హైదరాబాద్: ఓయూకు చెందిన ఖాళీ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై నిరసనలు ఆగడం లేదు. వరుసగా మూడోరోజు కూడా ఆందోళనతో ఓయూ క్యాంపస్ దద్ధరిల్లింది. కాగా కేసీఆర్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థి సంఘాలు బుధవారం, గురువారం ఓయూ బంద్ కు పిలుపు నిచ్చిన సంగతి తెలిసిందే. బుధవారం ఉదయం ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల వద్ద విద్యార్థులు ముఖ్యమంత్రి దిష్టిబొమ్మకు శవయాత్ర నిర్వహించారు. ప్రభుత్వ విధానాలను తీవ్రంగా నిరసిస్తూ సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు.