కౌలాస్‌నాలాలో పెరుగుతున్న నీటి మట్టం
జుక్కల్ : మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్ట్‌కు ఎగువ నుంచి వరద నీరు వచ్చి చేరుతుండడంతో ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరువలో ఉంది. గురువారం రాత్రి ఎడతెరపి లేకుండా వర్షాలు కురవడంతో శుక్రవారం ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 1200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోందని ప్రాజెక్టు జేఈ గజానన్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 458 మీటర్లు కాగా 456 మీటర్లకు చేరింది. గత రెండు రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో ప్రాజెక్ట్ నిండి దశకు చేరిందన్నారు. మరో రెండు మీటర్ల నీరు వచ్చి చేరితే గేట్లు ఎత్తివేస్తామని తెలిపారు. ప్రాజెక్ట్ దిగువ భాగంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కాల్వల పరిసర ప్రాంతాల్లోని రైతులు తమ పశువులు కాల్వలకు వెళ్లకుండా చూడాలన్నారు.