పాఠ్యపుస్తకాలు అందక విద్యార్థుల ఇక్కట్లు
ఇప్పటివరకు 40 శాతం లోపే సరఫరా
‘ప్రైవేటు’కు మరిన్ని కష్టాలు
బాన్సువాడ: విద్యాసంవత్సరం ప్రారంభానికి ముందుగానే విద్యార్థులకు సరిపడా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం ఆచరణలో విఫలమైంది. ఇప్పటికే మండల కార్యాలయూలకు పుస్తకాలు చేరాల్సి ఉండగా.. ఇంతవరకూ ఆ ఊసే లేదు. సిలబస్ మారిన పుస్తకాల పంపిణీలో ప్రభుత్వం విఫలమైందని విద్యార్థుల తల్లిదండ్రులు అంటున్నారు. కొత్త పుస్తకాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదని వాపోతున్నారు.
జూన్ ఒకటి నాటికి పాఠశాలలకు పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేసింది. ఈసారి ప్రైవేటు పాఠశాలల్లో ఒకటి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వం ముద్రించిన పుస్తకాలనే ఉపయోగించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు తెరిచే నాటికి ప్రతి పాఠశాలలో విద్యార్థులకు సరిపడా పాఠ్య పుస్తకాలు అందించాలన్నదే ఉన్నతాధికారుల లక్ష్యం. అయితే పుస్తకాల పంపిణీలో అడ్డంకులు ఎదురవుతున్నాయి. 2015-16 విద్యా సవత్సరానికి గాను జిల్లా లో సుమారు 18 లక్షల పాఠ్యపుస్తకాలు అవసరం ఉండగా, ఇప్పటి వరకు అన్ని పుస్తకా లు కలిపి 40 శాతం కూడా పంపిణీ కాలేదు. ఇప్పటికే పుస్తకాలు పంపిణీ చేయాల్సి ఉం డగా, ఆలస్యం జరుగుతుండడంతో అధికారులు ఆదోళన చెందుతున్నారు. రెండు, మూడేళ్ల క్రితం వరకు రవాణా చార్జీల మంజూరీరులో ఎదురైన ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని ఈ ఏడాది ముందుగానే నిధుల సమీకరణపై దృష్టి సారించారు.
‘ప్రైవేటు’కు మరిన్ని కష్టాలు..
కాగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎలాగోలా పుస్తకాలు పంపిణీ చేస్తుండగా, ప్రైవేటు వి ద్యా సంస్థల యాజామాన్యాలకే ప్రతి ఏడాది ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో 6 నుంచి 10వ తరగతి వరకు ఇంగ్లిష్/తెలుగు మీడియూలలో ప్రభుత్వ పుస్తకాలనే బోధించాలనే నిబంధన ఉండడంతో ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఎలాగోలా సర్దుబాటు చేసుకొనే వారు. ఒకటి నుంచి 5వ తరగతి వరకు ప్రైవేటు పబ్లిషర్స్ పుస్తకాలను విని యోగించారు. అయితే ప్రస్తుతం 1వ తరగతి నుంచే ప్రభుత్వ ముద్రిత పుస్తకాలను ఉపయోగించాలని విద్యాశాఖ ఆదేశించడంతో ప్రైవేటు యాజమాన్యాలు అయోమయానికి గురవుతున్నాయి. రాష్ట్ర పాఠ్య పుస్తకాల ము ద్రణా కేంద్రం నుంచి జిల్లాకు పాఠ్య పుస్తకా లు అందకపోవడంతో విద్యార్థులు అవస్థల పాల వుతున్నారు.
పాఠ్య పుస్తకాల కొరత విద్యార్థులకు కొరకరాని కొయ్యగా మారింది. డబ్బులు వెచ్చించి పుస్తకాలు కొనుగోలు చేద్దామన్నా దొరకడం లేదు. జిల్లాలో 22 పాఠ్య పుస్తకాల విక్రయ కేంద్రాలు ఉండగా, వాటిలో అవసరమైన పుస్తకాలు అందుబాటులో లేక ఇబ్బందు లు ఎదురవుతున్నాయి. గత ఏడాది జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల విద్యార్థుల కోసం సుమా రు 5 లక్షల పుస్తకాలు అవసరమని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా, అందులో 20 శాతం పుస్తకాలు మాత్రమే సరఫరా చేశారు. దీంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఎన్నో వ్యవప్రయాసలు కోర్చి తమ పిల్లలను ఇంగ్లిష్ మీడియంలో చేర్పించిన తల్లిద్రండులకు ప్రస్తుతం పాఠ్య పుస్తకాల కోసం తిప్పలు తప్పడం లేదు.
ప్రభుత్వ పుస్తకాలు ఉపయోగకరమే..
1వ తరగతి నుంచే ప్రభుత్వ ముద్రిత పుస్తకాలను ప్రవేశపెట్టడం విద్యార్థులకు ప్రయోజనకరమేనని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు తెలుగు, సాంఘిక శాస్త్రం సబ్జెక్టులను మార్చారు. జాతీయ స్థాయిలో జరిగే పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా పాఠశాల స్థాయిలో పాఠ్య పుస్తకాల సిలబస్‌లో మార్పులు చేశారు. పరిమితికి లోబడి, బట్టీ విధానానికి అనుకూలమైన రాష్ట్ర సిలబస్‌కు అదనంగా సీబీఎస్‌ఈ సిలబస్‌ను జోడించారు.
విద్యార్థుల్లో ప్రశ్నించేతత్వం, ప్రాక్టికల్‌గా ఆలోచించేలా సిలబస్ రూపకలప్పన చేయడాన్ని విద్యావేత్తలు స్వాగతిస్తున్నారు. ఇంతవరకూ బాగానే ఉన్నా, పాఠ్య పుస్తకాల ముద్రణలో గతం మాదిరిగానే జాప్యం జరుగుతోంది. గత ఏడాది రవాణాకు సంబంధించి ఎంఈఓలకు నిధులు ఇవ్వాల్సి ఉన్నట్లు తెలిసింది. కాగా గత అనుభవాల దృష్ట్యా ఈ నెలాకరుకల్లా పాఠ్య పుస్తకాలు పంపిణీ చేయాలని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.