ఏఓసీ సెంటర్‌పై ఆర్మీ గెలుపు
ఆలిండియా ఇన్విటేషన్ బాస్కెట్‌బాల్ టోర్నీ
ఎల్బీ స్టేడియం, న్యూస్‌లైన్: ఆలిండియా ఇన్విటేషన్ బాస్కెట్‌బాల్ టోర్నమెంట్లో పురుషుల విభాగంలో ఆర్మీ, ఓఎన్జీసీ జట్ల హవా కొనసాగుతోంది. నారాయణగూడలోని వైఎంసీఏ బాస్కెట్‌బాల్ కోర్టులో శుక్రవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఆర్మీ జట్టు 72-46 పాయింట్ల తేడాతో సికింద్రాబాద్ ఏఓసీ సెంటర్ జట్టుపై విజయం సాధించింది. దీంతో ఆడిన నాలుగు మ్యాచ్‌లకుగాను ఆర్మీ జట్టు మూడింట్లో గెలుపొంది.. ఏడు పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది.
ఓఎన్జీసీ జట్టు ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గి ఆరు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఆర్మీ జట్టులో రమేష్ కుమార్ 20, సౌమ్యా రంజన్18, శశి 12 చొప్పున పాయింట్లు చేశారు. ఏఓసీ సెంటర్ జట్టులో జలీల్ 15, ఇర్ఫాన్ 15, సంజయ్ 10 పాయింట్లు చేశారు. ఇక మరో లీగ్ మ్యాచ్‌లో ఓఎన్జీసీ జట్టు 87-66తో కేఎస్ఈబీ జట్టుపై గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో ఏఓసీ సెంటర్ 84-73తో హైదరాబాద్ వైఎంసీఏపై, ఆర్మీ గ్రీన్ 79-55తో ఆర్‌సీఎఫ్‌పై నెగ్గాయి.