అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్
వాషింగ్టన్ : ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ దగ్గర ఉన్నదాని కంటే అతి పెద్ద న్యూక్లియర్ బటన్ తన వద్ద ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీట్ ఒట్టిమాటలేనా?. తాజా రిపోర్టులు ఈ విషయాన్నే ధ్రువపరుస్తున్నాయి.
అమెరికా మరో దేశంపై అణు ఆయుధాన్ని ప్రయోగించడానికి అధ్యక్షుడితో పాటు ముఖ్య మిలటరీ అధికారులు పాలుపంచుకోవాల్సివుంటుంది. సులువుగా డెస్క్ మీద ఉన్న బటన్ నొక్కడంతో అమెరికా అణు దాడి చేయలేదు. అణు దాడికి అవసరమయ్యే కోడ్స్(అవి అధ్యక్షుడి వద్ద మాత్రమే ఉంటాయి)ను అందించడానికి అధ్యక్షుడే కదిలి పెంటగాన్‌కు వెళ్లాల్సివుంటుంది.
ఈ కోడ్స్‌ను ‘బిస్కెట్’ అనే కార్డులో ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో భద్రపర్చివుంటాయి. ఈ కార్డు ఎల్లప్పుడూ ప్రెసిడెంట్ వద్దే ఉంటుంది. అత్యవసర సమయాల్లో ఈ కార్డులోని కోడ్స్‌ను మిలటరీ అధికారులకు అధ్యక్షుడు అందజేస్తారు. అంతేకాకుండా యుద్ధం వచ్చినప్పుడు అమలు చేయాల్సిన వార్ ప్లాన్లను అమెరికా ఓ పుస్తక రూపంలో భద్రపరిచింది. దానిలోని నియమ, నిబంధనలను అనుసరిస్తూ మాత్రమే న్యూక్లియర్ బాంబును అమెరికా ప్రయోగించగలుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment