OBC Commission
-
ఓబీసీల వర్గీకరణతో సమన్యాయం
ఓబీసీ కులాల వర్గీ కరణ ఆవశ్యకతను గుర్తించి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం 2017 అక్టో బర్ 2న ముగ్గురు సభ్యులతో జస్టిస్ రోహిణి అధ్యక్షతన ఒక జాతీయ కమిషన్‌ను (justice rohini commission) ఏర్పాటు చేసింది. దానికి దేశంలో ఓబీసీ కోటాలో విద్యా–ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు అనుభవిస్తున్న సుమారు 2,640 కులాలను వర్గీకరించి రిజర్వేషన్లు అమలు చేయడంలోని సాధ్యా సాధ్యాలను పరిశీలించి నివేదిక సమర్పించడానికి 12 వారాల గడువు ఇచ్చింది. నాటి నుండి కేంద్ర ప్రభుత్వం కమిషన్ పదవీ కాలాన్ని ప్రతి ఆరు నెలలకు ఒక్కసారి పెంచింది. ఎట్టకేలకు కమిషన్ తన నివేదికను జూలై 2023లో సమర్పించింది. కానీ దాని అమలుకు ఇంతవరకూ చర్యలు తీసుకోకపోవడం చర్చనీయాంశం అయ్యింది. మరోవైపు దేశవ్యాప్తంగా సామాజికంగా, విద్యాపరంగా అభివృద్ధి చెందిన ఓబీసీ కులాల వారు(OBCs) వర్గీకరణను వ్యతిరేకిస్తున్న వైనం కనిపిస్తోంది.ఈ నేపథ్యంలో రాజకీయంగా నష్టం కలుగుతుందనే ఆలోచనతో బీజేపీ ప్రభుత్వం (BJP Government) ఓబీసీలను వర్గీకరించక పోవచ్చని రాజకీయ విశ్లేషకులు వాదిస్తున్నారు. 2023 ఆగస్టులో సుప్రీంకోర్టు ఏడుగురు జడ్జీల రాజ్యాంగ ధర్మాసనం.. ‘స్టేట్ అఫ్ పంజాబ్ వర్సెస్ దావీందర్ సింగ్’ కేసు తీర్పులో ఆర్టికల్ 341 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు షెడ్యూల్డ్ కులాల రిజర్వేషన్లను వర్గీకరణ ద్వారా అమలు చేసుకోవచ్చని తేల్చి చెప్పింది. ఇప్పటికే దేశంలోని 11 రాష్ట్రాల్లో బీసీ రిజర్వేషన్లను విద్యా, ఉద్యోగాల్లో వర్గీకరణ ద్వారా అమలు చేస్తున్నారు. బీసీ/ఓబీసీ కులాల మధ్య సామాజిక, విద్య, ఆర్థికపరమైన వ్యత్యాసాలు ఎక్కువగా ఉన్నాయి.అందుకే కేంద్రం 27 శాతం రిజర్వేషన్లను ఓబీసీలకు అమలు చేస్తున్నప్పటికీ, నేటికీ కేంద్రంలో 1,600 కులాలకు పైగా ఎలాంటి రిజర్వేషన్ల ఫలాలూ పొందలేదని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. అధిక జనసంఖ్య కలిగి సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బలంగా ఉన్న కులాల వారే అధిక ప్రయోజనం పొందుతున్నారు. కేంద్ర ఓబీసీ జాబితాలోని బీసీ కులాలు నేటి వరకు కేంద్ర ప్రభుత్వంలో రిజర్వేషన్ల ఫలాలను ఏ మేరకు అనుభవించాయనే లెక్కలను, వారి జనసంఖ్యను పరిగణలోకి తీసుకొని శాస్త్రీయంగా జస్టిస్ రోహిణి కమిషన్ ఓబీసీలను 4 గ్రూపులుగా వర్గీకరించి గ్రూప్–ఏలో 1,654 కులాలకు 2 శాతం, గ్రూప్–బీలో 534 కులా లకు 6 శాతం, గ్రూప్–సీలో 328 కులాలకు 9 శాతం, గ్రూప్–డీలో 104 కులాలకు 10 శాతం రిజర్వేషన్లను కేటాయిస్తున్నట్లు ప్రచారం జరిగింది. నిజమేమిటో తెలియదు. చదవండి: రూపంలో తేడా ఉన్నందుకేనా దొంగలు? మండల్ కమిషన్‌లోని సభ్యులు ఎల్ఆర్ నాయక్ ఆనాడే (1978–80) ఓబీసీ కులాల మధ్య అసమానతలను గమనించి ఆ కులాలను రెండు గ్రూపులుగా వర్గీకరించి 27 శాతం కోటాను అమలు పరచాలని డిసెంట్ నివేదికను కేంద్రానికి సమర్పించారు. అందులో అణిచివేయబడిన బీసీ కులాలకు 15%, మధ్యస్థ బీసీ కులాలకు 12% రిజర్వే షన్లు కేటాయించారు. కానీ, నాటి కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదు, 1993 నుండి ఉద్యోగాల్లో, 2008 నుండి విద్యాసంస్థల్లో వర్గీకరణ ద్వారా రిజర్వేషన్లు అమలు చేసి ఉంటే ఓబీసీల్లోని అత్యంత వెనుకబడిన కులా లకు న్యాయం జరిగి ఉండేది. మండల్ కమిషన్‌కు సంబంధించిన తీర్పులో సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం... బీసీల వర్గీకరణకు ఆమోదం తెలిపింది. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం ఓబీసీ కులాల మధ్య సమ న్యాయం కోసం వెంటనే జస్టిస్ రోహిణి కమిషన్ నివేదికను అమలు పరచాలి.- కోడెపాక కుమార స్వామిబీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు -
తుది అంకానికి ఓబీసీ వర్గీకరణ
సాక్షి, న్యూఢిల్లీ: ఓబీసీ ఉప కులాల వర్గీకరణ కమిషన్ ఆయా కులాల మధ్య రిజర్వేషన్లను దామాషా ప్రకారం పంచేందుకు వాటిని నాలుగు కేటగిరీలుగా ప్రతిపాదిస్తూ ముసాయిదా నివేదిక రూపొందించింది. ఆయా ప్రతిపాదనలను రాష్ట్రాలు, సంబంధిత భాగస్వాములతో చర్చించేందుకు సిద్ధమైంది. ఈ దిశగా మార్చి నెల నుంచి వివిధ రాష్ట్రాల్లో పర్యటించనున్నట్టు తెలుస్తోంది. మొత్తం 2,633 కులాలను నాలుగు కేటగిరీలుగా వర్గీకరిస్తూ.. వరుసగా 2, 6, 9, 10 శాతం రిజర్వే షన్లను పంపిణీ చేస్తూ కమిషన్ ప్రతిపాదించి నట్టు సమాచారం. రిజర్వేషన్ ఫలాలు పొందని, అత్యంత వెనబడిన కులాలను మొదటి కేటగిరీలో పొందు పరిచినట్టు తెలుస్తోంది. నాలుగో కేటగిరీలో 97 కులాలు మాత్రమే ఉన్నప్పటికీ... జనాభా పరంగా చూస్తే సింహభాగం వారే ఉన్నారు. కాబట్టి 27 శాతం ఓబీసీ రిజర్వేషన్లలో జనాభా ప్రాతిప దికన అత్యధికంగా 10% వారికే దక్కనుందని సమా చారం. 4వ కేటగిరీలో సామాజికంగా బలమైన, అత్యంత ప్రభావవంతమైన కులాలున్నాయి. గతం లోనూ ఈ కులాలే రిజర్వేషన్ల ఫలాలు అధికంగా పొందినప్పటికీ... జనాభా నిష్పత్తికి మించి వీరికి ప్రయోజనం కలిగిందనేది ఇతరుల అభ్యంతరం. మొదటి కేటగిరీలో 1,674 కులాలు, రెండో కేటగిరీలో 534 కులాలు, మూడో కేటగిరీలో 328, నాలుగో కేటగిరీలో 97 కులాలు పొందుపరిచినట్టు సమాచారం. కేంద్ర జాబితాలోని ఓబీసీ కులాలకు ప్రస్తుతం విద్య, ఉద్యోగాల్లో 27 శాతం రిజర్వేషన్లు వర్తిస్తున్నాయి. అయితే ఈ రిజర్వేషన్లలో మెజారిటీ భాగం కొన్ని కులాలకు మాత్రమే అందుతున్నాయని, ఓబీసీల్లో అత్యంత వెనకబడిన కులాలకు రిజర్వేషన్ ఫలాలు అందడం లేదంటూ బీసీ సంక్షేమ సంఘాల డిమాండ్లు, జాతీయ బీసీ కమిషన్ సిఫారసులు, స్థాయీ సంఘాల సిఫారసుల నేపథ్యంలో 2017 అక్టోబరు 2వ తేదీన ఈ కమిషన్ ఏర్పాటైంది. ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రోహిణి నేతృత్వంలో ఏర్పాటైన ఈ కమిషన్ అదే ఏడాది అక్టోబరు 10 నుంచి తన పని ప్రారంభించింది. ఈ కమిషన్ 12 వారాల్లో నివేదిక ఇవ్వాల్సి ఉండగా.. అనివార్య కారణాల వల్ల పలుమార్లు కేంద్ర మంత్రిమండలి ఈ కమిషన్ గడువు పొడిగించింది. ప్రస్తుతం 2021 జూలై 31కి నివేదిక ఇవ్వాల్సి ఉంది. ఈ కమిషన్ నాలుగు విధి విధానాల ఆధారంగా నివేదిక సమ ర్పించాల్సి ఉంటుంది. కేంద్ర జాబితాలో చేర్చిన ఓబీసీ కులాల మధ్య రిజర్వేషన్ ప్రయోజనాల పంపిణీలో అసమానతలు పరిశీలించడం, ఓబీసీ కులాల ఉప వర్గీకరణ కోసం శాస్త్రీయ విధానంలో నిబంధనలు రూపొందించడం, కేంద్ర జాబితాలో ఓబీసీలను ఉపకులాల వారీగా వర్గీకరించడం, కేంద్ర జాబితాలోని వివిధ ఎంట్రీలను అధ్యయనం చేసి అక్షర దోషాలు, పునరావృతులు, అస్పష్టతలు, లోపాలు ఉంటే వాటిని సరిదిద్దడం.. తదితరæ నాలుగు విధివిధానాలను దృష్టిలో పెట్టుకుని కమిషన్ నివేదిక సమర్పిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల ప్రవేశాల్లో... రిజర్వేషన్ల ద్వారా ప్రయోజనం పొందని ఓబీసీ కులాలకు.. ఈ కమిషన్ సిఫారసులను అమలు చేయడం ద్వారా లబ్ధి చేకూరుతుంది. ఓబీసీ జాబితాలో ఉన్న అటువంటి అట్టడుగు వర్గాలకు ప్రయోజనం చేకూర్చేలా కమిషన్ సిఫారసులు చేస్తుంది. సున్నితమైన అంశం... రాజకీయంగా ప్రాధాన్యత ఇప్పటివరకు ఓబీసీ రిజర్వేషన్లలో కొన్ని కులాలకే లబ్ధి చేకూరినట్టు కమిషన్ విశ్లేషించినట్టు తెలుస్తోంది. ఓబీసీలకు కేటాయించిన వాటిలో 97% మేర విద్యా సంస్థల్లో సీట్లు, ఉద్యోగాలు కేవలం 25% ఓబీసీ కులాలకే దక్కాయని, ఇందులో 24.95% ఉద్యోగాలు కేవలం 10 ఓబీసీ కులాలకే దక్కాయని, దాదాపు 983 కులాలకు (అంటే 37%) విద్య, ఉద్యోగాల్లో ప్రాతినిధ్యం లేకుండాపోయిందని కమిషన్ విశ్లేషించినట్టు తెలుస్తోంది. 994 ఓబీసీ కులాలకు 2.68% మేర కోర్సుల్లో సీట్లు, ఉద్యోగాలు దక్కినట్టు సమాచారం. ఓబీసీ ఉప కులాల వర్గీకరణ కమిషన్ తనకు అప్పగించిన విధివిధానాల మేరకు ఆయా అసమానతలను తొలగించాల్సి ఉన్నందున.. ఇప్పటివరకు ఓబీసీ రిజర్వేషన్ల ప్రయోజనాలను అధికంగా పొందిన కులాలను చివరి కేటగిరీలో చేర్చాల్సి వస్తుందని అంచనా. దేశంలో రాజకీయా లపై కులాల ప్రభావం ఎక్కువ ఉంటున్నందున.. రిజర్వేషన్లు తగ్గితే అధిక ప్రాబల్యం ఉన్న కులాల నుంచి రాజకీయ ఒత్తిళ్లు ఎలా ఉంటాయోనన్న చర్చ నడుస్తోంది. అయితే జనాభా ప్రాతిపదికన రిజ ర్వేషన్లు ఉండనున్నందున అలాంటి సమస్య తలె త్తదని, ఇప్పటివరకు రిజర్వేషన్ ఫలాలు అందని వారికి లబ్ధి చేకూరుతుందని, తాము లేవనెత్తిన అంశాలను కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుందని ఆశిస్తున్నామని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య ‘సాక్షి’కి తెలిపారు. సమాచారాన్ని విశ్లేషించిన కమిషన్ 11 రాష్ట్రాల్లో ఇప్పటికే బీసీ వర్గీకరణ అమలవుతోంది. అయితే ఆ వర్గీకరణ రాష్ట్ర జాబితాలోని కులాలకు రాష్ట్రస్థాయిలో వర్తిస్తుంది. ఇప్పుడు ఈ జాతీయస్థాయి కమిషన్ కేంద్ర జాబితాలోని ఓబీసీ కులాల మధ్య రిజర్వేషన్ల పంపిణీకి కసరత్తు చేస్తోంది. ఇప్పటికే బీసీ కులాల ఉప వర్గీకరణ చేపట్టిన అన్ని రాష్ట్రాలతో, రాష్ట్ర స్థాయి వెనుకబడిన తరగతుల కమిషన్లతో ఈ కమిషన్ చర్చించింది. ఉన్నత విద్య కోర్సుల్లో ఓబీసీ విద్యార్థుల ప్రవేశానికి సంబంధించిన సమాచా రాన్ని, ప్రభుత్వంలో భాగమైన వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, బ్యాంకులు, ఆర్థిక సహాయ సంస్థలు, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో ఓబీసీలకు ఇచ్చిన ఉద్యోగాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా కమిషన్ సేకరించింది. ఈ సమాచారాన్ని క్రోడీకరించి ఇప్పటివరకు రిజర్వేషన్ పంపిణీలో చోటు చేసుకున్న అసమానతలను విశ్లేషించింది. సంబంధిత సమాచారం భారీ పరిమాణంలో ఉన్నందున దానిని శాస్త్రీయంగా విశ్లేషించి సమగ్ర నివేదికను రూపొందించేందుకు సమయం అవసరమైంది. అలాగే లాక్డౌన్ పరిణామాల నేపథ్యంలో రాష్ట్రాల నుంచి సమాచారం రావడం ఆలస్యమైంది. వీటన్నింటినీ విశ్లేషించి, ముసాయిదాను రూపొందించిన కమిషన్ తన ప్రతిపాదనలపై వచ్చే నెల నుంచి రాష్ట్రాలు, ఓబీసీ కులాలు, సంబంధిత అంశంలో భాగస్వాములందరితో చర్చించనుంది. -
ఉపవర్గీకరణతోనే బీసీ కులాలకు న్యాయం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా దాదాపు 5వేలకు పైగా ఉన్న బీసీ కులాల వారికి న్యాయం జరగాలంటే ఉపవర్గీకరణతోనే సాధ్యపడుతుందని జాతీయ ఓబీసీ వర్గీకరణ కమిషన్ చైర్పర్సన్ జస్టిస్ రోహిణి అభిప్రాయపడ్డారు.బీసీ వర్గీకరణ అనే అంశంపై దత్తాత్రేయ అధ్యక్షతన శనివారం ఎన్‌కేఎం గ్రాండ్ హోటల్లో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జస్టిస్ రోహిణి మాట్లాడుతూ ‘‘దేశంలో దాదాపు 5 వేలకు పైగా బీసీ కులాలున్నాయి. వీటిలో ఆరేడు మాత్రమే అభివృద్ధి చెందాయి. అన్నీ అభివృద్ధి చెందాలంటే బీసీ ఉప వర్గీకరణ చేయాలి. ఇది చేయకపోతే మరో 50 ఏళ్లయినా అత్యంత వెనుక బడిన కులాల్లో మార్పు రాదు. వృత్తుల ఆధారంగా కొన్ని బీసీ కులాలపై వివక్ష చూపించారు. ఎస్సీ, ఎస్టీ మాదిరిగా వెనకబడిన తరగతులు పదానికి స్పష్టమైన నిర్వచనాన్ని రాజ్యాంగంలో పొందుపరచ లేదు. బీసీలకు చట్టసభల్లో ఇప్పటివరకు రిజర్వేషన్లు లేవు. దీనిపై ప్రభుత్వం ఆలోచించాలి. చట్టసభల్లో అవకాశం కల్పిస్తేనే వారి పక్షాన మాట్లాడే అవకాశం ఉంటుంది. బీసీల్లో అభివృద్ధి చెందిన కులాలతో అభివృద్ది చెందనివి పోటీపడలేకపోతున్నాయని అన్నారు. ఉపవర్గీకరణతో అందరికీ న్యాయం జరుగు తుంది. గ్రామీణ ప్రాంతాల్లో కులం ఇప్పటికీ చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. మనిషి అభివృద్ధిని ప్రభావితం చేస్తోంది. రాజ్యాంగంలో పొందుపరచిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం, న్యాయం అందరికీ అందాలి’’ అని అన్నారు. మోదీ వల్లే ఓబీసీ కమిషన్‌కు చట్టబద్ధత.. బీసీల్లోని అత్యంత వెనుకబడిన కులాలకు న్యాయం చేసేందుకే ఓబీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించారనీ, ఇది ప్రధాని నరేంద్రమోదీ ద్వారానే సాధ్యమైందని సభకు అధ్యక్షత వహించిన సికింద్రాబాద్ ఎంపీ బండారు దత్తాత్రేయ అన్నారు. ‘ఓబీసీ కమిషన్‌కు చట్టబద్దత కల్పించడం చరిత్రాత్మకం. బీసీ కమిషన్‌కు చట్టబద్ధత లేకపోవడం వల్ల రిజర్వేషన్లు సక్రమంగా అమలు కాలేదు. ఎస్సీ ఎస్టీలకు జరిగినట్లుగా ఇంతకాలం బీసీలకు న్యాయం జరగలేదు. అధికారంలో ఉన్న పార్టీలు ఇష్టా రీతిన కులాలను బీసీల్లో కలుపుకుంటూ పోయాయి. దేశంలో వేలాదిగా ఉన్న బీసీ కులాల ఉపవర్గీకరణకు ప్రధాని మోదీ నడుంకట్టి ఓబీసీ కమిషన్‌కు చట్టబద్ధత కల్పించడం గొప్ప విషయం. ఈ కమిషన్ ద్వారా పేద వర్గాల బీసీలకు ఎంతో న్యాయం జరుగుతుంది’ అని అన్నారు. ఈ సమావేశంలో 175 మంది బీసీ నేతలు, మేధావులు, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఓబీసీ బిల్లుకు రాజ్యసభ ఆమోదం
సాక్షి, న్యూఢిల్లీ : ఓబీసీ (సవరణ) బిల్లు, 2017కు సోమవారం రాజ్యసభ ఆమోదం తెలిపింది. వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్ (ఎన్సీబీసీ)కి రాజ్యాంగ హోదా కల్పించే ఈ బిల్లును గత వారం లోక్‌సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. వెనుకబడిన కులాల సంక్షేమానికి మోదీ సర్కార్ కట్టుబడిందనే సంకేతాలను పంపుతూ ఇతర వెనుకబడిన తరగతుల (ఓబీసీ) ప్రయోజనాలను పరిరక్షించేలా, వారి హక్కులను కాపాడేందుకు పూర్తి అధికారాలను ఎన్సీబీసీకి కట్టబెడుతూ దానికి రాజ్యాంగ హోదా కల్పించే బిల్లును ఆమోదింపచేయడం ప్రభుత్వ విజయంగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. కాగా మీడియా సంస్థల్లో జోక్యం చేసుకోవడం ద్వారా కేంద్రం దేశంలో సూపర్ ఎమర్జెన్సీని విధిస్తోందని తృణమూల్ నేతలు ఆరోపిస్తూ పార్లమెంట్ వెలుపల నిరసనలు చేపట్టారు. అసోంలో ఎన్ఆర్సీ అమలును తృణమూల్ నేతలు తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వానికి వ్యతిరేక కథనాలు ప్రసారం చేసే మీడియా సంస్థలపై బీజేపీ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తూ పరువు నష్టం కేసులు వేయడం వంటి చర్యలు చేపడుతున్నదని తృణమూల్ ఎంపీ డెరెక్ ఒబ్రెయిన్ ఆరోపించారు. -
‘ఓబీసీ కమిషన్’కు రాజ్యాంగ హోదా!
