సాక్షి, హైదరాబాద్: అంతరాష్ట్ర దొంగను ఆదిబట్ల పోలీసులు అరెస్టు చేశారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కండవల్లి సురేష్ అనే వ్యక్తి నకిలీ తాళాలతో బైక్‌లు, కార్లు ఎత్తుకెళ్లడమేగాక ఇళ్ళల్లో బంగారు ఆభరణాలు చోరీ చేస్తుంటాడు. ఇతడిని పోలీసులు అరెస్టు చేసి ఎల్బి నగర్లోని డిసిపి కార్యాలయంలో మీడియా ఎదుట ప్రవేశపెట్టగా డీసీపీ వెంకటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. నిందితుని వద్ద నుంచి రూ.7.5 లక్షల విలువైన ఒక కారు, 3 బైక్‌లు, 7 తులాల బంగారు ఆభరణాలు, రూ.15 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతనిపై ఏడు కేసులు నమోదై ఉన్నాయని ఆయన తెలిపారు.