not intrest
-
ఓడిపోతున్న ఓటు
హైదరాబాద్: మెట్రో నగరాల్లో ఓటరు చైతన్యం కొడిగడుతోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం వివిధ మెట్రో నగరాల్లో నివసిస్తున్నవారు కనీసం తమ ఓటు హక్కు నమోదు చేసుకోవడానికి కూడా బద్దకిస్తున్నారు. నెట్స్అవే సంస్థ ప్రత్యేకంగా ప్రశ్నావళి రూపొందించి ఢిల్లీ, ముంబై, పుణే, బెంగళూరు, హైదరాబాద్ నగరాలకు చెందిన యువతీయువకుల అభిప్రాయాలను ఆన్లైన్ మాధ్యమం ద్వారా సేకరించింది. ఆ వివరాల్లోకెళ్తే.. 53 శాతమే అత్యధికం.. ఓటు చైతన్యంలో బెంగళూరు ముందంజలో నిలిచింది. ఈ సిటీలో ఓటరు నమోదు, ఐడీ కార్డులను పొందడంతోపాటు క్రమం తప్పకుండా ఓటు వేస్తున్నవారు 53 శాతం మంది ఉన్నారట. మిగతా నగరాలతో పోలిస్తే ఇదే అత్యధికం కావ డం విశేషం. ముంబై, పుణే నగరాలు 52 శాతం ఓటరు చైతన్యంతో రెండోస్థానంలో నిలిచాయి. ఢిల్లీలో 47 శాతం మంది మాత్రమే ఓటు వేయడానికి ముందుకొస్తున్నారు. తెలంగాణ రాజధా ని హైదరాబాద్ ఈ విషయంలో మరింత వెనుకబడింది. ఇక్కడ కేవలం 45 శాతం మంది మాత్రమే ఓటుపై ఆసక్తి కనబరుస్తున్నారు. కారణాలివే.. నగరాల్లో స్థిరపడుతున్నవారంతా వలస వచ్చినవారే కావడంతో ఓటు నమోదుపై పెద్దగా ఆసక్తి చూపడంలేదు. యువతలో 75 శాతం మందికి తమ ఓటును ఎలా నమోదు చేసుకోవాలన్న అంశంపై అవగాహనే లేదు. పట్టణాల్లో స్థిరపడినా పుట్టిన గ్రామాల్లోనే ఓటు వేయడానికి 60 శాతం మంది ఆసక్తి చూపడం. ఇక 40 శాతం మంది ఓటర్ ఐడీ ఉంటే దేశంలో ఎక్కడైనా ఓటుహక్కు వినియోగించుకోవచ్చని విశ్వసిస్తున్నారు. ఈసారి తప్పకుండా వేస్తాం.. కనీసం ఈసారైనా ఓటు వేస్తారా? త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటారా? అని సర్వే సంస్థ అడిగిన ప్రశ్నలకు 75 శాతం మంది ‘ఈసారి తప్పకుండా వేస్తామ’ని చెప్పారు. మరో 20 శాతం మంది మాత్రం వేయాలనే ఉన్నా కుదరదేమోననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మిగతా ఐదు శాతం మంది మాత్రం తాము ఓటు వేయబోమని కచ్చితంగా తేల్చేశారు. వేసినా పెద్దగా మారేదేమీ లేనప్పుడు ఎందుకు వేయాలంటూ ఎదురు ప్రశ్నించారు. -
బావతో పెళ్లి ఇష్టంలేక బలవన్మరణం
సాక్షి, టీ.నగర్: తనను వివాహం చేసుకోవాలని సొంత అక్క భర్త ఒత్తిడి చేయడంతో మనస్తాపానికి గురైన కళాశాల విద్యార్థిని ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. పుదుచ్చేరి విల్లియనూరు సమీపం సేందనత్తం పేట ప్రాంతానికి చెందిన ఆనంద్ ఎద్దులబండి కార్మికుడు. ఈయనకు మంజు (25), లలిత (19) ఇద్దరు కుమార్తెలు, అరుణ్పాండియన్ అనే కుమారుడు ఉన్నారు. మంజు అదే ప్రాంతానికి చెందిన అంబేద్ (30)ను ఐదేళ్ల కిందట ప్రేమించి వివాహం చేసుకుంది. లలిత కదిర్ గ్రామం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల్లో రెండో సంవత్సరం చదువుతోంది. ఆమెను ప్రతిరోజు బావ అంబేద్ కళాశాలకు తీసుకువెళ్లేవాడు. దీంతో ఏర్పడిన పరిచయం కారణంగా అంబేద్ తనను వివాహం చేసుకోవాలని లలితపై ఒత్తిడి తెచ్చేవాడు. ఈ విషయం లలిత తల్లిదండ్రులకు తెలిసింది. వారు లలితకు మరొకరితో వివాహం జరిపించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆ వివాహాన్ని అంబేద్ అడ్డుకున్నాడు. దీనిపై లలిత తల్లిదండ్రులు విల్లియనూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఇరువర్గాలను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. ఆ తరువాత కూడా అంబేద్ లలితను వేధిస్తూ వచ్చాడు. సోమవారం అంబేద్ వివాహం విషయంపై లలితతో వాగ్వాదానికి దిగాడు. దీంతో విరక్తి చెందిన లలిత సెల్ఫోన్లో అక్క మంజుతో మాట్లాడి రోదించింది. తరువాత ఇంట్లోకి వెళ్లి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. దీనిపై పోలీసులు మంగళవారం కేసు నమోదుచేసుకుని విచారణ చేస్తున్నారు. -
మా భూమి సెంటు కూడా ఇవ్వం
ముక్తకంఠంతో తేల్చిచెప్పిన జక్కులనెక్కలం వాసులు విమానాశ్రయం విస్తరణ కోసం భూసేకరణపై గ్రామసభ జక్కులనెక్కలం (గన్నవరం రూరల్) : ‘మా గ్రామానికి హాని చేసే ఏలూరు కాలువ మళ్లింపు చేయవద్దు’ అంటూ జక్కులనెక్కలం గ్రామస్తులు ముక్కకంఠంతో తేల్చిచెప్పారు. జక్కులనెక్కలం పంచాయతీ కార్యాలయం వద్ద మంగళవారం విమానాశ్రయ విస్తరణ కోసం భూసేకరణ అంశంపై గ్రామసభ నిర్వహించారు. నూజివీడు సబ్ కలెక్టర్ లక్ష్మీషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ మహిళలు మాట్లాడుతూ ‘ఇప్పటికే ముంపుతో, మురుగుతో అల్లాడిపోతున్నామని, విమానాశ్రయ విస్తరణ పేరుతో మా గ్రామంలో భూములు సేకరించి, మమ్మల్ని ఇబ్బంది పెట్టవద్దు’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు ఏలూ రు కాలువ, రెండు వైపులా బుడమేరు, మరో వైపు వాగులతో తీవ్ర ఇబ్బందుల మధ్య బతుకుతున్నామని, ఈ పరిస్థితుల్లో విమానాశ్రయ విస్తరణ కోసం మా పంట భూములు లాక్కుంటే తాము ఏ విధంగా జీవించాలని ప్రశ్నించారు. 150 మంది మహిళలు పాల్గొని.. ఈ విషయంపై మరో మాట లేదని, ప్రభుత్వానికి జక్కులనెక్కలం గ్రామస్తుల అభిప్రాయం తెలియజేయాలని నినాదాలు చేశారు. సబ్ కలెక్టర్ మాట్లాడుతూ గ్రామస్తుల అభిప్రాయాలను ప్రభుత్వానికి తెలియజేస్తామని చెప్పారు. రైతు నాయకుడు గూడవల్లి న రసింహారావు (నర్సయ్య) మాట్లాడుతూ కేవలం 6.5 కిలోమీటర్లు దక్షిణం వైపు విమానాశ్రయం విస్తరించే వీలుండగా 13 కిలోమీటర్లు మళ్లిస్తున్నారని, దీనిపై నిపుణుల కమిటీ సూచనలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోసారి సర్వే నిర్వహించి రైతులకు ఇబ్బంది లేకుండా 6.5 కిలోమీటర్లలో విమానాశ్రయ విస్తరణ చేపట్టాలని సూచించారు. రైతు ముప్పలనేని రవికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల వద్ద భూములు తీసుకునే సందర్భంలో నిబంధనలు పాటించటం లేదని విమర్శించారు. గ్రామసభ సందర్భంగా జక్కులనెక్కలం గ్రామస్తులు విమానాశ్రయ విస్తరణ కోసం ఏలూరు కాలువ మళ్లింపును తీవ్రంగా వ్యతిరేకించారు. గ్రామస్తులందరూ ఒకే మాటపై నిలబడి రెవెన్యూ శాఖ అందించిన పత్రాలను సైతం తీసుకునేందుకు నిరాకరించారు. సర్పంచ్ కాట్రు ఏసుమ్మ మాట్లాడుతూ గ్రామస్తుల అభిప్రాయాన్ని అధికారులు ప్రభుత్వానికి తెలియజేయాలని, సెంటు భూమి ఇచ్చేందుకు మా గ్రామం సిద్ధంగా లేదని చెప్పారు. దీంతో అధికారులు ప్రసంగాలు, గ్రామస్తుల అభిప్రాయాలు నమో దు చేసుకుని వెళ్లిపోయారు. కార్యక్రమం లో మాజీ జెడ్పీటీసీ సభ్యుడు ఎంవీఎల్ ప్రసాద్, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్, తహసీల్దారు మాధురి, ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు.