Oil sales
-
అమెరికా డాలర్‌కు చావేనా? ఇరాన్ ఏం చేసిందంటే..
ప్రముఖ ‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ (Rich Dad Poor Dad) పుస్తక రచయిత, ఆర్థిక నిపుణుడు రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ప్రపంచ ఆర్థిక ముఖచిత్రంలో రాబోయే ఒక భారీ మార్పుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌తో యుద్ధం కంటే కూడా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి అమెరికా డాలర్‌కు పొంచి ఉందంటూ ఆయన హెచ్చరించారు.ఇరాన్ దేశం తన చమురు విక్రయాల కోసం అమెరికా డాలర్ స్థానంలో చైనా కరెన్సీ 'యువాన్' (Yuan)లో చెల్లింపులను స్వీకరించడం ప్రారంభించిందని, ఇది "పెట్రో డాలర్" (Petro-dollar) వ్యవస్థ అంతానికి నాంది కానుందని ఆయన సామాజిక మాధ్యమం 'ఎక్స్' (ట్విటర్) వేదికగా పేర్కొన్నారు.'పెట్రో డాలర్'కు మరణ శాసనం?రాబర్ట్ కియోసాకి తన ట్వీట్లో ప్రపంచ ఆర్థిక చరిత్రలోనే ఇది అత్యంత కీలకమైన పరిణామమని అభివర్ణించారు."ఇరాన్ చమురు కోసం చైనా యువాన్‌ను అంగీకరించడం ప్రారంభించింది. దీని అర్థం ఏమిటి? మీ భవిష్యత్తుపై, అమెరికా డాలర్ భవిష్యత్తుపై దీని ప్రభావం ఎలా ఉండబోతోంది? ఇరాన్‌తో యుద్ధం కంటే ఇది అత్యంత ఘోరమైన పరిస్థితి. అమెరికా డాలర్ అంతం కాబోతోందా?" అని కియోసాకి ప్రశ్నించారు.ఈ అంతర్జాతీయ మార్పుల వల్ల సామాన్యులు నష్టపోకుండా ఉండేందుకు, ప్రతి ఒక్కరూ తమ ఆర్థిక పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి కనీసం ఒక గంట సమయాన్ని కేటాయించాలని ఆయన కోరారు. మన పాఠశాలల్లో ఇలాంటి ముఖ్యమైన విషయాలను ఎప్పటికీ నేర్పరని ఆయన గుర్తుచేశారు.ప్రస్తుతం జరుగుతున్న ఈ భారీ ఆర్థిక సంక్షోభం గురించి ప్రముఖ బిలియనీర్, ఇన్వెస్టర్ రే డాలియో (Ray Dalio) మాత్రమే స్పష్టంగా వివరిస్తున్నారని కియోసాకి పేర్కొన్నారు. రే డాలియో నిర్వహించిన “ఇరాన్ జస్ట్ కిల్డ్ ది పెట్రో డాలర్” అనే పాడ్‌కాస్ట్‌ను తప్పకుండా వినాలని కియోసాకి ప్రజలకు సూచించారు."మీ జీవితంలో మీరు పెట్టే అత్యుత్తమ పెట్టుబడి... మీ ఆర్థిక విద్యపై పెట్టే పెట్టుబడే" అని కియోసాకి ట్వీట్లో స్పష్టం చేశారు.అసలు ఏమిటీ పెట్రో డాలర్ సంక్షోభం?గత కొన్ని దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా చమురు వ్యాపారం అంతా అమెరికా డాలర్లలోనే సాగుతోంది. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌కు తిరుగులేని ఆధిక్యత లభించింది. అయితే, ఇటీవల కాలంలో అమెరికా ఆంక్షలను ఎదుర్కొంటున్న ఇరాన్, రష్యా వంటి దేశాలతో పాటు చైనా కూడా డాలర్ రహిత వ్యాపారానికి (De-dollarization) తెరలేపాయి. చమురు వ్యాపారంలో చైనా యువాన్ వాడకం పెరిగితే, అది అమెరికా డాలర్ పతనానికి దారితీస్తుందనే ఆందోళనలు ప్రపంచ ఆర్థిక వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఆ ఆందోళనలనే రాబర్ట్ కియోసాకి తాజాగా తన ట్వీట్ ద్వారా మరోసారి ప్రపంచం దృష్టికి తీసుకువచ్చారు.WORSE THAN WAR in IRANDeath of the US Dollar?Iran began accepting payment for oil in Chinese Yuan. What does that mean to you and your future and the future of the US dollar?I strongly encourage you to invest about and hour in your financial education. I strongly…— Robert Kiyosaki (@theRealKiyosaki) May 24, 2026 -
సన్‌ఫ్లవర్ ఆయిల్ అమ్మకాలకు దెబ్బ
ముంబై: దేశీయంగా శుద్ధి చేసిన పొద్దుతిరుగుడుపువ్వు(సన్‌ఫ్లవర్) నూనె అమ్మకాల పరిమాణం 10 శాతం నీరసించనున్నట్లు రేటింగ్స్ దిగ్గజం క్రిసిల్ తాజా నివేదికలో అంచనా వేసింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో సరఫరా సమస్యలకుతోడు.. పెరుగుతున్న ధరలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2026–27) అమ్మకాలపై ప్రతికూల ప్రభావం చూపనున్నట్లు పేర్కొంది. వెరసి వినియోగదారులు ఇతర చౌక నూనెలవైపు దృష్టి సారించనున్నట్లు నివేదికలో క్రిసిల్ తెలియజేసింది. దీంతో డిమాండ్ మందగించి ఈ ఏడాది సన్‌ప్లవర్ ఆయిల్ అమ్మకాల పరిమాణం 10 శాతం క్షీణించనున్నట్లు అభిప్రాయపడింది. లాజిస్టిక్స్ వ్యయాలు పశ్చిమాసియా యుద్ధంతో ఇప్పటికే సరఫరా సవాళ్లు తలెత్తగా.. పెరుగుతున్న లాజిస్టిక్స్ వ్యయాలు అధిక ధరలకు దారితీస్తున్నట్లు నివేదికలో క్రిసిల్ వివరించింది. ఫలితంగా వినియోగదారులు తవుడు నూనె, సోయాబీన్ ఆయిల్ తదితరాలవైపు మళ్లనున్నట్లు పేర్కొంది. అయితే సన్‌ఫ్లవర్ అమ్మకాల ఆదాయం మాత్రం యథాతథంగా నమోదుకావచ్చని అంచనా వేసింది. అధిక ధరల కారణంగా అమ్మకాల పరిమాణం వెనకడుగు వేయనున్నట్లు తెలియజేసింది. కాగా.. తక్కువ వ్యయాలలో గతంలో కొనుగోలు చేసిన నిల్వల కారణంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ రిఫైనరీల లాభదాయకత నిలకడను చూపనున్నట్లు విశ్లేషించింది. దీంతో అమ్మకాల పరిమాణం నీరసించినప్పటికీ చౌక వ్యయాల నిల్వలతో లాభాలపై ప్రభావం పడకపోవచ్చని అభిప్రాయపడింది. దేశీయంగా 2.5–2.6 కోట్ల టన్నుల వంట నూనెల వినియోగంలో సన్‌ఫ్లవర్ ఆయిల్ 12–14 శాతం వాటా ఆక్రమిస్తున్నట్లు క్రిసిల్ వెల్లడించింది. వంట నూనెల పరిశ్రమ ముడిసన్ఫ్లవర్ ఆయిల్ కోసం అధికంగా దిగుమతులపై ఆధారపడుతున్న విషయాన్ని ప్రస్తావించింది. దీంతో ప్రపంచ వాణిజ్య విఘాతాలు, రాజకీయ భౌగోళిక అంశాలు పరిశ్రమను ప్రభావితం చేయనున్నట్లు వివరించింది. ఉక్రెయిన్, రష్యా నుంచి అత్యధికంగా దిగుమతులు నమోదవుతుంటాయి. అయితే హ ర్ముజ్ జల రవాణాకు విఘాతం ఏర్పడితే కేప్ఆఫ్ గుడ్‌హోప్ తదితర దూర తీరాల నుంచి వీటిని సమకూర్చుకోవలసి వస్తుందని తెలియజేసింది. -
వెనక్కి తగ్గిన ట్రంప్.. భారత్ కు గుడ్ న్యూస్
-
బ్యాంకులు లూటీ చేసి ...
