Olive
-
అవోకాడో వర్సెస్ ఆలివ్ ఆయిల్: ఆరోగ్యానికి ఏది మంచిది?
అవోకాడో, ఆలివ్ రెండూ ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధిగాంచినవే. ఇవి రెండు కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడం, వాపును తగ్గించడం పరంగా గుండె ఆరోగ్యానికి మేలు చేసేవే. అయితే ఈ రెండింటిలో ఏది బెస్ట్ అని ప్రత్యేకంగా చెప్పాలంటే..వాటికి ప్రత్యేక పోషక విలువల ఆధారంగా వెల్లడించాల్సి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.పోషకాల పరంగా రెండిటిలోనూ వేర్వేరు ప్రత్యేక పోషకాల ప్రొఫైల్‌ని కలిగి ఉంటాయి. అవేంటో సవివరంగా చూద్దాం..కొవ్వుల పరంగా చూస్తే..రెండు నూనెల్లో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్)ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ని పెంచి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. అవోకాడో నూనె కంటే ఆలివ్ నూనెలో మోనోశాచురేటెడ్ కొవ్వులలో కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఈ కొవ్వులు వాపును తగ్గిస్తాయి. పైగా హృదయనాళ పనితీరును మెరుగుపరుస్తాయి. అయితే అవోకాడో నూనె కూడా గుండెకి సంబంధించిన ఆరోగ్యకరమైన కొవ్వుల మూలం. పైగా ఎక్కువ పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులను (మంచి ఒమేగా-6 కొవ్వులు) కలిగి ఉంది. అలా అని అధిక మొత్తంలో తీసుకుంటే మంటను కలిగించే అవకాశం ఉన్నందున అవకాడోని మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.యాంటీఆక్సిడెంట్లు, పోషక సాంద్రతఆలివ్ ఆయిల్‌లోని పాలీఫెనాల్స్ కణాలు ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. మెరుగైన గుండె ఆరోగ్యం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అవకాడో నూనెలో తక్కువ పాలీఫెనాల్స్ ఉన్నప్పటికీ, ఇందులో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి తోడ్పడటమే గాక శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రెండు నూనెలు ఆరోగ్యాన్ని పెంపొందించే ప్రయోజనకరమైన మొక్కల సమ్మేళనాలను కూడా కలిగి ఉంటాయి. అందువల్ల ఆలివ్ ఆయిల్ అధిక ప్రాముఖ్యత ఇవ్వక తప్పదని చెబుతున్నారు నిపుణులు.వంట పరంగా..అవోకాడో నూనెలో ఆలివ్ నూనె కంటే ఎక్కువ స్మోక్ పాయింట్ ఉంటుంది. ఇది వేయించడానికి లేదా గ్రిల్ చేయడం వంటి అధిక వేడి వంటలక అనుకూలం. ఆలివ్ నూనె తక్కువ వేడి వంటకు లేదా సలాడ్లు, డిప్‌లలో ఫినిషింగ్ ఆయిల్గా బాగా సరిపోతుంది. రెండు నూనెలు వేడిలో స్థిరంగా ఉన్నప్పటికీ, అవోకాడో నూనె అధిక వేడి వంట కోసం ఉపయోగించినప్పుడు దానిలో పోషకాలను బాగా నిలుపుకుంటుంది. ఈ విధంగా చూస్తే అవోకాడో నూనె ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకునే సామర్థ్యం కారణంగా ఇదే బెస్ట్ అని చెప్పొచ్చు.రుచికి..ఆలివ్ నూనె అదనపు పచ్చి కొంచెం చేదుతో ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. ఇది సలాడ్లు, డ్రెస్సింగ్‌లు, మధ్యధరా వంటకాల రుచిని పెంచుతుంది. అవోకాడో నూనె దీనికి విరుద్ధంగా తేలికపాటి తటస్థ రుచిని కలిగి ఉంటుంది. ఇది వంటల రుచిని మారకూడదంటే ఇది బెస్ట్. అవకాడో ఆయిల్, ఆలివ్ ఆయిల్ రెండూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఆలివ్ నూనెలోని అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ గుండె ఆరోగ్యానికి ది బెస్ట్‌గా చెప్పొచ్చు. పైగా తక్కువ వేడి వంటకు అనువైనది. అవోకాడో నూనె అధిక వేడి వంటలకు సరైన ఎంపిక. అలాగే చర్మ సంరక్షణ కోసం విటమిన్ 'ఈ'ని అందిస్తుంది. రెండింటిని జీవన విధానంలో భాగం చేసుకోండి కానీ గుండె ఆరోగ్య రీత్యా ఆలివ్ ఆయిల్‌కి అధిక ప్రాధాన్యత ఇవ్వవల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.(చదవండి: మెటాస్టాటిక్ బ్రెస్ట్ కేన్సర్ రోగులు మానసిక ఆరోగ్యం కోసం ఏం చేయాలంటే..?) -
‘ఆలివ్‌రిడ్లే’కు ప్రత్యేక రక్షణ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: సముద్రంలో చేపల వేటకు వెళ్లే మరబోట్ల ఫ్యాన్ రెక్కలు తగిలి ప్రాణాలు కోల్పోతున్న అరుదైన ఆలివ్‌రిడ్లే తాబేళ్లను కాపాడేందుకు కృష్ణా జిల్లా అధికార యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇకనుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లే మరబోట్లకు లైసెన్స్‌లు తప్పనిసరి చేసింది. మరబోట్లు, మెకనైజ్డ్ బోట్ల ఫ్యాన్ల రెక్కలు ఆలివ్‌రిడ్లే తాబేళ్లకు తగలకుండా ప్రత్యేక పరికరాలను అమర్చాలని నిర్ణయించింది. కొత్త మరబోట్లకు అనుమతిచ్చే సమయంలోనే ఆలివ్‌రిడ్లే తాబేళ్ల రక్షణకు ప్రత్యేక షరతులు విధించనుంది. ఈ తాబేళ్లకు ముప్పు కలిగిస్తే వన్యప్రాణి చట్టం–1972 ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేయనుంది. తాజా నిర్ణయాలపై సముద్రంలో చేపలవేటకు వెళ్లే మత్స్యకారులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించనుంది. ఈ మేరకు కృష్ణా జిల్లా కలెక్టర్ రాజాబాబు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మన దగ్గర ఎక్కువగానే.. ఆలివ్‌రిడ్లే తాబేళ్లలో ఏడు రకాల జాతులు ఉన్నాయి. వాటిలో జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఐదు రకాల జాతులు ఉండగా, మన దేశంలో రెండు రకాలు ఉన్నాయి. మన దేశంలో ఒడిశా తీరప్రాంతంలో ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ఎక్కువగా ఉంటాయి. ఆ తర్వాత మన రాష్ట్రంలోని కాకినాడ జిల్లా ఉప్పాడ తీరం, హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్యం, కృష్ణాజిల్లా కోడూరు మండలం పాలకాయతిప్ప నుంచి నాగాయలంక మండలం జింకపాలెం వరకు, బాపట్ల జిల్లా సూర్యలంక, నిజాంపట్నం తీర ప్రాంతాల్లో ఆలివ్‌రిడ్లే తాబేళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఒక్కో తాబేలు 50 కిలోల వరకు బరువు పెరుగుతుంది. వీటి సంరక్షణకు అటవీశాఖ కూడా ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ప్రతి సంవత్సరం ఈ తాబేళ్ల గుడ్లను సేకరించి సముద్రంలోకి వదులుతుంది. ఈ సంవత్సరం కూడా 46,840 గుడ్లను సముద్రంలోకి వదిలింది. 2009 నుంచి ఇప్పటి వరకు కృష్ణా, గుంటూరు, బాపట్ల జిల్లాల్లో 5.18లక్షల ఆలివ్‌రిడ్లే తాబేళ్లను సముద్రంలోకి వదిలింది. -
20 వేల కిలో మీటర్లు ప్రయాణించి.. ఆలివ్ రిడ్లే తాబేళ్ల ఆసక్తికర విషయాలు..
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని సముద్ర తీరాలకు చేరుకుంటున్నాయి. అంతరించిపోతున్న జాబితాలో ఉన్న ఈ జాతి తాబేళ్లను రక్షించేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు. అరుదైన ఆలివ్ రిడ్లే తాబేళ్లలో ఏడు రకాల జాతులు ఉన్నాయి. వీటిలో 5 రకాలు జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో ఎక్కువ. రెండు అడుగుల వెడల్పు.. 50 కిలోల వరకూ బరువు పెరిగే ఈ తాబేలు ఎక్కడైతే గుడ్డు నుంచి పిల్లగా బయటకు వస్తుందో.. తిరిగి అక్కడికే వచ్చి గుడ్లు పెట్టడం ఈ జాతి ప్రత్యేకత. ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు సుమారు 20 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి తీరానికి వస్తాయి. దేశంలోని ఒడిశా తీరంలో ఈ జాతి తాబేళ్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ తరువాతి స్థానం ఆంధ్రప్రదేశ్‌దే. మన రాష్ట్రంలో కాకినాడ తీరంలోని ఉప్పాడ, హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్యం, కృష్ణా జిల్లాలోని కోడూరు మండలం పాలకాయతిప్ప నుంచి నాగాయలంక మండలం జింకపాలెం వరకూ, గుంటూరు జిల్లాలో నిజాంపట్నం, బాపట్ల పరిధిలోని సూర్యలంక ప్రాంతం వరకు ఈ జాతి తాబేళ్లు ఎక్కువగా వస్తుంటాయి. ఆడా.. మగా నిర్ధారించేది ఉష్ణోగ్రతలే ఆలివ్ రిడ్లే తాబేలు గుడ్లు పెట్టి పిల్లగా మారడానికి 28 డిగ్రీల నుంచి 32 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. 30 నుంచి 32 డిగ్రీల మధ్య పుట్టిన తాబేలు ఆడ తాబేలు అవుతుంది. అంతకంటే తక్కువ డిగ్రీల ఉష్ణోగ్రతలో పుట్టే పిల్లలు మగ తాబేళ్లు అవుతాయి. సృష్టిలో ఒక్క తాబేలు జాతికి మాత్రమే ఇలాంటి ప్రత్యేకత ఉంది. ఆలివ్ రిడ్లే తాబేళ్లు ఏటా అక్టోబర్, నవంబర్ మాసాల్లో ఫలదీకరణ కోసం వస్తుంటాయి. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో గుడ్లు పెడతాయి. ఇసుకలో 30 నుంచి 45 సెం.మీ. లోతున కుండాకారంలో గొయ్యి తీసి.. 60 నుంచి 120 వరకూ గుడ్లు పెడతాయి. గొయ్యి తీసేదగ్గర నుంచి గుడ్లు పెట్టడానికి 45 నిమిషాల నుంచి ఒక గంట సమయం తీసుకుంటుంది. ఈ గుడ్లు 45 నుంచి 50 రోజుల తరువాత పిల్లలు బయటకొస్తాయి. ఆలివ్ రిడ్లే తాబేళ్ల వల్ల పర్యావరణానికి ఎంతో మేలు కలుగుతుంది. సముద్రంలో ఆక్సిజన్ శాతం పెంచేందుకు.. చేపల సంతానం వృద్ధి చెందేందుకు తాబేలు ఎంతగానో దోహదపడుతుంది. చేప పిల్లలను తిని జీవించే జెల్లీ చేపలను తాబేలు తినడం వల్ల చేపల ఉత్పత్తి పెరుగుతుంది. తాబేలు ఎంత లోతులో ఉన్నా ప్రతి 45 నిమిషాలకు ఒకసారి నీటిపైకి వచ్చి ఆక్సిజన్ తీసుకుని లోపలకు వెళుతుంటుంది. అవి నీటిలో పైకి, కిందకు రావడం వల్ల నీటిలో ఆక్సిజన్ శాతం పెరుగుతుంది. ఈ విధంగా పర్యావరణానికి తాబేలు ఎంతో మేలు చేస్తుంది. గుడ్డు పెడుతున్న తాబేలు, నాగాయలంక మండలం ఐలాండ్ వద్ద సముద్రంలోకి తాబేళ్లను వదులుతున్న ఫారెస్ట్ అధికారులు, సిబ్బంది ప్రత్యేక హేచరీల ద్వారా రక్షణ అరుదైన ఆలివ్ రిడ్లే జాతి తాబేలుని రక్షించేందుకు అటవీ శాఖాధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అవనిగడ్డ ఫారెస్ట్ రేంజ్ పరిధిలో కోడూరు మండలం పాలకాయతిప్ప వద్ద ఒకటి, నాగాయలంక మండలం లైట్‌హౌస్ శివారు ఐలాండ్ దగ్గర మూడు, సంగమేశ్వరం వద్ద ఒకటి, నిజాంపట్నం, సూర్యలంక వద్ద రెండు హేచరీలను ఏర్పాటు చేశారు. 2009 నుంచి ఇప్పటి వరకూ 5 లక్షల తాబేళ్లను సముద్రంలోకి వదిలారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ కృష్ణా జిల్లా పరిధిలో 12,624 గుడ్లను సేకరించినట్టు అధికారులు చెప్పారు. తాబేళ్ల సంఖ్య పెరుగుతోంది ఆలివ్ రిడ్లే తాబేళ్లు గుడ్లు పెట్టే కాలంలో వాటి ప్రాణాలకు ముప్పు వాటిల్లే వలలు వేయకుండా చర్యలు తీసుకుంటున్నాం. దీనిపై మత్స్యశాఖ అధికారులతో కలసి అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. గతంలో కంటే గుడ్లు పెట్టేందుకు వచ్చే తాబేళ్ల సంఖ్య ఏటా పెరుగుతోంది. – కేవీఎస్ రాఘవరావు, ఫారెస్ట్ అధికారి, అవనిగడ్డ రేంజ్ -
వేల కిలోమీటర్ల నుంచి వచ్చి.. ఆలివ్ రిడ్లే తాబేళ్ల ప్రత్యేకతలివే..
