opposition agitaion
-
దక్షిణాఫ్రికా పొమ్మంది.. నైజీరియా పట్టం కట్టింది
లాగోస్: దక్షిణాఫ్రికాలో విదేశీయురాలని తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొన్న చిడిమా అడెత్సీనా మిస్ యూనివర్స్ నైజీరియాగా ఎన్నికైంది. నవంబరులో మెక్సికోలో జరిగే మిస్ యూనివర్స్ అందాల పోటీల్లో నైజీరియాకు ప్రాతినిధ్యం వహించనుంది. జాతీయతకు సంబంధించి ఆన్లైన్లో తీవ్రదాడి జరగడంతో అడెత్సీనా కిందటి నెల మిస్ సౌతాఫ్రికా పోటీ నుంచి వైదొలిగింది. నైజిరియాలో పోటీపడాల్సిందిగా వచి్చన ఆహ్వానాన్ని మన్నించింది. నైజీరియా తండ్రి, మొజాంబిక్ మూలాలున్న దక్షిణాఫ్రికా తల్లికి జని్మంచిందనే కారణంతో మిస్ సౌతాఫ్రికా పోటీల్లో పాల్గొనడానికి అడెత్సీనాకు అర్హత లేదనే వాదన మొదలైంది. ఆమె జాతీయతను దక్షిణాఫ్రికన్లు పశి్నంచారు. దాంతో అంతర్జాతీయ వేదికపై తండ్రి పుట్టినగడ్డకు ప్రాతినిధ్యం వహించే అవకాశంగా నైజీరియా అడెత్సీనాకు తమ ఆహ్వానాన్ని అభివరి్ణంచింది. చివరకు అదే నిజమైంది. ‘నా కల నిజమైంది. ఇదో అందాల కిరీటం కాదు. ఆఫ్రికా ఐక్యతకు పిలుపు’ అని అడెత్సీనా ఇన్‌స్టాగ్రామ్‌లో స్పందించింది. -
Waqf Amendment Bill 2024: జేపీసీకి వక్ఫ్ (సవరణ) బిల్లు
న్యూఢిల్లీ: వక్ఫ్ చట్టం–1995లో పలు మార్పులు తీసుకురావడంతోపాటు చట్టం పేరును ‘యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్, ఎంపవర్మెంట్, ఎఫీషియెన్సీ, డెవలప్మెంట్ యాక్ట్–1995’గా మారుస్తూ కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వక్ఫ్(సవరణ) బిల్లు–2024ను పార్లమెంట్లో ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. బిల్లును లోక్‌సభలో ప్రవేశపెట్టగా, అడ్డుకొనేందుకు ప్రయతి్నంచాయి. సమాజంలో ఓ వర్గాన్ని లక్ష్యంగా చేసుకొని రూపొందించిన ఈ క్రూరమైన బిల్లు వద్దే వద్దంటూ నినదించాయి. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ సమాజాన్ని విచి్ఛన్నం చేసే ఈ బిల్లును ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశాయి. బీజేపీ సహా అధికార ఎన్డీయే కూటమి పక్షాలు బిల్లుకు మద్దతు ప్రకటించాయి. చివరకు ప్రతిపక్షాల నిరసనతో ప్రభుత్వం దిగొచి్చంది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) పరిశీలనకు బిల్లును పంపిస్తున్నట్లు ప్రకటించింది. హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి కోసమే.. కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు వక్ఫ్(సవరణ) బిల్లును గురువారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లుపై చర్చ ప్రారంభించారు. బిల్లును ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తూ కాంగ్రెస్ సభ్యుడు కేసీ వేణుగోపాల్ నోటీసు ఇచ్చారు. దేశంలో మత స్వేచ్ఛను మోదీ ప్రభుత్వం కాలరాస్తోందని, సమాఖ్య వ్యవస్థపై దాడి చేస్తోందని మండిపడ్డారు. ప్రజల మధ్య చిచ్చు పెడుతూ విభజన రాజకీయాలు చేస్తున్న బీజేపీకి లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పారని, అయినప్పటికీ హరియాణా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో లబి్ధకోసమే బిల్లును తీసుకొచ్చిందని విమర్శించారు. ఇప్పుడు ముస్లింలపై దాడి చేస్తున్నారని, తర్వాత క్రైస్తవులపై, జైన్‌లపై దాడి చేస్తారని ధ్వజమెత్తారు. అనంతరం విపక్ష సభ్యులు బిల్లుపై దుమ్మెత్తిపోశారు. డీఎంకే ఎంపీ కనిమొళి, తృణమూల్ కాంగ్రెస్ సభ్యుడు సుదీప్ బందోపాధ్యాయ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ ఎంపీ బషీర్ బిల్లును వ్యతిరేకించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని తేల్చిచెప్పారు. ఎన్డీయేలోని కొన్ని పార్టీ సభ్యులు మాత్రం బిల్లుకు మద్దతు ప్రకటించారు. సభలో వాడీవేడిగా జరిగిన చర్చ తర్వాత మంత్రి కిరెణ్ రిజిజు స్పందించారు. బిల్లును జేపీసీ పరిశీలనకు పంపిస్తున్నట్లు తెలిపారు. జేపీసీ ఏర్పాటు కోసం త్వరలో అన్ని పారీ్టల నేతలో చర్చిస్తామని వివరించారు. ముసల్మాన్ వక్ఫ్ యాక్ట్–1923ని రద్దు చేసేందుకు ఉద్దేశించిన బిల్లును సైతం రిజిజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. బీజేపీ రియల్ ఎస్టేట్ కంపెనీ ‘‘కరడుగట్టిన బీజేపీ మద్దతుదారులను సంతోషపర్చడానికి బిల్లును తీసుకొచ్చారు. వక్ఫ్ బోర్డుల్లో ముస్లిమేతరులను నియమిస్తారా? ఇతర మత సంస్థల విషయంలో ఇలాగే చేయగలరా? ఎన్నికల్లో లబ్ధి కోసం బిల్లు రూపొందించారు. బీజేపీ రియల్ ఎస్టేట్ కంపెనీలా పనిచేస్తోంది. ఆ పార్టీ పేరును భారతీయ జమీన్ పారీ్టగా మార్చుకోవాలి. వక్ఫ్ బోర్డుల భూములను కాజేయాలని చూస్తున్నారు. బీజేపీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వక్ఫ్ బోర్డు భూములు అమ్మబోమంటూ గ్యారంటీ ఇవ్వాలి. ముస్లింల హక్కులను దోచుకుంటామంటే చూస్తూ ఊరుకోం. కచ్చితంగా అడ్డుకుంటాం’’ – అఖిలేశ్ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ మైనారీ్టలను రక్షించుకోవడం బాధ్యత ‘‘బిల్లును మేము వ్యతిరేకిస్తున్నాం. ఓ మతాన్ని లక్ష్యంగా చేసుకోవడం తగదు. బంగ్లాదేశ్‌లో ఏం జరుగుతోందో చూడండి. మైనారీ్టలను రక్షించుకోవడం మన నైతిక బాధ్యత. బిల్లు వెనుక ఉద్దేశం ఏమిటో ప్రభుత్వం బయటపెట్టాలి. బిల్లును ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. అందరితో చర్చించి పారదర్శకమైన బిల్లు రూపొందించాలి’’ – సుప్రియా సూలే, ఎన్సీపీ(శరద్ పవార్) పారదర్శకత కోసమే మద్దతు‘‘బిల్లుకు మద్దతిస్తున్నాం. వక్ఫ్ బోర్డుల నిర్వహణలో పారదర్శకతకు ఈ బిల్లు దోహదపడుతుంది. ముస్లిం వ్యతిరేక చర్య అనడంలో అర్థం లేదు. ఎవరికీ వ్యతిరేకం కాదు’’ –చిరాగ్ పాశ్వాన్, ఎల్జేపీ చీఫ్, కేంద్ర మంత్రి ముస్లింలను శత్రువులుగా చూస్తున్నారు ‘‘వక్ఫ్ చట్టంలో ఇష్టారాజ్యంగా సవరణలు చేయడాన్ని ఖండిస్తున్నాం. రాజ్యాంగ మౌలిక నిర్మాణంపై దాడి చేయడం దుర్మార్గం. ముస్లింలను శత్రువులుగా భావిస్తున్నారు. అందుకు ఈ బిల్లే నిదర్శనం. దర్గా, మసీదు, వక్ఫ్ ఆస్తులను స్వా«దీనం చేసుకోవాలనుకుంటున్నారా? ఈ బిల్లు ద్వారా దేశాన్ని ముక్కలు చేద్దామనుకుంటున్నారా? ఏకం చేద్దామనుకుంటున్నారా? బిల్లుకు వ్యతిరేకంగా ఇప్పటికే రూల్ 72 కింద నోటీసు ఇచ్చాం. ప్రభుత్వం తక్షణమే బిల్లును ఉపసంహరించుకోవాలి’’ – అసదుద్దీన్ ఒవైసీ, ఎంఐఎం వ్యతిరేకించిన వైఎస్సార్సీపీ సాక్షి, న్యూఢిల్లీ: లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లును వైఎస్సార్సీపీ వ్యతిరేకించింది. సభలో బిల్లు ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకిస్తున్నామని పార్టీ లోక్‌సభా పక్ష నేత మిథున్ రెడ్డి తెలిపారు. ‘ముస్లిం వర్గాల్లో అనేక ఆందోళనలు ఉన్నాయి. కాబట్టి ఈ బిల్లు మరింత ముందుకు తీసుకెళ్లే క్రమంలో ముస్లిం సమాజాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ లేవనెత్తిన ఆందోళనలతో పూర్తిగా ఏకీభవిస్తున్నాం. వాటిని పరిష్కరించాల్సిన అవసరం ఉంది’అని ఎంపీ మిథున్ రెడ్డి పేర్కొన్నారు. ముస్లింలకు వ్యతిరేకం కాదు ఈ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదు. మతపరమైన విభజనలను ప్రోత్సహించడం ప్రభుత్వ ఉద్దేశం కాదు. పారదర్శకత కోసమే బిల్లు రూపొందించారు. ప్రతిపక్షాలు ఈ బిల్లును ఆలయాలతో పోలుస్తున్నాయి. అసలు విషయాన్ని పక్కదారి పట్టిస్తున్నాయి. గతంలో కాంగ్రెస్ పాలనలో వేలాది మంది సిక్కులను ఊచకోత కోశారు. ఇందిరా గాంధీ హత్యకు ఏ ట్యాక్సీ డ్రైవర్ కారణం? దీనిపై కాంగ్రెస్ నాయకుడు కేసీ వేణుగోపాల్ సమాధానం చెప్పాలి. – రాజీవ్ రంజన్ సింగ్, జేడీ(యూ) సభ్యుడు, కేంద్ర మంత్రిరాజ్యసభలో వక్ఫ్ ఆస్తుల బిల్లు ఉపసంహరణ వక్ఫ్ ఆస్తుల(ఆక్రమణదార్ల తొలగింపు) బిల్లు–2014ను ప్రభుత్వం గురువారం రాజ్యసభ నుంచి ఉపసంహరించుకుంది. బిల్లు ఉపసంహరణకు మూజువాణి ఓటుతో సభ్యులు ఆమోదం తెలిపారు. వక్ఫ్ ఆస్తుల్లో ఎవరైనా అనధికారికంగా తిష్టవేస్తే వారిని అక్కడి నుంచి తొలగించడానికి ఒక యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా 2014 ఫిబ్రవరి 18న అప్పటి కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి కె.రెహా్మన్ ఖాన్ ఈ బిల్లును రాజ్యసభలో ప్రవేశపెట్టారు. 2014 మార్చి 5న బిల్లును పార్లమెంట్ స్థాయీ సంఘం పరిశీలనకు పంపించారు. అప్పటినుంచి బిల్లు పెండింగ్‌లో ఉంది.టీడీపీ మద్దతు లోక్‌సభలో వక్ఫ్ చట్ట సవరణ బిల్లు–2024కు టీడీపీ మద్దతు ప్రకటించింది. బిల్లును స్వాగతిస్తున్నామని టీడీపీ ఎంపీ హరీశ్ చెప్పారు. అన్ని మతాల వారు తమ మత కార్యక్రమాలకు భూములు, ఆస్తులను విరాళంగా ఇస్తుంటారని తెలిపారు. దాతల ప్రయోజనాలు కాపాడేలా సంస్కరణలు తీసుకొచ్చి ఆ వ్యవస్థలో పారదర్శకత తీసుకురావడం ప్రభుత్వ బాధ్యత అని తెలిపారు. -
మోదీపై విపక్షాలది దుష్ప్రచారమే
న్యూఢిల్లీ: ‘‘కేంద్రం ప్రభుత్వంపై ప్రధాని నరేంద్ర మోదీపై ప్రతిపక్షాల ఆరోపణలన్నీ దుష్ప్రచారాలు మాత్రమే. పలు కేసుల్లో ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పుల్లోనూ ఇదే స్పష్టమైంది’’ అని బీజేపీ పేర్కొంది. సోమవారం బీజేపీ జాతీయ కార్యవర్గ భేటీలో కేంద్ర న్యాయ మంత్రి కిరెన్ రిజిజు ఈ మేరకు చేసిన రాజకీయ తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మీడియాకు ఈ మేరకు వెల్లడించారు. ‘‘రఫేల్, పెగసస్, సెంట్రల్ విస్టా ప్రాజెక్టు, నోట్ల రద్దు, ఈడబ్ల్యూఎస్ కోటా తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్ర దుష్ప్రచారం సాగించాయి. కానీ వీటికి సంబంధించిన అన్ని కేసుల్లోనూ కేంద్రం వైఖరిని సమర్థిస్తూ సుప్రీంకోర్టు తీర్పులు వెలువరించింది. విపక్షాలు చెబుతున్నదంతా అబద్ధమేనని దీంతో తేలిపోయింది’’ అని ఆమె అన్నారు. మోదీపై వారి నిరాధార ఆరోపణలను చట్టపరంగా తిప్పికొట్టామన్నారు. ‘‘దేశం కోసం పనిచేస్తున్న మోదీకి ప్రపంచదేశాల్లో గౌరవం లభిస్తోంది. దేశ ప్రతిష్టను ఆయన పెంచారు’’ అన్నారు. 2023 ఎన్నికలు కీలకం: నడ్డా లోక్‌సభ ఎన్నికలకు ముందు 2023లో ఎన్నికలు జరిగే 9 రాష్ట్రాల్లో ఒక్కదాన్నీ బీజేపీ కోల్పోరాదని పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపును చరిత్రాత్మకంగా ఆయన అభివర్ణించారు. మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి దూసుకుపోతోందని కొనియాడారు. మోదీకి ఘన స్వాగతం అంతకుముందు కార్యవర్గ సమావేశానికి వస్తున్న మోదీకి బీజేపీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికాయి. పటేల్ చౌక్ నుంచి ఎన్డీఎంసీ కన్వెన్షన్ దాకా పార్టీ కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపులా నిలబడి ప్రధానిపై పూలు చల్లారు. నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వ విజయాలను తెలుపుతూ భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. వేదిక వద్ద మోదీకి నడ్డా స్వాగతం పలికారు. -
మిస్‌ఫైర్ అయిందా..?
సాక్షి,న్యూఢిల్లీ: అవినీతి...నల్లధనం...ఉగ్రవాదం..నకిలీ నోట్లకు చెక్ పెట్టేందుకే సాహసోపేత నిర్ణయం తీసుకున్నామని గత ఏడాది నవంబర్ 8న నోట్ల రద్దు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకుని సరిగ్గా ఏడాది అవుతోంది. ఏడాదిలో ప్రభుత్వం ఆశించిన లక్ష్యాలు నెరవేరాయా..? సగటు భారతీయుడికి ప్రయోజనాలు దక్కాయా..? ఆర్థిక వ్యవస్థ పరిస్థితి ఏంటి..? అందరి మదిలో మెదులుతున్న ఈ ప్రశ్నలకు సరైన సమాధానం దొరకడం లేదు. నోట్ల రద్దు పర్యవసానాలను బేరీజు వేసేందుకు ఏడాది సమయం స్వల్పకాలికమైనా ఈ వ్యవధిలో మోదీ నిర్ణయంతో సానుకూల ఫలితాల కన్నా ప్రతికూలతలే ఎదురయ్యాయి. చెలామణిలో ఉన్న 86 శాతం నగదు చెల్లదని ప్రకటిస్తూ మోదీ ప్రవచించిన ఉద్దేశాలు మొక్కుబడి మాటలుగా మిగిలాయి. వృద్ధి రేటు వెనక్కు... నోట్ల రద్దు నిర్ణయానికి ముందు ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఎదుగుతున్న ఎకానమీగా పరుగులు పెట్టిన దేశ వృద్ధి రేటు నగదు కొరతతో డీలా పడింది. జీడీపీ వృద్ధి రేటు కనిష్టస్థాయికి పతనమైంది. విపక్షాలు, రాజకీయ పరిశీలకులతో పాటు ఆర్థిక నిపుణులూ నోట్ల రద్దు బెడిసికొట్టిందని విశ్లేషించారు. నల్లధనం, అవినీతి నియంత్రణ ప్రక్రియ నోట్ల రద్దుతో ముగిసేది కాదంటూ నోమురా హోల్డింగ్స్ చీఫ్ ఇండియా ఎకనమిస్ట్ సొనాల్ వర్మ స్పష్టం చేశారు. నల్లధనం కేవలం నగదులోనే ఉండదని, అది రియల్ ఎస్టేట్, బంగారం వంటి పలు రూపాల్లో ఉంటుందని వర్మ అన్నారు. నకిలీ కరెన్సీ సరిహద్దుల నుంచీ వెల్లువెత్తుతున్న నకిలీ నోట్ల ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు నోట్ల రద్దు ఉపకరిస్తుందని ప్రధాని మోదీ చెప్పుకొచ్చారు. అతిపెద్ద నిర్ణయం ఈ దిశగానూ ఎలాంటి ఫలితాలను ఇవ్వలేదు. నోట్ల రద్దుకు ముందు చెలామణిలో ఉన్న మొత్తం కరెన్సీలో 0.07గా ఉన్న నకిలీ నోట్లు ఈ ఏడాది జూన్ 30 నాటికి 0.08 శాతానికి పెరిగాయి. మరోవైపు ఆర్బీఐ నూతనంగా ప్రవేశపెట్టిన రూ 2000 నోట్లలోనూ నకిలీలు ముంచెత్తుతున్నాయి. పెద్ద ఎత్తున రూ 2000, రూ 500 నకిలీ నోట్లు పట్టుబడుతూనే ఉన్నాయి. నల్లధనం గత ఏడాది నోట్ల రద్దు నిర్ణయం వెలువడిన వెంటనే సుప్రీం కోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపిన వివరాల ప్రకారం చెలామణిలో ఉన్న రూ 15 లక్షల కోట్ల కరెన్సీలో మూడింట ఓ వంతు బ్యాంకుల్లో జమ కాదని, ఆ మేరకు పెద్దమొత్తంలో నల్లధనమంతా చెల్లుబాటు కాకుండా పోతుందని ప్రభుత్వం నివేదించింది.అయితే రద్దయిన నోట్లలో 99 శాతం నోట్లు తిరిగి బ్యాంకింగ్ వ్యవస్థకు చేరినట్టు ఆర్బీఐ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. రద్దయిన నోట్లన్నీ బ్యాంకు డిపాజిట్ల రూపంలో నేరుగా వ్యవస్థలోకి ప్రవేశించడంతో ఇక బ్లాక్‌మనీని తుడిచిపెట్టడం ఎలా సాధ్యమని ఏబీఎన్ ఆమ్రో బ్యాంక్ సీనియర్ ఎకనమిస్ట్ అర్జెన్ డికుజెన్ విస్మయం వ్యక్తం చేశారు. డిజిటల్ లావాదేవీలు నోట్ల రద్దుకు ప్రభుత్వాన్ని ప్రేరేపించిన నగదు రహిత లావాదేవీలూ ఆశించిన మేర పుంజుకోలేదు. డిజిటల్ పేమెంట్ రంగంలో అతిపెద్ద సంస్థగా ఉన్న పేటీఎం నోట్ల రద్దు అనంతరం తన సబ్స్క్రైబర్లను భారీగా పెంచుకుని లాభాలు దండుకుంది. మ్యూచ్‌వల్ ఫండ్లలోకీ నిధులు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో ఆర్థిక వ్యవస్థలోకి తిరిగి నగదు చెలామణి సాధారణ స్థితిలోకి చేరగానే డిజిటల్ లావాదేవీలు తగ్గుముఖం పట్టాయి.అయితే నోట్ల రద్దు నిర్ణయం లేకుంటే ఈ మాత్రమైనా డిజిటల్ లావాదేవీలు జరిగేవి కాదని ఆర్థిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సుభాష్ గార్గ్ అంచనా వేశారు. ఉగ్రవాదం నోట్ల రద్దుతో ఉగ్రవాదానికి చెక్ పెట్టవచ్చని ప్రధాని మోదీ చెప్పినట్టుగా జమ్మూ కశ్మీర్లో నోట్ల రద్దు అనంతరం రాళ్ల దాడులు కొంత తగ్గుముఖం పట్టాయి. ఉగ్రవాద కార్యకలాపాలు తగ్గినా మళ్లీ క్రమంగా కశ్మీర్లో రాళ్ల దాడులు చోటుచేసుకుంటున్నాయి. నోట్ల రద్దుతో వీటికి నేరుగా సంబంధం ఉన్నదా అనేది అస్పష్టమని విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
వివాదాలు.. నినాదాలు!
పతిపక్షం పట్టు విడవలేదు. ప్రభుత్వం బెట్టు వీడలేదు. పంతాలపై ఎవరూ తగ్గలేదు. పార్లమెంటు స్తంభించిపోయింది. నినాదాలతో దద్దరిల్లింది. వాగ్వాదాలతో గందరగోళంగా మారింది. వాయిదాలపై వాయిదాలతో గడచిపోయింది. వర్షాకాల సమావేశాల్లో బుధవారం రెండో రోజూ ఏ చర్చా లేకుండానే తుడిచిపెట్టుకుపోయింది. ప్రతిపక్షాల దాడిని.. కాంగ్రెస్ పాలనలోని రాష్ట్రాల్లో అవినీతి ఆరోప ణలను ప్రస్తావిస్తూ అధికారపక్షం ఎదురు దాడిని ఉధృతం చేసింది. కోల్‌స్కాం నిందితుడికి పాస్‌పోర్ట్ ఇప్పించాలంటూ తనను ఒత్తిడి చేశారని సుష్మా.. ఉత్తరాఖండ్ సీఎం హరీశ్‌రావత్‌పై స్టింగ్ ఆపరేషన్ సీడీలను బయటపెట్టిన నిర్మలాసీతారామన్.. వెరసి.. ప్రభుత్వంపై విపక్షం దాడి, అధికారపక్షం ఎదురు దాడిగా ఘర్షణ మరింతగా ముదురుతోంది. * పార్లమెంటులో ప్రతిష్టంభన * ఉభయసభలూ వాయిదా * వ్యాపమ్, లలిత్‌గేట్‌లపై లోక్‌సభ వెల్‌లో విపక్షాల ఆందోళన * సుష్మా, రాజే, చౌహాన్లు రాజీనామా చేయాలని డిమాండ్: నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శన * సభ్యులపై స్పీకర్ ఆగ్రహం.. క్రమశిక్షణ చర్యలకు హెచ్చరిక; అధికార పక్షం ఎదురుదాడి * కాంగ్రెస్ రాష్ట్రాల సీఎంల అవినీతిపై చర్చిద్దామన్న జైట్లీ సాక్షి, న్యూఢిల్లీ: లలిత్‌మోదీ వివాదం, వ్యాపమ్ కుంభకోణాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలను పదవుల నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో ప్రతిపక్షాలు పార్లమెంటు ఉభయసభల్లోనూ తీవ్రస్థాయిలో నిరసనకు దిగాయి. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్‌లు పదవులకు రాజీనామా చేయనిదే ఎటువంటి చర్చనూ జరగనివ్వబోమని లోక్‌సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్, వామపక్షాలు, ఎస్పీ, బీఎస్పీ, ఎన్సీపీ తదితర పార్టీలు రెండోరోజూ భీష్మించాయి. ఆ పార్టీల సభ్యులు తమ డిమాండ్లతో వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేస్తుంటే.. అధికారపక్షం ప్రతి నినాదాలకు దిగింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఆరోపణలను ప్రస్తావిస్తూ ఎదురుదాడి చేసింది. గందరగోళాల మధ్య ఉభయసభలూ ఎటువంటి కార్యకలాపాలూ జరపకుండానే గురువారానికి వాయిదాపడ్డాయి. లోక్‌సభలో విపక్షాల హోరు... బుధవారం ఉదయం 11 గంటలకు సభ సమావేశమైన తర్వాత వివిధ ప్రాంతాల్లో ప్రమాదాలు, దుర్ఘటనల్లో మరణించిన వారికి నివాళులర్పించింది. రాజమండ్రి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన 29 మందికి కూడా నివాళులు తెలిపింది. ఆ తరువాత విపక్షాల ఆందోళన, నిరసనలతో సభ హోరెత్తింది. తొలుత టీఆర్ఎస్ సభ్యులు తెలంగాణకు తక్షణమే ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు. ఆ వెంటనే కాంగ్రెస్, వామపక్షాలు, ఎన్సీపీ తదితర పార్టీల సభ్యులు వ్యాపమ్, లలిత్‌గేట్ వివాదాలపై నినాదాలు చేస్తూ దూసుకొచ్చారు. తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ సభ్యులు వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంలో స్పీకర్ సుమిత్రా మహాజన్.. వివిధ అంశాలపై వాయిదా తీర్మానాల కోసం సభ్యులు ఇచ్చిన నోటీసులను తిరస్కరిస్తున్నట్టు తెలిపారు. మరోవైపు.. ‘బడే మోదీ మెహర్బాన్, తో చోటే మోదీ పెహల్వాన్’ (బలవంతుడైనవ్యక్తి మద్దతుతో చిన్న వ్యక్తి కూడా బలవంతుడవుతాడనే హిందీ సామెతను నరేంద్రమోదీ, లలిత్మోదీలకు అన్వయించిన నినాదం), ‘ప్రధాని మౌనం వీడాలి’, ‘మోదీ గారూ 56 అంగుళాలు చూపండి.. సుష్మా, రాజేలను త్వరగా తొలగించండి’ అనే నినాదాలు రాసిన ప్లకార్డులు ప్రదర్శించారు. సుష్మా అధికారపక్షం వైపు మొదటి వరుసలో హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, రవాణామంత్రి నితిన్గడ్కారీల పక్కన కూర్చున్నారు. కాంగ్రెస్ సభ్యులు తమ చేతులపై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు, ప్లకార్డులు ప్రదర్శించవద్దని స్పీకర్ హెచ్చరించినా వారు వాటిని కొనసాగించారు. నిరసన తెలుపుతున్న సభ్యుల చర్యను స్పీకర్ తప్పుపట్టారు. గందరగోళం కొనసాగటంతో ప్రారంభమైన 9 నిమిషాలకే సభను స్పీకర్ 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. క్రమశిక్షణ చర్యలకు స్పీకర్ హెచ్చరిక... సభ తిరిగి 12 గంటలకు ప్రారంభమైన తర్వాత.. సానియామీర్జా సహా అంతర్జాతీయ విజయాలు సాధించిన పలువురు క్రీడాకారులకు స్పీకర్ అభినందనలు తెలిపారు. అనంతరం.. సభలో వ్యవహరించాల్సిన తీరు, సభామర్యాదలకు సంబంధించి స్పీకర్ ప్రకటన చేస్తూ 349, 351, 352 నిబంధనలను చదివి వినిపించారు. సభ్యులు వీటికి కట్టుబడి ఉండడం లేదని, వీటిని అనుసరించని పక్షంలో తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పీకర్ హెచ్చరించారు. దీంతో కాంగ్రెస్, వామపక్షాల ఆగ్రహానికి ఆజ్యం పోసినట్లయింది. వారు మళ్లీ వెల్‌లోకి దూసుకెళ్లారు. టీఆర్ఎస్ సభ్యులు కూడా తమ ప్రత్యేక హైకోర్టు డిమాండ్‌తో వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. దీంతో పది నిమిషాల్లోనే స్పీకర్ సభను 2 గంటల పాటు వాయిదా వేశారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు సభ సమావేశమైన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగటంతో రెండు నిమిషాలకే ఉప సభాపతి ఎం.తంబిదురై సభను గురువారానికి వాయిదా వేశారు. ఈ గందరగోళం మధ్యలోనే.. భూసేకరణ బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లీమెంటరీ సంఘం గడువును పొడిగించాలన్న తీర్మానానికి ఆమోదం తెలిపారు. రాజ్యసభలో వాగ్వాదాల జోరు: అటు రాజ్యసభలోనూ అదే పరిస్థితి. బుధవారం ఉదయం సమావేశమయ్యాక.. వివిధ ప్రమాదాల్లో మృతిచెందిన వారికి నివాళులు అర్పించిన వెంటనే కాంగ్రెస్, బీఎస్పీ, వామపక్షాలు సుష్మా, వసుంధర, చౌహాన్లు పదవులకు రాజీనామాలు చేయనిదే సభలో ఎలాంటి చర్చా సాధ్యం కాదని భీష్మించాయి. సాధారణ కార్యకలాపాలను నిలిపివేసి లలిత్‌మోదీ, వ్యాపమ్స్కాంపై చర్చ జరపాలని 267 నిబంధన కింద నోటీసులు ఇచ్చినట్లు సతీశ్చంద్రమిశ్రా (బీఎస్పీ), నరేశ్అగర్వాల్ (ఎస్పీ), తపన్కుమార్సేన్ (సీపీఎం), డి.రాజా (సీపీఐ)లు తెలిపారు. లలిత్‌కు సాయం చేయటంలో చట్టంలోని ఏ ఒక్క నిబంధనను సుష్మా ఉల్లంఘించారో స్పష్టంగా చెప్పాలని.. సభా నాయకుడు అరుణ్‌జైట్లీ విపక్షాలను ప్రశ్నించారు. విపక్ష నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. వాయిదానోటీసులు ఇచ్చిన సభ్యు లు మాట్లాడేందుకు అనుమతించాలని పేర్కొనగా.. అందుకు జైట్లీ నిరసన వ్యక్తం చేస్తూ ఇటువంటి ఆచరణను ప్రతిరోజూ అనుమతించవచ్చా అని ప్రశ్నించారు. ‘‘నినాదాల రాజకీయాలు చాలు. మీరు చర్చ ప్రారంభించండి.’’ అని అన్నారు. వారు రాజీనామా చేయాలి: విపక్ష నేతలు ‘నేను తినను, తిననివ్వను’ అని బీరాలు పోయిన వారి బండారాన్ని వ్యాపమ్స్కాం బయటపెట్టిందని బీఎస్పీ అధినేత్రి మాయావతి ప్రధానిపై విమర్శలు ఎక్కుపెట్టారు. వివాదాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు రాజీనామా చేయాలని జేడీయూ నేత శరద్‌యాదవ్ పేర్కొన్నారు. దర్యాప్తులో వారు నిర్దోషులుగా తేలితే వారు మరింత బలపడతారని వ్యాఖ్యానించారు. ఇందుకు ఉదాహరణగా.. 1990ల్లో జైన్ హవాలా కేసులో తమ పేర్లు వచ్చినపుడు తాను, బీజేపీ నేత అద్వానీ రాజీనామాలు చేసిన ఉదంతాన్ని ప్రస్తావించారు. ‘వ్యాపమ్’ ఒక రాష్ట్ర అంశం: జైట్లీ వ్యాపమ్ కుంభకోణం అనేది ఒక రాష్ట్ర అంశమని.. రాష్ట్ర అంశాలను పార్లమెంటులో చర్చించేలా నిబంధనలు మార్చి, కొత్త సంప్రదాయాలు నెలకొల్పాలని విపక్షం భావిస్తే.. తొలుత కేరళ, హిమాచల్‌ప్రదేశ్, పుదుచ్చేరీ అస్సాం, గోవాలకు సంబంధించిన అంశాలను చర్చించాలని.. జైట్లీ ఎదురుదాడికి దిగారు. సుష్మాస్వరాజ్‌కు సంబంధించిన విషయాన్ని చర్చించాలని ప్రతిపక్షాలు కోరుకుంటే.. ఆ చర్చను ప్రారంభించాలన్నారు. అయితే.. వ్యాపమ్ ఒక రాష్ట్రానికి పరిమితమైన అంశం కాదని, ఆ స్కాంతో సంబంధమున్న వారు మధ్యప్రదేశ్‌కు వెలుపల అనుమానాస్పదంగా చనిపోయారని సీపీఎం నేత సీతారాం ఏచూరి వాదించారు. సభ కొనసాగినంతసేపూ, వాయిదాలు వాగ్వివా దాలతోనే సాగింది. ఈ పరిస్థితుల్లో రాజ్యసభ రెండో రోజు కూడా ఎలాంటి కార్యక్రమాలు జరగకుండానే గురువారానికి వాయిదా పడింది. పార్లమెంటులో పరిశోధన విభాగం: పార్లమెంట్లో కొత్తగా ఒక పరిశోధన విభాగం ఏర్పడనుంది. పార్లమెంట్లో జరిగే చర్చల్లో పాల్గొనేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలంటూ పలువురు ఎంపీలు స్పీకర్ సుమిత్ర మహాజన్‌కు విజ్ఞప్తి చేయడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రత్యేక హైకోర్టు కోసం టీఆర్ఎస్ ఎంపీల నిరసన తెలంగాణ రాష్ట్రానికి తక్షణమే ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు బుధవారం లోక్‌సభలో ఆందోళనకు దిగారు. సభ సమావేశమైన వెంటనే.. టీఆర్ఎస్ ఎంపీలు పది మంది వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు మొదలుపెట్టారు. ప్రత్యేక హైకోర్టు డిమాండ్‌తో ప్లకార్డులు ప్రదర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ ఎంపీ చామకూర మల్లారెడ్డి తమ తమ స్థానాల్లో నిల్చొని ప్రత్యేక హైకోర్టు కావాలని ఆందోళన వ్యక్తంచేశారు. అనంతరం పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద టీఆర్ఎస్ ఎంపీలు ధర్నా చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ లోక్‌సభాపక్ష నేత ఎ.పి.జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రం విడిపోయి సంవత్సరమైంది. ఇప్పటివరకు పార్లమెంటు నాలుగు పర్యాయాలు సమావేశమైంది. ప్రతి సమావేశాల్లోనూ ప్రత్యేక హైకోర్టు ఇవ్వాలని అడుగుతున్నాం. మా ముఖ్యమంత్రి.. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, న్యాయమంత్రి, హోంమంత్రిని కలిశారు. తప్పకుండా చేస్తామన్నారు. కానీ చేయలేదు. రాష్ట్రం విడిపోయినప్పుడు మొట్టమొదట హైకోర్టు ఏర్పాటుచేస్తారు. కానీ కేంద్ర కేబినెట్ మంత్రులు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతూ రావాల్సిన హైకోర్టు రాకుండా చేస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. తెలంగాణ కేసులన్నీ కూడా ఆంధ్రా హైకోర్టు న్యాయమూర్తుల వద్దకు వెళితే మాకు న్యాయం జరగడం లేదని మొదటి నుంచి చెప్తున్నాం. హైకోర్టు మాకు వచ్చేంతవరకు మేం నిరసన తెలుపుతాం’’ అని పేర్కొన్నారు. ఎంపీ కె.కవిత మాట్లాడుతూ ‘‘ఈ ప్రధానమంత్రి కేబినెట్లోని సీనియర్ మంత్రులు కొందరు హైకోర్టు విభజన కాకుండా ఆపుతున్నారని తెలిసింది. అందువల్ల ఈ విషయంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన తెలంగాణ ప్రజల పక్షాన నిలుస్తారని ఆశిస్తున్నాం. ఈ సమావేశాలు ముగిసేంతవరకు రోజూ నిరసన కొనసాగిస్తాం. పార్లమెంటును స్తంభింపజేసేందుకు ప్రయత్నిస్తాం’’ అని చెప్పారు. కోల్గేట్ నిందితుడికి పాస్‌పోర్ట్ కోసం ఒత్తిడి చేశారు: సుష్మా న్యూఢిల్లీ: కోల్గేట్ కుంభకోణంలో నిందితుడు సంతోష్ బగ్రోదియాకు ‘డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్’ ఇప్పించాలంటూ కాంగ్రెస్ నేత ఒకరు తనపై ఒత్తిడి తెచ్చారంటూ కేంద్రమంత్రి సుష్మ ట్విటర్లో బాంబు పేల్చారు. ‘‘కోల్ స్కాం నిందితుడు సంతోష్ బగ్రోదియాకు డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ ఇప్పించాల్సిందిగా కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు నాపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ నేతపేరును పార్లమెంటులో వెల్లడిస్తా..’’అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. పార్లమెంటు ఆవరణలో చేపట్టదలచిన మౌన దీక్షను కాంగ్రెస్ వాయిదా వేసుకుంది.