ornaments found
-
30 కోట్ల విలువైన వజ్రాభరణాల స్వాధీనం
సాక్షి, హైదరాబాద్: శంషాబాద్ విమానాశ్రయం కేంద్రంగా ముంబైకి తరలించేందుకు పంపిన కొరియర్లో భారీగా వజ్రాభరణాలు, బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఎయిర్ కార్గోలో ఈ ఉదయం ఎయిర్ ఇంటెలిజెన్స్ అండ్ కస్టమ్స్ అధికారుల విస్తృత తనిఖీలు నిర్వహించారు. గడిచిన నాలుగైదు గంటలుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో కస్టమ్స్ అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్, ఇన్స్పెక్టర్ల సభ్యుల బృందం అధ్వర్యంలో తనిఖీలు కొనసాగుతున్నాయి. ముంబయికి తరలించేందుకు స్మగ్లర్ పన్నిన పన్నాగాన్ని పసిగట్టిన కస్టమ్స్ అధికారుల బృందం ఈ తనిఖీలు చేపట్టింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌లో భారీ ఎత్తున బంగారం, డైమండ్ జ్యువలరీ ఆభరణాలు అక్రమ రవాణా జరుగుతుందని ఎయిర్ పోర్ట్‌లోని ఎయిర్ కార్గోలో ఈ రవాణా జరుగుతోందని డిప్యూటీ కమిషనర్ అధికారుల బృందానికి సమాచారం అందింది. స్వాధీనం చేసుకున్న కొరియర్ని ఓపెన్ చేసిన అధికారులు డైమండ్ వజ్రాభరణాలను పెద్ద పెద్ద తూనికలు కొలతలు వెయిట్ మిషన్ల సహాయంతో లెక్కిస్తున్నారు. (దూసుకెళ్లిన కారు; తప్పిన పెనుప్రమాదం) వజ్రాభరణాలుకి పైనుంచి వెండి పూత పూసి బంగారాన్ని గుర్తుపట్టకుండా అమర్చి గోల్డ్ మాఫియా తరలిస్తున్నట్టు గుర్తించారు. ముంబై వెళుతున్న పార్సెల్‌లో వజ్రాభరణాలు, బంగారం , ఆర్నమెంట్స్ అన్నీ కలిపి ఇప్పటిదాకా 21 కేజీలు గుర్తించారు. కాగా.. వీటి విలువ 30 కోట్ల రూపాయలకు పైబడి ఉంటుందని అంచనా. ఈ పార్సిల్‌ని శ్రీపాల్ జైన్ అనే వ్యక్తి ముంబయి అడ్రస్‌కి పంపుతున్నట్టు ఉండగా అశోక్ అనే వ్యక్తి నుండి పార్సల్ ఫ్రమ్ అడ్రస్ ఉండటం విశేషం. -
అంతరాష్ట్ర దొంగ అరెస్ట్: రూ.17 లక్షల సొత్తు స్వాధీనం
సాక్షి, తిరుమల: తిరుమలలో అంతర్రాష్ట్ర దొంగను పోలీసులు అరెస్టు చేశారు. మందలపు రాజు అలియాస్ శివ పోలీసులకు పట్టుబడ్డాడు. అతని వద్ద నుంచి 10 లాప్‌టాప్‌లు, 400 గ్రాముల బంగారు ఆభరణాలు, 500 గ్రాముల వెండి, రూ.లక్ష నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ మొత్తం సొత్తు విలువ రూ.17 లక్షల 50 వేలు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: అంతరాష్ట్ర దొంగను ఆదిబట్ల పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కండవల్లి సురేష్ అనే వ్యక్తి నకిలీ తాళాలతో బైక్‌లు, కార్లు ఎత్తుకెళ్లడమేగాక ఇళ్ళల్లో బంగారు ఆభరణాలు చోరీ చేస్తుంటాడు. ఇతడిని పోలీసులు అరెస్టు చేసి ఎల్బి నగర్‌లోని డిసిపి కార్యాలయంలో మీడియా ఎదుట ప్రవేశపెట్టగా డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. నిందితుని వద్ద నుంచి రూ.7.5 లక్షల విలువైన ఒక కారు, 3 బైక్‌లు, 7 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతనిపై ఏడు కేసులు నమోదై ఉన్నాయని ఆయన తెలిపారు. -
శ్రీవెంకటేశ్వరస్వామి ఆభరణాలు లభ్యం
కలిగిరి : కలిగిరిలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో చోరీకి గురైన కొన్ని ఆభరణాలను దొంగలు శనివారం ఆలయం ప్రాంగణంలో వదిలి వెళ్లారు. పోలీసులు ఆలయ కమిటీ సభ్యుల సమాచారం మేరకు.. గత నెల 1వ తేదీ అర్ధరాత్రి ఆలయంలో సుమారు రూ.3 లక్షల విలువైన ఆభరణాలు, హుండీలోని నగదు చోరీకి గురైన విషయం తెలిసిందే. అదే నెల 7వ తేదీన కలిగిరి, జలదంకి సరిహద్దు పొలాల్లోని కాలువలో రెండు ప్రాంతాల్లో కొన్ని ఆభరణాలను దొంగలు పూడ్చిపెట్టిన వాటిని రైతులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. చోరీకి గురైన వాటిలో మరి కొన్ని వస్తువులను శనివారం సిమెంట్ బస్తాలో మూట కట్టి ఆలయ ఆవరణలో వదిలి వెళ్లారు. ఆలయంను శుభ్రపరిచే మహిళ గమనించి పూజారికి సమాచారం ఇచ్చింది. పూజారి అందుబాటులో లేక పోవడంతో ఆలయ కమిటీ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. ఎస్సై ఎస్కే ఖాధర్‌బాషా ఆలయం వద్దకు చేరుకొని దొంగలు వదిలి వెళ్లిన ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మరో మూడు తాళి బొట్లు, హుండీలో నగదు దొరకాల్సి ఉందని పోలీసులు తెలిపారు. స్థానికుల పాత్రపై అనుమానాలు ఆలయంలో చోరీకి పాల్పండింది మండలానికి చెందిన వ్యక్తులేననే ఆరోపణలు బలంగా వినిస్తున్నాయి. పోలీసులు కూడా ఆ కోణంలో మొదటి నుంచి దర్యాప్తు చేస్తున్నారు. చోరీకి గురైన వస్తువులు మండలంలో పరిధిలో దొరుకుతుండటం కూడా స్థానికుల పాత్ర ఉన్నది అనే అనుమానాలకు బలం చేకురుస్తున్నాయి.