Odisha high court
-
ఓటమి నుంచే గాంధీ నేర్చుకున్నారు..
సాక్షి, హైదరాబాద్: ‘‘గెలుపు కన్నా ఓటమి నుంచే ఎక్కువగా నేర్చుకుంటాం.. గాంధీజీ సైతం అలాగే ఓటమి నుంచే నేర్చుకున్నారు.. అందుకని ఏ రంగంలోనైనా ఓడిపోతే కుంగిపోకూడదు ’’ అని ఒడిశా హైకోర్ట్ మాజీ చీఫ్ జస్టిస్ ఎస్.మురళీధర్ ఉద్బోధించారు. గాంధీ జయంతి నాడు ప్రముఖుల ప్రసంగాలకు పట్టం కట్టే మంథన్ సంవాద్ వార్షిక చర్చాగోష్టిని నగరంలోని శిల్పకళా వేదికలో సోమవారం నిర్వహించింది. కార్యక్రమంలో మాజీ చీఫ్ జస్టిస్ మురళీధర్ మాట్లాడుతూ రాజకీయా ల్లోకి రాక పూర్వం న్యాయవాదిగా గాంధీజీ ఎదుర్కొన్న వృత్తిపరమైన ఆటుపోట్లు, దక్షిణాఫ్రికా లో రెండు దశాబ్దాల పాటు న్యాయవాద వృత్తిలో పొందిన అనుభవాలను ప్రస్తావించారు. ఎటువంటి పరిస్థితుల్లోనూ సహనం కోల్పోకుండా, నేర్చుకోవడాన్ని మానకుండా సత్యాన్ని వీడకుండా నిరుపేదలకు అండగా గాంధీజీ న్యాయవాదిగా తన ప్రస్థానాన్ని కొనసాగించారని గుర్తు చేశారు. నవతరం న్యాయవాదులు గాంధీజీ న్యాయవాద ప్రస్థానం నుంచి నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయని పేర్కొన్నారు. ఉపాధికి దోహదం చేయలేని ఆర్ధికాభివృద్ధి: యామినీ అయ్యర్ సిటిజన్ వర్సెస్ లాభార్థి? అంశంపై ఢిల్లీలోని సెంటర్ ఫర్ పాలసీ రీసెర్చ్ అధ్యక్షుడు యామినీ అయ్యర్ మాట్లాడారు. దేశంలో పేర్కొంటున్న ఆర్థికాభివృద్ధి లాభదాయకమైన ఉపాధి అవకా శాలకు, ఉద్యోగాలకు దోహదం చేయలేకపోతోందని అభిప్రాయపడ్డారు. నిజమైన సంక్షేమానికి ఇంకా సరైన నిర్వచనాన్ని వెదికే క్రమంలోనే ఉన్నామన్నారు. ది క్వశ్చన్ ఆఫ్ అకడమిక్ ఫ్రీడమ్ అనే అంశంపై లండన్‌లోని కింగ్స్ కాలేజ్‌కు చెందిన ప్రొఫెసర్ నీరజా గోపాల్ జయాల్ మాట్లాడుతూ విద్యా సంబంధ స్వేచ్ఛ (అకడమిక్ ఫ్రీడమ్) అనేది మన దేశంలో ఇంకా తగిన స్థాయిలో లేదన్నారు. సదస్సులో ‘‘వై ఇండిపెండెంట్ న్యూస్ మీడియా షుడ్ త్రైవ్’’ అనే అంశంపై ది న్యూస్ మినిట్ ఎడిటర్ ఇన్ ఛీఫ్ ధన్యా రాజేంద్రన్ మాట్లాడుతూ పారిశ్రామికవేత్త అదానీపై వచ్చిన ఆరోపణల విషయంలో మీడియా పూర్తిస్థాయిలో నిష్పక్షపాత్ర పోషించలేకపోయిందన్నారు. ఫైటింగ్ ది ఫేక్ న్యూస్ పాండమిక్ అనే అంశంపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనాటె మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ఆధ్వర్యంలో ఫేక్ న్యూస్ ప్రచారం సాగుతోందని ఆరోపించారు. విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ డైరెక్టర్ ఆర్ఘ్యాసేన్గుప్తా ‘ది గ్లోబల్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా’ అనే అంశంపై మాట్లాడారు. సదస్సులో హిందీ కవి,వ్యంగ్యరచయిత సంపత్ సరళ్ పలు కవితలు,వ్యంగ్యరచనలు వినిపించారు. -
తెరుచుకోనున్న రత్న భాండాగార్..?
భువనేశ్వర్: శ్రీజగన్నాథ ఆలయ రత్న భాండాగార్ సమస్యపై ఉన్నత స్థాయి ప్యానెల్‌ను ఏర్పాటు చేయాలని ఒడిశా హైకోర్టు శుక్రవారం ఆలయ నిర్వహణ కమిటీని ఆదేశించింది. కమిటీని ఏర్పాటు చేసేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుభాసిస్ తలపాత్ర, జస్టిస్ సావిత్రి రాథోలతో కూడిన డివిజన్ బెంచ్ రెండు నెలల సమయం ఇచ్చింది. ఆలయ నిర్వహణ కమిటీ తరపున సీనియర్ న్యాయవాది బుద్ధదేవ్ రౌత్రాయ్, పిటిషనర్, బీజేపీ నాయకుడు సమీర్ మొహంతి తరపున సీనియర్ న్యాయవాది పీతాంబర్ ఆచార్య దాఖలు చేసిన వాదనలను విన్న తర్వాత ధర్మాసనం సెప్టెంబర్ 27న తీర్పును రిజర్వ్ చేసింది. దీనిలో భాగంగా శుక్రవారం తీర్పు వెల్లడించింది. దీంతో రత్న భాండాగార్ తెరుచుకోవడానికి అవకాశాలు ఉన్నాయని సర్వత్రా చర్చనీయాంశమైంది. ప్రజల విజయమిది ఈ సందర్భంగా మీడియాతో ఆచార్య మాట్లాడుతూ ఈ తీర్పు ఒడిశాలోని 4.5 కోట్ల మంది ప్రజల విజయమన్నారు. సాధారణంగా బీజేడీ ప్రభుత్వం 2024 అక్టోబర్ వరకు సమస్యను వాయిదా వేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. ఈ తీర్పుతో రత్న భాండాగారాన్ని తిరిగి తెరవడానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయాయని పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసమే సమీర్ మొహంతి పిల్ దాఖలు చేశారన్న రాష్ట్ర ప్రభుత్వ వాదనను కూడా కోర్టు తిరస్కరించిందని తెలియజేశారు. రత్న భాండాగార్ భద్రత పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా (అఐ)పై ఆధారపడి ఉంటుందన్నారు. తనిఖీ కోసం వీలైనంత త్వరగా తెరవాలని అఐ తన అఫిడవిట్లో స్పష్టం చేసిందన్నారు. ఏఎస్ఐతో ఏకీభవించిన హైకోర్టు రెండు నెలల్లోగా ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. -
మై లార్డ్, యువరానర్ అనాల్సిన అవసరం లేదు.. సర్ చాలు!
సాక్షి, భువనేశ్వర్/కటక్: సాధారణఃగా కోర్టుల్లో కేసుల విషయంలో వాదనలు వినిపించేటప్పుడు న్యాయవాదులు న్యాయమూర్తుల్ని ‘మైలార్డ్ లేదా..యువరానర్’ అని సంభోదిస్తుంటారు. అయితే న్యాయమూర్తులను ఉద్దేశించి చేసే మై లార్డ్, యువర్ లార్డ్‌షిప్, యువర్ ఆనర్ వంటి సంబోధనలు మినహాయించాలని రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ ఎస్.మురళీధర్ న్యాయవాదులకు విన్నపం చేశారు. సర్ వంటి సాధారణ సంబోధన సరిపోతుందని ఆయన అన్నారు. ఆయన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయన సోమవారం ఈ సందేశం జారీ చేశారు. 2009లో ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న రోజుల్లో సైతం న్యాయవాదులకు ఆయన ఇదే సందేశాన్ని జారీ చేయడం విశేషం. 2006 మే 29 నుంచి 2020 మార్చి 5వ తేదీ వరకు ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు నిర్వహించారు. ఆ తర్వాత 2020లో పంజాబ్–హర్యానా ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తి హోదాలో ఉండే సమయంలో కూడా ఇదే విన్నపం అక్కడి న్యాయవాదులకు విన్నవించడం గమనార్హం. 2020 మార్చి 6 నుంచి 2021 జనవరి 3వ తేదీ వరకు పంజాబ్–హర్యానా ఉమ్మడి హైకోర్టు న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ఇదిలా ఉండగా, చీఫ్ జస్టిస్ ప్రతిపాదన పట్ల హర్షం వ్యక్తం చేసిన బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా(బీసీఐ) న్యాయస్థానాల్లో న్యాయమూర్తులను ఉద్దేశించి మై లార్డ్, లార్డ్‌షిప్, యువర్ ఆనర్, ఆనరబుల్ వంటి సంబోధనలు నివారించాలని 2006లో తీర్మానించింది. చదవండి: వేల సంఖ్యలో కేసులు.. భారత్‌లో మొదలైన కరోనా థర్డ్‌వేవ్? చీఫ్ జస్టిస్ నిర్ణయం అభినందనీయం.. హైకోర్టులో న్యాయమూర్తులను ఉద్దేశించాల్సిన సంబోధనల పురస్కరించుకుని, ప్రధాన న్యాయమూర్తి జారీ చేసిన సందేశం అభినందనీయమని ఒడిశా హైకోర్టు బార్ అసోసియేషన్ కార్యదర్శి జె.కె.లెంకా తెలిపారు. ఆయన విన్నపం నేపథ్యంలో తోటి న్యాయమూర్తులు ఈ సంస్కరణ ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. న్యాయవాదులు, కోర్టు విచారణకు హాజరయ్యే వ్యక్తులు ఇదే పద్ధతి పాటించాలని కోరారు. హైకోర్టు న్యాయమూర్తులను ఉద్దేశించి చేసే సంబోధనల నివారణకు జస్టిస్ గతికృష్ణ మిశ్రా హయాంలో బీజం పడిందని సీనియర్ న్యాయవాదులు గుర్తు చేసుకున్నారు. 1969 నుంచి 1975 వరకు జస్టిస్ గతికృష్ణ మిశ్రా హైకోర్టు ప్రధాన న్యా యమూర్తిగా బాధ్యతలు నిర్వహించారు. న్యాయమూర్తులను సర్ అని సంబోధించాలని ఫుల్ బెంచ్ అప్పట్లో జారీ చేసిన ఉత్తర్వులు వాస్తవ కార్యాచరణకు నోచుకోలేదని విచారం వ్యక్తం చేశారు. -
Odisha: సర్కారుకు హైకోర్టు భారీ షాక్
భువనేశ్వర్: ప్రాథమిక పాఠశాలల విలీనం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి చుక్కెదురైంది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్ని రాష్ట్ర హైకోర్టు మంగళవారం రద్దు చేసి షాకిచ్చింది. 20 మంది కంటే తక్కువ విద్యార్థులు ఉన్న పాఠశాలల్ని చేరువలో ఉన్న మరో పాఠశాలలో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించి 2020వ సంవత్సరం మార్చి 11వ తేదీన పాఠశాలల విలీనం ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి కార్యాచరణ చకచకా ముగించేందుకు పాఠశాలలు–సామూహిక విద్యా విభాగం సన్నాహాలు వేగవంతం చేసింది. ఈ ప్రక్రియను వ్యతిరేకించిన విద్యార్థుల తల్లిదండ్రుల సంఘం (ఒడిశా అభిభాబొకొ మహాసొంఘొ) ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టులో దాఖలు చేసింది. ఈ వ్యాజ్యం ప్రాథమిక విచారణ సందర్భంగా మార్చి 30వ తేదీన హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా 11 వేల 560 ప్రాథమిక పాఠశాలల విలీనం ప్రక్రియ తాత్కాలికంగా వాయిదా వేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ సన్నాహాలపట్ల రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆలోచించాలని హితవు పలికింది. ఏప్రిల్ 13వ తేదీ నాటికి ప్రభుత్వ నిర్ణయం ప్రకటించాలని ఆదేశించింది. ప్రభుత్వ నిర్ణయంపట్ల పిటిషనర్ అసంతృప్తి చెందితే మళ్లీ కోర్టును ఆశ్రయించేందుకు అనుమతించి ప్రభుత్వ నిర్ణయం హైకోర్టుకు తెలియజేయాలని ప్రత్యేకంగా ఆదేశించింది. స్పందించని సర్కారు ఈ నేపథ్యంలో ఏడాది గడుస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి నిర్ణయాన్ని హైకోర్టుకు తెలియజేయలేదు. అయితే పాఠశాలల విలీనాన్ని పురస్కరించుకుని ప్రాథమిక విద్యాభ్యాసానికి గండిపడే ప్రమాదకర పరిస్థితుల్ని పిటిషనర్ మరోసారి తాజాగా హైకోర్టుకు వివరించడంతో పాటు ప్రభుత్వ ప్రతిపాదనలో సాధ్యాసాధ్యాల్ని విశ్లేషించారు. ఈ పూర్వాపరాల్ని పరిశీలించిన హైకోర్టు ప్రభుత్వ వైఖరితో ఏకీభవించకుండా పాఠశాలల విలీనం ఉత్తర్వులను రద్దు చేస్తూ మంగవారం తుది ఆదేశాలు జారీ చేసింది. చదవండి: అది కోర్టు ధిక్కరణ ఎందుకు కాదు: హైకోర్టు ఆగ్రహం -
ఆ స్కామ్‌లో రిటైర్డ్ హైకోర్ట్ జడ్జి అరెస్ట్
సాక్షి,న్యూఢిల్లీ: ప్రైవేట్ వైద్య కళాశాలల అడ్మిషన్ ప్రక్రియను నిలిపివేస్తూ సుప్రీం కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను విస్మరించి వాటిలో ఎంబీబీఎస్ విద్యార్థుల ప్రవేశానికి సహకరించిన ఒడిషా హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి సహా ఆరుగురిని సీబీఐ అరెస్ట్ చేసింది. వీరిపై నేరపూరిత కుట్ర, అవినీతి నిరోధక చట్టం కింద అభియోగాలు నమోదయ్యాయి. రిటైర్డ్ జడ్జి ఇష్రత్ మస్రూర్ ఖుద్దుసి సహా ఇతర నిందితులపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన అనంతరం ఢిల్లీ, లక్నో,భువనేశ్వర్‌లలోని పలు ప్రాంతాల్లో సీబీఐ దాడులు నిర్వహించింది. నిందితుల్లో ప్రైవేట్ మెడికల్ కాలేజీ అధినేతలు బీపీ యాదవ్, పలష్ యాదవ్‌లున్నారు. కాగా, ఢిల్లీలోని ఖుద్దుసి నివాసం పైనా దాడులు చేసిన సీబీఐ బృందాలు మొత్తంమీద రూ 1.91 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు ఖుద్దూసీ న్యాయపరమైన సలహాలు అందించడమే కాకుండా సుప్రీం కోర్టులో వారికి సానుకూల పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చినట్టు అధికారులు పేర్కొన్నారు. మౌలిక వసతుల లేమి, అవసరమైన ప్రమాణాలను పాటించకపోడంతో రెండేళ్ల పాటు వైద్య కోర్సుల్లో ప్రవేశాలు జరపరాదని ప్రభుత్వం 46 కాలేజీలను ఆదేశించింది. ప్రభుత్వ ఉత్తర్వులను ప్రసాద్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ కాలేజీకి చెందిన బీపీ యాదవ్, పలాష్ యాదవ్‌లు సుప్రీం కోర్టులో సవాల్ చేశారు.