సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసును ఈ నెల 4న సుప్రీంకోర్టు విచారించనుంది. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయాలని ఎమ్మెల్సీ స్టీఫెన్‌సన్‌ను ప్రలోభాలకు గురిచేసిన విషయం విదితమే. ఈ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడిని ముద్దాయిగా చేర్చాలని ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి న్యాయపోరాటం చేస్తున్నారు.
ఇందులో భాగంగా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను 4వ తేదీన జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం విచారించనుంది. ఓటుకు కోట్లు కేసును తెలంగాణ ప్రభుత్వం తగిన విధంగా దర్యాప్తు చేయడంలేదని, పూర్తి ఛార్జిషీటు వేయలేదని, సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని కోరుతూ ఎమ్మెల్యే ఆళ్ల దాఖలు చేసిన మరో పిటిషన్‌ను సుప్రీంకోర్టు 4న విచారించనుంది.
Comments
Please login to add a commentAdd a comment