note to vote Case
-
గ్రేటర్‌పై సర్కారు కుట్ర
సాక్షి, హైదరాబాద్: ఐఏఎస్ అధికారులపై ఆరోపణలు చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రే ఓటుకు నోటు కేసులో దొరికిన ఓ దొంగ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. శనివారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్పొరేటర్ల సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఐఏఎస్ అధికారులపై ఆరోపణలు వస్తే వాస్తవాలను బయటపెట్టి చర్యలు తీసుకోవాలన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో ఒక మేడిగడ్డ బ్యారేజ్ మాత్రమే కుంగిందని, దాన్ని భూతద్దంలో పెట్టి చూపిస్తున్నారని దుయ్యబట్టారు. చిన్న చిన్న లోపాలు ఉంటే ఎత్తి చూపాలి కానీ దాన్ని రాజకీయం కోసం వాడుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం గ్రేటర్ హైదరాబాద్‌పై పగ పట్టినట్లుగా వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. అయోమయంగా కాంగ్రెస్ పాలన కాంగ్రెస్ సర్కార్ రాజకీయ దురుద్దేశాలతో నగర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ప్రజాపాలన అందిస్తామంటూ పగల్భాలు పలుకుతున్న కాంగ్రెస్ సర్కార్.. జీహెచ్ఎంసీ జనరల్ బాడీ సమావేశం, స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు జరగకుండా ఆపుతోందని దుయ్యబట్టారు. ఫార్మాసిటీ, మెట్రో విస్తరణ వంటి భారీ ప్రాజెక్టులను రద్దు చేయడం వల్ల రాష్ట్ర అభివృద్ధి కూడా దెబ్బతింటుందన్నారు. 60 రోజుల కాంగ్రెస్ పాలన అయోమయంగా ఉందన్నారు. 6 గ్యారంటీలలో ఉన్న 13 కార్యక్రమాలతో పాటు 420 హామీల అమలుకు రూ. 57 వేల కోట్లు మాత్రమే బడ్జెట్లో కేటాయించిందని విమర్శించారు. మహాలక్ష్మి పథకం కోసం రూ. 50వేల కోట్లకుపైగా అవుతుందన్నారు. రైతుబంధు, ఆసరా, రుణమాఫీ వంటి పథకాల అమలుకు నిధులు ఎక్కడి నుంచి తెస్తారో బడ్జెట్లో చెప్పలేదని కేటీఆర్ ఉద్ఘాటించారు. పార్టీ మారితే వచ్చే నష్టమేమీ లేదు ఒక్కరో ఇద్దరో పార్టీ మారితే వచ్చే నష్టం ఏమీ లేదని.. అది వారి ఖర్మ అని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఎమ్మెల్యే టికెట్లు ఆశించి.. రాజకీయ కారణాలతో అవకాశం రాకున్నా పార్టీ కోసం నిబద్ధతతో పని చేశారన్నారు. ప్రతీ కార్పొరేటర్, పార్టీ శ్రేణులు చేసిన కృషితోనే నగరంలో బీఆర్ఎస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయగలిగిందని గుర్తు చేశారు. అధికారులు సహకరించడం లేదు: మేయర్ రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడి కారణంగా అధికారులు ప్రజాప్రతినిధులకు సహకరించడం లేదని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి ఆరోపించారు. ప్రభుత్వం అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి నగర అభివృద్ధిని అడ్డుకోవద్దన్నారు. స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికలు, జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించే అంశాన్ని నిర్ణయించడం కోసమే ముఖ్యమంత్రిని కలిశానన్నారు. ఒక సాధారణ కార్పొరేటర్‌గా ఉన్న తనకు పార్టీ మేయర్‌గా అవకామిచి్చందన్నారు. సమావేశంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్, మహమూద్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
ఓటుకు కోట్లు కేసులో రేవంత్‌కు సుప్రీంలో చుక్కెదురు
సాక్షి, ఢిల్లీ: ఓటుకు కోట్లు కేసులో టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఓటుకు కోట్లు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదంటూ రేవంత్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను దేశ సర్వోన్నత న్యాయస్థానం తోసిపుచ్చింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం ఈరోజు(మంగళవారం) విచారణ చేపట్టింది. ఓటుకు కోట్లు కేసు అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి రాదంటూ దాఖలు చేసిన పిటిషన్లను గతంలో హైకోర్టు కొట్టేయడంతో రేవంత్‌రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును సుప్రీంకోర్టు కూడా డిస్మిస్ చేయడంతో రేవంత్‌రెడ్డికి మరోసారి భంగపాటు తప్పలేదు. కాగా, తెలుగు రాష్ట్రాల్లో ఓటుకు నోటు కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ను ప్రలోభాలకు గురిచేసిన విషయం విదితమే. అప్పట్లో టీడీపీలో ఉన్న రేవంత్‌రెడ్డి స్వయంగా స్టీఫెన్సన్ ఇంటికి వెళ్లి భారీ మొత్తంలో నగదుతో ప్రలోభాలకు గురిచేసిన వీడియో గతంలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ముద్దాయిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయపోరాటం చేస్తున్న క్రమంలో నేడు సుప్రీంలో విచారణకు వచ్చింది. చదవండి: ఎందుకంత ఆందోళన? బాబు లాయర్లతో సుప్రీం బెంచ్.. విచారణ వాయిదా -
ఓటుకు కోట్లు కేసులో కదలిక.. 4న సుప్రీంకోర్టులో విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసును ఈ నెల 4న సుప్రీంకోర్టు విచారించనుంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని ఎమ్మెల్సీ స్టీఫెన్సన్ను ప్రలోభాలకు గురిచేసిన విషయం విదితమే. ఈ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ముద్దాయిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయపోరాటం చేస్తున్నారు. ఇందులో భాగంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను 4వ తేదీన జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. ఓటుకు కోట్లు కేసును తెలంగాణ ప్రభుత్వం తగిన విధంగా దర్యాప్తు చేయడంలేదని, పూర్తి ఛార్జిషీటు వేయలేదని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఎమ్మెల్యే ఆళ్ల దాఖలు చేసిన మరో పిటిషన్‌ను సుప్రీంకోర్టు 4న విచారించనుంది. చదవండి: అసలు చంద్రబాబు అరెస్ట్‌కి, తిరుమలకు ఏం సంబంధం? -
ఇద్దరు సీఎంలు దోషులే!
నిజామాబాద్ సిటీ : శాసనమండలి ఎన్నికలలో ‘ఓటుకు నోటు’ విషయంలో ప్రజాస్వామాన్ని ఖూనీ చేస్తున్న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులపై రాష్ట్రపతి రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోవాలంటూ డీసీసీ అధ్యక్షుడు తాహెర్ బిన్ హందాన్ కోరారు. ‘నోటుకు ఓటు’ విషయంలో ఇద్దరు సీఎంలు అవలంబిస్తున్న వైఖరికి నిర సనగా రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్ (ఎన్టీఆర్ చౌరస్తా) వద్ద వారి దిష్టిబొమ్మలను దహనం చేశారు. అనంతరం తాహెర్ బిన్ హం దాన్ మాట్లాడుతూ శాసనమండలి ఎన్నికలలో ఒక సీఎం నోట్లు ఇస్తుండగా,మరొక సీఎం డబ్బులు ఇచ్చి ఎమ్మెల్యేను కొంటూ ప్రజాస్వామ్యాన్ని ఖూని చేశారని అన్నారు. ‘ఓటుకు నోటు’ విషయంలో దొంగ నాటకం ఆడుతున్న ఇద్దరు సీఎంలు తోడు దొంగలేనని ఆయన వ్యాఖ్యానించారు. వీరిద్దరూ శిక్షర్హూలేనని, రాష్ట్రపతి జోక్యం చేసుకుని వీరిద్దరిపై రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. వాస్తవాలను బయటకు తీసి రెండు రాష్ట్రాల ప్రజలకు ఉత్కంఠ తొలగించాలన్నారు. మేధావులు ఏకమై తెలం గాణ, ఏపీ ప్రజలను కాపాడాలని కోరారు. ప్రజాస్వామ్యం పట్ల, ప్రజల పట్ల కాంగ్రెస్ పార్టీకి పూర్తి గౌరవం ఉందన్నారు. ఎప్పుడు ప్రజల పక్షానే ఉంటూ పోరాటం చే స్తామన్నారు. ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశ వేణు, మున్సిపల్ ఫ్లోరులీడర్ మాయవార్ సాయిరాం, కార్పొరేటర్లు కేశ మహేష్, చాంగుభాయి, ఖూద్దుస్, దారం సాయిలు, సర్పంచుల సంఘం ఫోరం అధ్యక్షుడు బోజన్న, డీసీసీ ఉపాధ్యక్షుడు జాకీర్, ప్రధాన కార్యదర్ళులు ఆకుల చిన్న రాజేశ్వర్, పోలా ఉషా, మహిళా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి స్వర్ణలత, అపర్ణ, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సుమీర్, యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ, నగర కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అజారుద్దీన్, నాయకులు సుమన్ తదితరులు పాల్గొన్నారు.