అవోకాడో, ఆలివ్ రెండూ ఆరోగ్య ప్రయోజనాలకు ప్రసిద్ధిగాంచినవే. ఇవి రెండు కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరచడం, వాపును తగ్గించడం పరంగా గుండె ఆరోగ్యానికి మేలు చేసేవే. అయితే ఈ రెండింటిలో ఏది బెస్ట్ అని ప్రత్యేకంగా చెప్పాలంటే..వాటికి ప్రత్యేక పోషక విలువల ఆధారంగా వెల్లడించాల్సి ఉంటుందని చెబుతున్నారు నిపుణులు.
పోషకాల పరంగా రెండిటిలోనూ వేర్వేరు ప్రత్యేక పోషకాల ప్రొఫైల్‌ని కలిగి ఉంటాయి. అవేంటో సవివరంగా చూద్దాం..
కొవ్వుల పరంగా చూస్తే..
రెండు నూనెల్లో ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉన్నాయి. ఇవి చెడు కొలెస్ట్రాల్ (ఎల్‌డీఎల్)ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్)ని పెంచి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. అవోకాడో నూనె కంటే ఆలివ్ నూనెలో మోనోశాచురేటెడ్ కొవ్వులలో కొంచెం ఎక్కువగా ఉంటాయి. ఈ కొవ్వులు వాపును తగ్గిస్తాయి. పైగా హృదయనాళ పనితీరును మెరుగుపరుస్తాయి. అయితే అవోకాడో నూనె కూడా గుండెకి సంబంధించిన ఆరోగ్యకరమైన కొవ్వుల మూలం. పైగా ఎక్కువ పాలీ అన్‌శాచురేటెడ్ కొవ్వులను (మంచి ఒమేగా-6 కొవ్వులు) కలిగి ఉంది. అలా అని అధిక మొత్తంలో తీసుకుంటే మంటను కలిగించే అవకాశం ఉన్నందున అవకాడోని మితంగా తీసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు.
యాంటీఆక్సిడెంట్లు, పోషక సాంద్రత
ఆలివ్ ఆయిల్‌లోని పాలీఫెనాల్స్ కణాలు ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షిస్తుంది. మెరుగైన గుండె ఆరోగ్యం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అవకాడో నూనెలో తక్కువ పాలీఫెనాల్స్ ఉన్నప్పటికీ, ఇందులో విటమిన్ ఈ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యానికి తోడ్పడటమే గాక శక్తిమంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. రెండు నూనెలు ఆరోగ్యాన్ని పెంపొందించే ప్రయోజనకరమైన మొక్కల సమ్మేళనాలను కూడా కలిగి ఉంటాయి. అందువల్ల ఆలివ్ ఆయిల్ అధిక ప్రాముఖ్యత ఇవ్వక తప్పదని చెబుతున్నారు నిపుణులు.
వంట పరంగా..
అవోకాడో నూనెలో ఆలివ్ నూనె కంటే ఎక్కువ స్మోక్ పాయింట్ ఉంటుంది. ఇది వేయించడానికి లేదా గ్రిల్ చేయడం వంటి అధిక వేడి వంటలక అనుకూలం. ఆలివ్ నూనె తక్కువ వేడి వంటకు లేదా సలాడ్‌లు, డిప్‌లలో ఫినిషింగ్ ఆయిల్‌గా బాగా సరిపోతుంది. రెండు నూనెలు వేడిలో స్థిరంగా ఉన్నప్పటికీ, అవోకాడో నూనె అధిక వేడి వంట కోసం ఉపయోగించినప్పుడు దానిలో పోషకాలను బాగా నిలుపుకుంటుంది. ఈ విధంగా చూస్తే అవోకాడో నూనె ఎక్కువ ఉష్ణోగ్రతను తట్టుకునే సామర్థ్యం కారణంగా ఇదే బెస్ట్ అని చెప్పొచ్చు.
రుచికి..
ఆలివ్ నూనె అదనపు పచ్చి కొంచెం చేదుతో ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది. ఇది సలాడ్‌లు, డ్రెస్సింగ్‌లు, మధ్యధరా వంటకాల రుచిని పెంచుతుంది. అవోకాడో నూనె దీనికి విరుద్ధంగా తేలికపాటి తటస్థ రుచిని కలిగి ఉంటుంది. ఇది వంటల రుచిని మారకూడదంటే ఇది బెస్ట్.
అవకాడో ఆయిల్, ఆలివ్ ఆయిల్ రెండూ అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఆలివ్ నూనెలోని అధిక యాంటీఆక్సిడెంట్ కంటెంట్ గుండె ఆరోగ్యానికి ది బెస్ట్‌గా చెప్పొచ్చు. పైగా తక్కువ వేడి వంటకు అనువైనది. అవోకాడో నూనె అధిక వేడి వంటలకు సరైన ఎంపిక. అలాగే చర్మ సంరక్షణ కోసం విటమిన్ 'ఈ'ని అందిస్తుంది. రెండింటిని జీవన విధానంలో భాగం చేసుకోండి కానీ గుండె ఆరోగ్య రీత్యా ఆలివ్ ఆయిల్‌కి అధిక ప్రాధాన్యత ఇవ్వవల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు.
(చదవండి: మెటాస్టాటిక్ బ్రెస్ట్ కేన్సర్ రోగులు మానసిక ఆరోగ్యం కోసం ఏం చేయాలంటే..?)
Comments
Please login to add a commentAdd a comment