Osmaina hospital
-
శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం బాధాకరం
సాక్షి, హైదరాబాద్ : బీజేపీ కార్యాలయం ముందు ఆత్మహత్యయత్నానికి పాల్పడి శ్రీనివాస్‌ను బీజేపీ నేతలు పరామర్శించారు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతడిని ఆదివారం కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, లక్ష్మణ్, చింతల రామచంద్రారెడ్డి, ప్రేమేందర్ రెడ్డి తదితరులు పరామర్శించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. ‘శ్రీనివాస్ ఆత్మహత్యాయత్నం బాధాకరం. పార్టీ కార్యకర్తగా చాలా కాలంగా శ్రీనివాస్ పనిచేస్తున్నాడు. అతడు మాట్లాడలేని స్థితిలో ఉన్నాడు. శ్రీనివాస్‌కు 58శాతం గాయాలు అయినట్లు వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ రాక్షస క్రీడ ఆడుతున్నారు. ప్రశ్నించేవారిపై ప్రభుత్వం లాఠీఛార్జ్ చేసి, జైళ్లకు పంపుతోంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ధైర్యంగా పోరాడదాం. బీజేపీ కార్యకర్తలు ఆత్మహత్యలు చేసుకోవద్దని పిలుపునిస్తున్నాను. తెలంగాణలో కాషాయ జెండాను రెపరెపలాడించేవరకూ కష్టపడి పనిచేద్దాం’ అని కోరారు. (సంజయ్ అరెస్ట్.. పెట్రోల్ పోసుకున్న కార్యకర్త) కాగా మెరుగైన చికిత్స నిమిత్తం శ్రీనివాస్‌ను బీజేపీ నేతలు సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు. శ్రీనివాస్‌కు మెరుగైన చికిత్స అందించాలని బండి సంజయ్ ఈ సందర్భంగా వైద్యులకు సూచించారు. ఇటీవల బండి సంజయ్‌ను టీఆర్ఎస్ ప్రభుత్వం అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తమ్మలానిగూడెంకు చెందిన శ్రీనివాస్ వంటిపై పెట్రోల్ పోసుకుని ఇవాళ ఉదయం బీజేపీ కార్యాలయం వద్ద ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా యశోదా ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. (నిరూపిస్తే.. ఉరేసుకుంటా: బండి సంజయ్) -
ఎట్టకేలకు ఉస్మానియా ఖాళీ
సాక్షి, హైదరాబాద్ : పూర్తిగా శిథిలావస్థకు చేరిన చారిత్రక ఉస్మానియా ఆసుపత్రిలోని పాత భవనాన్ని వెంటనే ఖాళీ చేయాలని డీఎంఈ రమేశ్‌రెడ్డి బుధవారం ఆదేశాలు జారీ చేశారు. భవనాన్ని వెంటనే ఖాళీ చేసి సీల్ వేయాలని ఆదేశించారు. కూలేందుకు సిద్ధంగా ఉన్న పాత భవనంలోని రోగులు, ఇతర కార్యాలయాలను వేరే భవనాల్లో సర్దుబాటు చేయాలని సూచించారు. ఆదేశాలు జారీ కావడంతో ఆస్పత్రి యంత్రాంగం వెంటనే చర్యలకు ఉపక్రమించింది. భవనాన్ని ఖాళీ చేసింది. 1925లో ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని నిర్మించారు. నిర్వహణ లోపం వల్ల ఇప్పటికే శిథిలావస్థకు చేరుకున్న ఈ భవనం పై అంతస్తుల్లోని పైకప్పు తరచూ పెచ్చులూడి పడుతోంది. గోడలు బీటలు వారాయి. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితి. దీనికి తోడు ఇటీవల కురిసిన వర్షానికి పాత భవనంలోని వార్డులను వరద ముంచెత్తడం, మురుగు నీటి మధ్యే రోగులకు చికిత్స అందించాల్సి రావడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇక్కడ వైద్య సేవలు అందించడం ఏ మాత్రం సురక్షితం కాదని భావించిన ప్రభుత్వం తక్షణమే భవనాన్ని ఖాళీ చేయాలని బుధవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ప్రస్తుతం ఆయా వార్డుల్లో చికిత్స పొందుతున్న రోగులను ఇతర భవనాల్లో సర్దుబాటు చేశారు. ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో ఇటీవలే ఆధునికరించిన హౌజ్ సర్జన్ల భవనంలో 150 పడకలు, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో రోగుల సహాయకుల కోసం ఏర్పాటుచేసిన రాత్రి వసతిగృహంలో 250 పడకలు, మరో భవనంలో ఇంకో 100 పడకలను సర్దుబాటు చేశారు. సూపరింటెండెంట్ కార్యాలయం సహా పలు ఆపరేషన్ థియేటర్లను ఖాళీ చేస్తున్నారు. ఉస్మానియా పాత భవనాన్ని యుద్ధ ప్రాతిపదికన కూల్చివేసి అక్కడ కొత్తగా ట్విన్ టవర్స్‌ను ఏడాదిలోపు పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. పాత భవనాన్ని కూల్చి అదే స్థలంలో నిర్మాణం చేపట్టిన తర్వాత మిగతా భవనాలను కూల్చివేయనున్నారు. భవిష్యత్తులో రోగుల రద్దీని తట్టుకోవాలంటే.. ఇప్పటికే గాంధీ, కింగ్‌కోఠి ఆస్పత్రులను ప్రభుత్వం పూర్తిస్థాయి కోవిడ్ సెంటర్లుగా మార్చింది. సాధారణ రోగులకు ప్రస్తుతం అక్కడ చికిత్సలు అందించలేని పరిస్థితి. తాజాగా ఉస్మానియా పాత భవనం కూడా ఖాళీ చేస్తున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ మాసాల్లో జ్వరపీడితుల సంఖ్య భారీగా పెరిగే అవకాశం ఉంది. వెయ్యి పడకల సామర్థ్యం ఉన్న ఉస్మానియా ఆస్పత్రిలో ఇప్పటికే 1,500 మంది వరకు చికిత్స పొందుతున్నారు. రాబోయే రోజుల్లో పెద్ద సంఖ్యలో వచ్చే రోగులకు ఇక్కడ చికిత్సలు ఇబ్బందిగా మారుతాయి. ఇటీవల గచ్చిబౌలిలో ప్రారంభించిన తెలంగాణ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)ను తాత్కాలికంగా ఉస్మానియాకు కేటాయించి, ప్రస్తుతం ఇక్కడ ఉన్న çకొన్ని విభాగాలను అక్కడికి తరలించడం వల్ల రోగుల రద్దీని నియంత్రించవచ్చని వైద్యులు భావిస్తున్నారు. ప్రభుత్వం కూడా ఇందుకు సుముఖంగా ఉన్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ప్రతిపాదించిన పదేళ్ల తర్వాత మళ్లీ కదలిక చారిత్రక ఈ భవనంలో వైద్యసేవలు ఇటు రోగులకు..అటు వైద్యులకు ఏమాత్రం శ్రేయస్కరం కాదని దివంగత నేత ,అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి భావించారు. నాలుగు ఎకరాల విస్త్రీర్ణంలో ఏడు అంతస్థుల భవనాన్ని నిర్మించాలని భావించి ఆ మేరకు 2009లో రూ.5 కోట్లు మంజూరు చేశారు. ఆయన మరణం తర్వాత అధికారంలోకి వచ్చిన రోశయ్య 2010 బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఆయన రాజీనామా తర్వాత సీఎంగా బాధ్యతలు స్వీకరించిన కిరణ్ కుమార్‌రెడ్డి ఇందుకు రూ.50 కోట్లు కేటాయించారు. శంకుస్థాపన కోసం ఓ పైలాన్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఏడు అంతస్థుల భవనానికి ఆర్కియాలజీ విభాగం అ«భ్యంతరం చెప్పడంతో నాలుగు అంతస్థులకు కుదించారు. 2014 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ఆస్పత్రిని సందర్శించారు. వారం రోజుల్లో పాత భవనాన్ని ఖాళీ చేసి, దాని స్థానంలో కొత్త భవనం నిర్మించనున్నట్లు ప్రకటించారు. ఆమేరకు తెలంగాణ తొలి బడ్జెట్లో రూ.200 కోట్లు కేటాయించారు. తాత్కాలికంగా పేట్లబురుజు ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రులకు పలు వార్డులను తరలించాలని నిర్ణయించి, ఆ మేరకు ఆయా ఆస్పత్రుల్లో పడకలు కూడా సిద్ధం చేశారు. అక్కడికి వెళ్లేందుకు వైద్యులు నిరాకరించడంతో రోగుల తరలింపు నిలిచిపోయింది. ఇదే సమయంలో పాతభవనం కూల్చివేతకు ఇటు ఆర్కియాలజీ..అటు ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రభుత్వం వెనక్కు తగ్గింది. ఇదే ఆస్పత్రి ప్రాంగణంలో ఖాళీగా ఉన్న స్థలంలో మరో రెండు బహుళ అంతస్థుల భవనాలు నిర్మించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పటివరకు పునాదిరాయి కూడా వేయలేదు. రక్షణ లేని ఈ పాతభవనంలో వైద్యసేవలు అందించలేక పోతున్నామని ఆస్పత్రి వైద్య సిబ్బంది 2018లో వందరోజుల పాటు ఆందోళన చేపట్టింది. అయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా వార్డుల్లోకి వరద నీరు చేరడంతో పాతభవనం ఖాళీ, కొత్త భవన నిర్మాణ అంశం మళ్లీ తెరపైకి వచ్చింది. -
ఉస్మానియా ఆస్పత్రిని సందర్శించిన బండి సంజయ్
-
ఉస్మానియా ఆస్పత్రిలో కలకలం
సాక్షి, హైదరాబాద్: ఉస్మానియా ఆస్పత్రి ఐసోలేషన్ వార్డులో ఉన్న కొందరు వ్యక్తులు మంగళవారం వైద్యులపై దాడికి దిగారు. పాజిటివ్ వచ్చిన వారితో కలిపి తమను వార్డులో ఉంచడం ఏమిటంటూ అనుమానిత లక్షణాలతో ఉన్న ఓ వ్యక్తి బంధువులు తోపులాటకు, వాగ్వాదానికి దిగారు. ఈ గొడవ జరుగుతుండగానే.. అనుమానితుడిని అతని కుమారుడు చెప్పాపెట్టకుండా పాతబస్తీలోని ఇంటికి తీసుకెళ్లిపోయాడు. తీరా అనంతరం వచ్చిన రిపోర్టులో అతని తండ్రికి పాజిటివ్ రావడం మరింత కలకలం సృష్టించింది. వాగ్వాదం.. తోపులాట ఉస్మానియా ఆస్పత్రి ఏఎంసీ వార్డులో ఏర్పాటుచేసిన ఐసోలేషన్ వార్డులో 12 మంది ఉన్నారు. వీరిలో ఇద్దరికి మంగళవారం పాజిటివ్ వచ్చింది. వీరిద్దరిని గాంధీ ఆస్పత్రికి తరలించే ప్రక్రియను వైద్యులు మొదలుపెట్టారు. అంతలో వార్డులో ఉన్న మిగిలిన వారు.. వైరస్ ఒకరి నుంచి మరొకరికి విస్తరించే ప్రమాదం ఉండటంతో ఈ వార్డులో ఉండలేమని, డిశ్చార్జ్ చేస్తే ఇంటికి వెళ్లిపోతామంటూ అనుమానిత లక్షణాలున్న ఓ వ్యక్తి తాలూకు బంధువులు ఆందోళనకు దిగారు. టెస్ట్ రిపోర్టులు రావాలని, అందులో నెగెటివ్ వస్తే డిశ్చార్జ్ చేస్తామని, అప్పటివరకు సంయమనం పాటించాలని విధుల్లో ఉన్న జూనియర్ వైద్యులు చెప్పారు. అయినా వారు వినిపించుకోకుండా బయటికి వెళ్లేందుకు యత్నిస్తూ, అడ్డుకున్న వైద్యులతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో ఓ జూనియర్ వైద్యుడు కిందపడిపోయారు. గొడవ జరుగుతుండగానే, పాజిటివ్‌గా తేలిన ఇద్దరినీ వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ స్పందించారు. ప్రాణాలు పణంగా పెట్టి సేవలందిస్తున్న వైద్యులపై దాడి చేయడం హేయమన్నారు. దాడిచేసిన వారిపై చర్యలు తీసుకుంటామని, వైద్యులకు రక్షణ కల్పిస్తామని హామీనిచ్చారు. సమస్యను పరిష్కరించాలని ఆస్పత్రి సూపరింటెండెంట్‌కు ఫోన్లోనే ఆదేశాలు జారీ చేశారు. రక్షణ కల్పించాలంటూ ‘జూడా’ల ఆందోళన విధుల్లో ఉన్న వైద్యులపై దాడి చేసిన బాధితుడి తరపు బంధువులను కఠినంగా శిక్షించాలని, వైద్యులకు రక్షణ కల్పించాలంటూ పలువురు జూనియర్ డాక్టర్లు ఆస్పత్రి సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. ఐసోలేషన్ వార్డుల్లో పనిచేస్తున్న జూడాలకు కనీస రక్షణ లేదని, ఇటు వైరస్‌తో, అటు రోగులతో ఇబ్బంది పడుతున్నామని పోలీసులకు ఫిర్యాదు చేశారు. తండ్రిని తీసుకుని ఇంటికి..రిపోర్ట్‌లో పాజిటివ్ జూనియర్ వైద్యులతో ఒకపక్క వాగ్వాదం, తోపులాట జరుగుతుండగానే, ఐసోలేషన్ వార్డులో ఉన్న తన తండ్రిని తీసుకుని అతని కుమారుడు వైద్యుల కళ్లుగప్పి ఇంటికి వెళ్లిపోయాడు. అనంతరం కొద్దిసేపటికే రిపోర్ట్లు రావడం, అందులో అతని తండ్రికి పాజిటివ్‌గా తేలడంతో వైద్యులు ఉలిక్కిపడ్డారు. పాతబస్తీకి చెందిన అతనిని గాలించి.. తిరిగి ఆస్పత్రికి తీసుకొచ్చారు. అతనితో పాటు ఐసోలేషన్ వార్డులో ఉన్న అందరినీ వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించాలని డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఉస్మానియాలోని ఐసోలేషన్ వార్డు దాదాపు ఖాళీ అయ్యింది. కాగా, పాజిటివ్ వచ్చిన వారితో కలిపి తమను ఐసోలేషన్ కేంద్రాల్లో ఉంచడంపై కరోనా అనుమానిత లక్షణాలున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే వైద్యులపై దాడులు జరుగుతున్నాయి. కాగా, మంగళవారం నాటి ఘటనకు సంబంధించి.. పాజిటివ్ వచ్చిన వారి పక్కనుంటే తమకూ వైరస్ సోకుతుందనే భయంతోనే అలా ప్రవర్తించామని, వైద్యుల మనసు నొప్పించినందుకు తమను క్షమించాలని, వైద్యులపై తమకెలాంటి ద్వేషం లేదని దాడికి పాల్పడిన వ్యక్తులు క్షమాపణ కోరారు. -
ఉదయ్ మృతికి నారాయణ యాజమాన్యానిదే బాధ్యత
సాక్షి, హైదరాబాద్ : రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన నారాయణ కళాశాల విద్యార్థుల కుటుంబసభ్యులు... యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్రనగర్‌లో స్నేహితుడి పుట్టినరోజు వేడుకలకు వెళ్లి తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోగా, మరో ఆరుగురు గాయపడిన విషయం తెలిసిందే. వీరంతా మాదాపూర్‌లో నారాయణ క్యాంపస్‌లో మెడిసిన్‌కి లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటూ హాస్టల్లో ఉంటున్నారు. అయితే ఫ్రెండ్ బర్త్‌డేకి పర్మిషన్ తీసుకోకుండానే గోడ దూకి బయటకు వెళ్లారు. ఈ క్రమంలో రాజేంద్రనగర్ నుంచి తిరిగి వస్తుండగా ఆరంఘర్ చౌరస్తా సమీపంలో వారు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తరుణ్, ఉదయ్ సంఘటనా స్థలంలోనే చనిపోయారు. ఇక గాయపడినవారిని చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషయంగా ఉంది. చదవండి: విషాదం: ఫ్రెండ్ బర్త్‌డే పార్టీకి... గోడ దూకి... మరోవైపు కేసు నమోదు చేసిన పోలీసులు పోస్ట్‌మార్టం నిమిత్తం తరుణ్, ఉదయ్ మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కుమారుడి మరణవార్తను తెలుసుకున్న ఉదయ్ కుటుంబసభ్యులు ఉస్మానియాకు చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. తన సోదరుడి మృతికి ఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలంటూ మృతుడి సోదరుడు కాలేజీ ఉద్యోగిని నిలదీశాడు. అనుమతి లేకుండా విద్యార్థులు బయటకు వెళుతుంటే యాజమాన్యం నిద్రపోతుందా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే విద్యార్థులు కుటుంబసభ్యులకు