nuclear button
-
చర్చలకు మేం సిద్ధమే!
సియోల్: దాదాపు రెండేళ్ల తర్వాత దక్షిణకొరియా, ఉత్తరకొరియా దేశాల మధ్య చర్చలు జరగనున్నాయి. ఈ మేరకు ఇరు దేశాల ప్రతినిధులు వచ్చే వారంలో సమావేశం కానున్నారు. సరిహద్దులోని పాన్ముంజోమ్లో వీరు చర్చలు జరపనున్నారు. ఈ చర్చలను ‘మంచి పరిణామం’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అభివర్ణించారు. అమెరికాపై ఎక్కడైనా దాడి చేయగల అణు క్షిపణులు తన వద్ద ఉన్నాయనీ, దాడిని సంబంధించిన న్యూక్లియర్ బటన్ తన టేబుల్ పైనే ఉంటుందని కిమ్ ఇటీవల హెచ్చరించడం తెల్సిందే. దీనికి సమాధానంగా ట్రంప్.. కిమ్ దగ్గర ఉన్న దాని కంటే శక్తిమంతమైన బటన్ తన వద్ద ఉందని హెచ్చరించారు. -
నా దగ్గరా న్యూక్లియర్ బటన్
వాషింగ్టన్: ‘కిమ్ వద్ద ఉన్న దానికన్నా పెద్దదైన, శక్తిమంతమైన, బాగా పనిచేసే న్యూక్లియర్ బటన్ నా దగ్గర కూడా ఉంది’ అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ చేసిన హెచ్చరికలపై స్పందించారు. కొత్త ఏడాది సందర్భంగా కిమ్ ప్రసంగిస్తూ అమెరికా ప్రధాన భూభాగంపై ఎక్కడైనా దాడి చేయగల అణు క్షిపణులు తన వద్ద ఉన్నాయనీ, దాడిని ప్రారంభించేందుకు అవసరమైన న్యూక్లియర్ బటన్ కూడా ఎప్పుడూ తన టేబుల్ పైనే ఉంటుందంటూ హెచ్చరించడం తెలిసిందే. దీనికి సమాధానంగా ట్రంప్ ‘న్యూక్లియర్ బటన్ ఎల్లవేళలా తన టేబుల్‌పైనే ఉంటుందని ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ చెప్పారు. దారిద్య్రంతో, ఆకలి కేకలతో అల్లాడుతున్న ఆ దేశంలోని ఎవరైనా వెళ్లి ఆయనకు చెప్పండి నా దగ్గర కూడా అంతకు మించిన బటన్ ఉందని’ అని ట్రంప్ బుధవారం ట్వీట్ చేశారు. పాలస్తీనాకూ సాయం ఆపేస్తాం ఉగ్రవాదంపై పోరాటం కోసం పాక్‌కు అందిస్తున్న ఆర్థిక సాయాన్ని నిలిపివేయాలని నిర్ణయించిన అమెరికా తాజాగా పాలస్తీనాకూ అదే హెచ్చరిక చేసింది. ఇజ్రాయెల్‌తో శాంతి చర్చలను పాలస్తీనా పునరుద్ధరించకపోతే ఆర్థిక సాయాన్ని నిలిపేస్తామంది. పాలస్తీనా శరణార్థుల కోసం ఐక్యరాజ్యసమితి విభాగానికి 2016లో అత్యధికంగా అమెరికానే 368 మిలియన్ డాలర్లను సాయంగా అందించింది. ‘పాలస్తీనాకు మేం ఏటా వందల మిలియన్ డాలర్లు ఇస్తున్నా కానీ వారు మమ్మల్ని అగౌరవపరుస్తున్నారు.’ అంటూ ట్రంప్ ఓ ట్వీట్ చేశారు. అంతకుముందు ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ మాట్లాడుతూ పాలస్తీనాకు ఆర్థిక సాయాన్ని తమ ప్రభుత్వం నిలిపేసిందన్నారు. ‘అత్యంత అవినీతి మీడియా’ అవార్డు వచ్చే సోమవారం ‘అత్యంత అవినీతికర అమెరికా మీడియా’ అవార్డును ప్రకటిస్తానని ట్రంప్ చెప్పారు. ఈ అవార్డులు అవినీతి మీడియా, తప్పుడు వార్తలు, బ్యాడ్ రిపోర్టింగ్ కేటగిరీల్లో ఉంటాయన్నారు. ఫాక్స్ న్యూస్ మినహా మిగతా అమెరికా మీడియాతో ట్రంప్‌కు సత్సంబంధాలు లేవు. దీంతో సమాచారాన్ని ఆయన ఎక్కువగా ట్వీట్ల ద్వారానే వెల్లడిస్తుండటం తెలిసిందే. -
ట్రంప్ దగ్గర లేదు.. కిమ్ వద్ద ఉంది..
వాషింగ్టన్ : ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ దగ్గర ఉన్నదాని కంటే అతి పెద్ద న్యూక్లియర్ బటన్ తన వద్ద ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ ఒట్టిమాటలేనా?. తాజా రిపోర్టులు ఈ విషయాన్నే ధ్రువపరుస్తున్నాయి. అమెరికా మరో దేశంపై అణు ఆయుధాన్ని ప్రయోగించడానికి అధ్యక్షుడితో పాటు ముఖ్య మిలటరీ అధికారులు పాలుపంచుకోవాల్సివుంటుంది. సులువుగా డెస్క్ మీద ఉన్న బటన్ నొక్కడంతో అమెరికా అణు దాడి చేయలేదు. అణు దాడికి అవసరమయ్యే కోడ్స్(అవి అధ్యక్షుడి వద్ద మాత్రమే ఉంటాయి)ను అందించడానికి అధ్యక్షుడే కదిలి పెంటగాన్‌కు వెళ్లాల్సివుంటుంది. ఈ కోడ్స్‌ను ‘బిస్కెట్’ అనే కార్డులో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో భద్రపర్చివుంటాయి. ఈ కార్డు ఎల్లప్పుడూ ప్రెసిడెంట్ వద్దే ఉంటుంది. అత్యవసర సమయాల్లో ఈ కార్డులోని కోడ్స్‌ను మిలటరీ అధికారులకు అధ్యక్షుడు అందజేస్తారు. అంతేకాకుండా యుద్ధం వచ్చినప్పుడు అమలు చేయాల్సిన వార్ ప్లాన్లను అమెరికా ఓ పుస్తక రూపంలో భద్రపరిచింది. దానిలోని నియమ, నిబంధనలను అనుసరిస్తూ మాత్రమే న్యూక్లియర్ బాంబును అమెరికా ప్రయోగించగలుగుతుంది.