October-December quarter
-
టీసీఎస్ లాభం అప్ క్యూ3లో రూ. 12,380 కోట్లు
ముంబై: ఐటీ సేవల దేశీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్విసెస్(టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2024–25) మూడో త్రైమాసిక ఫలితాలు వెల్లడించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 12 శాతం ఎగసి రూ. 12,380 కోట్లను తాకింది. గతేడాది(2023–24) ఇదే కాలంలో రూ. 11,058 కోట్లు ఆర్జించింది. ఈ ఏడాది జూలై–సెప్టెంబర్(క్యూ2)లో సాధించిన రూ. 11,909 కోట్ల లాభంతో పోలిస్తే త్రైమాసికవారీగా 4 శాతం పుంజుకుంది. మొత్తం ఆదాయం 6 శాతం బలపడి రూ. 63,973 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో రూ. 60,583 కోట్ల టర్నోవర్ అందుకుంది. వాటాదారులకు ఒక్కో షేరుకి రూ. 66 ప్రత్యేక డివిడెండ్‌తో కలిపి మొత్తం రూ. 76 చెల్లించనుంది. విభాగాలవారీగా ప్రధాన విభాగం బీఎఫ్ఎస్ఐసహా కన్జూమర్ బిజినెస్ వృద్ధి బాట పట్టినట్లు కంపెనీ పేర్కొంది. కొన్ని విభాగాలలో విచక్షణాధారిత వినియోగం పుంజుకుంటున్నట్లు తెలియజేసింది. వీటికితోడు ప్రాంతీయ మార్కెట్ల నుంచి డిమాండ్ బలపడుతున్నట్లు వివరించింది. వెరసి భవిష్యత్ వృద్ధి పట్ల విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. కంపెనీ ప్రణాళికలకు అనుగుణంగా క్యాంపస్ ప్లేస్మెంట్లు చేపడుతున్నట్లు మానవ వనరుల ప్రధాన అధికారి మిలింద్ లక్కడ్ తెలియజేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2025–26)లో మరింత మందికి ఉపాధి కలి్పంచే సన్నాహాల్లో ఉన్నట్లు వెల్లడించారు. రూ. 1,625 కోట్లు వెచ్చించి టాటా గ్రూప్ కంపెనీ నుంచి బెంగళూరులో భూమిని కొనుగోలు చేసినట్లు టీసీఎస్ పేర్కొంది.ఇతర విశేషాలు → కొత్తగా 10.2 బిలియన్ డాలర్ల విలువైన ఆర్డర్లు పొందింది. → ఉద్యోగుల సంఖ్యలో నికరంగా 5,370 కోతపడింది. → మొత్తం సిబ్బంది సంఖ్య 6,07,354 మందికి చేరింది.→ ఈ ఏడాది 40,000 క్యాంపస్ ప్లేస్మెంట్ల సాధనవైపు సాగుతోంది. → డివిడెండుకు రూ. 21,500 కోట్లు వెచ్చించనుంది. → నిర్వహణ లాభ మార్జిన్లు 0.4 శాతం మెరుగుపడి 24.5 శాతాన్ని తాకాయి. → ఐటీ సర్విసుల ఉద్యోగ వలసల రేటు 13 శాతంగా నమోదైంది. మార్కెట్లు ముగిశాక ఫలితాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో టీసీఎస్ షేరు 1.7% క్షీణించి రూ. 4,037 వద్ద ముగిసింది. ఆర్డర్ల జోరు పండుగల సీజన్ కారణంగా అధిక సెలవులున్నప్పటికీ భారీ కాంట్రాక్టులను సాధించాం. విభిన్న రంగాలు, వివిధ ప్రాంతాలు, వివిధ లైన్లలో ఆర్డర్లు పొందాం. కంపెనీ దీర్ఘకాలిక వృద్ధిని ఇవి ప్రతిబింబిస్తున్నాయి. – కె.కృతివాసన్, సీఈవో, టీసీఎస్ -
యాపిల్ ఇండియాకు ఐఫోన్ల జోష్
న్యూఢిల్లీ: ఐఫోన్ల దిగ్గజం యాపిల్ ఇండియా అక్టోబర్–డిసెంబర్ కాలానికి టర్నోవర్‌లో సరికొత్త రికార్డ్ సాధించింది. 2 శాతం వృద్ధితో 119.6 బిలియన్ డాలర్ల ఆదాయం అందుకుంది. ఇందుకు ఐఫోన్ విక్రయాల జోరు దోహదపడింది. వెరసి దేశీ అమ్మకాలలో కంపెనీ సరికొత్త రికార్డును నమోదు చేసినట్లు యాపిల్ సీఈవో టిమ్ కుక్ పేర్కొన్నారు. యాక్టివ్ డివైస్ల సంఖ్య 2.2 బిలియన్లకు చేరుకున్నట్లు వెల్లడించారు. ఇది అన్ని ప్రొడక్టులలోనూ ఇది అత్యధికంకాగా.. ఐఫోన్ల నుంచి ఆదాయం 6 శాతం ఎగసి 69.7 బిలియన్ డాలర్లను తాకినట్లు తెలియజేశారు. మలేసియా, మెక్సికో, టర్కీ తదితర వర్ధమాన మార్కెట్లలోనూ కంపెనీ చరిత్రలోనే అత్యధిక అమ్మకాలు అందుకున్నట్లు కుక్ పేర్కొన్నారు. మార్కెట్ రీసెర్చ్ సంస్థ కౌంటర్‌పాయింట్ రీసెర్చ్ వివరాల ప్రకారం తొలిసారి 2023లో యాపిల్ అత్యధిక ఆదాయం అందుకోగా.. అమ్మకాల పరిమాణంలో శామ్సంగ్ ముందుంది. కోటి యూనిట్ల షిప్మెంట్ల ద్వారా యాపిల్ ఆదాయంలో టాప్ ర్యాంకును కొల్లగొట్టింది. అయితే ప్రస్తుత సమీక్షా కాలంలో ఐప్యాడ్ అమ్మకాలు 25 శాతం క్షీణించి 7 బిలియన్ డాలర్లకు పరిమితంకాగా.. వేరబుల్, హోమ్, యాక్సెసరీస్ విభాగం విక్రయాలు సైతం 11 శాతం నీరసించి 11.95 బిలియన్ డాలర్లను తాకాయి. ఇక మ్యాక్ పీసీ అమ్మకాలు ఫ్లాట్‌గా 7.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. సర్వీసుల ఆదాయం 11 శాతంపైగా పుంజుకుని 23.11 బిలియన్ డాలర్లకు చేరింది. -
హైదరాబాద్‌లో ఆఫీస్ లీజు జోరు
న్యూఢిల్లీ: హైదరాబాద్ మార్కెట్లో కార్యాలయ స్థలాలకు (ఆఫీస్ స్పేస్) మెరుగైన డిమాండ్ నెలకొంది. ఈ ఏడాది అక్టోబర్–డిసెంబర్ కాలంలో 57 శాతం పెరిగి 2.9 మిలియన్ చదరపు అడుగులకు చేరింది. అంతేకాదు దేశవ్యాప్తంగా ఆరు ప్రధాన పట్టణాల్లో ఆఫీస్ స్పేస్ లీజు మార్కెట్ 92 శాతం వృద్ధిని ఇదే కాలంలో నమోదు చేసింది. స్థూల ఆఫీస్ స్పేస్ లీజు క్రితం ఏడాది ఇదే కాలంలో ఉన్న 10.5 మిలియన్ చదరపు అడుగుల (ఎస్ఎఫ్టీ) నుంచి 20.2 మిలియన్ ఎస్ఎఫ్టీకి పెరిగింది. ఈ వివరాలను రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కొలియర్స్ ఇండియా వెల్లడించింది. ఇక డిసెంబర్ త్రైమాసికంలో బలమైన డిమాండ్ మద్దతుతో 2023 మొత్తం మీద ఆరు పట్టణాల్లో ఆఫీస్ స్పేస్ లీజు 16 శాతం వృద్ధితో రూ.58.2 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. పునరుద్ధరించుకున్న లీజులు, ఆసక్తి వ్యక్తీకరించిన వాటిని స్థూల ఆఫీస్ స్పేస్ లీజులో మినహాయించారు. పట్టణాల వారీగా.. ► బెంగళూరులో ఆఫీస్ స్పేస్ లీజు 58 శాతం పెరిగి 5.5 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. క్రితం ఏడాది ఇదే కాలంలో లీజు పరిమాణం 3.5 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. ► చెన్నై మార్కెట్లో నాలుగు రెట్ల వృద్ధితో మిలియన్ ఎస్ఎఫ్టీ నుంచి 4.3 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. ► ఢిల్లీ ఎన్సీఆర్లో లీజు 61 శాతం పెరిగి 3.1 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా ఉంది. ► ముంబై మార్కెట్లో ఏకంగా 87 శాతం పెరిగి 2.6 మిలియన్ ఎస్‌ఎఫ్‌టీగా నమోదైంది. ► పుణెలో ఆఫీస్ స్పేస్ లీజు డిమాండ్ రెట్టింపై 2 మిలియన్ ఎస్ఎఫ్టీకి చేరింది. డిమాండ్ కొనసాగుతుంది.. ‘‘భారత ఆఫీస్ మార్కెట్ ఆరంభ అనిశి్చతులను అధిగమించడమే కాదు, అంచనాలను మించి విజయాన్ని సాధించింది. 2023లో 58 మిలియన్ ఎస్ఎఫ్టీ మేర లీజు నమోదైంది. ఇది 2024 సంవత్సరంలో ఆఫీస్ మార్కెట్ ఆశావహంగా ప్రారంభమయ్యేందుకు మార్గం వేసింది. అనూహ్య సంఘటనలు జరిగినా, స్థిరమైన ఆర్థిక వృద్ధి అంచనాలు భారత వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు అనుకూలించనున్నాయి. దేశ, విదేశీ కంపెనీల నుంచి ఆఫీస్ స్పేస్ కోసం ఆసక్తి కొనసాగుతూనే ఉంటుంది’’అని కొలియర్స్ ఇండియా ఆఫీస్ సరీ్వసెస్ హెడ్, ఎండీ అరి్పత్ మెహరోత్రా పేర్కొన్నారు. 2023లో ఆఫీస్ స్పేస్ లీజులో టెక్నాలజీ రంగం వాటా 25 శాతానికి తగ్గిందని, ఇది 2020లో 50 శాతంగా ఉన్నట్టు కొలియర్స్‌ఇండియా నివేదిక తెలిపింది. బీఎఫ్ఎస్ఐ, ఇంజనీరింగ్, తయారీ రంగాల నుంచి డిమాండ్ రెట్టింపైందని.. 2020లో వీటి వాటా 10–12 శాతంగా ఉంటే, 2023లో 16–20 శాతానికి పెరిగినట్టు పేర్కొంది. ఇంజనీరింగ్, తయారీ రంగ కంపెనీల నుంచి లీజు డిమాండ్ 26 శాతానికి చేరుకుంది. ఫ్లెక్సిబుల్ స్పేస్ ఆపరేటర్ల నుంచి డిమాండ్ 24 శాతం పెరిగి 8.7 మిలియన్ చదరపు అడుగులుగా ఉంది. -
జోరుగా ముందస్తు పన్ను వసూళ్లు
అగ్రస్థానంలో ప్రైవేట్ బ్యాంక్‌లు ముంబై: ముందస్తు పన్ను వసూళ్లు డిసెంబర్ క్వార్టర్లో జోరుగా ఉన్నాయి. ఈ ప్రాంతంలోని 45 కంపెనీల నుంచి అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌కు ముందస్తు పన్ను వసూళ్లు 12 శాతం వృద్ధితో రూ.24,279 కోట్లకు చేరాయని ఆదాయపు పన్ను అధికారులు వెల్లడించారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే క్వార్టర్‌కు ముందస్తు పన్ను వసూళ్లు రూ.21,681 కోట్లుగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. పన్ను వసూళ్ల లక్ష్యాన్ని చేరతామని ప్రధాన ఆదాయపు పన్ను చీఫ్ కమిషనర్ డి. ఎస్. సక్సేనా చెప్పారు. ప్రైవేట్ బ్యాంక్‌ల నుంచి ముందస్తు పన్ను వసూళ్లు జోరుగా ఉన్నాయని పేర్కొన్నారు. హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్‌లు అగ్రస్థానంలో ఉన్నాయని, మొండి బకాయిలు భారీగా పెరిగిపోవడంతో ప్రభుత్వ రంగ బ్యాంక్‌ల నుంచి ముందస్తు పన్ను వసూళ్లు ప్రోత్సాహ కరంగా లేవని పేర్కొన్నారు. -
ఐసీఐసీఐ బ్యాంక్ లాభం 13% అప్
ముంబై: ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ నికరలాభం అక్టోబర్-డిసెంబర్(క్యూ3)లో 13% వృద్ధితో రూ. 2,532 కోట్లను తాకింది. ఇందుకు వడ్డీ ఆదాయం, ట్రెజరీ లాభాలు పుంజుకోవడం సహకరించింది. అయితే గత నాలుగేళ్ల కాలంలో లాభాల్లో ఇంత తక్కువ వృద్ధి నమోదుకావడం ఇదే తొలిసారి. ఈ కాలంలో నికర వడ్డీ ఆదాయం(ఎన్ఐఐ) 22% ఎగసి రూ. 4,255 కోట్లను తాకింది. ఈ బాటలో వడ్డీయేతర ఆదాయం మరింత అధికంగా 26% ఎగసి రూ. 2,801 కోట్లను చేరింది. దీనిలో రూ. 1,397 కోట్ల ట్రెజరీ లాభాలు కలసి ఉన్నాయి. గతంలో ఇవి రూ. 934.5 కోట్లు మాత్రమే. బ్యాంక్ మొత్తం ఆదాయం రూ. 12,353 కోట్ల నుంచి రూ. 14,256 కోట్లకు పుంజుకుంది. ఇక క్యూ3లో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభం 9% పెరిగి రూ. 2,872 కోట్లయ్యింది. బీమా అనుబంధ కంపెనీలు రెండూ మంచి పనితీరును ప్రదర్శించడం దీనికి దోహదపడింది. 3.32% మార్జిన్లు ప్రస్తుత సమీక్షా కాలంలో నికర వడ్డీ మార్జిన్లు(ఎన్ఐఎం) 3.07% నుంచి 3.32%కు బలపడినట్లు బ్యాంక్ చైర్మన్ చందా కొచర్ తెలిపారు. ఇకపై కూడా ఇదే స్థాయిలో లాభదాయకతను నిలుపుకోగలమని భావిస్తున్నట్లు చెప్పారు. పన్ను బకాయిలకింద గడిచిన తొమ్మిది నెలలకుగాను రూ. 210 కోట్లను అదనంగా కేటాయించడంతో లాభాలు పరిమితమైనట్లు తెలిపారు. ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా ప్రతీ క్వార్టర్లోనూ రూ.70 కోట్లు కేటాయించనున్నట్లు వెల్లడించారు. మొండిబకాయిలకు రూ. 695 కోట్లను ప్రొవిజనింగ్ చేశామని, గతంలో ఈ పద్దుకింద రూ. 625 కోట్లు కేటాయించామన్నారు. 16% అధికంగా రుణ మంజూరీని చేయగా, డిపాజిట్లు 11% పెరిగాయని తెలిపారు. ఆర్బీఐ ప్రత్యేక విండో ద్వారా 200 కోట్ల డాలర్ల(సుమారు రూ. 12,400 కోట్లు) విదేశీ కరెన్సీ డిపాజిట్లను సమీకరించడంతో ఈ డిపాజిట్ల వృద్ధి సాధ్యపడిందన్నారు. బ్యాంకు స్థూల ఎన్పీఏలు అంతక్రితం క్వార్టర్‌తో పోలిస్తే 6 బేసిస్ పాయింట్లు తగ్గి 3.05%కి చేరగా, నికర ఎన్పీఏలు 9 బేసిస్ పాయింట్ల పెరుగుదలతో 0.94 శాతానికి ఎగిసాయి. వడ్డీ రేట్లు పెంచం.. రిజర్వ్ బ్యాంక్ తాజాగా రెపో రేటును 0.25% పెంచినప్పటికీ వడ్డీ రేట్లను పెంచే ఆలోచన లేదు. స్వల్పకాలిక నిధులకు అంతగా ప్రాధాన్యత ఇవ్వం. ప్రస్తుతం డిపాజిట్ వ్యయాలు స్థిరంగా ఉన్నాయి. దీంతో రుణాలపై వడ్డీ రేట్లలో మార్పులు చేయబోం. ఇక ఏటీఎం లావాదేవీలపై చార్జీల విషయంపై రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాలకు అనుగుణంగా స్పందిస్తాం. - చందా కొచర్, ఐసీఐసీఐ చీఫ్