న్యూఢిల్లీ: వెనుకబడిన తరగతుల జాతీయ కమిషన్(ఎన్సీబీసీ)కి రాజ్యాంగబద్ధత కల్పించే కీలక బిల్లును లోక్‌సభ ఆమోదించింది. గురువారం∙చర్చ తర్వాత మూడింట రెండింతలకు పైగా సభ్యులు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు. రాజ్యసభ ప్రతిపాదించిన కొన్ని సవరణలను లోక్‌సభ తోసిపుచ్చింది. బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందేందుకు కృషిచేసిన సామాజిక న్యాయం, సాధికారత మంత్రి గెహ్లాట్‌ను ప్రధాని అభినందించారు. 123వ రాజ్యాంగ సవరణ పేరిట తెచ్చిన తాజా బిల్లుపై చర్చ సందర్భంగా ఓబీసీల సంఖ్యను తేల్చడానికి జనాభా లెక్కలు నిర్వహించాలని పలువురు సభ్యులు డిమాండ్ చేశారు. 2014 నాటి సామాజిక, ఆర్థిక సర్వే వివరాలను బహిర్గతం చేయాలని మరికొందరు కోరారు. ఎన్సీబీసీ సభ్యుల్లో ఒకరు మహిళ ఉండేలా చూస్తామని హామీ ఇచ్చారు. సొంత ఓబీసీ జాబితా రూపొందించుకుని, దానిలో ఏ కులాన్నైనా చేర్చుకునే స్వేచ్ఛ రాష్ట్రాలకు ఉందని చెప్పారు. కేంద్ర జాబితాలో ఏదైనా కులాన్ని చేర్చాలనుకుంటే కేంద్రాన్ని సంప్రదించాలని గెహ్లాట్ సూచించారు. ఈ బిల్లుకు గతేడాది ఏప్రిల్ 10న లోక్‌సభ ఆమోదం తెలిపి రాజ్యసభకు పంపింది. ప్రతిపక్షాలు సూచించిన కొన్ని సవరణలను చేర్చి అదే ఏడాది జూలై 31న ఆమోదించిన బిల్లును ఎగువ సభ మళ్లీ లోక్‌సభకు పంపింది. ఆ సవరణలను తోసిపుచ్చుతూ తాజాగా లోక్‌సభ బిల్లుకు ఆమోదం తెలిపింది. జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ల మాదిరిగా ఎన్సీబీసీకి రాజ్యాంగబద్ధత కల్పించాలని ప్రతిపాదించారు. బీసీలకు రాజ్యాంగం కల్పించిన రక్షణల అమలును ఎన్సీబీసీ చూస్తుంది. హక్కుల ఉల్లంఘనలకు సంబంధించిన ఫిర్యాదుల విచారణ సమయంలో సివిల్ కోర్టులకుండే అధికారాలుంటాయి. -
ఓబీసీ సబ్ కేటగిరీపై మంత్రి కీలక వ్యాఖ్యలు
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ పరిధిలో గల ఇతర వెనుకబడిన కులాల (ఓబీసీ) జాబితాలోని కులాలను ఉప కేటగిరీల కింద విభజించే అంశంపై కమిషన్ అధ్యయనం చేస్తోందని సామాజిక న్యాయశాఖ సహాయ మంత్రి కృష్ణపాల్ గుర్జర్ రాజ్యసభలో గురువారం ప్రకటించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 340 కింద ఓబీసీలను ఉప కేటగిరీలుగా విభజించే అంశాన్ని పరిశీలించేందుకు 2017 లోనే ప్రభుత్వం కమిషన్‌ను ఏర్పాటు చేసిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బీసీలను ఉప కేటగిరీలుగా విభజించి రిజర్వేషన్ల విధానాన్ని అమలు చేస్తున్నారనీ, కేంద్ర జాబితాలోని ఓబీసీలను సైతం ఆయా రాష్ట్రాల్లో అమల్లో ఉన్న పద్ధతిలోనే ఉప కేటగిరీల కింద విభజించే అవకాశాలను కమిషన్ పరిశీలిస్తున్నట్లు మంత్రి చెప్పారు. సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగానే బీసీలలో క్రీమీ లేయర్ విధానం అమలు చేస్తున్నామని, ఈ విధానాన్ని రద్దు చేసే ప్రతిపాదన ప్రస్తుతానికి లేదని మంత్రి స్పష్టం చేశారు. -
జూలై 18 నుంచి పార్లమెంటు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంటు వర్షాకాల సమావేశాలను జూలై 18 నుంచి ఆగస్టు 10 వరకూ నిర్వహించనున్నట్లు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి అనంత్‌కుమార్ తెలిపారు. సోమవారం జరిగిన పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశం అనంతరం అనంత్‌కుమార్ మీడియాతో మాట్లాడారు. ఈసారి పార్లమెంటు సమావేశాల్లో దాదాపు 18 పనిదినాలు ఉండనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశాల్లో ట్రిపుల్ తలాక్ బిల్లు, ఓబీసీ జాతీయ కమిషన్‌కు రాజ్యంగబద్ధత బిల్లు, జాతీయ వైద్య కమిషన్ ఏర్పాటు బిల్లు, ట్రాన్స్‌జెండర్స్ బిల్లుతో పాటు 6 ఆర్డినెన్సుల్ని ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ పదవీకాలం జూన్‌తో ముగియనున్న నేపథ్యంలో కొత్త డిప్యూటీ చైర్మన్‌ను ఎన్నుకునేందుకు ఈ సమావేశాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. పార్లమెంటు వర్షకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలని ప్రతిపక్షాలకు అనంత్ విజ్ఞప్తి చేశారు. -
అక్కడ కేవలం ఇద్దరు యాచకులే!
కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి థావర్ చంద్ గెహ్లాట్ దేశంలోని యాచకులకు సంబంధించి ఒక నివేదికను విడుదల చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో మొత్తం 4 లక్షల మంది యాచకులు, సంచార యాచకులు ఉన్నారు. 81వేల మంది యాచకులతో పశ్చిమ బెంగాల్ ప్రథమ స్థానంలో ఉండగా కేవలం ఇద్దరు యాచకులతో లక్షద్వీప్ చివరి స్థానంలో ఉంది. గెహ్లాట్ లోక్‌సభకు రాసిన లిఖితపూర్వక సమాధానంలో 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 4,13,670 మంది యాచకులు ఉండగా వారిలో 2,21,673మంది పురుషులు కాగా, 1,91,997మంది స్త్రీలు ఉన్నారు. ఉత్తరప్రదేశ్ 65,835మంది యాచకులతో రెండో స్థానంలో ఉండగా 30,218 మందితో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మూడో స్థానంలో ఉంది. కేంద్ర పాలిత ప్రాంతాల్లో యాచకుల సంఖ్య తక్కువగా ఉంది. 2,187మంది యాచకులతో దేశ రాజధాని ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉండగా, కేవలం ఇద్దరు యాచకులతో లక్షద్వీప్ చివరి స్థానంలో ఉంది. దాద్రా నగర్ హవేలీలో 19మంది, డామన్ డయ్యూలో 22మంది, అండమాన్ నికోబార్‌లో 56మంది యాచకులు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. వెనకబడిన తరగతులకు చెందిన ఒక సంస్థ జాతీయ వెనకబడిన తరగతుల కమిషన్‌ను సంచార జాతులు, యాచకులు, ఆశ్రిత కులాల వారిని, వృత్తి పనులను చేసుకునే వారిని గుర్తించి వారందరినీ ఒబీసీల్లో ఉపకులాలుగా చేర్చాలని కోరింది. గత అక్టోబరులో ప్రధాని మోదీ ఒబీసీల వర్గీకరణ కోసం ఒక కమిషన్‌ను ఏర్పాటుచేశారు. ఆ కమిషన్ ప్రధాన విధి ఒబీసీల వర్గీకరణ. ఫలితంగా ఎక్కువ వెనకబడిన కులాలకు రిజర్వేషన్లను వర్తింపచేయడం. వెనుకబడిన తరగతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య జాతీయ వెనకబడిన కులాల కమిషన్‌కు ఒక లేఖ రాశారు.దానిలో ఆయన సంచార జాతులను, యాచకులను, ఆశ్రిత కులాల వారిని, వృత్తి పనులను చేసుకునే వారిని ఓబీసీలోని ‘ఏ’ కేటగిరీలో ఉప కులాలుగా చేర్చాలని కోరారు. చేతివృత్తులు చేసుకునేవారిని, విద్య, ఉపాధి రంగాల్లో 50శాతం కన్నా తక్కువ ఉన్నవారిని ‘బీ’ కేటగిరీలో, 50శాతం కన్నా ఎక్కువ ఉన్నవారిని ‘సీ’ కేటగిరీలో ఉపకులాలుగా చేర్చాలని కోరారు. వ్యవసాయం, ఇతర వృత్తులను చేసుకునేవారిని డీ కేటగిరీలో, దళితులు, ముస్లింలు, క్రైస్తవులను ఈ కేటగిరీలో చేర్చాలని లేఖలో వివరించారు. జనాభావారీగా విభజించిన తర్వాత రిజర్వేషన్‌ను నిర్ణయించాలని కోరారు. -
‘తలాక్’పై రాజకీయాలొద్దు
న్యూఢిల్లీ: ట్రిపుల్ తలాక్ బిల్లు వీలైనంత త్వరగా ఆమోదం పొందటం ద్వారా ముస్లిం మహిళలకు స్వేచ్ఛా జీవితాన్ని ఇవ్వగలుగుతామని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ అంశంపై రాజకీయాలు చేయకూడదని అన్ని పక్షాలను ఆయన కోరారు. సోమవారం పార్లమెంటు వెలుపల మీడియాతో మాట్లాడుతూ.. ట్రిపుల్ తలాక్ బిల్లు ఈ సమావేశాల్లో ఆమోదం పొందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. 2018 నూతన సంవత్సర కానుకగా ముస్లిం సోదరీమణులకు ఈ బిల్లును కానుకగా ఇవ్వాలన్నారు. అంతకుముందు జరిగిన ఎన్డీఏ పక్షాల భేటీలో మోదీ మాట్లాడుతూ.. ఏకకాల ఎన్నికలకు అనుకూల వాతావరణాన్ని నిర్మాణం చేయటంలో కృషిచేయాలని కోరారు. ఇందుకోసం దేశవ్యాప్తంగా చర్చను ప్రారంభించాలని సూచించారు. బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎన్డీయే పక్షాల సభ్యుల పూర్తిస్థాయిలో హాజరవ్వాలని మోదీ కోరారు. ట్రిపుల్ తలాక్ బిల్లు, ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగ హోదా కల్పించే బిల్లులను ఆమోదింపజేసుకోవటం కీలకమన్నారు. ముఖ్యమైన అంశాలపై ఈసారి సమావేశంలో చర్చించనున్నందున హాజరు శాతం ఎక్కువగా ఉండాలన్నారు. ఈ సమావేశంలో వరల్డ్ ఎకనమిక్ ఫోరం, ఆసియాన్ సదస్సుల్లో మోదీ ప్రసంగాన్ని అభినందిస్తూ తీర్మానం చేశారు. కాగా సోమవారం ముగ్గురు ఆప్ ఎంపీలు, ఒక బీజేపీ సభ్యుడు రాజ్యసభ సభ్యులుగా ప్రమాణం చేశారు. -
ఓబీసీల హక్కులను కాలరాయొద్దు
విపక్షాలపై మోదీ విమర్శలు న్యూఢిల్లీ: ఇతర వెనుకబడిన కులాల ప్రజల హక్కులను వారికి అందకుండా విపక్షాలు అడ్డుకుంటున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా విమర్శించారు. ఓబీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించే బిల్లు–2017 (రాజ్యాంగ సవరణ–123వ)కు సంబంధించి రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ప్రధాని ఈ విమర్శలు చేశారు. అన్ని పార్టీల కోరిక మేరకే కేంద్రం ఈ బిల్లు తెచ్చిందన్నారు. ‘లోక్‌సభలో ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. కానీ రాజ్యసభలో విపక్షపార్టీలు ఈ బిల్లుకు ఎందుకు అడ్డుపడుతున్నాయో అర్థం కావటం లేదు. వెనుకబడిన తరగతుల హక్కులను అడ్డుకునే వ్యతిరేక రాజకీయాలు చూసి చింతిస్తున్నాం’ అని మోదీ అన్నారు. బీజేపీ ఓబీసీ ఎంపీలు.. ఇతర పార్టీల్లోని ఓబీసీ రాజ్యసభ ఎంపీలను కలిసి వారిని ఒప్పించాలని సూచించారు.