Other companies
-
ఎఫ్ఎంసీజీ దిగ్గజాల షాపింగ్
ముంబై: ఇటీవల కొద్ది నెలలుగా ఎఫ్ఎంసీజీ రంగ దిగ్గజాలు షాపింగ్‌లో బిజీగా కనిపిస్తున్నాయి. ఇతర సంస్థల కొనుగోళ్లకు తెరతీస్తున్నాయి. ప్రధానంగా ఆధునికతరం డిజిటల్ బ్రాండ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న చిన్నతరహా కంపెనీలు లక్ష్యంగా షాపింగ్‌ను చేపడుతున్నాయి. జెన్‌జెడ్ వినియోగదారులకు చేరువ అవుతున్నాయి. డైరెక్ట్‌టు కన్జ్యూమర్ బ్రాండ్స్ సోషల్ మీడియా, డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వినియోగదారులను వేగంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే పరిమిత పంపిణీ వ్యవస్థ, నిధులలేమి కారణంగా పలు కంపెనీలు కార్యకలాపాలను విస్తరించలేకపోతున్నాయి. కొనుగోళ్ల బాటలో దీంతో ఎఫ్ఎంసీజీ కంపెనీలు హెచ్‌యూఎల్, గోద్రెజ్ ఆగ్రోవెట్, ఐటీసీ చిన్న సంస్థలను సొంతం చేసుకుంటున్నాయి. దీంతో చిన్నతరహా సంస్థలు తమ ప్రొడక్టులను విస్తారిత మార్కెట్లో పరిచయం చేసేందుకు వీలు కలుగుతోంది. ఇటీవల స్కిన్‌కేర్ బ్రాండ్ మినిమలిస్ట్‌ను హిందుస్తాన్ యూనిలీవర్(హెచ్‌యూఎల్) సొంతం చేసుకోగా.. గోద్రెజ్ ఆగ్రోవెట్.. క్రీమ్‌లైన్ డెయిరీను కొనుగోలు చేసింది. హెచ్‌యూఎల్ తెలంగాణలో పామాయిల్ క్షేత్రాన్ని కొనుగోలు చేసింది. తద్వారా సబ్బులు తదితర ప్రొడక్టుల తయారీలో పామాయిల్ అవసరాలను సర్దుబాటుచేసుకోనుంది. ఈ బాటలో తాజా గా ప్లాస్టిక్ రీసైక్లింగ్ సంస్థ.. లుక్రో ప్లాస్టిసైకిల్లో వాటా కొనుగోలు చేసింది. తద్వారా భవిష్యత్‌లో ఎఫ్ఎంసీజీ కంపెనీలకు తప్పనిసరికానున్న ప్లాస్టిక్ రీసైక్లింగ్ నిబంధనల అమలుకు హెచ్‌యూఎల్ దారి ఏర్పాటు చేసుకుంటున్నట్లు విశ్లేషకులు వివరించారు. మామాఎర్త్ లిస్టింగ్.. దశలవారీగా 100 శాతం వాటా కొనుగోలు చేస్తున్న డైవర్సిఫైడ్ దిగ్గజం ఐటీసీ గూటికి.. ఫ్రోజెన్, రెడీటు ఈట్ ఆహార ప్రొడక్టుల కంపెనీ ప్రసుమ చేరనుంది. తొలుత 43.8 శాతం వాటాతో ప్రారంభించి మూడేళ్లలో పూర్తి వాటాను ఐటీసీ సొంతం చేసుకోనుంది. ఇప్పటికే మరో ఎఫ్ఎంసీజీ దిగ్గజం ఇమామీ.. పురుషుల సౌందర్య పోషక సంస్థ హీలియోస్ లైఫ్‌స్టైల్(ద మ్యాన్ కంపెనీ)ను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఇదేవిధంగా చింగ్స్ సీక్రెట్, స్మిత్ అండ్ జోన్స్ బ్రాండ్ల కంపెనీ క్యాపిటల్ ఫుడ్స్‌ను టాటా గ్రూప్ దిగ్గజం టాటా కన్జూమర్ ప్రొడక్ట్స్ చేజిక్కించుకుంది. తద్వారా ఆర్గానిక్, హెల్త్ ఫుడ్ విభాగంలో కార్యకలాపాలు విస్తరిస్తోంది. కాగా.. మామాఎర్త్ బ్రాండ్ ప్రొడక్టుల డీటూసీ కంపెనీ హోనసా కన్జ్యూమర్ డిజిటల్ మార్గంలో వినియోగదారులను ఆకట్టుకుంటున్నప్పటికీ ఆఫ్‌లైన్‌లో విస్తరించడంలో సవాళ్ల కారణంగా వృద్ధి పరిమితమవుతున్నట్లు విశ్లేషకులు వివరించారు. వెరసి స్టాక్ ఎక్సే్ఛంజీలలో లిస్టింగ్ కంటే ఎఫ్ఎంసీజీ దిగ్గజాల ద్వారా అధిక నిధులు, విస్తరణకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. ప్రీమియం ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ బ్రాండ్ ఇందులేఖను హెచ్‌యూఎల్ కొనుగోలు చేయడంతో పరిమితస్థాయి నుంచి బయటపడి భారీస్థాయిలో అమ్మకాలు సాధిస్తుండటాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఈ బాటలో మినిమలిస్ట్ ప్రొడక్టులు సైతం వేగవంత వృద్ధి సాధించే వీలున్నట్లు అభిప్రాయపడ్డారు. ఎఫ్ఎంసీజీ దిగ్గజాలు కొంతకాలంగా ప్రత్యేక తరహా చిన్నకంపెనీలపై దృష్టి పెట్టాయి. డిజిటల్ బ్రాండ్లతో వినియోగదారులను ఆకట్టుకుంటున్న సంస్థల కొనుగోలుకి ఆసక్తి చూపుతున్నాయి. తద్వారా జెన్‌జెడ్ వినియోగదారులకూ చేరువ అవుతున్నాయి. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
ఉద్యోగానికి సరిగ్గా సరిపోతారు.. అందుకే రిజెక్ట్!
కొత్త ఉద్యోగానికి సరిపడా అర్హతలు లేక చాలా మంది తిరస్కరణను ఎదుర్కొంటారు. తనకు అన్ని అర్హతలు ఉండి, సదరు కొత్త జాబ్‌ను చేయగల సమర్థత ఉన్నాసరే ఉద్యోగాన్ని పొందలేకపోవడంతో ఒక అమ్మాయి ఆశ్చర్యపోయింది. ఉద్యోగం ఇవ్వలేకపోవడానికి గల కారణాన్ని చూసి అవాక్కయింది. తర్వాత ఆ తిరస్కరణ తాలూకు వివరాలను సామాజిక మాధ్యమం ‘ఎక్స్’వేదికగా అందరితో పంచుకుంది. గూగుల్‌లో ఉద్యోగం చేస్తూ.. అనూ శర్మ అనే ఈ అమ్మాయి ప్రతిష్టాత్మక గూగుల్ సంస్థలో ఢిల్లీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్నారు. మెరుగైన ఉపాధి అవకాశాలు, జీతం, కొత్త సవాళ్లను ఎదుర్కోవాలనే ఉద్దేశంతో వేరే సంస్థలో ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నారు. ఆన్లైన్లో రెజ్యూమ్, వివరాలు పంపారు. ఉద్యోగం తప్పకుండా వస్తుందనుకుంటే ‘తిరస్కరిస్తున్నాం’అన్న సందేశం వచి్చంది. ఉద్యోగంలోకి తీసుకోకపోవడానికి గల కారణాలను సంస్థ వివరించింది. ‘‘మీ రెజ్యూమ్‌ను క్షుణ్ణంగా పరిశీలించాం. ఇక్కడ తేలిందేమంటే సదరు ఉద్యోగానికి కావాల్సిన అర్హతలన్నీ మీలో ఉన్నాయి. వాస్తవం చెప్పాలంటే ఇంకాస్త ఎక్కువే ఉన్నాయి. ఇంతటి ప్రతిభావంతురాలు మాకు వద్దు. ఎందుకంటే ఎక్కువ ప్రతిభ ఉండి తక్కువ స్థాయి ఉద్యోగం చేసే వాళ్లలో సాధారణంగా ఒక రకమైన అసంతృప్తి ఉంటుంది. మరింత మెరుగైన ఉద్యోగాన్ని వీలైనంత త్వరగా వెతుక్కుని పాత ఉద్యోగాన్ని వదిలేస్తారు’’అని వివరణ ఇచి్చంది. ఇలాంటి కారణాలకు కూడా తిరస్కరిస్తారా? అని ఆమె ఆలోచనలో పడింది. ‘‘అర్హతలున్నా ఉద్యోగం ఎందుకు రాదో మీకు తెలుసా?’అంటూ అనూ శర్మ సంబంధిత సంస్థ రిప్లై స్క్రీన్‌షాట్‌ను ‘ఎక్స్’లో పోస్ట్‌చేశారు.స్పందనల వెల్లువఅనూ శర్మ పెట్టిన పోస్ట్‌కు స్పందనల వరద మొదలైంది. ‘‘అతి అర్హతలతో బాధపడుతున్నారా?’అని ఒక నెటిజన్ సరదాగా వ్యాఖ్యానించారు. ‘‘ఇదొక మంచి పరిణామానికి సంకేతం. ఒకరి దగ్గర పనిచేయడం మానేసి మీరే సొంతంగా కంపెనీ పెట్టి ఉద్యోగాలివ్వండి’అని మరొకరు ఉచిత సలహా ఇచ్చారు. ‘‘ఉద్యోగం చేసే స్థాయి మీకున్నా, ఇచ్చేస్థాయి మాకు లేదు అని కంపెనీయే ఒప్పుకుంది’’అని మరొకరు ట్వీట్‌చేశారు. సంస్థనూ మెచ్చుకున్న వాళ్లు కోకొల్లలు ఉన్నారు. ‘‘కంపెనీ మంచిపనే చేసింది. అర్హత కాస్తంత తక్కువ ఉంటే ఉద్యోగం ఇచ్చి, పని బాగా చేయించి రాటుదేలాలా చేస్తారు. ఈమెలాగే అప్పటికే మంచి ప్రతిభ ఉంటే మధ్యలోనే మానేస్తారు. అప్పుడు మళ్లీ నోటిఫికేషన్, రిక్రూట్మెంట్, శిక్షణ అంటూ సంస్థ ఉద్యోగ వేట మళ్లీ మొదలవుతుంది’’అని ఇంకో నెటిజన్ అభిప్రాయపడ్డారు. ‘‘కనీసం రెజ్యూమ్ చదవకుండా, ఏవేవో పిచ్చి కారణాలు చెప్పకుండా నిజాయతీగా రిప్లై ఇచ్చిన సంస్థను మెచ్చుకోవాల్సిందే’అని ఇంకొకరు ట్వీట్‌చేశారు. దీంతో సరిగ్గా సరిపోయే అర్హతలున్న వారికి ఉద్యోగం ఇవ్వాలా? లేదంటే కాస్తంత తక్కువ అర్హత ఉన్న వారికి ఉద్యోగం ఇచ్చి తమకు తగ్గట్లు తీర్చిదిద్దుకోవాలా? అన్న చర్చ మొదలైంది. – న్యూఢిల్లీ -
Corona Vaccine: కోవాగ్జిన్ ఫార్ములా బదిలీకి ఓకే
న్యూఢిల్లీ: కోవాగ్జిన్ టీకా ఫార్ములాను ఇతర సంస్థలకు బదిలీ చేయడానికి తయారీ సంస్థ భారత్ బయోటెక్ అంగీకరించింది. నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ గురువారం ఈ విషయాన్ని వెల్లడించారు. వ్యాక్సిన్లకు తీవ్ర కొరత ఏర్పడి రాష్ట్రాల నుంచి విపరీతమైన ఒత్తిళ్లు, విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. దేశంలో కోవిడ్ 19 టీకాల లభ్యతను గణనీయంగా పెంచడానికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వం తెలిపింది. అందుకు వీలుగా ‘న్యూ లిబరలైజ్డ్ ప్రైసింగ్ అండ్ యాక్సిలరేటెడ్ నేషనల్ కోవిడ్ 19 వ్యాక్సినేషన్ స్ట్రాటెజీ’ని రూపొందించినట్లు స్పష్టం చేసింది. దేశీయంగా వ్యాక్సిన్ల ఉత్పత్తిని వేగవంతం చేసేందుకు దేశీయ వ్యాక్సిన్ ఉత్పత్తిదారులతో వ్యాక్సిన్ సాంకేతిక బదిలీకి సంబంధించి ద్వైపాక్షిక భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకునేలా ప్రభుత్వ, ప్రైవేటు రంగంలోని ఫార్మా సంస్థలను ప్రోత్సహిస్తోందని తెలిపింది. అందులో భాగంగానే, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలైన ‘ఇండియన్ ఇమ్యూనలాజికల్స్ లిమిటెడ్(ఐఐఎల్), భారత్ ఇమ్యునలాజికల్స్ అండ్ బయోలాజికల్స్ కార్పొరేషన్ లిమిటెడ్(బీఐబీసీఒఎల్), అలాగే, ముంబైకి చెందిన హాఫ్కిన్స్ బయోఫార్మా.. ‘కోవాగ్జిన్’ టీకాను ఉత్పత్తి చేస్తున్న భారత్ బయోటెక్ సంస్థతో టీకా సాంకేతికత బదిలీకి సంబంధించి ఒప్పందం కుదుర్చుకున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ఒప్పందాల వెనుక భారత ప్రభుత్వ కృషి ఉందని తెలిపింది. మరోవైపు, ఈ మూడు సంస్థలకు ప్రభుత్వం ఆర్థిక సాయం కూడా అందిస్తోందని వెల్లడించింది. ఐఐఎల్ ఈ సంవత్సరం సెప్టెంబర్ నుంచి, బీఐబీసీఓఎల్, హాఫ్కిన్స్ ఈ సంవత్సరం నవంబర్ నుంచి కోవాగ్జిన్ టీకాల ఉత్పత్తిని ప్రారంభించనున్నాయని తెలిపింది. ఈ మూడు సంస్థలే కాకుండా, మరిన్ని ప్రభుత్వ, ప్రైవేటు రంగ సంస్థలకు కోవాగ్జిన్ టీకా సాంకేతికత బదిలీ జరిగి, పెద్ద ఎత్తున టీకా ఉత్పత్తి సాధ్యమయ్యేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని వెల్లడించింది. ఈ దిశగా సంబంధిత వర్గాలతో చర్చలు జరుపుతోందని పేర్కొంది. కోవాగ్జిన్ టీకా సాంకేతికత బదిలీకి, లైసెన్సుల జారీకి సంబంధించి జాప్యం జరుగుతోందన్న వాదనను ప్రభుత్వం తోసిపుచ్చింది. సంబంధిత వార్తా కథనాలు, ట్వీట్లు అవాస్తవాలని స్పష్టం చేసింది. టీకా ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి ఇతర ఫార్మా కంపెనీలకు కోవాగ్జిన్ సాంకేతికత బదిలీకి వీలు కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసిన విషయం తెలిసిందే. నేరుగా దిగుమతికీ వెసులుబాటు విదేశాల్లో రూపొందిన, విదేశాల్లో ఉత్పత్తి అవుతున్న కోవిడ్ 19 టీకాలను భారత్‌లో వినియోగించేందుకు వీలుగా కొత్త విధానాన్ని ప్రారంభించామని తెలిపింది. అమెరికా, యూరోప్, జపాన్ తదితర దేశాల్లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన.. అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతినిచ్చిన వ్యాక్సిన్లను భారత్‌లో వెంటనే వినియోగించేందుకు వీలుగా నూతన పాలసీని రూపొందించామని తెలిపింది. తక్షణమే వినియోగించుకునే వీలున్న విదేశీ టీకాలను కేంద్ర ప్రభుత్వం ద్వారానే కాకుండా, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రైవేటు ఆసుపత్రులు సొంతంగా సమకూర్చుకునే వీలు కూడా కల్పించామని పేర్కొంది. విదేశీ ఉత్పత్తిదారులకు భారత్‌లో ప్రవేశించేందుకు ఆసక్తి కలిగేలా ధరల విధానంలోనూ ఈ కొత్త పాలసీలో మార్పులు చేశామని వెల్లడించింది. మరోవైపు, మోడెర్నా, ఫైజర్ తదితర విదేశీ టీకా ఉత్పత్తిదారులతో భారత ప్రభుత్వం చర్చలు జరుపుతోందని వెల్లడించింది. భారత్‌లో అత్యవసర వినియోగానికి అనుమతినివ్వాలని దరఖాస్తు చేసుకోవాలని వారిని కోరుతోందని తెలిపింది. మరోవైపు, కోవిడ్ టీకాలకు మేథో హక్కుల మినహాయింపు కోసం భారత్ సహా పలు దేశాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయని తెలిపింది. 3ఫార్మా కంపెనీలకూ ఆహ్వానం కోవాగ్జిన్‌ను ఉత్పత్తి చేయాలనుకునే ఫార్మా కంపెనీలను ఆహ్వానిస్తున్నామని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ తెలిపారు. తద్వారా టీకాల ఉత్పత్తి పెరిగి, దేశీయంగా వాటి లభ్యత మెరుగుపడుతుందన్నారు. భారత బయోటెక్‌తో అవి ఒప్పందం కుదుర్చుకునేలా ప్రభుత్వం కృషి చేస్తుందని వెల్లడించారు. ఇతర ఫార్మా కంపెనీలతో సాంకేతికత బదిలీకి భారత్ బయోటెక్ సిద్ధంగా ఉందన్నారు. ‘ఈ విషయాన్ని భారత్ బయోటెక్ ప్రతినిధులతో చర్చించాం. వారు సంతోషంగా స్వాగతించారు’ అని పాల్ తెలిపారు. ‘‘అయితే, ఈ వ్యాక్సిన్‌ను లైవ్ వైరస్‌ను ఇనాక్టివ్ చేయడం ద్వారా ఉత్పత్తి చేస్తారు. ఈ ప్రక్రియ ‘బీఎస్ఎల్3’ ల్యాబొరేటరీల్లో మాత్రమే సాధ్యమవుతుంది. అన్ని ఫార్మా కంపెనీల్లో ఇవి లేవు’’ అని వివరించారు. -
సెన్సెక్స్‌కు 148 పాయింట్లు లాభం
- 27,958 పాయింట్ల వద్ద ముగింపు - 38 పాయింట్ల లాభంతో 8,459కు నిఫ్టీ ఎస్బీఐ, కొన్ని ఇతర కంపెనీల ఆర్థిక ఫలితాలు అంచనాల కంటే మెరుగ్గా ఉండటంతో స్టాక్ మార్కెట్ శుక్రవారం లాభాల్లో ముగిసింది. గురువారం అమెరికా మార్కెట్లు, ఈ జోరుతో శుక్రవారం ఆసియా మార్కెట్లు పెరగడం కూడా కలసి వచ్చింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఇంట్రాడేలో 28 వేల పాయింట్లను దాటింది. మొత్తం మీద సెన్సెక్స్ 148 పాయింట్ల లాభంతో 27,958 పాయింట్ల వద్ద, నిఫ్టీ 38 పాయింట్లు లాభపడి 8,459 పాయింట్ల వద్ద ముగిశాయి. ఐటీ, ఫార్మా, క్యాపిటల్ గూడ్స్, రిఫైనరీ, టెక్నాలజీ షేర్లు కళకళలాడాయి. కన్సూమర్ డ్యూరబుల్స్, బ్యాంకింగ్, రియల్టీ, మెటల్ షేర్లలో లాభాల స్వీకరణ జరిగింది. పూర్తిగా టెక్నికల్స్: విదేశీ ఇన్వెస్టర్లు మళ్లీ కొనుగోళ్లు ప్రారంభించడంతో సెంటిమెంట్ ఊపందుకుందని మార్కెట్ విశ్లేషకులంటున్నారు. అయితే ఈ పెరుగుదల పూర్తిగా టెక్నికల్స్ మీద ఆధారపడి ఉందని, ఆర్థిక వృద్ధి, కంపెనీల ఆర్థిక ఫలితాల వంటి ఫండమెంటల్స్ విషయాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయని వారు హెచ్చరిస్తున్నారు. బ్లూచిప్ షేర్లు ఆకర్షణీయ ధరల్లో లభిస్తుండటంతో కొనుగోళ్లు భారీగా జరిగాయని వెరాసిటి బ్రోకింగ్ హెడ్ (రీసెర్చ్) జిగ్నేశ్ చౌధురి చెప్పారు.