ఓయూలో కేసీఆర్ దిష్టిబొమ్మ దగ్థం
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్శిటీ భూముల్లో పేదలకు ఇళ్లు కట్టిస్తానని ఇచ్చిన హామీని వెంటనే వెనక్కి తీసుకోవాలని సీఎం కేసీఆర్ను ఓయూ విద్యార్థులు డిమాండ్ చేశారు. కేసీఆర్ హామీకి నిరసనగా విద్యార్థులు మంగళవారం ఉస్మానియా యూనివర్శిటీలో ఆందోళనకు దిగారు. ఓయూ విద్యార్థులకు ఉస్మానియా యూనివర్శిటీ భూముల జోలికి వస్తే ఊరుకోమని వారు ఈ సందర్భంగా కేసీఆర్ను హెచ్చరించారు.
అనంతరం ఓయూ ఆర్ట్స్ కాలేజీ వద్ద కేసీఆర్ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. స్వచ్ఛ హైదరాబాద్లో భాగంగా పార్శీ గుట్టలోని బస్తీ వాసులకు ఓయూ భూముల్లో నివాసాలు కట్టిస్తానని కేసీఆర్ ప్రకటించారు. కేసీఆర్ ప్రకటనపై వివిధ రాజకీయపార్టీల నేతలు, విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే.