not released
-
నిధులపై తాలిబన్ల ఆశలు ఆవిరి
వాషింగ్టన్: అమెరికాలో స్తంభించిన అఫ్గాన్ కేంద్ర బ్యాంకు నిధులను తమకు అప్పగించాలన్న తాలిబన్ల ఆశలపై అమెరికా నీళ్లుజల్లింది. దాదాపు 700 కోట్ల డాలర్ల ఈ నిధులను అఫ్గాన్‌లో మానవీయ సాయానికి, 2001 బాధితులకు పరిహారానికి వినియోగించాలని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ ఆదేశాలిచ్చేందుకు సిద్ధమయ్యారు. ఈ విషయంలో త్వరలో అధ్యక్షుడు బ్యాంకులకు ఆదేశాలిస్తారని, దీంతో యూఎస్ ఫైనాన్స్ సంస్థలు ఈ నిధులను విడుదల చేస్తాయని సంబంధిత అధికారులు చెప్పారు. వీటిలో 350 కోట్ల డాలర్లను అఫ్గాన్‌లో సహాయానికి కేటాయిస్తారని, 350 కోట్ల డాలర్లను అమెరికా వద్దే ఉంచుకొని ఉగ్రవాద దాడుల బాధితులకు అందిస్తారని చెప్పారు. గతంలో అమెరికా సహా పలు దేశాలు అఫ్గాన్‌కు సాయం కోసం కోట్లాది డాలర్ల నిధులను అందించాయి. వీటిని అఫ్గాన్ కేంద్రబ్యాంకు అమెరికా బ్యాంకుల్లో దాచింది. తాలిబన్లు దేశాన్ని వశం చేసుకున్నప్పటినుంచి ఈ నిధులు తమకు అప్పగించాలని కోరుతున్నారు. అయితే తాలిబన్లు అధికారంలోకి వచ్చాక ఈ నిధులను అమెరికా స్తంభింపజేసింది. అమెరికాలో ఉన్న 700 కోట్ల డాలర్లు కాకుండా మరో 200 కోట్ల డాలర్ల అఫ్గాన్ నిధులు జర్మనీ, యూఏఈ, స్విట్జర్లాండ్, ఖతార్‌లో ఉన్నాయి. అమెరికా తాజా నిర్ణయాన్ని తాలిబన్లు వ్యతిరేకిస్తారని అంచనా. వీరి ప్రతిస్పందన ఎలా ఉంటుందోనని సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. -
దా‘రుణం’..!
కార్పొరేషన్ రుణాలు అందని ద్రాక్షగా మారాయి. లోన్లు తీసుకుని స్వయం ఉపాధి పొందొచ్చని ఆశించిన నిరుద్యోగులకు ఏటా నిరాశే ఎదురవుతోంది. దరఖాస్తు చేసుకుని ఏళ్లుగడుస్తున్నా మొండిచెయ్యే మిగులుతోంది. ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా బడ్జెట్ విడుదల చేసినా లబ్ధిదారులకు అందించడంలో అధికారులు, బ్యాంకర్లు విఫలమవుతున్నారు. దీంతో వారు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ చేయడం తప్పడంలేదు. దురాజ్‌పల్లి (సూర్యాపేట) : నిరుద్యోగ యువత, కుల, చేతివృత్తిదారులు, చిరువ్యాపారులకు ఆర్థి కంగా చేయూతనందించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేషన్ల ప్రభుత్వం రుణాలు మంజూరు చే స్తోంది. 50శాతం నుంచి 80శాతం వరకు సబ్సి డీపై ఈ లోన్లు అందజేస్తోంది. గతంలో 20 శాతం నుంచి 50 శాతం వరకే ఉన్న సబ్సిడీని తెలంగాణ ప్రభుత్వం 80 శాతం వరకు పెంచింది. దీంతో కార్పొరేషన్ రుణాల కోసం యువకులు, చిరు వ్యాపారులు, చేతి వృత్తి దారులు అధిక సంఖ్యలో దరఖాస్తులు చేసుకుంటున్నారు. 2015–16లో దరఖాస్తులు చేసుకొని ఎంపికైన లబ్ధిదారుల్లో కొంత మందికి నేటికీ రుణాలు అందలేదు. ప్రభుత్వం కార్పొరేషన్ల ద్వారా బడ్జెట్ విడుదల చేసినా పూర్తిస్థాయిలో జిల్లా అధికారులు, బ్యాం కర్లు.. లబ్ధిదారులకు అందించడంలో విఫలం అవుతున్నారు. దీంతో లబ్ధిదారులు సంబంధిత శాఖ, బ్యాంకర్ల చుట్టూ తిరుగుతున్నారు. జిల్లాలో 2015–16 ఆర్థిక సంవత్సరంలో బీసీ కార్పొరేషన్ ద్వారా 254మంది లబ్ధిదారులకు ప్రభుత్వం సబ్సి డీ విడుదల చేయగా ఇప్పటి వరకు కేవలం 157 మందికి మాత్రమే రుణాలు అందించగలిగారు. ఎస్టీ కార్పొరేషన్ ద్వారా 161మంది లబ్ధిదారులకు ప్రభుత్వం సబ్సిడీ విడుదల చేయగా 83 మందికి మాత్రమే పంపిణీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా 1,770మంది లబ్ధిదారులకు సబ్సిడీ విడుదల కాగా 1,629 మందికి మాత్రమే ఇచ్చారు. 2015–16లో ఇంకా 123 మందికి... బీసీ కార్పొరేషన్ రుణాలకు 2015–16లో 5,216 మంది దరఖాస్తు చేసుకోగా లాటరీ, ఇంటర్వ్యూ, గ్రామసభల ద్వారా 552 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ఈ 552 మంది లబ్ధిదారులకు రూ.49,86,60,000 సబ్సిడీ అందించాల్సి ఉండగా ప్రభుత్వం 254 మందికి రూ.196.93 లక్షల సబ్సిడీని అందించాల్సి ఉండగా 157 మందికి రూ.124 లక్షలు అందించారు. ఇంకా 123 మందికి సుమారు రూ. 72 లక్షల సబ్సిడీని అందించాల్సి ఉంది. అయితే దరఖాస్తులు చేసుకున్న మూడు సంవత్సరాలకు గాను ప్రభుత్వం సబ్సిడీని విడుదల చేస్తే అందించడంలో బ్యాంకర్లు, జిల్లా అధికారులు విఫలం అవుతున్నారు. బ్యాంకర్లు ఇవ్వడం లేదని లబ్ధిదారులు అంటున్నారు. అదే విధంగా ఇతర ఖాతాల్లో సబ్సిడీ జమ అయినట్లుగా సంబంధిత అధికారులకు 16 ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక 2016–17, 2017–18లో దరఖాస్తులే ఆహ్వానించలేదు. గిరిజన సంక్షేమశాఖలోనూ అదే పరిస్థితి జిల్లాలో గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఉమ్మడి జిల్లాలో 2015–16 ఆర్థిక సంవత్సరానికి 161 మందిని అర్హులుగా ఎంపిక చేశారు. దాదాపు ఒక సంవత్సరం తర్వాత ప్రభుత్వం స్వయం ఉపాధి రుణాలకు సబ్సిడీని విడుదల చేసింది. అయితే ఇందులో 161 మందికి రూ. 165 లక్షల సబ్సిడీ అందించాల్సి ఉండగా కేవలం 81 మందికి మాత్రమే సబ్సిడీ ఇచ్చారు. పూర్తిగా అందించామని గ్రౌండింగ్ కాకపోవడంతో ఆన్లైన్లో చూపడం లేదని అధికారులు చెబుతున్నా ఇంకా కొంత మందికి రుణాలు అందలేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఇక 2016–17లో ఎస్టీ సంక్షేమ శాఖ ద్వారా అందించే రుణాలకు దరఖాస్తులు స్వీకరించలేదు. కానీ 2017–18 ఆర్థిక సంవత్సరానికి దరఖాస్తులు స్వీకరించారు. ఇందులో 633 మందిని ఎంపిక చేశారు. వీరికి రూ. 695.96 లక్షల సబ్సిడీ అందించాల్సి ఉంది. ప్రభుత్వం బడ్జెట్ రిలీజు చేయలేదు. అందరికీ ఇచ్చామంటున్న అధికారులు ఏస్సీ కార్పొరేషన్ ద్వారా 2015–16లో 1,770 మంది లబ్ధిదారులను ఎంపిక చేశారు. ప్రభుత్వం బడ్జెట్ విడుదల చేయగా 1,629 మందికి అందించినట్లుగా లెక్కలు చూపుతున్నాయి. కానీ అధికారులు మాత్రం అందరికీ అందాయని చెబుతున్నారు. అయితే తమకు రుణాలు అందించలేదని, బ్యాంకు ఖాతా నంబర్లు మారినందున బ్యాంకర్లు ఇవ్వడం లేదని సంబంధిత శాఖలకు 15 ఫిర్యాదులు వచ్చినట్లు సమాచారం. ఇదిలా ఉంటే 2016–17 ఆర్థిక సంవత్సరంలో 1500 మంది లబ్ధిదారులను ఎంపిక చేయాల్సి ఉండగా కేవలం 524 మంది లబ్ధిదారులను మాత్రమే ఎంపిక చేశారు. ఇందులో 132 మందికి సబ్సిడీ విడుదల కాగా నేటికీ ఒక్కరికి కూడా అందించలేదు. త్వరలోనే అందిస్తాం 2015–16 సంవత్సర బీసీ కార్పొరేషన్ ద్వారా విడుదలైన సబ్సిడీని లబ్ధిదారులకు త్వరలోనే అందిస్తాం.లబ్ధిదారులు.. బ్యాంకర్లకు యూసీలు అందించకపోవడం వల్ల గ్రౌండింగ్ కాక పెండింగ్ చూపిస్తున్నాయి. కొన్ని చోట్ల బ్యాంకర్ల బిజీగా ఉండటంతో లబ్ధిదారులకు అందించలేక పోయారు. అదే విధంగా ఇతర ఖాతాల్లో కొంత సబ్సిడీ పడటంతో ప్రభుత్వానికి నివేదికలు పంపాం. త్వరలోనే అందరికీ అందిస్తాం. -
స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలి
వీరన్నపేట (మహబూబ్‌నగర్) : తెలంగాణ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను తక్షణమే విడుదల చేయాలని బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు శివకుమార్ డిమాండ్ చేశారు. గురువారం బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల విద్యార్థులు జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీ, ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శివకుమార్ మాట్లాడుతూ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉద్యోగుల జీతాలను మూడింతలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెంచి విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లను చెల్లించకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రభుత్వం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను చెల్లించకపోవడం వల్ల విద్యార్థుల నుంచి కళాశాలల యాజమాన్యాలు పరీక్ష ఫీజులను తీసుకోవడం లేదని అన్నారు. దీంతో విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ప్రభుత్వం బకాయిలను వెంటనే విడుదల చేయాలని, అదేవిధంగా హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీలను పెంచాలని డిమాం డ్ చేశారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మున్నూరు రాజు, కార్యదర్శి ఓంప్రకాష్, నాయకులు వెంకట్రాములు, బాలరాజు, అంజి, నరేష్, నవీన్, శివ, గోపి, రఘు తదితరులు పాల్గొన్నారు. -
చెయ్యిచ్చారు !
సాక్షి, గుంటూరు :జిల్లాలోని పంచాయతీలు నిధులు లేక నీరసిస్తున్నాయి. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నాయి. పంచాయతీ ఎన్నికలు ఆలస్యంగా జరగడంతో కేంద్రం నిధులు సరిగా విడుదల చేయలేదు. అరకొరగా విడుదల చేసిన 13వ ఆర్థిక సంఘం, స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ (ఎస్ఎఫ్సీ) నిధులను బకాయిలు పేరుతో లాక్కుంటున్నారు. గత ఐదు నెలలు క్రితం కొత్తగా కొలువుదీరిన పంచాయతీ పాలకవర్గాలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతుంటే, మరో వైపు ఏకగ్రీవ పంచాయతీలకు నజరానా అందిస్తామని ఆశలు చూపిన సర్కారు ఇప్పుడు మొండి‘చెయ్యి’ చూపుతోంది. ఇంతవరకు ఏకగ్రీవ పంచాయతీలకు అందించాల్సిన ప్రోత్సాహకాలు అందించలేదు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏకగ్రీవాలకు ఈ నిధులు అందుతాయో లేదోనని ఏకగ్రీవ పంచాయతీల్లోని పెద్దలు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలోని 162 ఏకగ్రీవ పంచాయతీలపై నాలుగు నెలల క్రితమే పంచాయతీ అధికారులు నివేదిక పంపించారు. ఇంతవరకు మేజరు, మైనరు పంచాయతీలకు రూ.లక్షల్లో అందించాల్సిన నజరానాలపై నోరు మెదపడం లేదు. గ్రామాల్లో అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి ఫ్యాక్షన్ పల్లెల్లో శాంతి సుమాలు పూయించిన పెద్దలు, యువత చేసిన కృషి నీరుగారిపోతోంది. జిల్లాలోని 1,010 పంచాయతీలకు గత ఏడాది మూడు దశల్లో ఎన్నికలు జరిగాయి. ఏకగ్రీవ పంచాయతీలు అధికంగా తెనాలి డివిజన్లో ఉన్నాయి. ఈ డివిజన్లోని ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన వెంటనే నగరం మండలంలో ఫ్యాక్షన్ గ్రామమైన పెద్దవరం ఏకగ్రీవం అయింది. ఇక్కడి గ్రామస్తులంతా కలిసికట్టుగా గ్రామాభివృద్ధికి పాటుపడ్డారు. అప్పట్లో ఏకగ్రీవ పంచాయతీలకు భారీ నజరానా అందిస్తామనే ప్రభుత్వ ప్రకటనతో పల్నాడు ప్రాంతంలోని గ్రామాలు ఏకగ్రీవ బాట పట్టాయి. 2006లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మేజరు పంచాయతీలకు రూ.5 లక్షల వరకు ప్రభుత్వం ప్రోత్సాహకం అందించింది. ఈ మొత్తాన్ని 2013లో జరిగిన ఎన్నికల్లో పెంచుతామని ప్రకటించడంతో జిల్లాలో కక్ష్యలు, కార్పణ్యాలు నెలకొన్న గ్రామాలు ఏకగ్రీవ బాట పట్టాయి. తెనాలి డివిజన్లో 62, గుంటూరులో 37, నరసరావుపేటలో 57 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ప్రోత్సాహకాల కోసం ఎదురు చూస్తున్నాం... పంచాయతీలకు అందించాల్సిన ప్రోత్సాహకాల కోసం ఎదురు చూస్తున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి చంద్రశేఖర్ ‘సాక్షి’కి తెలిపారు. ఏకగ్రీవం అయిన వెంటనే ప్రభుత్వానికి నివేదిక పంపినట్లు పేర్కొన్నారు.