Osmania university students
-
వినియోగదారుల పాత్ర ఉండాలి: అకున్ సబర్వాల్
సాక్షి, హైదరాబాద్: ప్రముఖ వ్యక్తుల ఫొటో లు, పేర్లను వారి అనుమతి లేకుండా చట్ట విరుద్ధంగా ప్రచారానికి వాడుకుంటున్న ఒక రెడీమేడ్ షాపుపై ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి.. వినియోగదారుల సలహా కేంద్రానికి ఫిర్యాదు చేసి షాపు యాజమాన్యంపై విజయం సాధించారు. ఫిర్యాదుపై వెంటనే స్పందించిన సలహా కేంద్రం నిర్వాహకులు షాపు యజమానులకు నోటీసులు జారీ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఫొటో వాడుకున్నందుకు సలహా కేంద్రం రూ.10 వేల జరిమానా విధించింది. ఈ జరిమానా మొత్తాన్ని వినియోగదారుల సలహా కేంద్రం బి.ఆకాశ్ కుమార్‌కు అందజేసింది. ఈ సందర్భంగా ఆకాశ్‌ను రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి అకున్ సబర్వాల్ అభినందించారు. ఇటువంటి కేసు మా విభాగానికి రావడం ఇది తొలిసారి అని, ఆకాశ్ లాగా ప్రతి ఒక్క వినియోగదారుడు వివిధ రూపాల్లో జరుగుతున్న మోసాలను గుర్తించి ప్రభుత్వానికి తగిన సమాచారం ఇవ్వడంలో తమ వంతు పాత్ర పోషించాలని అన్నారు. -
విజయ్ ని కోర్టులో హాజరుపరచాలి: వరవరరావు
వరంగల్ కేసీఆర్ సభలో నిరసన తెలిపిన ఉస్మానియా ఎంటెక్ విద్యార్థి మనువాడ విజయ్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ప్రజా సంఘాలు తెలిపాయి. విజయ్ తో పాటు అతని తల్లి దండ్రులు కూడా పోలీసులు పట్టుకెళ్లారని.. పేర్కొన్నారు. వెంటనే విజయ్, అతడి తల్లి దండ్రులను పోలీసులు కోర్టులో హాజరు పరచాలని డిమాండ్ చేశారు. కాగా.. విజయ్ కి మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు వాదిస్తున్నారు. మరో వైపు కేసీఆర్ సభలో నిరసన తెలిపి నందుకే పోలీసులు విజయ్ పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నారని ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. పోలీసులు అదుపులోకి తీసుకున్న ఉస్మానియా ఎంటెక్ విద్యార్థి మనువాడ విజయ్ ని వెంటనే కోర్టులో హాజరు పరచాలని విప్లవ రచయితలసంఘం నేత వరవరరావు డిమాండ్ చేశారు. కొత్తగూడెం పోలీసులు మనువాడ విజయ్ ని అదుపులోకి తీసుకున్నారని ఆయన తెలిపారు. అక్రమంగా తమ కస్టడీలో పెట్టుకున్న మనువాడ విజయ్ ని పోలీసులు వేధింపులకు గురిచేస్తున్నారని ఆయన ఆరోపించారు. -
ఓయూలో ఎంపీ సీతారాం ఘెరావ్
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు టీఆర్ఎస్ ఎంపీ ప్రొ.సీతారాం నాయక్‌ను ఘెరావ్ చేశారు. బుధవారం క్యాంపస్‌లోని లైబ్రరీలో పుస్తక ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరై తిరిగి వెళ్తున్న ఎంపీని విద్యార్థులు చుట్టుముట్టారు. ఈ సందర్భంగా తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ జేఏసీ చైర్మన్, ఎస్టీ రిజర్వేషన్ల సాధన కమిటీ చైర్మన్ కళ్యాణ్ మాట్లాడుతూ ప్రభుత్వానికి తొత్తుగా మారిన ఎంపీ ప్రొ.సీతారాం నాయక్ తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లక్ష ఉద్యోగాల భర్తీకి ప్రకటన విడుదల చేయాలని, గ్రూప్-2లో ఇంట ర్వ్యూ విధానాన్ని ఎత్తివేయాలని, ఎస్టీలకు పది శాతం రిజర్వేషన్లను పెంచాలని, సీఎం కేసీఆర్ ప్రకటించిన ఓయూ విద్యార్థుల రూ.9 కోట్ల మెస్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని కేసీఆర్‌కు తాకట్టుపెట్టిన ఎస్టీ ప్రజాప్రతినిధులకు తగిన బుద్ధిచెప్పాలన్నారు. అనంతరం ఎంపీ సీతారాం నాయక్ మాట్లాడుతూ విద్యార్థులవి న్యాయమైన డిమాండ్లని, ఐదుగురు విద్యార్థి నాయకులు తన వెంట వస్తే సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి సమస్యలను తీసుకెళ్లి పరిష్కరించేలా చూస్తానని తెలిపారు. అనంతరం పోలీసుల సహకారంతో లైబ్రరీ లోపలి నుంచి బయటకు వచ్చిన ఎంపీ తన వాహనంలో వెళ్లిపోయారు. ఘెరావ్ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు నరేందర్‌పవార్, అర్జున్‌బాబు, రవీంద్రనాయక్, సుబ్బు, శ్రీకాంత్, శ్యాం, నవీన్, రమేష్, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. బంజారా విద్యార్థుల ఖండన.. ఓ గిరిజన ఎంపీని అడ్డుకోవడం దుర్మార్గమని ఆల్ బంజారా విద్యార్థి సంఘం అధ్యక్షుడు, టీఎస్‌జాక్ చైర్మన్ కరాటే రాజు, టీఆర్ఎస్వీ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రవితేజా, టీఆర్ఎస్ నేతలు శంకర్‌నాయక్, నెహ్రునాయక్ పేర్కొన్నారు. విద్యార్థుల సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వం సాకూలంగా ఉందని తెలిపారు. -
ఓయూలో కేసీఆర్ దిష్టిబొమ్మకు శవయాత్ర
హైదరాబాద్: ఓయూకు చెందిన ఖాళీ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై నిరసనలు ఆగడం లేదు. వరుసగా మూడోరోజు కూడా ఆందోళనతో ఓయూ క్యాంపస్ దద్ధరిల్లింది. కాగా కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు బుధవారం, గురువారం ఓయూ బంద్ కు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ప్రభుత్వ విధానాలను తీవ్రంగా నిరసిస్తూ సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. -
ఓయూలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్థం
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తానని ఇచ్చిన హామీని వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్‌ను ఓయూ విద్యార్థులు డిమాండ్ చేశారు. కేసీఆర్ హామీకి నిరసనగా విద్యార్థులు మంగళవారం ఉస్మానియా యూనివర్శిటీలో ఆందోళనకు దిగారు. ఓయూ విద్యార్థులకు ఉస్మానియా యూనివర్శిటీ భూముల జోలికి వస్తే ఊరుకోమని వారు ఈ సందర్భంగా కేసీఆర్‌ను హెచ్చరించారు. అనంతరం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా పార్శీ గుట్టలోని బస్తీ వాసులకు ఓయూ భూముల్లో నివాసాలు కట్టిస్తానని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ ప్రకటనపై వివిధ రాజకీయపార్టీల నేతలు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. -
కోదండరామ్ ఇంటి ముట్టడి
హైదరాబాద్: కాంట్రాక్టు ఉద్యోగుల పర్మనెంట్ ప్రకటనను నిరసిస్తూ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు శనివారం తార్నాకలోని జేఏసీ చైర్మన్ కోదండరామ్ ఇంటిని ముట్టడించారు. తమ ఉద్యమానికి మద్దతు తెలపాలని డిమాండ్ చేశారు. తొలుత ప్లకార్డులతో నినాదాలు చేస్తూ ఓయూ క్యాంపస్ నుంచి ర్యాలీగా కోదండరాం ఇంటిని ముట్టడించేందుకు విద్యార్థులు బయలుదేరారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థులను బారికేడ్లు, బందోబస్తుతో అడ్డుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు విద్యార్థి నేతలకు మధ్య వాగ్వాదం జరిగింది. భారీ సంఖ్యలో హాజరైన విద్యార్థులు చివరకు కోదండరామ్ ఇంటికి చేరుకున్నారు. పోలీసు బందోబస్తు ఉన్నప్పటికీ అక్కడే బైఠాయించి నినాదాలు చేశారు. విద్యార్థులకు అండగా ఓయూలోని అన్ని విద్యార్థి సంఘాల నాయకులు వచ్చారు. తెలంగాణ ఏర్పడితే కొత్త ఉద్యోగాలు వస్తాయనే ఆశతో ఉద్యమంలో కీలక పాత్ర పోషిస్తే, కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ చేస్తానని నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనలు చేస్తున్నాడని విద్యార్థులు మండిపడ్డారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రకటన వెలువడే వరకు ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. విద్యార్థుల ఆందోళనతో ఇంట్లో నుంచి బయటకు వచ్చిన కోదండరామ్ వారితో మాట్లాడారు. కేసీఆర్ ప్రకటనతో తనకు ఏ మాత్రం సంబంధం లేదని స్పష్టం చేశారు. జేఏసీగా విద్యార్థులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జేఏసీలో ఈ విషయమై చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. దీంతో విద్యార్థులు శాంతించి ఆందోళన విరమించారు. కొనసాగిన ఆందోళన కాంట్రాక్టు ఉద్యోగులను పర్మనెంట్ ప్రకటనను నిరసిస్తూ ఓయూ విద్యార్థులు చేపట్టిన ఆందోళన శనివారం మూడో రోజుకు చేరుకుంది. విద్యార్థుల ర్యాలీని అడ్డుకోవడంతో ఓయూ పోలీస్ స్టేషన్ వద్ద ధర్నాకు దిగారు. -
కేసీఆర్‌పై ఓయూ విద్యార్థులు 'ఆగ్రహం'
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇంకా పూర్తిగా రూపుదిద్దుకోకమందే, ఆ రాష్ట్ర ఏర్పాటులో కీలకంగా వ్యహరించిన టీఆర్ఎస్, ఓయూ విద్యార్థులు మధ్య పోరు రోజురోజూకు ఉధృతమవుతుంది. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ తెలంగాణ పునర్ నిర్మాణం అంటే దొరల తెలంగాణనే అని ఓయూ విద్యార్థులు ఆరోపించారు. గురువారం ఓయూ విద్యార్థులు హైదరాబాద్‌లో ని యూనివర్శిటీ క్యాంపస్‌లో మాట్లాడుతూ... తెలంగాణ ప్రాంత విద్యార్థుల పోరాటం వల్లే ప్రత్యేక రాష్ట్రం వచ్చిందని వారు గుర్తు చేశారు. తెలంగాణ పునర్ నిర్మాణం పేరుతో 3 బ్యాంక్ అకౌంట్ నంబర్లు ఇచ్చి బహిరంగ వసూళ్లకు పాల్పడుతోందని విద్యార్థులు టీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సీఎం అయితే ఆయన జేబు నింపుకోవడానికే ఒకరిద్దరు విద్యార్థి నాయకులకు మాత్రమే టీఆర్ఎస్ ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నారన్నారు. విద్యార్థి నాయకులలో ఒకరిద్దరికి టికెట్లు ఇచ్చి తమను సంతృప్తి పరచడానికి టీఆర్ఎస్ నాటకాలు అడుతుందని ఆ పార్టీపై తెలంగాణ విద్యార్థులు తీవ్రస్థాయిలో ధ్వజమేత్తారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటులో తీవ్రంగా కృషి చేసిన ఇద్దరు విద్యార్థి సంఘం నాయకులకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చేందుకు ఇప్పటికే టీఆర్ఎస్ రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ పోరాటంలో ఎంతో మంది విద్యార్థులు పాల్గొన్నారని, అయిన ఒకరిద్దరికి మాత్రమే ఎమ్మెల్యే అభ్యర్థులుగా నిలబెట్టేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలపై ఓయూ విద్యార్థులు మండిపడుతున్నారు. -
పార్టీ ఏర్పాటుకు ఈసీకి ఓయూ విద్యార్థుల దరఖాస్తు
న్యూఢిల్లీ: తెలంగాణ స్టూడెంట్స్ ప్రజా పార్టీ పేరుతో కేంద్ర ఎన్నికల సంఘానికి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు దరఖాస్తు చేశారు. విద్యార్థుల త్యాగాలను టీఆర్ఎస్, కాంగ్రెస్, టీడీపీలు తమకు అనుకూలంగా మలుచుకుని గెలవాలని చూస్తున్నాయని ఓయూ విద్యార్థి నాయకుడు కరాటే రాజు ఆరోపించారు. తెలంగాణ ప్రత్యేక ఏర్పడ్డాక ఈ పార్టీలను తరిమికొడతామని ఆయన హెచ్చరించారు. బంగారు తెలంగాణను తామే నిర్మించుకుంటామన్నారు. జనవరి 20న 5 లక్షల మంది విద్యార్థులతో తెలంగాణ స్టూడెంట్స్ ప్రజా పార్టీ విధివిధానాలు ప్రకటిస్తామని కరాటే రాజు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం కూడా విద్యార్థి ఉద్యమం నడుస్తుందన్నారు.