లండన్ : ప్రపంచంలో నరమేధానికి నెత్తుటి చిరునామా 'ఐఎస్ఐఎస్'. ఆ సంస్థ సాగిస్తున్న మారణ హోమానికి నగదు ఎలా ఎక్కడి నుంచి సమకూర్చుకుంటుదన్న విషయాన్ని యూఎస్ ఉన్నతాధికారి వెల్లడించారు. యూఎస్ టెర్రరిజం మరియు ఫైనాన్షియల్ ఇంటిలిజెన్స్ అండర్ సెక్రటరీ అడమ్ జుబిన్ గురువారం లండన్‌లో మాట్లాడుతూ... బ్యాంకులు లూటీ చేసి రూ. బిలియన్ డాలర్లకు పైగా సంపాదించిందని తెలిపారు. అలాగే నల్ల బజారులో చమురును విక్రయించి ఆర బిలియన్ డాలర్లు మేర ఆ సంస్థ కూడబెట్టినట్లు పేర్కొన్నారు. తమ అధీనంలో ఉన్న ప్రాంతాల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడుతుందని చెప్పారు. ప్రస్తుతం ఇలా ఐఎస్ఐఎస్ 1.5 బిలియన్ డాలర్లకుపైగా సమకూర్చుకుందన్నారు. -
భారీగా పడిన ముడిచమురు ధర
50 డాలర్లకు పతనం న్యూయార్క్: అంతర్జాతీయంగా ముడిచమురు ధర అంతకంతకూ తగ్గుతోంది. చమురు విక్రయాలపైనే ఆధారపడ్డ దేశాలకు చెమటలు పట్టిస్తోంది. సోమవారం ఒక్కరోజే ఫ్యూచర్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో నెమైక్స్ క్రూడ్ ధర దాదాపు 5-6 శాతం తగ్గిపోయింది. దీంతోబ్యారెల్ ధర 50 డాలర్లను తాకింది. 2009 ఏప్రిల్ తరువాత ముడిచమురు ధర ఈ స్థాయికి పడిపోవడం ఇదే తొలిసారి. 2014 జూన్ నుంచి చూస్తే క్రూడ్ ధర దాదాపు 50 శాతం తగ్గింది. చైనా సహా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక మందగమన పరిస్థితి, జపాన్‌లో మాంద్యం, యూరో జోన్లో వృద్ధి నిలిచిపోవడం, అధిక నిల్వలు, మార్కెట్‌పై పట్టుకు సంబంధించి అంతర్జాతీయంగా అమెరికా, ఒపెక్ సహా వివిధ చమురు ఉత్పత్తి దేశాల మధ్య రాజకీయ, ఆర్థిక ఆధిపత్యం దీనికి కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు భారీగా తగ్గినప్పటికీ, ఆ ప్రయోజనాన్ని కేంద్రం సామాన్యుడికి అందించటం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
జోరుగా బోన్ ఆయిల్ విక్రయాలు
పలమనేరు: జిల్లాలో బోన్ ఆయిల్ పేరిట జంతువుల ఎముకలతో తయారు చేసిన నూనె విక్రయాలు గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్నాయి. సాధారణ వంట నూనెల్లోనూ ఈ ఆయిల్‌ను కలిపి తక్కువ ధరకే కొందరు అమ్ముతున్నారు. లోకల్ డాల్డా పేరిట చిన్నచిన్న హోటళ్లకు ఈ నూనెను రిటైల్‌గా విక్రయిస్తున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఎముకల సేకరణ కేంద్రాలు భారీగా ఉన్నాయి. కొందరు ఏజెంట్లు ఈ ఎముకలను సరిహద్దులోని తమిళనాడుకు తరలించి అక్కడి నుంచి బోన్‌ఆయిల్‌ను ఇక్కడికి చేరవేస్తున్నారు. దీన్ని అరికట్టాల్సిన ఆహారకల్తీ నియంత్రణ శాఖ అసలు పట్టించుకోవడం లేదు. బోన్ ఆయిల్‌తో తయారుచేసిన పదార్థాలు తింటే అనారోగ్యం కొని తెచ్చుకున్నట్టే. పలుచోట్ల ఎముకల సేకరణ కేంద్రాలు జంతువుల ఎముకలను సేకరించి ఎండబెట్టి కొందరు తమిళనాడులోని ఫ్యాక్టరీలకు విక్రయిస్తున్నారు. పలమనేరు పట్టణ సమీపంలోని గడ్డూరు ఇందిరమ్మ కాలనీ వద్ద ఓ ఇంట్లో ప్రస్తుతం ఎముకల సేకరణ భారీగా సాగుతోంది. ఈ ఇంటి ఆవరణలో ఎటువైపు చూసినా జంతువుల క బేళాలు, ఎండబెట్టిన ఎముకలు దర్శనమిస్తున్నాయి. ఈ ప్రాంతమంతా తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతోంది. ఇలాంటి ఎముకల సేకరణ కేంద్రాలు వి.కోట, చిత్తూరు, పుత్తూరు, మదనపల్లె, పుంగనూరు తదితర ప్రాంతాల్లో రహస్యంగా సాగుతోంది. ఇలా సేకరించిన ఎముకలను అక్రమంగా తమిళనాడు రాష్ట్రంలోని గుడియాత్తం, పేర్నంబట్, ఆంబూర్ తదితర ప్రాం తాలకు తరలిస్తున్నారు. వీటితో అక్కడ ఈ బోన్‌ఆయిల్‌ను తయారు చేస్తున్నారు. వంట నూనెల్లో బోన్ ఆయిల్ కల్తీ బోన్ ఆయిల్‌ను ఐదు లీటర్లు, పది లీటర్ల క్యాన్ల లో నింపి అమ్ముతున్నారు. వంట నూనెల్లోనూ కల్తీ చేసి రకరకాల కంపెనీ ప్యాకెట్లుగా తయారుచేస్తున్నారు. మరోవైపు లూజ్ డాల్డా పేరిట ఎముకల నూనెను కలిపి పలు ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఇక్కడి నుంచి ఎముకలు తీసుకెళ్లే ఏజెంట్లే వచ్చేటపుడు అక్కడి నుంచి ఈ బోన్ ఆయిల్‌ను ఇక్కడికి తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నూనె భలే చీప్.. స్థానికంగా వేరుశెనగ నూనె లేదా సన్‌ఫ్లవర్ ఆయిల్ కంపెనీ బ్రాండ్‌ను బట్టి లీటర్ రూ.80 నుంచి 100 దాకా దొరుకుతోంది. డాల్డా, పామోలిన్ రూ.60 వరకు అమ్ముతున్నారు. ఈ బోన్ ఆయిల్ కల్తీచేసిన నూనె లీటర్ రూ.30కే దొరుకుతోంది. దీంతోపాటు డాల్డా, పామోలిన్ రూ.20 లకే అమ్ముతున్నారు. తక్కువ ధరకే దొరుకుతోం దన్న ఆశతో పలువురు వీటిని కొనుగోలుచేసి ఉపయోగిస్తున్నారు. లోకల్ డాల్డా పేరిట హోటళ్లకు విక్రయాలు తమిళనాడుకు చెందిన కొందరు ఏజెంట్లు జిల్లాలోని పలు ప్రాంతాల్లో చిన్నహోటళ్లకు బోన్‌ఆయిల్‌ను సరఫరా చేస్తున్నారు. లోకల్డాల్డా పేరిట బహిరంగంగానే విక్రయిస్తున్నారు. దానికి తోడు ముందుగా సరుకిచ్చి వారం తర్వాత డబ్బులు తీసుకెళ్తున్నారు. దీంతో హోటల్ వ్యాపారులు సైతం ఈ నూనె కొనుగోలుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అనారోగ్యం కొని తెచ్చుకున్నట్టే బోన్ఆయిల్ లేదా కల్తీ చేసిన నూనెలతో తయారుచేసే ఆహార పదార్థాలను తినడం వల్ల అనారోగ్యం కొని తెచ్చుకున్నట్టేనని వైద్యులు చెబుతున్నారు. ఒంటిపై దద్దుర్లు రావడం, ఆపై చర్మ సంబంధిత వ్యాధులకు కారణమవుతోందని చెబుతున్నారు. దీర్ఘకాలికంగా ఇలాంటి నూనెలతో జీర్ణ వ్యవస్థ దెబ్బతినే అవకాశముందని, ముఖ్యంగా మధుమేహ వ్యాధి ఉన్నవారికి చాలా ప్రమాదకరమని ైవె ద్యులు సూచిస్తున్నారు. అదేవిధంగా ఒబెసిటి లాంటి వ్యాధులు కూడా రావచ్చని చెబుతున్నారు. పట్టించుకోని ఫుడ్ సెఫ్టీ విభాగం ఆహార పదార్థాల కల్తీని గుర్తించి తగు చర్యలు తీసుకోవాల్సిన ఫుడ్ సెఫ్టీ అధికారులు కల్తీ నూ నెల వ్యవహారాన్ని అసలు పట్టించుకోవడం లే దు. ఫుడ్ ఇన్స్పెక్టర్లు పట్టణాల వైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. మున్సిపాలిటీల్లోని అధికారులు ఈ కల్తీ గురించి చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. మున్సిపల్ కమిషనర్లకు సోదాలు చేసే అధికారం లేకపోవడమూ ఓ కారణంగా మారింది. ప్రభుత్వం ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్‌ను అమలు చేస్తున్నా ఇలాంటి అక్రమాలు మాత్రం తగ్గడం లేదు. దీనిపై ఆహా ర కల్తీ నిరోధక శాఖ విచారణాధికారిగా వ్యవహరిస్తున్న జాయింట్ కలెక్టర్ అయినా చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ విషయమై చిత్తూరు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ శ్రీనివాసులు రెడ్డిని వివరణ కోరగా తమకు ఇంతవరకు ఈ విషయం తెలీదని, వెంట నే జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించి చర్యలు తీసుకుంటామని అన్నారు.


