మలక్‌పేట్ వ్యవసాయ మార్కెట్‌లో ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు ఉల్లి కొనుగోలు బంద్ చేస్తున్నారు.
హైదరాబాద్ : పెద్ద నోట్ల రద్దుతో మలక్‌పేటలోని హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్‌లో ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు ఉల్లి కొనుగోలు బంద్ చేస్తామని ఉల్లి హోల్‌సేల్ వ్యాపారుల సంఘం అధ్యక్షుడు అనంత రెడ్డి అన్నారు.
మార్కెట్ ప్రాంగణంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ... ఉల్లి తీసుకు వచ్చిన రైతులు డబ్బు ఇవ్వాలని ఒత్తిడి తేవడంతో నోట్ల చలామణి సమస్యతో ఇవ్వలేకపోతున్నామన్నారు. దాంతో ఈనెల 15 నుంచి 19వ తేదీ వరకు ఉల్లి కొనుగోలు నిలిపివేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఈ విషయమై అధికారులకు సైతం సమాచారం ఇచ్చామన్నారు. రైతులు సహకరించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.