పిఠాపురం(తూర్పుగోదావరి): అలసట లేని వలస జీవులవి. అలుపెరుగని ప్రయాణం వాటి జీవన శైలి. సైబీరియా పక్షుల మాదిరిగా కేవలం సంతానోత్పత్తి కోసమే వేల కిలోమీటర్లు ప్రయాణించి పుట్టింటికి వచ్చినట్టుగా ‘తూర్పు’ తీరానికి చేరుకుంటాయి. ఎన్నో విశేషాలకు నిలయమైన ఆ జీవులు ఆలివ్ రిడ్లే తాబేళ్లు. ప్రస్తుతం సంతానోత్పత్తి కాలం కావడంతో జిల్లాలోని సముద్ర తీరంలో సందడి చేస్తున్న ఈ తాబేళ్ల రక్షణకు అటవీ అధికారులు చర్యలు చేపడుతున్నారు. చదవండి: రూపాయికే దోసె.. ఎర్రకారం, బొంబాయి చట్నీ.. ఎక్కడో తెలుసా..? అరుదైన ఉభయచర జీవుల్లో అనేక జాతుల తాబేళ్లున్నప్పటికీ ఆలివ్ రిడ్లే తాబేళ్లకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. వీటికి స్థిర నివాసం అంటూ ఏదీ ఉండదు. రెండడుగుల పొడవు, సుమారు 500 కేజీల బరువు ఉండే ఈ తాబేళ్లు ఆహారాన్వేషణ, గుడ్లు పెట్టడం, సంతానోత్పత్తి కోసం దాదాపు 20 వేల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. వీటిల్లో 7 జాతులుండగా 5 జాతుల తాబేళ్లు జపాన్, ఆ్రస్టేలియా, న్యూజిలాండ్ తదితర దేశాల నుంచి లక్షలాదిగా ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల తీరాలకు సముద్ర మార్గంలో వలస వస్తూంటాయి. నదులు సముద్రంలో కలిసే చోటు వీటి సంతానోత్పత్తికి అనువుగా ఉంటుంది. అందుకే కాకినాడ సమీపంలోని ఉప్పాడ, హోప్ ఐలాండ్, కోరంగి అభయారణ్య తీర ప్రాంతానికి ఈ తాబేళ్లు ఎక్కువగా వస్తూంటాయి. జీవనం అంతా సముద్రంలోనే అయినప్పటికీ కేవలం గుడ్లు పెట్టడానికి భూమి మీదకు వచ్చేవి ఆలివ్ రిడ్లే తాబేళ్లు మాత్రమే. వేల కిలోమీటర్లు వలస వచ్చి గుడ్లు పెట్టిన చోటనే తయారైన పిల్లలు.. తిరిగి పదేళ్ల తరువాత సంతానోత్పత్తి సమయంలో తిరిగి అదే చోటుకు వచ్చి గుడ్లు పెట్టడం విశేషం. ఈ విధంగా పుట్టిన చోటుకే వచ్చి, మళ్లీ అక్కడే గుడ్లు పెట్టేది ఒక్క సముద్ర తాబేలు మాత్రమే. సాధారణంగా ఇవి జనవరి, ఫిబ్రవరి నెలల్లో గుడ్లు పెట్టేందుకు సుదూర ప్రాంతాల నుంచి ‘తూర్పు’ తీరానికి వేలాదిగా వస్తాయి. అర్ధరాత్రి 2 నుంచి తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఆయా తీరాలకు చేరి, ఇసుకలో గోతులు తవ్విన, వాటిల్లో గుడ్లు పెట్టి, తిరిగి వాటిపై ఇసుక కప్పి, తల్లి తాబేళ్లు సముద్రంలోకి తిరిగి వెళ్లిపోతాయి. సుమారు నెల రోజుల అనంతరం ఈ గుడ్లు పిల్లలుగా తయారవుతాయి. ఒక్కో తాబేలు 50 నుంచి 150 వరకూ గుడ్లు పెడతాయి. 28 నుంచి 30 డిగ్రీల ఉష్ణోగ్రతలో పొదిగిన గుడ్లు మగ తాబేళ్లుగాను, 30 నుంచి 32 డిగ్రీల ఉష్ణోగ్రతలో పొదిగిన గుడ్లు ఆడ తాబేళ్లుగాను తయారవుతాయి. వెన్నెల రాత్రుల వేళ ఆ పిల్లలు కూడా వాటంతట అవే సముద్రంలోకి వెళ్లిపోవడం మరో విశేషం. అన్నీ గండాలే భారీ సైజులో ఉండే సముద్ర తాబేళ్లకు తీరంలో రక్షణ కరువవుతోంది. కుక్కలు, నక్కలు, ఇతర జంతువులు వీటి గుడ్లను తినేస్తుంటాయి. చివరకు కొన్ని మాత్రమే పిల్లలుగా తయారై వాటంతటవే సముద్రంలోకి వెళ్లిపోతుంటాయి. కొన్నిసార్లు ఆ పిల్లలను కూడా కొన్ని జంతువులు వేటాడి తినేస్తుంటాయి. ఇలా పుట్టినప్పటి నుంచీ సముద్ర తాబేళ్లకు ప్రాణసంకటంగానే ఉంటుంది. గుడ్లు పెట్టడానికి తీరానికి వచ్చిన తాబేళ్లు ఒక్కోసారి మత్స్యకారుల వలలకు చిక్కుతాయి. వాటిని జాగ్రత్తగా సముద్రంలో వదిలేయాల్సిన కొంతమంది విచక్షణారహితంగా వ్యవహరించడంతో అవి మృత్యువాత పడుతుంటాయి. రాత్రి సమయాల్లో గుడ్లు పొదిగేందుకు వచ్చిన తాబేళ్లను కూడా వివిధ జంతువులు వేటాడి చంపుతుంటాయి. ఈవిధంగా ఏటా ఉప్పాడ తీరంలో అనేక తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటున్నాం జనవరి, ఫిబ్రవరి నెలలు సముద్ర తాబేళ్లకు సంతానోత్పత్తి సమయం. దీంతో ఇక్కడకు వస్తున్న తాబేళ్లకు రక్షణ కల్పిస్తున్నాం. అవి సంచరించే ప్రాంతాన్ని సంరక్షణ ప్రాంతంగా నిర్ణయించి, బోర్డులు ఏర్పాటు చేసి, ప్రత్యేక కంచెలు ఏర్పాటు చేస్తున్నాం. అవి గుడ్లు పెట్టే ప్రాంతాల్లో జనసంచారం లేకుండా చూస్తున్నాం. గుడ్లు పొదిగి పిల్లలయ్యేంత వరకూ సుమారు 40 రోజుల పాటు రక్షణ వలయం ఏర్పాటు చేస్తున్నాం. తాబేళ్లను, వాటి గుడ్లను ఏ జంతువులూ తినకుండా రక్షణ కలి్పస్తున్నాం. తయారైన పిల్లలు సురక్షితంగా సముద్రంలోకి వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం. తాళ్లరేవు సమీపంలోని కోరింగ అభయారణ్యం ప్రాంతానికి సుమారు లక్ష వరకూ తాబేళ్లు వచ్చే అవకాశాలున్నాయి. ఉప్పాడ, కాకినాడ తదితర ప్రాంతాల్లో కొన్ని పరిస్థితుల వల్ల బోట్లలో పడి కొన్ని తాబేళ్లు మృత్యువాత పడుతున్నాయి. వాటి రక్షణకు చర్యలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాం. – ఎస్.అశ్వనీకుమార్, అటవీ శాఖ సెక్షన్ అధికారి, కోరంగి -
ఆపదలో ఆలివ్.. తీర ప్రాంతాల్లో ఆలివ్‌రిడ్లేల కళేబరాలు!
ప్రపంచలోనే అత్యంత అరుదైన సముద్రపు తాబేళ్లుగా పిలవబడే ఆలివ్‌రిడ్లేల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. సముద్ర జలాలను శుద్ధిచేసి, పర్యావరణాన్ని కాపాడడంలో తోడ్పడుతున్న వీటి సంరక్షణ కరువైంది. ఏటా గంజాం జిల్లా సాగర తీరంలో మైటింగ్(సంగమం)కి వచ్చే వీటిని కాపాడేందుకు అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నా ఇవి ఈసారి ఆశించినంత స్థాయిలో లేవనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనికి జిల్లాలోని పలు తీర ప్రాంతాల్లో కనిపిస్తున్న ఆలివ్‌రిడ్లేల కళేబరాలే నిదర్శనం. బరంపురం (ఒడిశా): గంజాం జిల్లాలోని రుసికుల్యా నది–బంగాళాఖాతం ముఖద్వారం ఆలివ్‌రిడ్లేల సంతానాభివృద్ధికి మంచి ఆవాసం. దేశ వ్యాప్తంగా ఉన్న 3 అనువైన ప్రదేశాలకు మాత్రమే ఇవి కొన్ని వందల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి మరీ సంగమిస్తుండడం విశేషం. ఏటా నవంబరులో వీటి మైటింగ్(సంగమం)తో ప్రారంభమయ్యే ఈ ప్రక్రియ గుడ్లు పెట్టడం, ఆ తర్వాత వాటిని పొదగడం వంటి ప్రక్రియలు జనవరి, ఫిబ్రవరి నెలల వరకు నిరవధికంగా సాగుతుంది. అయితే ఈ తాబేళ్ల పిల్లలు సముద్రంలోకి ఏ మార్గాన వెళ్తాయో అవి పెద్దవైన తర్వాత గుడ్లు పెట్టేందుకు కూడా అదే స్థావరానికి రావడం వీటి ప్రత్యేకత. ఇప్పుడు గంజాం జిల్లాలోని గోపాలపూర్, పూర్ణబొందా సాగర తీరాల్లో ఎక్కడికక్కడ ఒడ్డుకు చేరుకున్న ఆలివ్ రిడ్లే తాబేళ్ల కళేబరాలు కనిపిస్తున్నాయి. ఇక్కడికి ఏటా చేరుకుంటున్న వీటికి రక్షణ కల్పించేందుకు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపడుతున్నా ఇటువంటి దృశ్యాలు తారసపడడం పర్యావరణ హితులను కలవరపరుస్తోంది. ఇటీవల ఆలివ్‌రిడ్లేల రాక నేపథ్యంలో తీరం నుంచి లోపలికి 10 కిలోమీటర్ల మేర చేపల వేట నిషేధిస్తూ జిల్లా అధికార యంత్రాంగం ఉత్వర్వులు జారీ చేసింది. ఫిషింగ్ బోట్లతో వేటకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించింది. చదవండి: (AP PGCET: ఏపీ పీజీసెట్ ఫలితాలు విడుదల) తీరంలోని కళేబరాలను పీక్కుతింటున్న శునకాలు సంప్రదాయ వలలతో వేటకు ఓకే.. మత్స్యకారులు జీవనోపాధి కోల్పోకుండా సంప్రదాయ వలలతో వేట కొనసాగించుకోవచ్చని అవకాశం కల్పించింది. తీరంలో నిబంధనలను ఎవ్వరూ అతిక్రమించకుండా అధికారులను సైతం అధికార యంత్రాంగం నియమించింది. అయితే రెండు రోజులుగా అధికారుల జాడ కొరవడడంతో కొంతమంది సముద్రంలో అక్రమంగా చేపల వేట కొనసాగించే సాహసం చేస్తున్నారు. ఈక్రమంలో ట్రాలీల వినియోగంతో మైటింగ్లో ఉన్న తాబేళ్లు చనిపోతున్నాయి. ముఖ్యంగా ఫిషింగ్ బోట్ల చక్రాలు తాబేళ్లను ఢీకొనడం, సముద్రంలోకి చేరే ఆక్వా రసాయనాలతో ఇవి చనిపోతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ముఖ్యంగా