమగ్రకుటుంబ సర్వే ప్రకారం 9.85లక్షల కుటుంబాలు ఉన్నాయి. అందులో 5.21లక్షల గ్యాస్కనెక్షన్లు ఉండగా 4.64లక్షల కుటుంబాలకు కనెక్షన్లు లేవని తేలింది. ప్రభుత్వం మంజూరుచేసిన 70వేల కనెక్షన్లకు 1.80లక్షల కుటుంబాలు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో మహిళా సంఘాలకు ప్రాధాన్యమిస్తూ 25శాతం ఎస్సీలు, 16శాతం ఎస్టీలు, మైనార్టీలకు గ్యాస్కనెక్షన్ అందించాలని నిర్ణయించారు. సెక్యూరిటీ డిపాజిట్ సొమ్ము ఒక్కో కనెక్షన్‌కు రూ.1600చొప్పున మొత్తం 70వేల కనెక్షన్లకు రూ.11.20కోట్లు అందజేసింది. మే నెలలో దరఖాస్తులు స్వీకరించినప్పటికీ నిర్ణీత గడువు దాటినా పంపిణీ ఓ కొలిక్కిరాలేదు. లబ్ధిదారులకు ఉచితంగా గ్యాస్కనెక్షన్లు జారీచేసి ఖాళీ సిలిండర్‌తో పాటు రెగ్యులేటర్ ఇస్తారు. నిరుపేదలైన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు, గతంలో ప్రభుత్వం నుంచి దీపం పథకం ద్వారా లబ్ధిపొందని వారు, గ్యాస్కనెక్షన్ తీసుకునేందుకు డబ్బు వెచ్చించలేని నిరుపేదలు ఈ పథకానికి అర్హులు. గ్రామసభల ద్వారా ఎంపికచేసిన లబ్ధిదారుల జాబితాను కలెక్టర్ ఆమోదించి ఆ తరువాత జిల్లా మంత్రికి నివేదించిన తరువాతే కనె క్షన్లు ఇచ్చే అవకాశం ఉంది. ఈ విషయంలో జిల్లా యంత్రాంగం మేల్కోవాల్సి ఉంది. -
ఎదురుచూపులే..
పాఠ్యపుస్తకాలు అందక విద్యార్థుల ఇక్కట్లు ఇప్పటివరకు 40 శాతం లోపే సరఫరా ‘ప్రైవేటు’కు మరిన్ని కష్టాలు బాన్సువాడ: విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందుగానే విద్యార్థులకు సరిపడా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో విఫలమైంది. ఇప్పటికే మండల కార్యాలయూలకు పుస్తకాలు చేరాల్సి ఉండగా.. ఇంతవరకూ ఆ ఊసే లేదు. సిలబస్ మారిన పుస్తకాల పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. కొత్త పుస్తకాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదని వాపోతున్నారు. జూన్ ఒకటి నాటికి పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఈసారి ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలనే ఉపయోగించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు తెరిచే నాటికి ప్రతి పాఠశాలలో విద్యార్థులకు సరిపడా పాఠ్య పుస్తకాలు అందించాలన్నదే ఉన్నతాధికారుల లక్ష్యం. అయితే పుస్తకాల పంపిణీలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. 2015-16 విద్యా సవత్సరానికి గాను జిల్లా లో సుమారు 18 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం ఉండగా, ఇప్పటి వరకు అన్ని పుస్తకా లు కలిపి 40 శాతం కూడా పంపిణీ కాలేదు. ఇప్పటికే పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉం డగా, ఆలస్యం జరుగుతుండడంతో అధికారులు ఆదోళన చెందుతున్నారు. రెండు, మూడేళ్ల క్రితం వరకు రవాణా చార్జీల మంజూరీరులో ఎదురైన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని ఈ ఏడాది ముందుగానే నిధుల సమీకరణపై దృష్టి సారించారు. ‘ప్రైవేటు’కు మరిన్ని కష్టాలు.. కాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాగోలా పుస్తకాలు పంపిణీ చేస్తుండగా, ప్రైవేటు వి ద్యా సంస్థల యాజామాన్యాలకే ప్రతి ఏడాది ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో 6 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్/తెలుగు మీడియూలలో ప్రభుత్వ పుస్తకాలనే బోధించాలనే నిబంధన ఉండడంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఎలాగోలా సర్దుబాటు చేసుకొనే వారు. ఒకటి నుంచి 5వ తరగతి వరకు ప్రైవేటు పబ్లిషర్స్ పుస్తకాలను విని యోగించారు. అయితే ప్రస్తుతం 1వ తరగతి నుంచే ప్రభుత్వ ముద్రిత పుస్తకాలను ఉపయోగించాలని విద్యాశాఖ ఆదేశించడంతో ప్రైవేటు యాజమాన్యాలు అయోమయానికి గురవుతున్నాయి. రాష్ట్ర పాఠ్య పుస్తకాల ము ద్రణా కేంద్రం నుంచి జిల్లాకు పాఠ్య పుస్తకా లు అందకపోవడంతో విద్యార్థులు అవస్థల పాల వుతున్నారు. పాఠ్య పుస్తకాల కొరత విద్యార్థులకు కొరకరాని కొయ్యగా మారింది. డబ్బులు వెచ్చించి పుస్తకాలు కొనుగోలు చేద్దామన్నా దొరకడం లేదు. జిల్లాలో 22 పాఠ్య పుస్తకాల విక్రయ కేంద్రాలు ఉండగా, వాటిలో అవసరమైన పుస్తకాలు అందుబాటులో లేక ఇబ్బందు లు ఎదురవుతున్నాయి. గత ఏడాది జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల కోసం సుమా రు 5 లక్షల పుస్తకాలు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, అందులో 20 శాతం పుస్తకాలు మాత్రమే సరఫరా చేశారు. దీంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నో వ్యవప్రయాసలు కోర్చి తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చేర్పించిన తల్లిద్రండులకు ప్రస్తుతం పాఠ్య పుస్తకాల కోసం తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వ పుస్తకాలు ఉపయోగకరమే.. 1వ తరగతి నుంచే ప్రభుత్వ ముద్రిత పుస్తకాలను ప్రవేశపెట్టడం విద్యార్థులకు ప్రయోజనకరమేనని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులను మార్చారు. జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా పాఠశాల స్థాయిలో పాఠ్య పుస్తకాల సిలబస్‌లో మార్పులు చేశారు. పరిమితికి లోబడి, బట్టీ విధానానికి అనుకూలమైన రాష్ట్ర సిలబస్‌కు అదనంగా సీబీఎస్ఈ సిలబస్‌ను జోడించారు. విద్యార్థుల్లో ప్రశ్నించేతత్వం, ప్రాక్టికల్‌గా ఆలోచించేలా సిలబస్ రూపకలప్పన చేయడాన్ని విద్యావేత్తలు స్వాగతిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా, పాఠ్య పుస్తకాల ముద్రణలో గతం మాదిరిగానే జాప్యం జరుగుతోంది. గత ఏడాది రవాణాకు సంబంధించి ఎంఈఓలకు నిధులు ఇవ్వాల్సి ఉన్నట్లు తెలిసింది. కాగా గత అనుభవాల దృష్ట్యా ఈ నెలాకరుకల్లా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.