Olympic Council
-
ఆసియా క్రీడల్లో మళ్లీ క్రికెట్
బ్యాంకాక్: ఆసియా క్రీడల్లో మళ్లీ క్రికెట్‌కు చోటు దక్కనుంది. 2022లో చైనాలోని హాంగ్జౌలో జరిగే క్రీడల్లో క్రికెట్‌ను ఆడించాలని ఆసియా ఒలింపిక్ మండలి (ఓసీఏ) నిర్ణయించింది. అలాగే ఆస్ట్రేలియాకు ఆసియా క్రీడల్లో అవకాశం కల్పించేందుకు సిద్ధమైంది. 2010, 2014 ఆసియా గేమ్స్‌లో టి20 ఫార్మాట్లో క్రికెట్ క్రీడను ఆడించారు. కానీ గతేడాది ఇండోనేసియాలో జరిగిన క్రీడల్లో మాత్రం ఈ ఆటను తొలగించారు. రెండు సార్లు క్రికెట్ ఆడించినా భారత్ మాత్రం బరిలోకి దిగలేదు. స్వతంత్రంగా ఉండాలనుకునే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)... భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) గొడుగు కిందకు వచ్చేందుకు నిరాకరిస్తూ... ఆసియా గేమ్స్‌కు దూరంగా ఉంది. ఆసియా ఒలింపిక్స్ మండలి తాజా నిర్ణయాన్ని ఐఓఏ స్వాగతించింది. వచ్చే క్రీడల్లో టీమిండియా ఆడేలా ఒప్పించేందుకు ప్రయత్నిస్తామని ఐఓఏ కార్యదర్శి రాజీవ్ మెహతా తెలిపారు. మరోవైపు బీసీసీఐ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘2022 గేమ్స్‌కు చాలా సమయం ఉంది. ముందు చర్చించి, ఆ తర్వాత ఏ నిర్ణయమైనా తీసుకుంటాం’ అని అన్నారు. -
బోటింగ్ శిక్షణ అకాడమీ ఏర్పాటుకు కృషి
ఒలంపిక్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేసీ పవన్‌కుమార్‌రెడ్డి గార్లదిన్నె: మండల పరిధిలోని మిడ్‌పెన్నార్ (ఎంపీఆర్‌డ్యాం)లో బోటింగ్ శిక్షణ అకాడమి ఏర్పాటుకు కృషి చేస్తామని ఒలంపిక్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేసీ పవన్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మిడ్‌పెన్నార్ డ్యాంను జేసీ పవన్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా యన మాట్లాడుతూ డ్యాం పరిసర ప్రాంతాల్లో దాదాపు 200 బెస్త కుటుం బాలు ఉన్నాయని, వీరికి బోటింగ్‌పై శిక్షణ ఎంతో అవసరమన్నారు. క్రీడల పట్ల ఉత్సాహంగా ఉన్న ప్రతి ఒక్కరికి బోటింగ్‌పై శిక్షణ ఇచ్చే విధంగా భ విష్యత్తులో ఇంటర్నేషనల్ కోచ్ ఆధ్వర్యంలో బోటింగ్ శిక్షణ అకాడమిని ఏ ర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కెనాయింగ్ రాష్ట్ర అధ్యక్షులు వినిల్‌రెడ్డి, ఉపాధ్యక్షులు రాజశేఖర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు రవి ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు.