onion market
-
రైతుల్లో ‘ఈ–నామ్’ సంతోషం
ఒకప్పుడు..ఆరుగాలం కష్టించి పండించిన పంటను మార్కెట్‌కు తీసుకొస్తే వ్యాపారులు మోసం చేసేవారు. సిండికేట్‌గా ఏర్పడి తక్కువ ధరకు దిగుబడులను కొనుగోలు చేసేవారు. ఈ–నామ్ అమలుతో నేడు ఆ పరిస్థితిలో మార్పు వచ్చింది. రహస్య టెండర్ల ద్వారా పంట కొనుగోళ్లు జరుగుతుండడంతో మంచి ధర లభిస్తోంది. రైతుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. కర్నూలు(అగ్రికల్చర్): దేశంలో ఎక్కడా లేని విధంగా కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఉల్లిని ఈ–నామ్ పోర్టల్‌లో టెండరు ద్వారా కోనుగోలు చేస్తున్నారు. మహారాష్ట్రలో ఉల్లి మార్కెట్లు ఉన్నాయి. అలాగే హైదరాబాద్ మలక్‌పేటలో ఉల్లి మార్కెట్ నడుస్తోంది. ఎక్కడా కూడా ఈ–నామ్ అమలు కావడం లేదు. దేశంలో మొట్టమొదటి సారిగా ఉల్లిని ఈ–నామ్లో కొనుగోలు చేస్తున్న ఏకైక మార్కెట్ కర్నూలు కావడం విశేషం. అడ్డంకులను అధిగమించి.. ఈ–నామ్ అమలును మొదట్లో వ్యాపారులు, కమీషన్ ఏజెంట్లు వ్యతిరేకించారు. మార్కెట్ బంద్ చేసేంత వరకు పరిస్థితి వచ్చింది. అయితే దీని వల్ల ఎవ్వరికీ ఎటువంటి నష్టం ఉండబోదని మార్కెట్ కమిటీ అధికారులు అందరినీ ఒప్పించి ఆగస్టు 26వ తేదీన ఈ–నామ్‌కు శ్రీకారం చుట్టారు. ఇప్పటి వరకు రూ.22.16 కోట్ల విలువ చేసే 1.36 లక్షల క్వింటాళ్ల ఉల్లిని కొనుగోలు చేశారు. నాడు ఈ పద్ధతిని వ్యతిరేకించిన వారు నేడు జై కొడుతున్నారు. రహస్య టెండర్ విధానంలో.. కర్నూలు వ్యవసాయ మార్కెట్ యార్డులో గతంలో ఉల్లిని వేలంపాట ద్వారా కొనుగోలు చేసే వారు. ఈ సమయంలో వ్యాపారులు మంచి లాట్ల దగ్గర సిండికేట్ అయ్యేవారనే విమర్శలు ఉన్నాయి. వ్యాపారులు సిండికేట్ అయి ధరలను అణచివేస్తున్నారని పలుసార్లు రైతులు రోడెక్కి ఆందోళనలు నిర్వహించారు. దీనిని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఈ–నామ్ అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ విధానంలో ఆన్లైన్లో రహస్య టెండరు విధానంలో ధర కోట్ చేస్తారు. దీంతో వ్యాపారులు సిండికేట్ అయ్యే అవకాశం లేదు. ఫలితంగా ఉల్లికి మంచి ధర లభిస్తోంది. వంద శాతం అమలు.. దేశ వ్యాప్తంగా ఒకే మార్కెట్ నినాదంతో కేంద్ర ప్రభుత్వం ఈ–నామ్ అమలు చేస్తోంది. జిల్లాలో కర్నూలు, ఎమ్మిగనూరు, ఆదోని మార్కెట్ కమిటీల్లోనే వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాలు జరుగుతున్నాయి. ఇటీవలి వరకు ఉల్లి మినహా అన్ని పంటలను ఈ–నామ్ పోర్టల్‌లోనే కొనుగోలు చేస్తూ వచ్చారు. ఉల్లిని కూడా ఈ విధానంలోకి తేవడంతో 100 శాతం ఈ–నామ్‌ను అమలు చేసినట్లు అయ్యింది. మెరుగ్గా ధరలు.. కర్నూలు మార్కెట్లో ఈ–నామ్ అమలు చేయడం మొదలు పెట్టిన తర్వాత తాడేపల్లిగూడెం కంటే ఇక్కడే ధరలు మెరుగ్గా ఉంటున్నాయి. క్వింటానికి రూ.200 నుంచి రూ.400 వరకు ఎక్కువ ధర లభిస్తోంది. ఇక్కడే మంచి ధర లభిస్తుండటంతో రైతులు తీవ్ర వ్యయ ప్రయాసలకు ఓర్చి తాడేపల్లిగూడేనికి వెళ్లడం లేదు. కర్నూలు మార్కెట్లోనే ఉల్లి అమ్ముకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు ఎక్కువే.. జిల్లాలో 90 వేల ఎకరాల్లో ఉల్లి సాగవుతోంది. సగటున ఎకరాకు 40 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. ఈ ప్రకారం ఏటా 36 లక్షల క్వింటాళ్ల ఉల్లి జిల్లాలో పండుతోంది. ఇందులో 20 శాతం వరకు తాడేపల్లిగూడేనికి వెళ్తోంది. మరో 30 శాతం రైతులు పొలం దగ్గరే అమ్ముకుంటున్నారు. 50 శాతం కర్నూలు మార్కెట్‌కు వస్తోంది. ఈ–నామ్ అమలు చేసిన తర్వాత తాడేపల్లిగూడేనికి తగ్గుముఖం పడుతోంది. కర్నూలు మార్కెట్‌కు ప్రతి రోజూ 1,550 క్వింటాళ్ల ఉల్లి వస్తోంది. తెచ్చిన రోజునే దిగుబడిని అమ్ముకొని రైతులు సంతోషంతో ఇంటికి వెళ్తున్నారు. వ్యాపారుల మధ్య పోటీ పెరిగింది గతంలో వేలంపాట నిర్వహించే సమయంలో వ్యాపారులు మంచి లాట్ల దగ్గర సిండికేట్ అయ్యేవారు. ఈ–నామ్ వచ్చిన తర్వాత ఆన్లైన్లో రహస్య పద్ధతిలో కొనుగోలు చేపట్టిన తర్వాత వ్యాపారుల మధ్య పోటీ కనిపిస్తోంది. మార్కెట్‌కు నేను 22 క్వింటాళ్ల ఉల్లి తీసుకొచ్చాను. క్వింటా ధర రూ.2,511 పలికింది. – సుంకన్న, గోరంట్ల గ్రామం, కోడుమూరు మండలం వచ్చిన రోజే అమ్ముకున్నాం గతంలో కర్నూలు మార్కెట్ యార్డులో ఉల్లి అమ్ముకోవాలంటే తల ప్రాణం తోకకు వచ్చేది. కనీసం నాలుగు రోజుల సంయం పట్దేది. ఈ–నామ్ అమలు చేసిన తర్వాత పంట తెచ్చిన రోజునే అమ్ముకునే అవకాశం ఏర్పడింది. మార్కెట్‌కు 16 క్వింటాళ్ల ఉల్లి తెచ్చాను. నాణ్యత ఒక మోస్తరుగా ఉన్నా క్వింటాలుకు రూ.1,175 ప్రకారం ధర లభించింది. – మద్దిలేటి, ఏనుగుబాల, ఎమ్మిగనూరు మండలం పారదర్శకంగా కొనుగోళ్లు ఈ–నామ్లో వంద శాతం పారదర్శకంగా ఉల్లి కొనుగోళ్లు జరుగుతున్నాయి. మధ్యాహ్నం సమయానికి ధరలు ప్రకటిస్తున్నారు. వెంటనే కాటా వేయడం మొదలవుతుంది. సాయంత్రానికి రైతులు నగదు తీసుకొని వెళ్లిపోతున్నారు. రైతులకు ఇబ్బంది లేకుండా ఆన్లైన్లో వచ్చిన తక్‌పట్టీలను ప్రింట్ తీసి ఇస్తున్నాం. తాడేపల్లిగూడెంతో పోలిస్తే కర్నూలు మార్కెట్లోనే మంచి ధరలు లభిస్తున్నాయి. – జయలక్ష్మి, సెక్రటరీ,కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీ -
లసల్గావ్ మార్కెట్.. ఆనియన్ సీలింగ్‌ను బ్రేక్ చేసిన కార్యశాలి ఆమె!
లసల్గావ్.. అసియాలోనే అతి పెద్ద ఆనియన్ మార్కెట్. ఇది మహారాష్ట్రలో ఉంటుంది. సీజన్లో అక్కడ రోజూ ఉల్లిపాయల వేలం జరుగుతుంది. వ్యాపారులు మగవాళ్లే, దళారులు మగవాళ్లే, రైతులూ మగవాళ్లే. ఆడవాళ్లను ఆ దరిదాపుల్లోకి రానివ్వరు. అలాంటిది తొలిసారి.. ‘నా పాట...’ అంటూ ఒక మహిళ గొంతు వినిపించింది. అంతా తల తిప్పి చూశారు. ‘నా పేరు సాధన.. నా పాట ..’ అంటూ ఆమె వేలంలోకి దిగారు. అయితే మగవాళ్లంతా ఆ వేలాన్ని బహిష్కరించారు. ప్రభుత్వం సాధన వైపు నిలబడింది. సాధనకు వేలం సమకూరింది. గ్లాస్ కన్నా గట్టిదైన ఆ ఆనియన్ సీలింగ్‌ను బ్రేక్ చేసిన కార్యశాలిగా సాధనా యాదవ్ వార్తల్లోకి వచ్చారు. లసల్గావ్ ఉల్లి మార్కెట్లో శుక్రవారం హటాత్తుగా ఉల్లిపాయల వేలంపాట ఆగిపోయింది. ‘‘మేము పాడం’’ అని వ్యాపారులు పక్కకు వెళ్లిపోయారు. వాళ్లతోపాటు దళారీలు, వాళ్లతోపాటు కొద్దిమంది రైతులు! ‘ఆడవాళ్లను వేలంలోకి ఎలా రానిస్తారు?’ అని వాళ్ల అభ్యంతరం. అయితే ఆ మాటను వారు నేరుగా అనలేదు. ‘వేలానికి వచ్చిన ఆ ఆడ మనిషికి కమిటీలో సభ్యత్వం లేదు. తనను వెళ్లిపొమ్మనండి’ అన్నారు. వాళ్లన్న ఆ ఆడ మనిషి సాధనా జాదవ్. వాళ్లన్న ఆ కమిటీ ఏపీఎంసీ. అగ్రికల్చర్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ. సాధన అనే ఆ మహిళకు ఎపీఎంసీలో సభ్యత్వం లేని మాట నిజమే. అయితే ఉండాలన్న నిబంధన లేదు. సాధన అదే మాట అన్నారు. ‘‘వేలానికి ఎవరొచ్చినా, రాకున్నా మాకు అనవసరం. మేము పాటలోకి దిగుతున్నాం’’ అని చెప్పారు. లసల్గావ్ వేలంలో టన్నుల కొద్దీ ఉల్లిపాయల్ని కొనేసి తను వ్యాపారం చేసుకోడానికి సాధన అక్కడికి రాలేదు. ‘కృషి’ అనే వ్యవసాయ ఉత్పత్తుల మహిళా సహకార సంఘం తరఫున వచ్చారు. ఆమె వెనుక ‘కృషి’ ఉంది. ‘కృషి’ వెనుక నాఫెడ్ ఉంది. (నేషనల్ అగ్రికల్చరల్ కోపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా). ఎవరున్నా వెనక్కి వెళ్లాల్సిందే అని సాధనను, ఆమె వెంట ఉన్న మరొక మహిళను అక్కడి నుంచి తరిమేసినంత పని చేశారు. అయితే వేలంలో పాల్గొనడానికి సాధనకు అధికారికమైన అడ్డంకులేమీ లేవు. పాటకు వచ్చిన పురుషులు వచ్చారు. పాట సాగింది. సాధనకు పాట దక్కింది. ∙∙ గ్లాస్ సీలింగ్ అంటుంటాం కానీ.. లసల్గావ్ ఆనియన్ సీలింగ్ మహా దృఢమైనది. మగాళ్లంతా జట్టు కట్టినట్లుగా ఆడవాళ్లను వేలంలోకి రానివ్వరు. తక్కువకు పాడి ఎక్కువకు అమ్మేసుకోవాలని అంతా ఒకమాటపై ఉండే ఆ వేలం వలయంలో ఉండేదంతా పురుషులే. మహిళా రైతులు ఉన్నా వారి తరఫున పురుషులనే వేలంలో పాడనిస్తారు. అయితే గత గురువారం నుంచి ‘నాఫెడ్’ తరఫున ‘కృషి’ సంస్థ డైరెక్టర్ అయిన సాధన నేరుగా తనే వేలానికి వస్తున్నారు. పైగా నాఫెడ్‌కు కృషి నోడల్ ఏజెన్సీ. ‘అయితే మాత్రం..’ అని వేలానికి వచ్చిన పురుషులు గురువారం ఒక్కరోజే కాదు, శుక్రవారం, శనివారం కూడా సాధన వేలంలో పాల్గొన్నారు. వేలం ఎవరి ఆధ్వర్యంలో అయితే జరిగిందో ఆ ఎపీఎంసీకి ఛైర్పర్సన్ కూడా మహిళే. సువర్ణ జగ్దీప్. మహిళ కాబట్టి మహిళకు మద్దతు ఇవ్వడం కాదు.. సాధన అవసరమైన పత్రాలన్నీ చూపించారు. ఇక పురుషులు సాకులు చూపడానికి దారి లేకపోయింది. లసల్గావ్ మార్కెట్ కమిటీ పరిధిలోని 321 మంది కమీషన్ ఏజెంట్లలో 107 మంది, కమిటీలో పేరు నమోదు చేయించుకున్న 335 మంది వ్యాపారులలో 71 మంది మహిళలు ఉన్నప్పటికీ ఏనాడూ అక్కడి వారు మహిళల్ని వేలం లోకి రానివ్వలేదు. సాధననా యాదవ్ వల్ల మొదటిసారి ఆ ఆనియన్ సీలింగ్ బ్రేక్ అయింది. ఈ ఘటనతో అసలు లసల్గావ్ వేలంలో ఇంతకాలం ఏం జరుగుతున్నదీ మాధునీ ఖడ్సే అనే మహిళా రైతు ముందుకు వచ్చి చెప్పగలిగారు. సాధనా యదవ్ వేలంపాటలో మహిళా రైతులు, మహిళా వర్తకుల మాట చెల్లుబాటు కాకుండా ఉండేందుకు అవసరమై అన్ని అవాంతరాలను, అడ్డంకులను, అసౌకర్యాలను వేలంలో పాల్గొనడానికి వచ్చే పురుషులు సృష్టిస్తూ ఉంటారని మాధురి చెప్పారు. సాధనా యాదవ్ చొరవతో మొట్టమొదటి సారి మహిళల మాట నెగ్గిందని అన్నారు. తక్కువకు వేలాన్ని ముగించనివ్వకుండా, న్యాయంగా పాడి రైతుకు లాభం చేకూరుస్తారు కనుకనే మహిళలను లోపలికి రానివ్వరని కూడా ఆమె చెప్పారు. ‘‘ఏపీఎంసీ అధికారులు, వ్యాపారులు, దళారులు కుమ్మక్కయి ఈ పని చేస్తారు. ఇదేంటని ప్రశ్నించిన రైతు పంట వేలం వరకు రాకుండా వృథా కావలసిందే. మహిళలు ఇలాంటివి సాగనివ్వరు కనుకనే వాళ్లను దూరంగా ఉంచుతారు’’ అని అంటున్న సాధనా యాదవ్.. ‘‘ఇది ఒకరోజుతో ముగిసే పోరాటం కాదు. రైతుల తరఫున నిరంతరం ఒకరు ఉండాలి. మా సొసైటీ ఉంటుంది’’ అని ఆమె స్పష్టంగా చెబుతున్నారు. చదవండి: భారత్ బయోటెక్’కు సీఐఎస్ఎఫ్ భద్రత -
రేపటి నుంచి ఉల్లి కొనుగోళ్లు షురూ...
హైదరాబాద్ : మలక్‌పేట్ మార్కెట్ ఉల్లి వ్యాపారులతో అధికారుల చర్చలు సఫలమయ్యాయి. గురువారం మలక్‌పేట్ మహబూబ్‌మాన్షన్ మార్కెట్ వ్యాపారులతో మార్కెటింగ్ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి పార్థసారధి చర్చలు జరిపారు. నిలిపివేసిన కొనుగోళ్లను శుక్రవారం నుంచి మొదలుపెట్టేందుకు ఈ సందర్భంగా వ్యాపారులు అంగీకరించారు. అలాగే, మార్కెట్లో మొబైల్ ఏటీఎం ఏర్పాటు చేసేందుకు కూడా ఆయన సమ్మతించారు. పెద్ద నోట్ల రద్దుతో గత 11 రోజులుగా ఉల్లి కొనుగోళ్లు నిలిపివేసిన విషయం తెలిసిందే. -
నేటి నుంచి ఉల్లి మార్కెట్ బంద్
-
మలక్‌పేట్ ఉల్లి మార్కెట్ బంద్
హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో మలక్‌పేటలోని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్లో ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు ఉల్లి కొనుగోలు బంద్ చేస్తామని ఉల్లి హోల్‌సేల్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు అనంత రెడ్డి అన్నారు. మార్కెట్ ప్రాంగణంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఉల్లి తీసుకు వచ్చిన రైతులు డబ్బు ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో నోట్ల చలామణి సమస్యతో ఇవ్వలేకపోతున్నామన్నారు. దాంతో ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు ఉల్లి కొనుగోలు నిలిపివేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ విషయమై అధికారులకు సైతం సమాచారం ఇచ్చామన్నారు. రైతులు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. -
ఉల్లి మార్కెట్‌పై సీబీఐ విచారణ
► ఉల్లి నిల్వలు, అమ్మకాలు, మార్కెట్ పరిస్థితులపై ఆరా ► తాడేపల్లిగూడెంలో సీబీఐ బృందం మకాం ► ఏలూరు మార్కెట్లోనూ వివరాల సేకరణ తాడేపల్లిగూడెం : ఉల్లిపాయల మార్కెట్‌పై కేంద్ర నేర పరిశోధనా సంస్థ (సీబీఐ) దృష్టి సారించింది. ఉల్లిపాయలేంటి.. సీబీఐ ఏంటని ఆశ్చర్యపోకండి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉల్లి పంట, మార్కెట్లో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేయూల్సిందిగా సీబీఐకి ఆదేశాలిచ్చినట్టు సమాచారం. దీంతో సీబీఐ అధికారుల బృందం ఉల్లికి ప్రధాన మార్కెట్ అయిన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో మకాం వేసింది. ఇటీవల కాలంలో ఉల్లి ధరలు అడ్డూఅదుపూ లేకుండా పెరిగిపోయాయి. దీనికి మహారాష్ట్రలో అధిక వర్షాలు ఒక కారణం కాగా, కృత్రిమ కొరత కూడా ధరలను ఆకాశం నుంచి దిగనివ్వటంలేదు. అందుకే కేంద్రప్రభుత్వం ఉల్లి పండే ప్రాంతాలతో పాటు, వాటిని విక్రయించే మార్కెట్ల పరిస్థితులపైనా సమాచారం సేకరించాలని సీబీఐని ఆదేశించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తాడేపల్లిగూడెం వచ్చిన సీబీఐ అధికారులు ఇక్కడి మార్కెట్ స్థితిగతులపై లోతుగా ఆరా తీస్తున్నారు. ఇవే అంశాలపై ఇటీవల ఏలూరులోనూ సమాచారం సేకరించినట్టు తెలుస్తోంది. ఈ విషయం తాడేపల్లిగూడెం, ఏలూరులోని ఉల్లి వ్యాపారుల్లో కలకలం రేపుతోంది. కర్నూలు ఉల్లిపాయలకు సంప్రదాయ మార్కెట్‌గా తాడేపల్లిగూడెంకు పేరుంది. ఈ ఉల్లికి కర్నూలు పుట్టిల్లైతే, తాడేపల్లిగూడెం మెట్టినిల్లుగా మారింది. చాలాకాలంగా ఈ రెండు ప్రాంతాల మధ్య ఉల్లి బంధం పెనవేసుకుపోయింది. ఇటీవల ఈ బంధం బలంగా ఉండటానికి గల కారణాలను తెలుసుకున్న రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి పరిటాల సునీత అవాక్కయ్యారు. దీంతో ఉల్లి వ్యవహా రంపై రాష్ట్రం కూడా నిఘా పెంచింది. ఉల్లి రవాణా విధానాలలో మార్పులు సైతం చేసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఉల్లి పంట, డిమాండ్, మార్కెట్లకు వచ్చే సరుకు పరిస్థితులు, నిల్వలు, కృత్రిమ కొరత వంటి అంశాలతోపాటు ఎగుమతులకు సంబంధించిన అంశాలపైనా సీబీఐ ద్వారా వివరాలు సేకరిస్తున్నట్టు చెబుతున్నారు. -
కర్నూలు ఉల్లికి పెరిగిన డిమాండ్
తాడేపల్లిగూడెం, న్యూస్‌లైన్: కర్నూలు ఉల్లి రైతుల పంటపండింది. తుపానులు, వర్షాల కారణంగా ఉల్లికి వైరస్ సోకడంతో తాడేపల్లిగూడెం ఉల్లిపాయలకు మార్కెట్లో డిమాండ్ తగ్గింది. క్వింటాలు రూ.4వేల వరకు పలికిన ఉల్లి ధర ఒక్కసారిగా రూ.2,500 దిగువకు పడిపోయింది. అయితే ఆదివారం కర్నూలు ఉల్లి మాత్రం క్వింటాలు రూ.4,500 వరకూ పలికింది. నాలుగు రోజుల క్రితం కూడా ఇదే ధర పలికినా సరుకు నాణ్యత లేకపోవడంతో ఎగుమతిదారులెవరూ కొనుగోలుకు మందుకు రాలేదు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో కొత్త ఉల్లిపాయలు మార్కెట్లకు రాకపోవడం కూడా కర్నూలు ఉల్లికి డిమాండ్ పెరగడానికి దోహదం చేసింది. ఈ ఉల్లిలో తేమ శాతం అధికంగా ఉండటంతో ఎగుమతిదారులు సరుకును కొనడానికి జంకారు. కానీ, ఆదివారం పరిస్థితి మారింది. పూర్తి డ్రై క్వాలిటీ ఉల్లిపాయలు 75 లారీల వరకు ఇక్కడి మార్కెట్‌కు వచ్చాయి. మహారాష్ట్రలో నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల అక్కడినుంచి కోల్‌కతా, ఢిల్లీ, బంగాదేశ్ మార్కెట్లకు సరుకు ఎగుమతి చేసేందుకు ప్రతికూల పరిస్థితి ఏర్పడింది. అక్కడినుంచి ఎగుమతిదారుల రాకతో తాడేపల్లిగూడెం మార్కెట్‌కు వచ్చిన సరుకు వచ్చినట్టుగా హాట్ కేక్‌లా అమ్ముడుపోయింది. కర్నూలు ఉల్లి సీజన్ డిసెంబర్ నెలాఖరుకు ముగియనుంది. రిటైల్ మార్కెట్లో నాణ్యత తక్కువ ఉన్న ఉల్లి కిలో రూ.40, నాణ్యత కలిగినవి రూ.50కి విక్రయించారు.