Ola cab aggregator
-
మేము బంద్ చేస్తోంటే.. నువ్ పని చేస్తావా..
సాక్షి, ముంబై : పని వేళల్లో మార్పులు, ఆదాయంలో వాటా పెంపును కోరుతూ యాప్-బేస్డ్ క్యాబ్ డైవ్రర్లు ముంబయ్ వ్యాప్తంగా అక్టోబర్ 22 నుంచి నిర్వహిస్తున్నారు. ఎవరూ పనుల్లోకి పోకుండా నిరసన పాటిస్తున్నారు. అయితే, బంద్ కొనసాగుతుండగా క్యాబ్ నడుపున్నవంటూ ఓలా సంస్థకు చెందిన ఓ డ్రైవర్‌ను సోమవారం చితకొట్టారు. దుర్భాషలాడుతూ అతనిపై పిడిగుద్దుల వర్షం కురిపించారు. ఇప్పుడీ విడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. కాగా, డ్రైవర్‌పై దాడికి దిగిన వారిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. తమ ఆదాయాన్ని లాక్కుంటున్నారు.. ఓలా, ఊబర్ వంటి ఆన్లైన్ క్యాబ్ బుకింగ్ సంస్థలు తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ముంబయ్ వ్యాప్తంగా దాదాపు 40 వేల మంది యాప్-బేస్డ్ డ్రైవర్లు నిరసనలకు దిగడంతో దేశ వాణిజ్య రాజధానిలో 90 శాతం మేర క్యాబ్‌లు షెడ్లకే పరిమితమయ్యాయి. కాగా, డ్రైవర్లు సోమవారం తమ నిరసనలను ముమ్మరం చేశారు. కుర్లాలోని ఊబర్ కార్యాలయం నుంచి అంధేరిలోని ఓలా ఆఫీస్ వరకు నల్ల జెండాలు ధరించి భారీ ర్యాలీ తీశారు. ఓలా, ఊబర్ సంస్థలు కుట్రకు పాల్పడుతున్నాయనీ, కావాలనే వినియోగదారుల వద్ద తక్కువ వసూలు చేసి తమకు రావాల్సిన ఆదాయానికి గండి కొడుతున్నాయని డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. -
ఇంటర్నెట్ లేకున్నా ఓలా బుకింగ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: క్యాబ్ అగ్రిగేటర్ ఓలా తాజాగా ఆఫ్‌లైన్ ఫీచర్‌ను జోడించింది. దీనితో ఇంటర్నెట్ లేనప్పటికీ స్మార్ట్‌ఫోన్ నుంచి క్యాబ్‌ను బుక్ చేయవచ్చు. బుక్ వయా ఎస్ఎంఎస్ అన్న ఆప్షన్‌పై క్లిక్ చేయగానే కస్టమర్ మొబైల్ నుంచి లొకేషన్‌తో కూడిన వివరాలతో ఒక మెసేజ్ ఓలాకు వెళ్తుంది. వెంటనే కస్టమర్‌కు సమీపంలో ఉన్న మైక్రో, మినీ, ప్రైమ్, లగ్జరీ క్యాబ్‌ల వివరాలతో ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. కస్టమర్ తనకు నచ్చిన క్యాబ్‌ను ఎంచుకోవచ్చు. ఎంపిక చేసుకోగానే డ్రైవర్, క్యాబ్ వివరాలతో మరో ఎస్ఎంఎస్ వస్తుంది. అటు డ్రైవర్‌కూ కస్టమర్ సమాచారం, జీపీఎస్ లొకేషన్ సైతం ఎస్ఎంఎస్ ద్వారా వెళ్తుంది. ఇంటర్నెట్ ఉంటే రైడ్ వివరాలు, జీపీఎస్ ట్రాకింగ్, ఎస్‌వోఎస్ బటన్ వంటి ఫీచర్లు వినియోగించుకోవచ్చు. ఓలా ఆఫ్‌లైన్ బుకింగ్ సౌకర్యం ప్రస్తుతం ప్రధాన నగరాల్లో ఉంది. దశలవారీగా మొత్తం 102 నగరాలు, పట్టణాలకు విస్తరిస్తామని ఓలా ఒక ప్రకటనలో తెలియజేసింది.