విద్యుత్ బకాయిలు ప్రభుత్వమే చెల్లించాలి
మంత్రి జూపల్లికి సర్పంచ్ల ఫోరం వినతి
సాక్షి, హైదరాబాద్: పాత విద్యుత్ బకాయిలను ప్రభుత్వమే చెల్లించాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి జూపల్లికి తెలంగాణ సర్పంచ్ల ఫోరం జాతీయ అధ్యక్షుడు యాకుబ్‌రెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు సోమిరెడ్డి విన్నవించారు. 14వ ఆర్థి క సంఘం నిధులు నేరుగా పంచాయతీలకే ఇవ్వాలని, భూముల రిజిస్ట్రేషన్‌కు సంబం ధించిన ట్రాన్స్ఫర్ డ్యూటీ మొత్తాన్ని పంచా యతీలకు విడుదల చేయాలని కోరారు. ఆది వారం సచివాలయంలో మంత్రితో భేటీ అయిన ఫోరం నేతలు పంచాయతీల సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. సమస్యలపై సానుకూలంగా స్పందించిన మంత్రి అనంతరం మాట్లాడుతూ.. పంచాయ తీలను స్వచ్ఛ్ గ్రామాలుగా మార్చేందుకు ప్రత్యేక చొరవ చూపాలని, 100 శాతం వ్యక్తిగత మరుగుదొడ్ల లక్ష్యం కోసం సర్పంచ్‌లు చిత్తశుద్ధితో పనిచేయాలని కోరా రు. హరితహారాన్ని గ్రామాల్లో పెంపొందిం చాలన్నారు. స్థానిక సంస్థల సమస్యల పరి ష్కారం కోసం ఈ నెల 27న మహాధర్నాకు పిలుపునిచ్చిన రాష్ట్ర సర్పంచ్ల ఐక్య వేదిక, జెడ్పీటీసీల ఫోరం ప్రతినిధులు భేటీకి హాజరు కాలేదు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఆందోళ నకు దిగుతామని తెలంగాణ సర్పంచ్ల సంఘం, తెలంగాణ పంచాయతీరాజ్ చాంబ ర్ ప్రతినిధులు ఇటీవల ప్రకటించారు.