occupation of public lands
-
ఆక్రమణ కట్టడాలను కూల్చివేతను అడ్డుకున్న టీడీపీ వర్గీయులు..
సాక్షి,ఇచ్ఛాపురం : ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను రక్షించుకోవాలన్న ప్రభుత్వ ఆశయానికి టీడీపీ వర్గీయులు తూట్లు పొడుస్తున్నారు. స్థానిక మహిళలను రెచ్చగొడుతూ అధికారులు, పాలకవర్గాలపైకి ఉసుగొల్పుతున్నారు. ఇటువంటి సంఘటన శనివారం కొఠారీ పంచాయతీలో చోటుచేసుకుంది. కొఠారీ కాలనీ వద్ద సర్వే నంబర్ 133, 135–12లో ప్రభుత్వ స్థలంలో ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారులు గుర్తించారు. ‘మిషన్ ప్రభుత్వ భూమి సంరక్షణ’ కార్యక్రమంలో భాగంగా శనివారం ఎంఆర్ఐ మద్దిలి కృష్ణమూర్తి, మండల సర్వేయర్ తవిటినాయుడుతో పాటు సర్పంచ్ దుక్క ధనలక్ష్మి, వీఆర్వో, సచివాలయ సర్వేయర్, స్థానికులు కొంతమంది కలసి గ్రామంలో ర్యాలీ నిర్వహించి ఆక్రమణ కట్టడాల వద్దకు వెళ్లారు. అయితే అప్పటికే టీడీపీ నేతలు రెచ్చగొట్టడంతో స్థానిక మహిళలు కొందరు సంఘటనా స్థలం వద్దకు చేరుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని చింపేశారు. చదవండి:Bhola Shankar: చిరుకు సోదరిగా కీర్తి సురేశ్.. రాఖీ వీడియో వైరల్ అక్కడితో ఆగకుండా అధికారులు, సర్పంచ్ ధనలక్ష్మి, ఆమె భర్త ఆనంద్, కుమారుడుపై దాడికి ప్రయత్నించారు. ఈ క్రమంలో సర్పంచ్ ధనలక్ష్మి స్వల్ప గాయాలతో బయపడ్డారు. పరిస్థితి అదుపు తప్పుతుండడంతో రెవెన్యూ సిబ్బంది అక్కడ నుంచి వెళ్లిపోయారు. దాడికి పాల్పడిన దువ్వు పోతయ్య, దుక్క దీనబందు, సావిత్రి, జయ, దువ్వు జానికమ్మలపై సర్పంచ్ ధనలక్ష్మి రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. స్థానిక టీడీపీ ఎమ్మెల్యే బెందాళం అశోక్‌కు ఆ పార్టీ నేతలు ఫిర్యాదు చేయడంతో ఆయన సంఘటనా స్థలానికి చేరుకొని కాలనీ వాసులతో మాట్లాడారు. తహసీల్దార్ దాసరి చిన్న రామారావుకు ఫోన్‌చేసి ఇటువంటి పరిస్థితుల్లో రెవెన్యూ అధికారులు కలుగజేసుకోకూడదంటూ హెచ్చరింపు ధోరణిలో మాట్లాడినట్లు తెలిసింది. చదవండి:లోకేష్ తీరుపై ఏపీ పోలీస్ అధికారుల సంఘం ఆగ్రహం -
అగ్రస్థానమే లక్ష్యం
⇔ కర్ణాటక వైమానిక పాలసీ సవరణకు మంత్రి మండలి ఆమోదం ⇔ రూ.14,520 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 33 ప్రతిపాదనలకు అంగీకారం ⇔ 10,584 ఉద్యోగాల సృష్టి’ ⇔ జీఎస్టీ’ ఆమోదానికి 14న అసెంబ్లీ ప్రత్యేక సమావేశం బెంగళూరు: విమానయాన రంగంలో కర్ణాటకను దేశంలోనే అగ్ర స్థానంలో నిలపడమే లక్ష్యంగా కర్ణాటక వైమానిక విధానాల్లో సవరణలు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు సంబంధించి మంత్రి మండలి ఆమోదం సైతం లభించింది. బుధవారమిక్కడి విధానసౌధలో సీఎం సిద్ధరామయ్య అధ్యక్షతన మంత్రి మండలి సమావేశాన్ని నిర్వహించారు. మంత్రి మండలి సమావేశం అనంతరం రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర మంత్రి మండలిలో తీసుకున్న నిర్ణయాలను మీడియాకు వివరించారు. కర్ణాటక రాష్ట్రం ఏరోస్పేస్ హబ్‌గా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కర్ణాటక ‘వైమానిక పాలసీ 2013-23’కు సవరణలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పారు. రాష్ట్రంలో మొత్తం రూ.14,520 కోట్ల పెట్టుబడులకు సంబంధించిన 33 ప్రతిపాదనలకు మంత్రి మండలి అంగీకారం తెలిపిందని, తద్వారా రాష్ట్రంలో 10,584 ఉద్యోగాల సృష్టి జరగనుందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో అమల్లో ఉన్న పారిశ్రామిక విధానంలో వ్యాపారులకు లభించే అన్ని సౌకర్యాలు, రాయితీలు నూతన వైమానిక పాలసీ ద్వారా ఈ రంగంలోని వ్యాపారులకు కూడా లభించనున్నాయని తెలిపారు. ఇక విమానాలు, హెలికాప్టర్ల విడిభాగాల తయారీ కర్ణాటకలో ఎక్కువగా జరుగుతోందని అన్నారు. ఇదిలాగే కొనసాగితే కర్ణాటక ఏషియాలోనే ఏరోస్పేస్ హబ్‌గా మారుతుందనడంలో ఎలాంటి సందేహం లేదని పేర్కొన్నారు. మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలు.... ⇔ ‘జీఎస్టీ’ బిల్లు ఆమోదానికి సెప్టెంబర్ 14న ఒక రోజు పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలను నిర్వహించేందుకు మంత్రి మండలి అంగీకారం తెలిపింది. సెప్టెంబర్ 14న ఉదయం 11గంటలకు అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానుంది. ⇔ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ప్యారా మెడికల్ కాలేజీల ఏర్పాటుకు మంత్రి మండలి అనుమతించింది. ఒక్కో కళాశాలలో 320 సీట్లు అందుబాటులో ఉంటాయి. ⇔రాష్ట్ర పట్టు పరిశ్రమ శాఖ మాజీ అధికారి చలపతిని సీఎం కార్యాలయ ప్రత్యేక అధికారిగా నియమించేందుకు అంగీకారం ⇔పోలీసు శాఖలో 50 బస్సులు, 200 హొయ్సళ వాహనాల ఖరీదుకు గాను రూ. 14కోట్లను విడుదల చేసేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. -
వణుకు పుట్టాలి
భూ ఆక్రమణదారులపై నాన్‌బెయిలబుల్ కేసులు నేరం రుజువైతే కఠిన శిక్షలు కర్ణాటక భూ ఆక్రమణల నిషేధ ప్రత్యేక న్యాయస్థానాన్ని ప్రారంభించిన సీఎం న్యాయస్థానాన్ని ప్రారంభిస్తున్న సీఎం తదితరులు బెంగళూరు: ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని సీఎం సిద్ధరామయ్య హెచ్చరించారు. నగరంలోని రెవెన్యూ భవన్లో ఏర్పాటు చేసిన కర్ణాటక భూ ఆక్రమణల నిషేధ ప్రత్యేక న్యాయస్థానాన్ని బుధవారం లాంఛనంగా ప్రారంభించిన అనంతరం ఆయన మాట్లాడారు. ‘ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై నాన్‌బెయిలబుల్ కేసులను నమోదు చేయాలి, నేరం రుజువైతే కఠిన శిక్షలు విధించాలి. భూముల ఆక్రమణల్లో ఆక్రమణదారులకు కొందరు ప్రభుత్వ అధికారులు కూడా సహకారం అందిస్తున్నారు. వారికి కూడా శిక్షలు పడితేనే ఇలాంటి ఘటనలు తగ్గుతాయి’ అని పేర్కొన్నారు. సభా సమితి నివేదిక ప్రకారం ఒక్క బెంగళూరు నగరంలోనే 34వేల భూముల ఆక్రమణల కేసులు నమోదు కాగా, కొన్ని లక్షల ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని అన్నారు. ఇటీవలి కాలంలో రోజు రోజుకు భూముల ధరలు పెరిగిపోతుండడంతో భూములను కబ్జా చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోతోందని పేర్కొన్నారు. ‘భూ ఆక్రమణ దారులు తమ వద్ద ఉన్న డబ్బుతో ఏమైనా చేయవచ్చని భావిస్తుంటారు. ఏ వ్యవస్థనైనా తమ దగ్గర ఉన్న డబ్బుతో కొనేయవచ్చని, న్యాయమూర్తులను కూడా తమ డబ్బుతో కొనేయవచ్చని అనుకుంటూ ఉంటారు. అందుకే అలాంటి వారికి కనీసం జామీను కూడా లభించకుండా నాన్ బెయిలబుల్ కేసులను పెట్టాలి. ఈ ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావించినపుడు కొంతమంది ఇందుకు అడ్డుపడేందుకు ప్రయత్నించారు. అలాంటి వారిలో ఇప్పుడిక వణుకు ప్రారంభమైంది’ అని సీఎం సిద్ధరామయ్య తెలిపారు. భూ ఆక్రమణలకు సంబంధించిన కేసులు ప్రత్యేక కోర్టులో త్వరితగతిన పరిష్కారం అయ్యేందుకు హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో ఓ సమితిని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆక్రమణదారులను శిక్షించడంతో పాటు నిరపరాధులను రక్షించాల్సిన అవసరం కూడా ఉందని అభిప్రాయపడ్డారు. భూ ఆక్రమణలు పెద్ద మాఫియాలా రూపాంతరం చెందాయని ఆందోళన వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్థలోని కొన్ని లోపాలను ఇలాంటి వ్యక్తులు తమ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత భూ ఆక్రమణలకు అడ్డుకట్ట వేయడంతో పాటు వేలాది ఎకరాల ప్రభుత్వ భూమిని తిరిగి స్వాధీనం చేసుకోగలిగామని సీఎం సిద్ధరామయ్య పేర్కొన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర, రెవెన్యూ శాఖ మంత్రి కాగోడు తిమ్మప్ప తదితరులు పాల్గొన్నారు.