NSE banking intrade
-
దేశీయ స్టాక్ మార్కెట్లపై బేర్ పంజా...నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
దేశీయ స్టాక్ మార్కెట్లపై గురువారం బేర్ పంజా విసిరింది. దీంతో సూచీలు కుప్ప కూలి గురువారం ఉదయం ప్రారంభం నుంచి స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. మన దేశంలో పెట్రోల్ ధరలు పెరగడం, రష్యా–ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్త పరిస్థితుల వల్ల గోధుమలు, పామాయిల్ వంటి కమోడిటీలతో పాటు ప్యాకేజింగ్ మెటీరియల్స్ మొదలైన వాటి రేట్లు పెరగడంతో ఆ భారాన్ని వినియోగదారులకు బదలాయించేందుకు ఎఫ్ఎంసీజీ (ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్) సంస్థలు సిద్ధమవ్వడం, అంతర్జాతీయంగా అమెరికా బాండ్లపై వడ్డీరేట్లు పెరగుతుండడం,యూరప్‌లో యుద్ధం పరిస్థితులు, పశ్చిమ దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్ల పెంపు నిర్ణయాలు సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి దీంతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం ఉదయం 9.20గంటలకు సెన్సెక్స్ పాయింట్లు నష్టపోయి 57370 వద్ద ట్రేడ్ అవుతుండగా..నిఫ్టీ 489 పాయింట్లు నష్టపోయి 35659 పాయింట్ల వద్ద ట్రేడింగ్ ను కొనసాగుతుంది. కోల్ఇండియా, హిందాల్కో, ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్, జేఎస్‌డబ్ల్యూస్టీల్, టాటా స్టీల్, అదానీ పోర్ట్ స్టాక్స్ లాభాలతో కంటిన్యూ అవుతుండగా..కొటాక్, ఐసీఐసీఐ,హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఎస్బీఐ షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. -
అర్ధరాత్రి వరకూ ట్రేడింగ్‌కు రెడీ
ముంబై: ట్రేడింగ్ వేళలను అర్ధరాత్రి వరకూ పొడిగించేందుకు సిద్ధంగా ఉన్నామని నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ) సీఈఓ విక్రమ్ లిమాయే స్పష్టంచేశారు. సెబీ ఆదేశాలకు అనుగుణంగా ప్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్ అండ్ ఓ) విభాగంలో ట్రేడింగ్‌ను అక్టోబర్ 1 నుంచి రాత్రి 11.15 వరకూ పొడిగించేందుకు ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఎన్ఎస్ఈ కార్యకలాపాలు మొదలై 25 ఏళ్లు అయిన సందర్బంగా బుధవారం ఇక్కడ జరిగిన రజతోత్సవ కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని తెలిపారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఈ కొత్త లోగోను ఆవిష్కరించారు. ‘ప్రస్తుతం ఉదయం 9.15 నుంచి మధ్యాహ్నం 3.30 వరకూ ట్రేడింగ్ జరుగుతోంది. క్యాష్ మార్కెట్ ముగిసిన కొంత వ్యవధి తర్వాత రెండో సెషన్ సాయంత్రం 5 నుంచి ప్రారంభమై రాత్రి 11.15కు ముగుస్తుంది. అయితే, ఈ సెషన్లో డెరివేటివ్స్ (ఎఫ్ అండ్ ఓ) ట్రేడింగ్‌కు మాత్రమే అవకాశం ఉంటుంది’ అని పేర్కొన్నారు. ఐపీఓ ఎప్పుడంటే... ఎన్ఎన్ఈ కో–లొకేషన్ సర్వర్లకు సంబంధించి వివాదంపై మాట్లాడుతూ... దీనిపై ఇప్పటికే తమ అంతర్గత దర్యాప్తును పూర్తి చేశామని.. దీనికి తగిన పరిష్కారం కోసం సెబీతో తాజాగా మళ్లీ సంప్రదింపులు జరుపుతున్నామని తెలియజేశారు. కన్సెంట్ విధానంలో (నేరాన్ని అంగీకరించడం లేదా నిరాకరించడంతో సంబంధం లేకుండా జరిమానా రూపంలో కొంత చార్జీలను చెల్లించడం) దీన్ని పరిష్కరించుకుంటామని చెప్పారు. ‘ఎన్ఎస్ఈ ఐపీఓ (రూ.10,000 కోట్లుగా అంచనా) ఎప్పుడు వస్తుందో ఇప్పుడే చెప్పలేను. ఎందుకంటే కో–లొకేషన్ సమస్యతో ఇది ముడిపడి ఉంది. ఈ వివాదానికి పరిష్కారం ఎంత త్వరగా లభిస్తుందో అంత త్వరగా ఐపీఓ పూర్తవుతుంది’ అని లిమాయే వివరించారు. ఇక కమోడిటీ కాంట్రాక్టుల్లో ట్రేడింగ్‌ను కూడా అక్టోబర్ 1 నుంచి ప్రారంభించేందుకు సిద్ధమేనని చెప్పారు. ‘దీనికి నియంత్రణ సంస్థ సెబీ అనుమతులు రావాల్సి ఉంది. ముందుగా బులియన్ (బంగారం, వెండి), ఇంధనం, మెటల్ వంటి వ్యవసాయేతర ఉత్పత్తులతో కమోడిటీ ట్రేడింగ్‌ను ప్రారంభిస్తాం’ అని వెల్లడించారు. రిటైల్ ఇన్వెస్టర్లతో పాటు సంస్థాగత ఇన్వెస్టర్ల సంఖ్యను మరింతగా పెంచాల్సిన అవసరం ఉందని లిమాయే పేర్కొన్నారు. ఈక్విటీ, డెట్‌పై మరింత దృష్టి: చావ్లా వ్యాపార విస్తరణలో భాగంగా ఈక్విటీ, డెట్, వడ్డీరేట్లు ఫ్యూచర్స్ విభాగాలపై మరింత దృష్టి పెడతామని ఎన్ఎస్ఈ చైర్మన్ అశోక్ చావ్లా పేర్కొన్నారు. అదేవిధంగా కంపెనీల నిధుల సమీకరణ వ్యయాలను కూడా తగ్గించడానికి ప్రయత్నిస్తామని చెప్పారు. కమోడిటీ ఫ్యూచర్స్లోకి ప్రవేశంతో ఎక్సే్ఛంజ్ టర్నోవర్ ఇంకాస్త జోరుందుకుంటుందని చావ్లా తెలిపారు. మరిన్ని శిఖరాలనుచేరాలి...: మన్మోహన్ సరిగ్గా 25 ఏళ్ల క్రితం 1994లో దేశంలో రెండో ప్రధాన స్టాక్ ఎక్సే్ఛంజ్‌గా ఆవిర్భవించి అనతి కాలంలో టర్నోవర్ పరంగా నంబర్ వన్ స్థానానికి ఎగబాకిన ఎన్ఎస్ఈ.. ఇంకా మరెన్నో విజయ శిఖరాలను అధిరోహించాల్సి ఉందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఆకాంక్షించారు. అప్పటి ఆర్థిక మంత్రి హోదాలో ఎన్సీఈ కార్యకలాపాలను ప్రారంభించింది మన్మోహన్ కావడం గమనార్హం. ‘1994లో దేశ ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తుపై ఎవరికీ అంతగా విశ్వాసం లేదు. ముఖ్యంగా ఫైనాన్షియల్ రంగానికి గడ్డురోజులవి. అయితే, అవన్నీ తప్పని దేశ భవిష్యత్తుకు ఢోకాలేదని నిరూపించగలిగాం’ అని ఎన్ఎస్ఈ రజతోత్సవ వేడుకలో మన్మోహన్ పేర్కొన్నారు. మార్కెట్, దేశ ఆర్థికాభివృద్ధితో పాటు ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో భారత్‌ను మరింతగా సమ్మిళితం చేసే దిశగా ఎన్ఎస్ఈ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తుందని మన్మోహన్ పేర్కొన్నారు. కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ కార్యక్రమానికి హాజరవ్వాల్సి ఉన్నా.. అనుకోని కారణాలతో రాలేకపోయా రు. ఆయన సందేశాన్ని చదవి వినిపించారు. -