రుసికుల్యా నది–బంగాళాఖాతం ముఖ ద్వారంలోని నిషేధిత ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్‌కి చెందిన విశాఖపట్నం, కాకినాడ ఓడరేవుల నుంచి కొంతమంది వేట జరపడంతో ఇక్కడి మైటింగ్లోని ఆలివ్‌రిడ్లేలు చనిపోతున్నాయి. ఇప్పటికైనా అధికారులు దృష్టి సారించి, ఆపదలో ఉన్న తాబేళ్ల పరిరక్షణకు చర్యలను కట్టుదిట్టం చేయాలని స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజాసంఘాల నాయకులు విజ్ఞప్తి చేస్తున్నారు. పొదిగే సమయం 45 రోజులు.. సంతానాభివృద్ధికి ఏటా నవంబరులో తీరానికి చేరే తాబేళ్లు మైటింగ్ అనంతరం గుడ్లు పెడతాయి. ఆ తర్వాత జనవరి, ఫిబ్రవరి నెలల్లో తీరంలోని ప్రత్యేక గుంతల్లో భద్రపరిచిన గుడ్లును పొదుగుతాయి. దీనికి 45 నుంచి 60 రోజుల సమయం పడుతుంది. వీటి సంరక్షణకు ట్రీ ఫౌండేషన్, బయోవర్సిటీ కన్జర్వేషన్ ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థలు కృషి చేస్తుండగా, ఆలివ్‌రిడ్లే ఒక్కొక్కటి 3 అడుగుల పొడవు, 1.5 అడుగుల వెడల్పు, దాదాపు 45 కిలోల బరువు ఉంటుంది. చదవండి: (KTR: మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు) ఆక్సిజన్ పెంచడంలో కీలకం.. ఆలివ్‌రిడ్లే తాబేళ్లు సముద్ర జలాల్లోని వివిధ వ్యర్థాలను తిని, సముద్రం కలుషితం కాకుండా కాపాడుతాయి. అంతేకాకుండా సముద్ర జీవరాశులను అంతరించిపోకుండా ఇవి పరిరక్షిస్తున్నాయి. సముద్రంలో ఆక్సిజన్ పెంచడంలో తాబేళ్లు కీలకపాత్ర పోషిస్తాయి. ఇవి గుడ్లు పెట్టే సమయంలో తీరంలో ఓ రకమైన జెల్‌ని విడుదల చేస్తాయి. అది భూమిలో బంకలా అతుక్కుపోయి విపత్తుల సమయంలో తీరం కోతకు గురికాకుండా నివారిస్తుంది. ఇలా అనేక ఉపయోగాలున్న వీటి సంరక్షణ నేడు గాల్లో దీపంగా మారింది. వన్యప్రాణి సంరక్షణ చట్టం ఏం చెబుతోంది.. వణ్యప్రాణి సంరక్షణ చట్టం–1972 ప్రకారం తాబేళ్లను షెడ్యూల్–1లో పొందుపరిచి, ప్రత్యేక రక్షణ కల్పించారు. పర్యావరణాన్ని కాపాడే సముద్రపు తాబేళ్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. కొందరు సముద్రంలోకి వ్యర్థాలను వదిలిపెట్టడం, నిబంధనలకు విరుద్ధంగా మరబోట్లు నడపడం వల్ల తాబేళ్లు ఎక్కువగా చనిపోతున్నాయి. అలాగే తాబేళ్లను ఎవరైనా తిన్నా, చంపినా, వాటి ఆవాసాలను నాశనం చేసినా శిక్షార్హులు. నేరం రుజువైతే 3 ఏళ్ల నుంచి 7 ఏళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. -
హైదరాబాద్‌లో ప్రైవేట్ ఆస్పత్రి నిర్వాకం
సాక్షి, హైదరాబాద్: ఓ వైపు కరోనా వైరస్ విశ్వరూపం చూపిస్తుంటే.. మరోవైపు పలు ప్రైవేట్ ఆస్పత్రులు దారుణానికి పాల్పడుతున్నాయి. తాజాగా కరోనా లక్షణాలు ఉన్నప్పటికీ డ్యూటీకి రావాలంటూ నర్సులను వేధిస్తున్న వైనం వెలుగులోకి వచ్చింది. మోహదీపట్నంలోని నానాల్‌నగర్‌లోని ఆలివ్ ఆస్పత్రి యాజమాన్యం తమిళనాడుకు చెందిన నర్సులను నిర్భంధించింది. జ్వరం వచ్చినప్పటికీ ట్యాబ్లెట్ వేసుకుని డ్యూటీకి రావాలంటూ ఉచిత సలహా ఇచ్చింది. దీంతో దిక్కుతోచని నర్సులు ఈ విషయాన్ని తెలంగాణ నర్సింగ్ సమితికి దృష్టికి తీసుకు వెళ్లారు. తమను ఆదుకోవాలంటూ వేడుకుంటున్నారు. -
జై మోదీ, ఆలివ్ హెల్త్కేర్లపై ప్రపంచ బ్యాంక్ వేటు
వాషింగ్టన్ : పలు భారతీయ కంపెనీలు, పౌరులపై ప్రపంచ బ్యాంక్ వేటు వేసింది. ప్రపంచవ్యాప్తంగా చేపడుతున్న పలు ప్రాజెక్ట్‌లను ఆయా కంపెనీలు చేపట్టకుండా నిషేధం విధించింది. అవినీతి, మోసాలకు పాల్పడుతున్నందుకు గాను, మొత్తం 78 భారతీయ కంపెనీలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రపంచ బ్యాంక్ ప్రకటించింది. . ఇకపై ఈ కంపెనీలు ఎలాంటి కార్యకలాపాలూ నిర్వహించకుండా ఆదేశాలు జారీ చేసినట్టు ప్రపంచ బ్యాంకు తన వార్షిక నివేదిక ద్వారా వెల్లడించింది. భారత్‌కు చెందిన ఆలివ్ హెల్త్‌కేర్, జై మోదీ కంపెనీలు అవినీతికి పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో వాటిని నిషేధిస్తున్నట్లు పేర్కొంది. ఈ కంపెనీలు బంగ్లాదేశ్‌లో ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్ట్‌లో పనిచేస్తున్నాయి. ఆలివ్ హెల్త్‌పై 10 ఏళ్ల ఆరు నెలలు నిషేధం విధించగా.. జై మోదీని ఏడేళ్ల ఆరు నెలలు డిబార్ చేసింది.. అదేవిధంగా భారత్‌కు చెందిన ఏంజెలిక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌పై కూడా నాలుగేళ్ల ఆరు నెలలు నిషేధం విధించింది. ఈ కంపెనీ ఇథియోపియా, నేపాల్‌లో ప్రపంచ బ్యాంక్ ప్రాజెక్ట్‌లో పాల్గొంటుంది. ఫ్యామిలీ కేర్‌పై నాలుగేళ్లు నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. ఈ కంపెనీ అర్జెంటీనా, బంగ్లాదేశ్ దేశాల ప్రాజెక్ట్‌లో ఉంది. ఇక భారత్‌లో ప్రాజెక్టులు నిర్వహిస్తున్న మధుకాన్ ప్రాజెక్టు లిమిటెడ్‌పై రెండేళ్లు, ఆర్కేడీ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్‌పై ఏడాది ఆరు నెలల పాటు నిషేధం విధించినట్లు ప్రపంచ బ్యాంకు తన నివేదికలో వెల్లడించింది. వీటితో పాటు తత్వే గ్లోబల్ ఎన్విరాన్మెంట్ ప్రైవేట్ లిమిటెడ్, ఎస్ఎంఈసీ(ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్, మాక్లోడ్స్ ఫార్మాసిటికల్స్ లిమిటెడ్‌పై ఏడాది కంటే తక్కువ కాలం నిషేధం విధించింది. ఈ 78 కంపెనీలతో పాటు మరో ఐదు కంపెనీలపై కూడా ఆంక్షలతో కూడిన నిబంధనలు విధించింది. ప్రపంచ బ్యాంక్ ఫండ్ చేసే ప్రాజెక్ట్‌ల్లో ఈ కంపెనీలు అవినీతి, మోసం, కుట్రలు, అవరోధాలకు పాల్పడుతున్నాయని తన నివేదికలో వెల్లడించింది. -
గుడ్‌నైట్ ఆలివ్
మిస్టరీ * అనుకోకుండా మరణించింది. * ఆత్మగా మారి సంచరిస్తోంది. * ఎవరామె? ఎక్కడుంది? న్యూ ఆమ్స్టర్డామ్ థియేటర్... కాలిఫోర్నియా... ‘‘త్వరగా కానివ్వండి. టైమవుతోంది. ఇంత మెల్లగా చేస్తే ఎలా?’’... శ్యామ్సన్ అరుపులతో థియేటర్ మారుమోగుతోంది. ‘‘ఏంటీ గోల... ఎందుకలా అరుస్తాడు?’’ అంటూ గొణిగింది లూసీ. ‘‘అంతే. వాడేదో పనిమంతుడైనట్టు, మిగతా వాళ్లంతా బద్ధకస్తులన్నట్టు మాట్లాడుతుంటాడు. మేనేజర్ విని వాడినో పెద్ద తురుము అనుకోవాలని వాడి ఉద్దేశం’’ అంది సారా. అంతలో వాళ్ల దగ్గరకు వచ్చాడు శ్యామ్సన్. ‘‘ఏంటి కబుర్లు? మేకప్ పూర్తయ్యిందా?’’ మూతి తిప్పింది లూసీ. ఫక్కున నవ్వబోయి ఆపుకుంది సారా. ‘‘మేం రెడీ, మీదే లేటు’’ అంది. ‘‘సరే. హాల్ నిండిపోతోంది. మరో పదిహేను నిమిషాల్లో స్టార్ట్ చేయాలి’’ అనేసి వెళ్లిపోయాడు శ్యామ్సన్. ‘‘వీడు... వీడి ఓవరాక్షన్’’ అంది సారా పళ్లు కొరుకుతూ. ‘‘ఎప్పుడూ ఇలాగే మాట్లాడతాడా’’ అడిగింది లూసీ. ‘‘ఆ... ఎప్పుడూ ఇంతే. ఇంతకు ముందు వేరే థియేటర్లో సూపర్ వైజర్‌గా ఉండేవాడు. అక్కడ నాకు బాగా అలవాటు. ఈ మధ్యనే ఈ థియేటర్లో చేరాడు. నా ఖర్మ కాలి నేను కూడా ఇక్కడికే వచ్చాను. వాడికీ నాకూ ఇక్కడ ఇదే ఫస్ట్ షో’’... చెప్పింది సారా. ‘‘ఓహ్... నాకే అనుకున్నాను. మీకూ ఇక్కడ ఇదే ఫస్ట్ షో అన్నమాట’’ అంటూ వ్యానిటీ బాక్స్ తెరిచింది లూసీ. వెంటనే ఆమె ముఖం చిన్నబోయింది. ‘‘సారా... నా వ్యానిటీ బ్యాక్స్ ఖాళీగా ఉందేంటి? కాస్మొటిక్స్ నువ్వేమైనా తీశావా?’’ అంది. ‘‘నేనెందుకు తీస్తాను? అయినా తీస్తే గీస్తే ఒక లిప్‌స్టిక్కో, ఫౌండేషన్ క్రీమో తీసుకుంటాను గానీ అన్నీ ఎందుకు తీస్తాను?’’ అంది సారా. అదీ నిజమే కదా అనిపించింది లూసీకి. మరి తన కాస్మొటిక్స్ ఏమైనట్టు! లేచి అంతా వెతికింది. ఎక్కడా ఒక్కటి కూడా కనిపించలేదు. ఆ షోలో వాళ్లిద్దరే ఫిమేల్ ఆర్టిస్టులు. కాబట్టి వేరే వాళ్లెవరూ తీసే చాన్స్ లేదు. మరి అవన్నీ ఎక్కడికి పోయాయి! ఆమె ఆలోచిస్తూ ఉండగానే సారా పిలిచింది. ‘‘ఏంటి’’ అంటూ వెళ్లిన లూసీ... సారా చేతిలో ఉన్న వ్యానిటీ బాక్స్‌ను చూసి అవాక్కయ్యింది. ‘‘అది... ఆ బాక్స్..’’ అంది అయోమయంగా. ‘‘నీదే మేడమ్. అన్నీ ఇందులోనే ఉన్నాయి కదా! మరి నన్నెందుకు అడిగినట్టు?’’ అంది సారా కళ్లెగరేస్తూ. విస్తుపోయింది లూసీ. వెళ్లి బాక్స్‌ను చెక్ చేసింది. అది తనదే. తన కాస్మొటిక్స్ అన్నీ అందులోనే ఉన్నాయి. అప్పుడేమయ్యాయి? ఇప్పుడెలా వచ్చాయి? ఆమె ఆ కన్ఫ్యూజన్లో ఉండగానే బెల్ మోగింది. వెంటనే టచప్ చేసుకుని గబగబా స్టేజివైపు నడిచింది. ‘‘నిన్ను ప్రాణంగా ప్రేమించాను. ప్రేమంటే నీవే అనుకున్నాను. కానీ నీకసలు ప్రేమంటేనే అర్థం తెలియదని ఇప్పటికి అర్థం చేసుకున్నాను. ఈ వంచనకు నేను తల వంచలేను. ఈ ప్రేమ రాహిత్యాన్ని నేను సహించలేను. భగ్న ప్రేమికురాలిగా బతుకు సాగించలేను. నీ కళ్లముందే నన్ను నేను అంతం చేసుకుంటాను. నీ పాదాల దగ్గరే నా ప్రాణాలు విడుస్తాను’’... ఎమోషనల్‌గా డైలాగ్స్ చెప్పుకుంటూ పోతోంది లూసీ. ప్రేక్షకులంతా ముగ్ధులవుతున్నారు. చెమర్చిన కళ్లతో తన్మయం చెందుతున్నారు. ఊపిరి బిగబట్టి నాటకాన్ని తిలకిస్తున్నారు. అంతలో... ఢామ్మంటూ ఓ శబ్దం. అందరూ ఉలిక్కిపడ్డారు. హాల్లో లైట్లు ఆరిపోయాయి. అంతటా అంధకారం అలముకుంది. హాహాకారాలు మొదలయ్యాయి. లైట్స్ ఆన్ చేయండి అంటూ కొందరు అరుస్తున్నారు. తెర వెనుక ఉన్న శ్యామ్సన్ కంగారు పడిపోయాడు. ‘‘రేయ్... లెట్లైందుకు ఆరిపోయాయి?’’ అరిచాడు. ‘‘ట్రాన్స్ఫార్మర్ పేలిపోయింది సర్’’... చెప్పాడు అసిస్టెంట్. ‘‘జెనరేటర్ ఆన్ చెయ్యి. త్వరగా!’’ ‘‘ఆన్ కావడం లేదు సర్. డీజిల్ ఉంది. వేరే ఏ సమస్య కూడా లేదు. అయినా ఆన్ కావడం లేదు.’’ కోపం తారస్థాయికి చేరింది శ్యామ్సన్కి. ‘‘అన్నీ ముందే చూసుకోవద్దా! మేనేజర్ అడిగితే ఏం చెప్పాలి?’’ అంతలోనే మేనేజర్ రానే వచ్చాడు. తత్తరపడ్డాడు శ్యామ్సన్. ‘‘సారీ సర్... అదీ... మరీ..’’ అంటూ నసిగాడు. ‘‘ఇలా ఎందుకు జరిగిందో నాకు తెలుసు. నువ్వేం కంగారు పడకు శ్యామ్సన్’’ అంటూ స్టేజి మీదికి వెళ్లాడు. ‘‘అంతరాయానికి చింతిస్తున్నాం. కాసేపట్లో షో మళ్లీ ప్రారంభమవుతుంది’’ అని ప్రకటించాడు. తన ఇన్‌ఫ్లుయెన్స్‌ని ఉపయోగించి వెంటనే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి మనుషుల్ని రప్పించాడు. ట్రాన్స్ఫార్మర్ను పది నిమిషాల్లో బాగు చేయించాడు. మళ్లీ షో మొదలైంది. ‘‘ఇంత రిచ్ ఏరియాలో, ఇంత ఆధునిక థియేటర్లో ఇలాంటి సమస్య రావడమేంటి సర్?’’ అన్నాడు శ్యామ్సన్. మేనేజర్ చిన్నగా నవ్వాడు. ‘‘ఇదే కాదు. ఇంకా చాలా సమస్యలు వస్తుంటాయి. సడెన్‌గా వస్తువులు మాయమవుతాయి. మళ్లీ ప్రత్యక్షమవుతాయి. ఫ్యాన్లు తిరగడం ఆగిపోతాయి. ఆపేసినా వాటంతటవి తిరుగుతాయి. ఇదంతా ఆలివ్ థామస్ పని’’ అన్నాడు కూల్‌గా. ‘‘ఆలివ్ థామసా? తనెవరు?’’ అన్నాడు శ్యామ్సన్ అయోమయంగా. ‘‘ఒకప్పుడు నటి. ఇప్పుడు ఆత్మ’’ అనే వెళ్లిపోతోన్న మేనేజర్ వైపు నోరి తెరిచి చూస్తూండిపోయాడు శ్యామ్సన్. మనిషి అన్ని విధాలుగానూ అభివృద్ధి పథంలో పయనిస్తోన్న ఈ రోజుల్లో... ఆత్మలు, దెయ్యాల ఉనికి అందరికీ ప్రశ్నార్థకమే. అయితే అవి లేవని కొట్టిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే తాము ఉన్నామంటూ అవి ఎప్పటికప్పుడు నిరూపిస్తూనే ఉన్నాయి. దానికి ఉదాహరణే ఆలివ్ థామస్ ఆత్మ. ఇంతకీ ఎవరీ ఆలివ్? 1894లో పెన్సిల్వేనియాలో జన్మించింది ఆలివ్. నటి కావాలన్నది ఆమె కల. ఆ కలను నెరవేర్చుకోవడానికి అతి చిన్న వయసులోనే ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే అంతలోనే మనసు, రెక్కలు కట్టుకుపోయి ప్రేమ సామ్రాజ్యంలో వాలింది. పదిహేనేళ్ల వయసులోనే బెర్నార్డ్ థామస్ అనే వ్యక్తికి ఆమె భార్య అయ్యింది. కొత్త ఆనందాలతో కాపురం కొన్నాళ్లు సజావుగానే సాగింది. కానీ మెల్లగా బంధం బీటలు వారింది. చివరికి ముక్కలై ఇద్దరినీ వేరు చేసింది. దాంతో మళ్లీ కెరీర్‌పై దృష్టి సారించింది ఆలివ్. అదృష్టం కలిసి వచ్చింది. మొదట మోడలింగ్‌లో పాదం మోపింది. తర్వాత నాటకాల్లో అవకాశాలు సంపాదించింది. ఆపైన మూకీ సినిమాల్లో చాన్సులు కొట్టేసింది. అప్పుడే నటుడు జాక్ పిక్ఫోర్డ్తో పరిచయమైంది. ఆ పరిచయం ప్రేమకు దారితీసి, వాళ్లిద్దరినీ భార్యాభర్తల్ని చేసింది. ఓ పక్క వ్యక్తిగత జీవితంలోని ఆనందం... మరోపక్క కెరీర్ ఊపందుకుంటున్న సమయం... ప్రపంచం అందంగా కనిపించసాగింది ఆలివ్‌కి. కానీ అతి త్వరలో తాను ఈ ప్రపంచానికే దూరంగా వెళ్లిపోతానన్న విషయం ఆమె గ్రహించలేకపోయింది. 1920, సెప్టెంబర్ నెల. భర్త జాక్‌తో కలిసి వెకేషన్‌కు వెళ్లింది ఆలివ్. ఓ హోటల్లో బస చేశారు. ఆ రాత్రి ఉన్నట్టుండి రిసెప్షన్‌కి ఫోన్ చేశాడు జాక్. తన భార్య పరిస్థితి బాలేదని చెప్పాడు. అంబులెన్స్ వచ్చింది. ఆలివ్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లింది. ఐదు రోజుల పాటు ఆలివ్ మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. అసలా రాత్రి ఏమైందని అడిగితే... నిద్రలో ఆలివ్ అరుపులు వినిపిస్తే లేచానని, ఆలివ్ గట్టిగా అరిచి సొమ్మసిల్లి పడిపోయిందని చెప్పాడు జాక్. పోస్ట్‌మార్టమ్‌లో ఆలివ్ కడుపులో మెర్క్యురీ బైక్లోరైడ్ లిక్విడ్ ఉన్నట్టు తేలింది. సిఫిలిస్ వ్యాధితో బాధపడుతోన్న జాక్ ఆ మందు వాడతాడు. దాన్ని ఎక్కువ మోతాదులో తాగడం వల్లే ఆలివ్ మరణించిందని నిర్ధారించారు వైద్యులు. అయితే ఆమె ఎందుకు తాగిందన్న విషయం మాత్రం తెలియలేదు. ఆత్మహత్య చేసుకుందా అంటే... ఆ అవకాశం ఉందనిపించలేదు. పోనీ జాక్ ఆమెతో బలవంతంగా తాగించాడా అంటే దానికీ సాక్ష్యం లేదు. దాంతో ఆలివ్ మృతి ఒక అనుమానాస్పద మరణంగానే మిగిలిపోయింది. అయితే ఆమెను ఈ ప్రపంచం మర్చిపోలేకపోయింది. దానికి కారణం... ఆమె ఆత్మ! న్యూ ఆమ్స్టర్డామ్ థియేటర్లో ప్రదర్శించిన ఎన్నో నాటకాల్లో నటించింది ఆలివ్. ఒక రకంగా చెప్పాలంటే ఆ థియేటర్లో ఆమె గడిపిన కాలం చాలా ఎక్కువ. అందుకనో ఏమో... దాన్ని వదిలి వెళ్లలేకపోయింది. అక్కడక్కడే తిరుగుతూ ఉండేది. గోడకి వేళ్లాడుతున్నట్టు, ఎగురుతున్నట్టు, కుర్చీలో కూర్చున్నట్టు ఎందరికో కనిపిస్తూ ఉండేది. అయితే కనిపించి మాయమయ్యేది తప్ప ఎవరికీ కీడు చేసేది కాదు. కానీ అల్లరి పనులు చేసేది. లైట్లు ఆర్పేసేది. బ్యానర్లవీ లాగి పారేసేది. మేకప్ సామాన్లు, ఇతరత్రా చిన్న చిన్న వస్తువులు కనిపించకుండా చేసి తిప్పలు పెట్టేది. స్వతహాగా ఆలివ్ చాలా తుంటరిది. ఎప్పుడూ సందడి చేస్తూ, అందరినీ ఆట పట్టిస్తూ ఉండేది. చనిపోయిన తర్వాత కూడా అలాగే చేస్తోందని అనుకున్నారంతా. అయితే ఎవ్వరూ ఎప్పుడూ ఆలివ్‌ని ద్వేషించలేదు. దానికి కారణం... ఆమె అంటే ఉన్న అభిమానం, పాతికేళ్ల చిన్న వయసులోనే అకారణంగా చనిపోయిందన్న జాలి. ఇప్పటికీ ఆలివ్ ఆత్మ ఆమ్స్టర్డామ్ థియేటర్లోనే ఉందని అంటూ ఉంటారు. ఆత్మగా మారి అక్కడే సంచరిస్తోందంటే... ఆలివ్ అసంతృప్తితో ఉందా? అంటే, ఆమె మరణం వెనుక ఏదైనా మిస్టరీ ఉందా? ఏమో... అది ఆలివ్కే తెలియాలి! ఆలివ్ థామస్ ఆలివ్ ఆత్మ వల్ల చిన్న చిన్న ఇబ్బందులు తప్ప, చెప్పుకోదగ్గ కష్టనష్టాలు ఎప్పుడూ కలగలేదని థియేటర్ నిర్వాహకులు చెబుతుంటారు. అయితే ప్రేమకథలను ప్రదర్శించినప్పుడు... స్త్రీ పాత్ర కనుక వంచనకు గురై, ఆవేదనతో డైలాగ్స్ చెబుతుంటే... ఆలివ్ ఎక్కువ రియాక్ట్ అయ్యేదట. ఎలాగోలా నాటకాన్ని డిస్టర్బ్ చేసేందుకు ప్రయత్నించేదట. కానీ ఇంతకు ముందులా ఇప్పుడు ఆలివ్ ఎవరినీ డిస్టర్బ్ చేయడం లేదని కూడా అంటున్నారు. దానికి కారణం... థియేటర్లో ఒకచోట ఆమె ఫొటోను పెట్టారు. ప్రతిరోజూ అక్కడ ప్రార్థన చేస్తారు. రాత్రి వెళ్లేముందు ప్రతి ఒక్కరూ ‘గుట్ నైట్ ఆలివ్’ అని చెప్పి వెళ్తూ ఉంటారు. అందువల్లే ఆమె తమ జోలికి రావడం లేదట!