రాసుకున్నోళ్లకు రాసుకున్నంత..
అనంతపురం మెడికల్ : ఒక రోగి త్వరగా కోలుకోవాలంటే వైద్యుడు ఎంత కీలకమో.. నర్సింగ్ కేర్ అంతకంటే కీలకం అని వైద్య నిపుణులు చెబుతుంటారు. అలాంటి నర్సింగ్ కోర్సును పూర్తి చేయూలంటే నిరంతర అధ్యయనం, పరిశీలన ఎంతో ముఖ్యం. వీటన్నింటికీ తిలోదకాలిస్తూ అనంతపురం సర్వజనాస్పత్రిలో బుధవారం జనరల్ నర్సింగ్ ఆఫ్ మిడ్వైఫరీ(జీఎన్ఎం) ప్రాక్టికల్స్‌లో ఇన్విజిలేటర్ల సమక్షంలోనే జోరుగా మాస్ కాపీయింగ్ చేరుుంచారు. వివరాల్లోకి వెళితే.. ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని కాన్పుల విభాగంలో జీఎన్ఎం ఎక్స్టర్నల్ పరీక్షలు నిర్వహించారు.
జిల్లా నలుమూలల నుంచి వందల సంఖ్యలో నర్సింగ్ విద్యార్థినిలు హాజరయ్యారు. వీరంతా ఒక చోట కూర్చొని కాపీయింగ్‌కి పాల్పడ్డారు. ఉదయం 10 నుంచి పరీక్షలు ప్రారంభమయ్యూరుు. వైవాతో పాటు, రోగి జబ్బుకి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలో వాటిని జవాబు పత్రంలో రాయాల్సి ఉంటుంది. అధ్యయనం, స్వయంగా చూసి తెలుసుకోవడం ద్వారా సమాధానాలు రాయూల్సి ఉండగా, ధైర్యంగా రికార్డులు తెరుచుకుని పరీక్షలు రాశారు. థియరీ పార్ట్ ఒక ఎత్తై ప్రధానంగా నర్సింగ్ గురించి ప్రాక్టికల్‌గా ప్రతిభ చూపాలి. అప్పుడు వారిని పాస్ చేస్తారు. అటువంటిది నిబంధనలకు విరద్ధంగా పరీక్షలు జరిపారు. ఆస్పత్రిలో ఎప్పుడూ లేని విధంగా పరీక్షలు నిర్వహించారు. ప్రైవేట్ నర్సింగ్ కళాశాలలతో కుమ్మక్కైనట్లు స్పష్టంగా తెలుస్తోంది.
గర్భిణిల మధ్యే చూచిరాత
న ర్సింగ్ విద్యార్థినుల అలజడితో ఆస్పత్రిలో గర్భిణిలు, బాలింతలకు ఇబ్బందులు ఎదురయ్యూరుు. రోగుల మధ్యే చూచి రాతలు రాశారు. ఓ వైపు నిండు చూలాలు ప్రసవ వేదనతో బాధపడుతుంటే పట్టించుకున్న వారు లేరు. బాలింతలు కాలు చాపుకుని పడుకునేందుకు వీలు లేకుండా పోయింది. ఏమైనా అంటే కసురుకుంటారేమోనని బాలింతలు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవంగా రోగులను ఇబ్బందులకు గురి చేయకుండా పరీక్షలు జరపాలి. పరీక్షలు ఇలా నిర్వహించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇన్విజిలేటర్ల అండతోనే
మాస్ కాపీరుుంగ్
ప్రాక్టికల్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరిగినా ఇన్విజిలేటర్లు ఏమాత్రం పట్టీపట్టనట్లుగా వ్యవహరించారు. దీనిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారికి తెలిసే మాస్ కాపీయింగ్ జరిగిందని స్పష్టంగా తెలుస్తోంది. ‘సాక్షి’ ఈ విషయంపై ఆరా తీయగా అప్పుడు మేలుకున్నారు. ఫోటోలు తీయాల్సిన పనిలేదని, నిబంధనల ప్రకారమే జరుపుతున్నామన్నారు.
చివరకు గుంపులుగా ఉన్న విద్యార్థినిలను ఓ ఇన్విజిలేటర్ చెదరగొట్టింది.
వారు తమ విద్యార్థులు కాదని దాటవేశారు. మూడేళ్ల పాటు చేయాల్సిన కోర్సును అడ్డదారుల్లో చేస్తున్నా ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. ఆర్ఎంఓ సైతం అటువైపు తొంగి చూడలేదు. ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఈ విషయం తెలిసే కాపీయింగ్‌కి పాల్పడినట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా సర్వజనాస్పత్రిలో ప్రాక్టికల్స్ ఇంత ఈజీగా ఉంటాయా అని రోగులు, వారి వెంట వచ్చిన బంధువులు ముక్కున వేలేసుకున్నారు. ఇలా కాపీ కొట్టి పరీక్షలు పాసైతే వీరేం సేవలు చేస్తారంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు.