లైంగికదాడి ఘటనపై డీఎస్పీ విచారణ
పాల్వంచ, న్యూస్‌లైన్: మండలంలోని మొండికట్ట గ్రా మంలో నాలుగేళ్ల బాలికపై యువకుడు లైంగికదాడికి పాల్పడిన ఘటనపై శనివారం కొత్తగూడెం డీఎస్పీ రంగరాజు భాస్కర్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా మొండికట్ట గ్రామాన్ని సందర్శించిన ఆయన 13 మంది సాక్షులను విచారించారు. అనంతరం ఆయన విలేకరుల తో మాట్లాడుతూ సంఘటన జరిగిన మాట వాస్తవమని నిరూపణ అయ్యిందని, ప్రాథమిక విచారణ పూర్తయిం దని, శాస్త్రీయంగా నిరూపణ కావాల్సి ఉందన్నారు. కొత్తగూడెం టూటౌన్ సీఐ ఎన్.వెంకటస్వామిని విచారణాధికారిగా నియమించినట్లు డీఎస్పీ తెలిపారు. అదేవిధంగా ఐసీడీఎస్ సూపర్వైజర్ వజ్రమ్మ, కార్యకర్త హేమలతల ఆధ్వర్యంలో సంఘటనపై విచారణ జరిపారు.