సమాధానం చెప్పలేక నారాయణ కాలేజీ ఉద్యోగి అక్కడ నుంచి పరారయ్యాడు. మృతుడు ఉదయ్ స్వస్థలం మహబూబ్‌నగర్ జిల్లా కోస్గి మండలం గుండుమాల్. ఇక తరుణ్ స్వస్థలం బెంగళూరు కాగా, కుటుంబం బోయినపల్లిలో నివాసం ఉంటోంది. కాలేజీ యాజమాన్యంపై నమ్మకంతో తమ పిల్లలను చేరిస్తే వారికి బాధ్యత ఉండదా అని ఉదయ్ మేనత్త మండిపడ్డారు. ఉదయ్ మృతికి నారాయణ కాలేజీ యాజమాన్యం బాధ్యత వహించాలన్నారు. కాగా తొమ్మిది మంది హాస్టల్ విద్యార్థులు అదృశ్యం అయ్యారంటూ నారాయణ కాలేజీ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కోడెల మృతదేహానికి పోస్ట్‌మార్టం పూర్తి
సాక్షి, హైదరాబాద్ : టీడీపీ సీనియర్ నేత, మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు అంత్యక్రియలు మంగళవారం నర్సరావుపేటలో జరగనున్నాయి. మరోవైపు కోడెల మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రిలో పోస్ట్‌మార్టం పూర్తియింది. ఇద్దరు ప్రొఫెసర్లు, ఓ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్ట్‌మార్టం నిర్వహించగా, ఈ ప్రక్రియను పోలీసులు వీడియో రికార్డు చేశారు. అలాగే కోడెల మృతదేహాన్ని ఫోరెన్సిక్ బృందం పరిశీలించగా, ఆయన చెవుల దగ్గర నుంచి గొంతు మీదగా ఉరి వేసుకున్నట్లు గుర్తులు ఉన్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ భవన్‌కు కోడెల భౌతికకాయం పోస్ట్‌మార్టం అనంతరం భౌతికకాయాన్ని పార్టీ నేతలు, కార్యకర్తల సందర్శనార్థం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తరలించారు. టీడీపీ నేతలు ట్రస్ట్ భవన్ చేరుకుని, కోడెలకు నివాళులు అర్పిస్తున్నారు. ఇవాళ రాత్రి అక్కడే ఉంచి, రేపు (మంగళవారం) ఉదయం ఆరు గంటలకు హైదరాబాద్‌లో కోడెల పార్దీవదేహంతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకష్ రోడ్డు మార్గంలో బయల్దేరనున్నారు. సూర్యాపేట, విజయవాడ మీదగా మధ్యాహ్నం గుంటూరులోని టీడీపీ పార్టీ కార్యాలయంలో సందర్శకుల కోసం కొద్దిసేపు ఉంచి, అనంతరం నర్సరావుపేట తీసుకు వెళతారు. మరోవైపు కోడెల అనుమానాస్పద మృతిపై బంజారాహిల్స్ ఏపీసీ ఆధ్వర్యంలో సిట్ ఏర్పాటు అయింది. సిట్ బృందం కోడెల నివాసంలో తనిఖీలు నిర్వహించి, ప్రత్యక్ష సాక్షులు, సెక్యూరిటీ, డ్రైవర్‌ను ప్రశ్నించారు. క్లూస్ టీమ్ కూడా పలు ఆధారాలను సేకరించింది. చదవండి: శివరామే తండ్రిని హత్య చేశాడని ఫిర్యాదు కోడెల మృతితో షాక్‌కు గురయ్యాను... కోడెల మరణం: క్షణక్షణం అనేక వార్తలు! కోడెల మెడపై గాట్లు ఉన్నాయి కాబట్టి: సోమిరెడ్డి కోడెల మృతిపై అనేక సందేహాలు: అంబటి కోడెల మృతిపై కేసు నమోదు కోడెల కొడుకు ఆస్పత్రికి ఎందుకు రాలేదు? కోడెలది ఆత్మహత్యా? సహజ మరణమా? సుదీర్ఘ రాజకీయ జీవితం.. అనూహ్య విషాదం! కోడెల శివప్రసాదరావు కన్నుమూత -
వృద్ధదంపతుల ఆత్మహత్యాయత్నం, భార్య మృతి
హైదరాబాద్: నగరంలో ఓ విషాదం చోటుచేసుకుంది. రామంతాపూర్ వివేక్‌నగర్ కాలనీలో వృద్ధదంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భార్య మృతిచెందగా, భర్త పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. భర్తను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరాలేదు.