బోటింగ్‌ శిక్షణ అకాడమీ ఏర్పాటుకు కృషి | Boating effort to establish the training academy | Sakshi
Sakshi News home page

బోటింగ్‌ శిక్షణ అకాడమీ ఏర్పాటుకు కృషి

Published Mon, Sep 19 2016 11:32 PM | Last Updated on Wed, Apr 3 2019 5:26 PM

బోటింగ్‌ శిక్షణ అకాడమీ ఏర్పాటుకు కృషి - Sakshi

బోటింగ్‌ శిక్షణ అకాడమీ ఏర్పాటుకు కృషి

  • ఒలంపిక్‌ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేసీ పవన్‌కుమార్‌రెడ్డి
  • గార్లదిన్నె: మండల పరిధిలోని మిడ్‌పెన్నార్‌ (ఎంపీఆర్‌డ్యాం)లో బోటింగ్‌ శిక్షణ అకాడమి ఏర్పాటుకు కృషి చేస్తామని  ఒలంపిక్‌ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జేసీ పవన్‌కుమార్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని మిడ్‌పెన్నార్‌ డ్యాంను జేసీ పవన్‌కుమార్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా యన మాట్లాడుతూ డ్యాం పరిసర ప్రాంతాల్లో దాదాపు 200 బెస్త కుటుం బాలు ఉన్నాయని, వీరికి బోటింగ్‌పై శిక్షణ ఎంతో అవసరమన్నారు.  క్రీడల పట్ల ఉత్సాహంగా ఉన్న ప్రతి ఒక్కరికి బోటింగ్‌పై శిక్షణ ఇచ్చే విధంగా భ విష్యత్తులో ఇంటర్నేషనల్‌ కోచ్‌ ఆధ్వర్యంలో బోటింగ్‌ శిక్షణ అకాడమిని ఏ ర్పాటు చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు.  ఈ కార్యక్రమంలో కెనాయింగ్‌ రాష్ట్ర అధ్యక్షులు వినిల్‌రెడ్డి, ఉపాధ్యక్షులు రాజశేఖర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షులు రవి ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షులు సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

     

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement