కమోడిటీల్లో కూడా ఆప్షన్ ట్రేడింగ్
మరో 6 కమోడిటీల్లోనూ ట్రేడింగ్‌ను అనుమతించిన సెబీ
న్యూఢిల్లీ: కమోడిటీ డెరివేటివ్‌ల మార్కెట్‌ను మరింతగా విస్తరించే రెండు నిర్ణయాలను మార్కెట్ నియంత్రణ సంస్థ, సెబీ బుధవారం తీసుకుంది. కమోడిటీల్లో ఆప్షన్స్ ట్రేడింగ్‌ను అనుమతించింది. అంతే కాకుండా మరో ఆరు కమోడిటీల్లో ట్రేడిం గ్ను ప్రారంభించింది. వజ్రాలు, టీ, గుడ్లు, కోకో, దుక్క ఇనుము, ఇత్తడి.. ఈ ఆరు కమోడిటీల్లో ట్రేడింగ్‌ను అనుమతిస్తున్నామని సెబీ పేర్కొంది. దీంతో కమోడిటీ ఎక్స్చేంజీల్లో ట్రేడింగ్‌కు అనుమతించిన కమోడిటీల సంఖ్య 91కు పెరిగింది. నీతి ఆయోగ్ సభ్యుడు రమేశ్ చాంద్ అధ్యక్షతనగల నిపుణల కమిటీ సూచనలు, సెబీతో సంప్రదింపుల అనంతరం ప్రభుత్వం కొత్తగా ఈ ఆరు కమోడిటీల్లో ట్రేడింగ్‌ను అనుమతించింది.