స్టాక్ మార్కెట్ హైజంప్
ఆకాశమే హద్దుగా కొత్త రికార్డుల వెల్లువ * 650 పాయింట్లు ఎగసిన సెన్సెక్స్ తొలిసారిగా 23,000కు * 200 పాయింట్లు దూసుకెళ్లిన నిఫ్టీ 6,859 పాయింట్ల వద్ద ముగింపు * దుమ్ముదులిపిన బ్యాంకింగ్ షేర్లు మళ్లీ ఎఫ్ఐఐల పెట్టుబడుల జోరు ప్రస్తుత ఎన్నికల తర్వాత కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పడుతుందన్న అంచనాలు స్టాక్ మార్కెట్లకు ప్రోత్సాహమిచ్చాయి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు మరో రెండు రోజుల తర్వాత వెలువడనున్న నేపథ్యంలో ముందుగానే కొద్దిమంది బుల్ ఆపరేటర్లు డెరివేటివ్ విభాగంలో భారీ పొజిషన్లు తీసుకోవడం ద్వారా ఈ ర్యాలీకి కారణమయ్యారని మార్కెట్ వర్గాలు పేర్కొంటున్నాయి. దీంతో ఆకాశమే హద్దుగా మార్కెట్లు హైజంప్ చేశాయి. మరోసారి కొత్త రికార్డులను సృష్టించాయి! స్టాక్ మార్కెట్ చరిత్రలో సెన్సెక్స్ తొలిసారి 23,000 పాయింట్లను అధిగమించగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 6,850ను దాటి ముగిసింది. ఈ బాటలో బ్యాంక్ నిఫ్టీ సైతం సరికొత్త గరిష్టం 13,810ను తాకడం విశేషం! సాధారణ ఇన్వెస్టర్లు, ట్రేడర్లను నిర్ఘాంత పరుస్తూ వారాంతం రోజున స్టాక్ మార్కెట్లు రివ్వున దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 650 పాయింట్లు ‘హై’జంప్‌చేసి 22,994 పాయింట్ల ముగిసింది. ఇది సెప్టెంబర్ 2013 తరువాత అతిపెద్ద ర్యాలీకాగా, ఇంట్రాడేలో 704 పాయింట్లు ఎగసి 23,048 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇక నిఫ్టీ కూడా 199 పాయింట్లు పుంజుకుని 6,859 వద్ద ముగిసింది. ఒక దశలో అత్యధికంగా 6,871ను తాకింది. ర్యాలీకి ప్రధానంగా బ్యాంకింగ్ దిగ్గజాలు దోహదపడ్డాయి. ఎన్ఎస్ఈ బ్యాంకింగ్ ఇండెక్స్ ఇంట్రాడేలో 13,810ను తాకి, చివరికి 13,750 వద్ద స్థిరపడింది. ఇక్కడ ప్రస్తావించదగ్గ విశేషమేమిటంటే ఇవన్నీ సరికొత్త రికార్డులే!! సెన్సెక్స్, నిఫ్టీ 3% చొప్పున పుంజుకోగా, బ్యాంక్ నిఫ్టీ, బీఎస్ఈ బ్యాంకెక్స్ 5.5% స్థాయిలో ఎగశాయి. ఈ బలంతో మార్కెట్లు సరికొత్త రికార్డులను నెలకొల్పాయి!! ర్యాలీకి కారణాలేంటి? ప్రస్తుతం జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ మెజారిటీ సాధించి, అధికారంలోకి వస్తుందన్న గట్టి విశ్వాసాన్ని బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడి వ్యక్తంచేయడం తాజా ర్యాలీకి కారణంగా కొంతమంది నిపుణులు విశ్లేషిస్తున్నారు. మార్కెట్లో కొద్దిరోజుల నుంచి షేర్లు కొంటున్న బలమైన ట్రేడర్లు ఒక్కసారిగా ముందస్తు ర్యాలీకి తెరలేపారని మరికొంతమంది నిపుణులు వాదిస్తున్నారు. మోడీ ప్రధాని కాగలరన్న అంచనాల తో గత ఆరు నెలలుగా మార్కెట్లు బలపడుతూ వచ్చిన సంగతి తెలిసిందే. కేంద్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటయితే సంస్కరణలు వేగమందుకుంటాయని, ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటుందని మార్కెట్ వర్గాలు ఆశిస్తున్నాయి. అయితే రెండు వారాలుగా ఎన్డీఏకు తగిన మెజారిటీ లభించకపోవచ్చునన్న ఊహలు కూడా మార్కెట్లలో వ్యాపించాయి. దీంతో అమ్మకాలు పెరిగి ఈ మధ్యకాలంలో మార్కెట్లు 2.5% వరకూ నష్టపోయాయి కూడా. కాగా, సోమవారం(12న) చివరి దశ పోలింగ్ జరిగాక ఎగ్జిట్ పోల్స్ వెలువడనున్నాయి. నిజానికి వీటి ఆధారంగా మంగళవారం(13) నుంచి మార్కెట్లలో సందడి మొదలవుతుందని ఇన్వెస్టర్లు ఊహిస్తూ వచ్చారు. ఈలోపు అనూహ్యంగా శుక్రవారమే మార్కెట్లు భారీ స్థాయిలో పుంజుకున్నాయి. విశేషాలెన్నో... * గత నాలుగు రోజుల్లో రూ. 810 కోట్లను మాత్రమే ఇన్వెస్ట్‌చేసిన ఎఫ్ఐఐలు ఒక్కసారిగా రూ. 1,269 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. * బ్యాంక్ షేర్లలో ఐసీఐసీఐ బ్యాంక్ దాదాపు 7% ఎగసి రూ. 1,375 వద్ద ముగిసింది. తద్వారా 2008లో నమోదైన లైఫ్‌టైమ్ గరిష్టం రూ. 1,465కు చేరువైంది. యాక్సిస్ రూ. 1,632 వద్ద, కొటక్ మహీంద్రా బ్యాంక్ రూ. 852 వద్ద చరిత్రాత్మక గరిష్టాలను అందుకున్నాయి. * యస్‌బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, పీఎన్బీ, ఇండస్ఇండ్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, కెనరా, ఫెడరల్ బ్యాంక్, బీవోబీ 9-3% మధ్య దూసుకెళ్లాయి. * ఆర్ఐఎల్ దాదాపు నాలుగేళ్ల గరిష్టం రూ. 997ను తాకగా, జేఅండ్‌కే బ్యాంక్, అరవింద్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరాం సిటీ యూనియన్, ఐషర్ మోటార్స్ కూడా కొత్త రికార్డులను చేరాయి. * ఎంఅండ్ఎం, కోల్ ఇండియా, హెచ్‌పీసీఎల్, ఇంజినీర్స్, జీఎస్పీఎల్, బజాజ్ ఫిన్సర్వ్ తదితర 154 షేర్లు ఏడాది గరిష్టాలను తాకాయి. హా సెన్సెక్స్‌లో టాటా పవర్, హిందాల్కో, భెల్, ఓఎన్జీసీ, మారుతీ, హెచ్డీఎఫ్సీ, ఆర్ఐఎల్, హీరోమోటో, టాటా స్టీల్, ఎల్అండ్టీ 5.6-3.3% మధ్య పురోగమించాయి. * అన్ని రంగాల ఇండెక్స్లూ 1-5% మధ్య లాభపడగా, కేవలం ఫార్మా (0.5%) నష్టపోయింది. * రియల్టీ, పవర్, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్, మెటల్, ఆటో రంగాలు 4.5-2.5% ఎగశాయి. * ఒక్క రోజులో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ విలువ రూ. 1.5 లక్షల కోట్లమేర పెరిగి రూ. 76.43 లక్షల కోట్లకు చేరింది. * నిఫ్టీలో 4, సెన్సెక్స్‌లో 3 షేర్లు మాత్రమే నష్టపోయాయంటే ర్యాలీ ఎంత బలంగా వచ్చిందీ అర్థం చేసుకోవచ్చు. * రియల్టీలో హెచ్‌డీఐఎల్ 18% జంప్‌చేయగా, యూనిటెక్, డీబీ, ఇండియాబుల్స్, డీఎల్ఎఫ్, ఒబెరాయ్ 9-4% మధ్య దూసుకెళ్లాయి. * ట్రేడైన షేర్లలో 1,610 లాభపడితే, కేవలం 1,146 నష్టపోయాయి.