oneday match
-
తొలి వన్డే సెంచరీ సాధించడానికి సచిన్ ఎన్ని మ్యాచ్‌లు ఆడాడో తెలుసా?
Sachin Tendulkar Maiden ODI Century: సచిన్ టెండూల్కర్ ఇది పేరు మాత్రమే కాదు.. ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఓ బ్రాండ్.. కోట్లాది మంది భారతీయ క్రికెట్ అభిమానుల గుండె చప్పుడు. ఇక క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ మొదటి వన్డే సెంచరీ సాధించి గురువారానికి ఇరవై ఏడేళ్లు పూర్తయ్యాయి. మరి.. అంతర్జాతీయ క్రికెట్లో వంద సెంచరీలు సాధించిన లిటిల్ మాస్టర్‌కు తన మెదటి వన్డే సెంచరీ సాధించడానికి ఎంతకాలం పట్టిందో తెలుసా..? 1989లో అంతర్జాతీయ క్రికెట్లో టెండూల్కర్ అరంగేట్రం చేశాడు. తన మెదటి వన్డే సెంచరీ సాధించడానికి దాదాపు ఐదు సంవత్సరాలు పట్టింది. 1994, సెప్టెంబర్ 9 న సచిన్ ఆస్ట్రేలియాపై తొలి వన్డే సెంచరీ సాధించాడు. ఇందుకోసం అతడు 79 మ్యాచ్‌లు ఆడాల్సి వచ్చింది. సచిన్ 130 బంతుల్లో 110 పరుగులు చేసి భారత్‌కు ఘన విజయం అందించాడు. అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లో తొలి డబుల్ సెంచరీ: 2010 ఫిబ్రవరి 24న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో సచిన్ 200 పరుగులు సాధించి వన్డేల్లో డబుల్ సెంచరీ సాధించిన తొలి క్రికెటర్‌గా కొత్త రికార్డు సృష్టించాడు. అలాగే 2010 డిసెంబర్ 19 న దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టులో తన 50వ సెంచరి పూర్తి చేసి టెస్టుల్లో మరే మైలురాయిని అధిరోహించాడు. భారత రత్న పొందిన తొలి క్రీడాకారుడు సచిన్.. 16 నవంబర్ 2013 నాడు తన 200వ టెస్ట్ మ్యాచ్ పూర్తి చేసి, అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన సందర్భంలో భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారత రత్న ప్రకటించింది. ఈ విధంగా ఈ అవార్డును పొందిన ప్రథమ క్రీడాకారుడడిగామరో రికార్డు నెలకొల్పాడు సచిన్ టెండూల్కర్. తండ్రి మరణం: 1999 ప్రపంచ కప్ పోటీలో ఉండగా సచిన్ తండ్రి రమేష్ టెండుల్కర్ ఆకస్మాత్తుగా మృతిచెందారు. తండ్రి అంత్యక్రియల కొరకు భారత్ రావడంతో జింబాబ్వేతో ఆడే మ్యాచ్‌కు దూరమయ్యాడు. వెంటనే మళ్ళీ ప్రపంచ కప్ పోటీలకు హాజరై కెన్యాపై బ్రిస్టన్లో జరిగిన మ్యాచ్ లో 101 బంతుల్లోనే 140 పరుగులు చేశాడు. ఈ శతకం తన తండ్రికి అంకితం ఇచ్చాడు. చదవండి: Hardik Pandya: అనుకోకుండా ఆల్‌రౌండర్ అయ్యాను.. అది నా అదృష్టం #OnThisDay in 1994 - Batting great @sachin_rt scored his first ODI hundred. Relive the magic - DD SPORTS#Legend #SRT pic.twitter.com/hgvSm42yKK — BCCI (@BCCI) September 9, 2019 -
రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలుపు
కొలంబో: వర్షం అంతరాయం కలిగించిన రెండో వన్డేలో దక్షిణాఫ్రికా డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 67 పరుగుల తేడాతో శ్రీలంకపై నెగ్గి మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1–1తో సమం చేసింది. తొలుత సఫారీ జట్టు 47 ఓవర్లలో 6 వికెట్లకు 283 పరుగులు చేసింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ జేన్‌మన్ మలాన్ (135 బంతుల్లో 121; 9 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీ చేశాడు. హెండ్రిక్స్ (51; 5 ఫోర్లు) రాణించాడు. వర్షం కారణంగా శ్రీలంక లక్ష్యాన్ని 41 ఓవర్లకు 265 పరుగులుగా కుదించారు. ఛేదనలో లంక 36.4 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది. చరిత్ అసలంక (77; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించాడు. షమ్సీ 5 వికెట్ల శ్రీలంకను కట్టడి చేశాడు. చదవండి: BAN Vs NZ: వార్నీ ఇదేం డెలివరీ.. నోరెళ్లబెట్టిన బ్యాట్స్‌మన్ -
రుతురాజ్ 187 నాటౌట్
బెల్గామ్: ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (136 బంతుల్లో 187 నాటౌట్; 26 ఫోర్లు, 2 సిక్స్‌లు) తన కెరీర్లోనే గొప్ప ఇన్నింగ్స్ ఆడటంతో... శ్రీలంక ‘ఎ’తో గురువారం జరిగిన తొలి అనధికారిక వన్డే మ్యాచ్‌లో భారత్ ‘ఎ’ 48 పరుగుల తేడాతో గెలిచింది. వర్షం కారణంగా 42 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్ ‘ఎ’ నాలుగు వికెట్లకు 317 పరుగులు చేసింది. రుతురాజ్ రెండో వికెట్‌కు అన్మోల్ప్రీత్ సింగ్ (67 బంతుల్లో 65; 6 ఫోర్లు)తో కలిసి 163 పరుగులు... మూడో వికెట్‌కు ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 45; 4 ఫోర్లు, సిక్స్)తో కలిసి 99 పరుగులు జోడించాడు. అనంతరం 318 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక ‘ఎ’ 42 ఓవర్లలో ఆరు వికెట్లకు 269 పరుగులు చేసి ఓడిపోయింది. షెహాన్ జయసూర్య (120 బంతుల్లో 108 నాటౌట్; 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అజేయ సెంచరీ చేసినా ఫలితం లేకపోయింది. భారత ‘ఎ’ బౌలర్లలో మయాంక్ మార్కండే రెండు వికెట్లు తీసుకున్నాడు. రుతురాజ్ గైక్వాడ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో భారత్ 1–0తో ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో వన్డే ఇదే వేదికపై శనివారం జరుగుతుంది. -
‘ఆసియా’ సమరం
చాన్నాళ్ల తర్వాత వన్డే సమరం... అందులోనూ తటస్థ వేదికపై! రెండు చిన్న జట్లు సహా బహుళ దేశాల ప్రాతినిధ్యం... ఉత్కంఠను పెంచే చిరకాల ప్రత్యర్థుల పోరు! నేటి నుంచే ఆసియా కప్! భారత్‌కు ఎంతగానో అచ్చొచ్చిన టోర్నీ! ...మరి ఎప్పటిలాగే టీమిండియా సత్తా చాటుతుందా? విజేతగా తిరిగొస్తుందా? దుబాయ్: ఆరు దేశాలు పాల్గొంటున్న ఆసియా కప్ వన్డే టోర్నీ దుబాయ్ వేదికగా శనివారం నుంచి ప్రారంభం కానుంది. 14వ సారి (గతంలో 12 సార్లు వన్డే, ఒకసారి టి20) నిర్వహిస్తున్న ఈ కప్ తొలి మ్యాచ్‌లో శ్రీలంకతో బంగ్లాదేశ్ తలపడనుంది. ఆరు సార్లు విజేత, డిఫెండింగ్ చాంపియన్ టీమిండియా తొలి మ్యాచ్‌ను అబుదాబిలో ఈ నెల 18న క్వాలిఫయర్ హాంకాంగ్‌తో ఆడనుంది. ఆ మరుసటి రోజే దాయాది పాకిస్తాన్‌తో కీలక సమరంలో రోహిత్ శర్మ బృందం అమీతుమీ తేల్చుకోనుంది. సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటన అనంతరం విరాట్ కోహ్లికి విశ్రాంతినివ్వడంతో ఓపెనర్ రోహిత్ శర్మ జట్టుకు సారథ్యం వహించనున్నాడు. ఎంతకాలంగానో అస్థిరంగా ఉన్న మిడిలార్డర్ సమస్యను పరిష్కరించుకునేందుకు, ప్రపంచ కప్ కూర్పుపై అంచనాకు వచ్చేందుకు మన జట్టుకు ఈ టోర్నీ ఓ అవకాశంగా నిలవనుంది. తద్వారా మాజీ కెప్టెన్ ధోని ఏ స్థానంలో బ్యాటింగ్‌కు రావాలన్న విషయమూ స్పష్టమవుతుంది. రెండు గ్రూపులుగా... టోర్నీలో జట్లను పూల్ ‘ఎ’ (భారత్, పాకిస్తాన్, హాంకాంగ్), పూల్ ‘బి’ (శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్)గా వర్గీకరించారు. తమ గ్రూపుల్లో 1, 2 స్థానాల్లో నిలిచిన జట్లే సూపర్ ఫోర్ దశలో ఆడాల్సి ఉంటుంది. దీని ప్రకారం భారత్, పాక్ వరుసగా రెండు మ్యాచ్‌ల్లో ఎదురుపడే అవకాశం ఉంది. సంచలనాలేమీ లేకుంటే ఫైనల్లోనూ ఈ రెండు జట్లే అమీతుమీ తేల్చుకునేందుకు బరిలో దిగొచ్చు. బంగ్లాను లంక ఆపగలదా? బంగ్లాదేశ్... కొంతకాలంగా వన్డేలు, టి20ల్లో రాణిస్తూ స్థాయిని పెంచుకుంటోంది. ఇదే సమయంలో శ్రీలంక ఆటతీరు దిగజారింది. ఇటీవలి నిదహాస్ ట్రోఫీలో సొంతగడ్డపైనే లంకకు బంగ్లా షాకిచ్చింది. బ్యాటింగ్‌లో తమీమ్ ఇక్బాల్, ముష్ఫికర్, మహ్మదుల్లా, లిటన్ దాస్, బౌలింగ్‌లో కెప్టెన్ మష్రఫె మొర్తజా, ముస్తాఫిజుర్, రూబెల్ హుస్సేన్‌లతో జట్టు పటిష్ఠంగా కనిపిస్తోంది. కీలక ఆల్‌రౌండర్ షకీబ్ హసన్‌కు తోడు, మెహదీ హసన్‌లతో స్పిన్ విభాగమూ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో శనివారం నాటి మ్యాచ్‌లోనూ మాథ్యూస్ సేనకు సవాలు తప్పదు. మరోవైపు లంక చండిమాల్ లేకుండానే బరిలో దిగుతోంది. పేసర్ లసిత్ మలింగ పునరాగమనం ఆశలు రేపుతోంది. కెప్టెన్ ఏంజెలో మాథ్యూస్, సీనియర్ ఓపెనర్ తరంగ, డిక్వెలా, కుశాల్ మెండిస్ బ్యాటింగ్‌లో మూలస్తంభాలు. కుశాల్, తిసారా పెరీరా ద్వయం రాణిస్తే గెలుపుపై భరోసా పెట్టుకోవచ్చు. అయితే, కొంత పేస్‌కు సహకరించే దుబాయ్ పిచ్‌లపై బంగ్లా పేస్ త్రయాన్ని ఎదుర్కొనడం క్లిష్టమే. షెడ్యూల్ మార్చకుండానే... భారత్ రెండు రోజుల్లో రెండు మ్యాచ్‌లు ఆడాల్సి రావడంతో టోర్నీ షెడ్యూల్‌పై గత నెలలో తీవ్ర విమర్శలు వచ్చాయి. హాంకాంగ్‌తో వన్డే ఆడి... విశ్రాంతి లేకుండా, మరుసటి రోజే పాకిస్తాన్ వంటి ప్రత్యర్థితో తలపడటం సరికాదని వ్యాఖ్యలు వచ్చాయి. అయినా, షెడ్యూల్లో మార్పులేమీ లేకుండానే టోర్నీ ప్రారంభమవుతోంది. ఆసియా కప్ టోర్నీలో 12 సార్లు పోటీపడ్డ టీమిండియా ఆరుసార్లు విజేతగా నిలిచింది. శ్రీలంక ఐదు సార్లు, పాక్ రెండు సార్లు గెలుచుకున్నాయి. -
ఈ సెంచరీ ప్రత్యేకమైనది
కేప్‌టౌన్: దక్షిణాఫ్రికాతో జరిగిన మూడోవన్డేలో సాధించిన అజేయ సెంచరీ చాలా ప్రత్యేకమని, ఇన్నింగ్స్ మొత్తం ఆటను వివిధ రకాలుగా మార్చుకుంటూ శతకం సాధించానని భారత కెప్టెన్ విరాట్ కోహ్లి అభిప్రాయపడ్డాడు. బుధవారం ప్రొటీస్‌తో జరిగిన వన్డేలో భారత్ 124 పరుగుల తేడాతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో మ్యాచ్ ముగిసిన అనంతరం మీడియాతో ముచ్చటించాడు. కేప్‌టౌన్ వికెట్ చాలా కష్టమైన వికెటని, ప్రత్యర్థి పదునైన బౌలింగ్‌ను ఎదుర్కొని శతకం బాదడం సంతృప్తిగా ఉందని పేర్కొన్నాడు. మ్యాచ్‌లో 30వ ఓవర్ అనంతరం వికెట్ స్లోగా మారిందని, ఆ సమయంలో భారత్ వికెట్లను కోల్పోవడంతో తాను సమయోచితగా ఆడాల్సి వచ్చిందని తెలిపాడు. ఇన్నింగ్స్ మొత్తం బ్యాటింగ్ చేయడం ఆనందంగా ఉందని, అయితే 90ల్లో ఉన్నప్పుడు కాస్తా నెర్వస్‌గా భావించానని పేర్కొన్నాడు. మరోవైపు తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు లేదా ఛేదనకు దిగినప్పుడు తన వ్యూహాలు వేర్వేరుగా ఉంటాయని చెప్పుకొచ్చాడు. మరోవైపు వరుసగా మూడు వన్డేల్లో నెగ్గి 3–0తో తిరుగులేని ఆధిక్యం సాధించిన తమజట్టు నిర్లిప్తంగా ఉండరాదని కోహ్లి సూచించాడు. జోహన్నెస్‌బర్గ్‌లో జరిగిన మూడోటెస్టు నుంచి తాము చాలా కష్టపడి ఆడామని, ఈక్రమంలో వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విజయం సాధించామని గుర్తు చేశాడు. జట్టు ప్రదర్శన గర్వకారణంగా ఉందని, అయితే ఇప్పటికి తాము సాధించాల్సింది చాలా ఉందని ఈ సందర్భంగా పేర్కొన్నాడు. సిరీస్‌లో మరో మూడుమ్యాచ్‌లు ఉన్నాయని, 6–0తో వైట్‌వాష్‌పై దృష్టిసారించాలని పరోక్షంగా జట్టుకు సూచించాడు. ప్రస్తుతానికి తాము సిరీస్ కోల్పోని దశకు చేరుకున్నామని, ఇది జట్టులో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంపొందిస్తుందని అభిప్రాయపడ్డాడు. నాలుగోవన్డేలో ప్రస్తుతానికి మించిన తీవ్రత, కోరికతో మైదానంలోకి అడుగుపెడతామని కోహ్లి పేర్కొన్నాడు. తీవ్రతే నా మంత్రం తీవ్రతే (ఇంటెన్సిటీ) తన బ్యాటింగ్ హాల్‌మార్కు అని, ఒకవేళ అది కోల్పోతే తనకేమీ తోచదని కోహ్లి పేర్కొన్నాడు. ఈ ఏడాది తను 30వ పడిలోకి ప్రవేశిస్తానని, మరో నాలుగైదేళ్లు ఇలాంటి ఇంటెన్సిటీతోనే ఆడతానని తెలిపాడు. ఈక్రమంలో తాను చాలా కఠోర శిక్షణ తీసుకున్నానని తెలిపాడు. తన ఆహారం పట్ల కఠినంగా ఉంటానని పేర్కొన్నాడు. ఇలాంటి విషయాలే తను రాణించాడని దోహదపడుతున్నాయని తెలిపాడు. జట్టుకు అవసరమైన సందర్భాల్లో రాణించడం చాలా ఆనందంగా ఉందని అభిప్రాయపడ్డాడు. బుధవారం వన్డేల్లో చేసిన సెంచరీతో వన్డేల్లో అత్యధిక సెంచరీలు (12)చేసిన భారత కెప్టెన్‌గా విరాట్ కోహ్లి నిలిచాడు. ఈక్రమంలో సౌరవ్ గంగూలీ (11)ని వెనక్కినెట్టాడు. కేప్‌టౌన్ వన్డే విజయంతో ఆరువన్డేల సిరీస్‌లో 3–0తో ఆధిక్యంలో నిలిచిన భారత్.. శనివారం జోహన్నెస్‌బర్గ్‌లో ప్రొటీస్‌తో నాలుగోవన్డే ఆడనుంది. చహల్, కుల్దీప్లపై ప్రణాళికల్ని సవరించుకోవాలి: డుమిని భారత స్పిన్నర్లు యజ్వేంద్ర చహల్, కుల్దీప్ యాదవ్‌లను ఎదుర్కోవడానికి తమజట్టు తాజాగా మళ్లీ ప్రణాళికల్ని రూపొందించాల్సిన అవసరముందని దక్షిణాఫ్రికా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ జేపీ డుమిని అభిప్రాయపడ్డాడు. పరిస్థితులకు తగినట్లుగా వీరిద్దరూ అద్భుతంగా బౌలింగ్ చేశారని, సరైన లైన్ అండ్ లెంగ్త్‌తో బంతులు విసిరి తమను కట్టడి చేశారని ప్రశంసించాడు. వారి గూగ్లీలకు తమవద్ద సమాధానం లేకపోయిందని, వారిపై రచించిన వ్యూహాలన్నీ పనికిరాకుండా పోయాయని పేర్కొన్నాడు. వన్డే సిరీస్‌లో తమ పని అయిపోలేదని, నాలుగోవన్డేకు ముందు తమజట్టు తీవ్రంగా ఆలోచించాల్సిన అవసరముందని తెలిపాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో తాము చక్కని భాగస్వామ్యం నమోదు చేశామని, అయితే కెప్టెన్ ఐదెన్ మార్క్రమ్ ఔటైన తర్వాత పరిస్థితి మారిందని చెప్పుకొచ్చాడు. సరైన భాగస్వామ్యాలు లేకపోవడమే సిరీస్‌లో తమ ఓటములకు కారణమని అంగీకరించాడు. మరోవైపు మూడోవన్డేలో సెంచరీ చేసిన కోహ్లిపై ప్రశంసలు కురిపించాడు. తను ప్రపంచ అత్యుత్తమ ఆటగాడని, తనను ఔట్ చేయాలంటే బౌలర్లు విభిన్నమైన వ్యూహాల్ని రూపొందించాల్సిన అవసరముందని పేర్కొన్నాడు. మరోవైపు నాలుగోవన్డేకు విధ్వంసక బ్యాట్స్‌మన్ ఏబీ డివిలియర్స్ అందుబాటులోకి రావడం తమ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుందని డుమిని అభిప్రాయపడ్డాడు. వన్డే క్రికెట్లో తనో అత్యుత్తమ ఆటగాడని, తన నాయకత్వ లక్షణాలు జట్టుకు ఎంతో విలువ తెస్తుందని డుమిని అభిప్రాయపడ్డాడు. కేప్‌టౌన్ వన్డేలో చహల్, కుల్దీప్లు చెరో నాలుగు వికెట్లతో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించిన సంగతి తెలిసిందే. ఈ సిరీస్‌లో వీరిద్దరూ కలిపి ఏకంగా 21 వికెట్లు తమ ఖాతాలో వేసుకున్నారు. ఈక్రమంలో 304 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ప్రొటీస్ 40 ఓవర్లలో 179 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే. -
తొలివన్డేలో భారత్ ఘన విజయం
-
భారత్ ఘన విజయం..!
డర్బన్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలివన్డేలో భారత్ ఆరు వికెట్ల తేడాతో విజయ దుంధుంబి మోగించింది. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 270 పరుగులు లక్ష్యాన్ని నిర్దేశించింది. తర్వాత బ్యాటింగ్‌కు వచ్చిన కోహ్లిసేన ఆరంభంలోనే ఓపనర్లు రోహిత్ శర్మ(20), ధావన్(35) వికెట్లను కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లి రహానేతో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. కోహ్లి తన కెరీర్లో 33వ సెంచరీని 106 బంతుల్లో పూర్తి చేశాడు. సెంచరీతో కదంతొక్కిన సారథి విరాట్ కోహ్లికి మ్యాచ్ ఆఫ్ ద మ్యాచ్ వరించింది. రహానే కూడా నెమ్మదిగా బౌండరీలు కొడుతూ క్రీజులో పుంజుకున్నాడు. రహానే(79) వ్యక్తిగత పరుగుల వద్ద ఫెలూక్వాయో వేసిన 43 ఓవర్లో మూడో వికెట్‌గా వెనుదిరిగాడు. తర్వాత అల్రౌండర్ హార్దిక్‌పాండ్యా కోహ్లితో జత కట్టాడు. విరాట్ తన అద్భుతమైన ఆట తీరుతో అందర్నీ అకట్టుకున్నాడు. కోహ్లి 112(119) వ్యక్తిగత పరుగుల వద్ద ఫెలూక్వాయో వేసిన 45 ఓవర్లోనే మూడో బంతికి రబడాకు క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. తర్వాత క్రీజులోకి వచ్చిన ధోని విన్నింగ్ షాట్ ఫోర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఇండియా నాలుగు వికెట్లు కోల్పోయి 45.3 ఓవర్లలో విజయలక్ష్యాన్ని ఛేదించింది. దక్షిణాఫ్రికాలో బౌలర్లలో ఫెలూక్వాయోకు రెండు వికెట్లు, మోర్నీ మోర్కెల్‌కు ఒక వికెట్ దక్కాయి. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్ ఎంచుకుంది. దాంతో ఇన్నింగ్స్‌ను డీకాక్, హషీమ్ ఆమ్లాలు ఆరంభించగా సఫారీలకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ ఆమ్లా(16) తొలి వికెట్‌గా పెవిలియన్ చేరి నిరాశపరిచాడు. బూమ్రా బౌలింగ్‌లో ఆమ్లా వికెట్ల ముందు దొరికిపోయాడు. ఆపై సఫారీ ఇన్నింగ్స్‌ను డీకాక్-డు ప్లెసిస్‌లు ముందుకు తీసుకెళ్లారు. అయితే జట్టు స్కోరు 83 పరుగుల వద్ద డీకాక్(34) రెండో వికెట్‌గా అవుయ్యాడు. అటు తరువాత మర్క్రామ్(9), డుమినీ(12), మిల్లర్(7)లు స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు చేరడంతో దక్షిణాఫ్రికా 134 పరుగుల వద్ద ఐదో వికెట్‌ను నష్టపోయింది. ఆ తరుణంలో క్రిస్ మోరిస్-డు ప్లెసిస్ జోడి ఇన్నింగ్స్ మరమ్మత్తులు చేపట్టింది. ఈ జంట 74 పరుగులు జోడించడంతో సఫారీలు రెండొందల మార్కును చేరారు. మోరిస్(37) ఆరో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. కాగా, టెయిలెండర్ ఫెలూక్వాయో(27) సాయంతో డు ప్లెసిస్ సమయోచిత ఇన్నింగ్ ఆడి సెంచరీ చేశాడు. దాంతో దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. భారత్ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ మూడు వికెట్లు సాధించగా, చాహల్ రెండు వికెట్లు తీశాడు. ఇక బూమ్రా, భువనేశ్వర్‌లకు తలో వికెట్ దక్కింది. -
ఎట్టకేలకు గెలిచిన ఆస్ట్రేలియా
సాక్షి, స్పోర్ట్స్: అడిలైడ్‌లో జరిగిన నాలుగో వన్డే మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట బ్యాటింగ్ చేపట్టిన ఇంగ్లాండ్ 44.5 ఓవర్లలో 196 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో 8 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లోకి వెళ్లింది. వన్డేల్లో మరో అత్యల్ప స్కోరు నమోదవుతుందా అని అనిపించింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్, ఆల్‌రౌండర్ మహ్మద్ అలీ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. జట్టు స్కోరు 61 పరుగుల వద్ద మోర్గాన్(33), 112 పరుగుల వద్ద అలీ అవుటయ్యారు. మోర్గాన్ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన బౌలింగ్ ఆల్‌రౌండర్ క్రిస్ వోక్స్ బాధ్యతాయుతంగా ఆడటంతో ఆ మాత్రం స్కోరు చేయగలింది. జట్టు స్కోరు 180 పరుగుల వద్ద వోక్స్(78, నాలుగు ఫోర్లు, ఐదు సిక్స్‌లు) అవుటయ్యాడు. చివర్లో కుర్రాన్(35) రాణించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో కమిన్స్‌కు 4, హజల్‌వుడ్‌కు 3, ఆండ్రూ టైకు 3 వికెట్లు దక్కాయి. అనంతరం స్వల్ప లక్ష్యంలోబ్యాటింగ్ చేపట్టిన ఆస్ట్రేలియాకు విజయం సాధించడానికి కష్ట పడాల్సి వచ్చింది. ఆస్ట్రేలియా బ్యాట్స్మన్లలో టిమ్ హెడ్(96), మిచెల్ మార్ష్(32), టిమ్ పెయిన్(25) రాణించారు. 37 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించారు. ఇంగ్లాండ్ బౌలర్లలో ఆదిల్ రషీద్‌కు 3 వికెట్లు దక్కాయి. బౌలింగ్‌లో 4 వికెట్లు తీసి ఇంగ్లాండ్ పతనాన్ని శాసించిన ప్యాట్ కమిన్స్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. మొదటి మూడు వన్డేలు ఇంగ్లాండ్ గెలిచిన విషయం తెల్సిందే. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ మధ్య చివరిదైన ఐదవ వన్డే ఈ నెల 28న పెర్త్‌లో జరుగనుంది. -
విండీస్‌పై రహానే శతకం..
► హాఫ్ సెంచరీతో మెరిసిన ధావన్ ట్రినిడాడ్: భారత్- వెస్టిండీస్ రెండో వన్డేలో టీంఇండియా ఓపెనర్ అజింక్యా రహానే శతకం సాధించాడు. గత కొద్ది రోజులుగా నిలకడలేమి ఆటతో సతమతవుతున్న రహానే ఎట్టకేలకు శతకం బాది తన సత్తా చాటాడు. గత చాంపియన్స్ ట్రోఫీలో రహానే నిలకడలేమి ఆటతో బెంచ్‌కే పరిమితమైన విషయం తెలిసిందే. విండీస్‌తో జరిగిన తొలి వన్డేలో కూడా రహానే అర్ధశతకం సాధించాడు. కానీ ఈ మ్యాచ్ వర్షంతో రద్దయింది. అయితే ఈ మ్యాచ్‌కు ముందు కూడా వర్షం ఆటంకం కలిగించడంతో అంపైర్లు మ్యాచ్‌ను 43 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు శిఖర్ ధావన్, అజింక్యా రహానేలు మంచి శుభారంబాన్ని అందించారు. వీరి దూకుడుకు భారత్ పవర్ ప్లే ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. ఈ తరుణంలో 49 బంతుల్లో ధావన్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అనంతరం దూకుడుగా ఆడే ప్రయత్నంలో ధావన్(63) అష్లే నర్స్ బౌలింగ్‌లో స్టంప్ అవుటయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ కోహ్లీతో రహానే ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. రహానే 56 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. తర్వాత మరింత దూకుడు పెంచిన రహానే 102 బంతుల్లో 10 ఫోర్లు, 2సిక్సర్లతో కెరీర్లో మూడో శతకం సాధించాడు. అనంతరమే క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఇక మ్యాచ్ ఫినీషర్ హర్డీక్ పాండ్యా(4) తీవ్రంగా నిరాశ పరిచాడు. మరో వైపు కెప్టెన్ కోహ్లీ(43), యువరాజ్ సింగ్(0) క్రీజులో ఉన్నారు. భారత్ 35 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 223 పరుగులు చేసింది.