Oxford scientists
-
ఏ టీకా అనేది మన ఇష్టం కాదు
న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సినేషన్‌కు కేంద్ర ప్రభుత్వం చురుగ్గా ఏర్పాట్లు చేస్తోంది. టీకా సరఫరా కోసం ఉద్దేశించిన కో–విన్ యాప్‌లో ఇప్పటికే కోటి మందికిపైగా తమ పేర్లు నమోదు చేసుకున్నారు. మరో మూడు రోజుల్లోనే వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఆక్స్ఫర్డ్–ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్, హైదరాబాద్‌లోని భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్‌కు ప్రభుత్వం అత్యవసర వినియోగ అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలిదశలో ఈ నెల 16వ తేదీ నుంచి ఈ వ్యాక్సిన్లను దాదాపు 3 కోట్ల మంది హెల్త్‌కేర్, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు ఉచితంగా అందజేయనున్నారు. కోవిషీల్డ్, కోవాగ్జిన్‌లో నిర్దిష్టంగా ఏదైనా ఒకటి ఎంచుకునే అవకాశం లబ్ధిదారులకు లేదని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. రెండు టీకాల్లో ఎవరికి ఏ టీకా వేయాలన్నది ప్రభుత్వమే నిర్ధారిస్తుందని వెల్లడించింది. అంటే ఇష్టమైన టీకా తీసుకునే వెసులుబాటు లేనట్లే. వచ్చే ఎనిమిది నెలల్లో దేశంలో 30 కోట్ల మందికి కరోనా టీకా ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 16.5 లక్షల కోవాగ్జిన్ డోసులు ఉచితం కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను భారత్‌లో పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) ఉత్పత్తి చేస్తోంది. తొలిదశలో ఈ సంస్థ నుంచి 1.1 కోట్ల టీకా డోసులు, భారత్ బయోటెక్ నుంచి 55 లక్షల డోసుల కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. మొదటి 10 కోట్ల డోసుల్లో ఒక్కో డోసును రూ.200 చొప్పున ధరకు ప్రభుత్వానికి విక్రయించనున్నట్లు సీరం సంస్థ సీఈవో అదార్ పూనావాలా చెప్పారు. పన్నులతో కలుపుకుంటే ఒక్కో డోసు ధర రూ.220కు చేరుతుందన్నారు. ఇక కోవాగ్జిన్ ధర పన్నులు లేకుండా ఒక్కో డోసు రూ.295. పన్నులు కూడా కలిపితే రూ.309.5 అవుతుంది. 55 లక్షల డోసుల కొనుగోలుకు ప్రభుత్వం ఒప్పందం చేసుకోగా, ఇందులో 16.5 లక్షల డోసులను ఉచితంగా సరఫరా చేస్తామని భారత్ బయోటెక్ హామీ ఇచ్చింది. ఈ లెక్కన చూస్తే కోవాగ్జిన్ ఒక్కో డోసు రూ.206కే ప్రభుత్వం కొన్నట్లు అవుతుందని అధికారులు చెప్పారు. వ్యాక్సినేషన్ నేపథ్యంలో కరోనా టీకాల చేరవేత ఊపందుకుంది. విమానాల్లో తొలుత ప్రధాన నగరాలకు, అక్కడి నుంచి ద్వితీయశ్రేణి నగరాలు, పట్టణాలకు జాగ్రత్తగా, వేగంగా చేరవేస్తున్నారు. కరోనా టీకా రెండో డోసు తీసుకున్న 14 రోజుల తర్వాత దాని ప్రభావం కనిపించడం మొదలవుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ బుధవారం చెప్పారు. -
ఈయూలో టీకా షురూ
లండన్/రోమ్: ఐరోపా దేశాల సమాఖ్య(ఈయూ)లో కోవిడ్–19 వ్యాక్సినేషన్ ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. డాక్టర్లు, నర్సులు, వృద్ధులకు ఫైజర్/బయోఎన్‌టెక్ వ్యాక్సిన్ మొదటి డోసు ఇచ్చారు. వీరికి మూడు వారాల్లో మరో డోసు ఇవ్వాల్సి ఉంటుంది. ఈయూలో 27 సభ్య దేశాలు ఉండగా, జర్మనీ, హంగేరి, స్లోవేకియా తదితర దేశాలు ఒకరోజు ముందే అంటే శనివారం వ్యాక్సినేషన్‌కు శ్రీకారం చుట్టాయి. కరోనా బారినపడే ప్రమాదం అధికంగా ఉన్న ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ ఇచ్చారు. స్పెయిన్‌లో 96 ఏళ్ల వ్యక్తికి తొలి డోసు ఇచ్చారు. చెక్ రిపబ్లిక్ ప్రధానమంత్రి అండ్రెజ్ బబీస్ కూడా ఆదివారం వ్యాక్సిన్ తీసుకున్నారు. జర్మనీలో 101 ఏళ్ల మహిళ వ్యాక్సిన్ తీసుకున్నారు. ఈయూలో ఇప్పటివరకు 1.60 కోట్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 3,36,000 మంది బాధితులు మరణించారు. వారికే మొదటి ప్రాధాన్యత.. ఆక్స్ఫర్డ్, అస్ట్రాజెనెకా కలిసి అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌కు గురువారంలోగా యూకే ప్రభుత్వం అనుమతి లభిస్తుందని భావిస్తున్నారు. కరోనా వైరస్ సోకితే ఆసుపత్రిలో చేరాల్సిన అవసరం ఉన్న 1.2 కోట్ల నుంచి 1.5 కోట్ల మందికి తొలుత వ్యాక్సిన్ అందజేస్తామని, వారే తమ మొదటి ప్రాధాన్యత అని ప్రభుత్వం తెలిపింది. ఒక్కో డోసు కేవలం 2 పౌండ్లు ఫైజర్, మోడెర్నా టీకాల తరహాలోనే ఆక్స్ఫర్డ్/అస్ట్రాజెనెకా టీకా కూడా ప్రభావవంతంగా పని చేస్తున్నట్లు అధ్యయనంలో తేలిందని అస్ట్రాజెనెకా చీఫ్ ఎగ్జిక్యూటివ్ పాస్కాల్ సొరియొట్ చెప్పారు. కరోనా బాధితులపై 95 శాతం ప్రభావవంతంగా పని చేస్తుందని, ఆసుపత్రిలో చికిత్స అవసరమైన వారికి 100 శాతం రక్షణ కల్పిస్తుందని వెల్లడించారు. ఈ టీకాను సాధారణ రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేయవచ్చు. ధర ఒక్కో డోసుకు కేవలం 2 పౌండ్లు. 10 కోట్ల ఆక్స్ఫర్డ్/అస్ట్రాజెనెకా టీకా డోసుల కోసం యూకే ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది. మార్చికల్లా 4 కోట్ల డోసులు అందుబాటులోకి రానున్నాయి. -
కరోనా : ఆరు నెలల్లో తొలి వ్యాక్సిన్ సిద్ధం
లండన్ : మానవాళికి పెనుముప్పుగా మారిన కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు ప్రస్తుతానికి ఎలాంటి చికిత్సగానీ, వ్యాక్సిన్‌గానీ అందుబాటులో లేదు. కోవిడ్-19 నివారణకు టీకాలను రూపొందించే పనిలో ప్రపంచవ్యాప్తంగా పలువురు నిపుణులు, శాస్త్రవేత్తలు తలమునకలైవున్నారు. ప్రధానంగా వ్యాక్సిన్ రూపకల్పనపై ప్రత్యేక దృష్టిపెట్టిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కీలకమైన అంశాన్ని ప్రకటించింది. నయం చేయలేని ఈ వ్యాధికి రాబోయే ఆరు నెలల్లో వ్యాక్సిన్ తయారు చేయగలమంటూ నమ్మకంగా చెబుతున్నారు. దీనికి సంబంధించిన పరిశోధనలు దాదాపు పూర్తి కావచ్చినట్టేనని తాజాగా ప్రకటించారు. మూడవ దశ ట్రయల్ అనంతరం కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ సిద్ధమవుతుందని ఆక్సఫర్డ్ యూనివర్శిటీ పరిశోధకులు వెల్లడించారు. 2020 సెప్టెంబరు, డిసెంబరు మధ్య కాలం నాటికి తొలి వ్యాక్సిన్ అందుబాటులో ఉంచాలని లక్ష్యంగా పెట్టుకున్నామని బ్రిటన్ చీఫ్ సైంటిఫిక్ సలహాదారు సర్ పాట్రిక్ వాలెన్స్ వివరించారు. ఈ నెలాఖరు నుంచి సెప్టెంబర్ వరకు 500 మంది వాలంటీర్లపై పరిశోధనలు నిర్వహించిన అనంతరం కచ్చితమైన డోస్‌తో వ్యాక్సిన్‌ను విడుదల చేస్తామని చెప్పారు. కనీసం 2021 ప్రారంభంనాటికి వ్యాక్సిన్ సిద్ధమవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయసుగల వాలంటీర్లు తమపై పరిశోధనకు ముందుకొచ్చారని, ఇవి విజయవంతమైతే వ్యాక్సిన్ అనుకున్న దానికంటే ముందుగానే అందుబాటులోకి వస్తుందన్నారు. ఇప్పటికే చైనాలో మార్చి 17నుంచి క్లినికల్ ట్రయల్స్ ప్రారంభించామని పరిశోధకులు చెప్పారు. మొదటిదశలో చైనాకు చెందిన వాలంటీర్లపై వ్యాక్సిన్ ప్రయోగం జరిపినట్టు పరిశోధకులు వెల్లడించారు. 18 నుంచి 60 సంవత్సరాల వయసున్న ఆరోగ్యవంతులు మొత్తం 108 మందిపై పరిశోధనలు జరిపామని18మంది అబ్టర్వేషన్ పూర్తయిందని, వారంతా కరోనానుంచి బయటపడ్డారని వివరించారు. 14 రోజుల ఐసోలేషన్ తర్వాత సంపూర్ణ ఆరోగ్యంతో బుధవారం ఇంటికి వెళ్లినట్టు వివరించారు. మరో ఆరునెలల పాటు వీరినుంచి రక్త నమూనాలు సేకరిస్తూ, పరిశోధనలు జరుపుతామని, అనంతరం కచ్చితమైన డోస్‌తో వ్యాక్సిన్‌ను విడుదల చేస్తామని పేర్కొన్నారు. టీకా సమర్థవంతంగా, సురక్షితంగా ఉందని తేలితే విదేశాలలో అదనపు పరీక్షలు నిర్వహించాలని యోచిస్తున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా గతఏడాది చైనాలో విస్తరించిన కరోనా శరవేగంగా విస్తరిస్తూ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. లాక్ డౌన్ కారణంగా ప్రజలంతా ఇంటికే పరిమితమవుతున్నా, వైరస్ విస్తరణ ఉధృతిని నిలువరించడం పెను సవాలుగా మారింది. ఇలాంటి తరుణంలో నిజంగా పరిశోధకుల ప్రయోగాలు ఫలించి వ్యాక్సిన్ సిద్ధమయితే యావత్ ప్రపంచానికి భారీ ఊరట లభించినట్టే. -
ధూమపానం కన్నా మనోవ్యాధులే డేంజర్..
మానసిక అనారోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తే అది ధూమపానం కన్నా ప్రమాదకరం అంటున్నారు ఆక్స్ఫర్డ్వర్సిటీ శాస్త్రవేత్తలు. మానసిక అనారోగ్యం వల్ల జీవితకాలం సగటున 10 నుంచి 20 ఏళ్ల వరకూ తరిగిపోతుందని, అది ధూమపానం వల్ల తరిగిపోయే ఆయుర్ధాయం కన్నా ఎక్కువని వారు హెచ్చరిస్తున్నారు. మానసిక సమస్యలు, ఆల్కహాల్ వినియోగం, ధూమపానం వంటి వాటి వల్ల మరణించే అవకాశాలు ఎంత మేరకు ఉంటాయి? అన్న కోణంలో 17 లక్షల మందిపై, 2.50 లక్షల మరణాలపై జరిగిన 20 పరిశోధనల ఫలితాలను ఆక్స్ఫర్డ్ సైకియాట్రిస్టులు అధ్యయనం చేశారు. వీరి తాజా అంచనాల ప్రకారం.. బైపోలార్ డిజార్డర్ వల్ల 9-10 ఏళ్లు, స్కిజోఫ్రీనియా వల్ల 9-20 ఏళ్లు, మళ్లీమళ్లీ వచ్చే డిప్రెషన్ వల్ల 7-11 ఏళ్లు జీవితకాలం తగ్గుతుందట. అలాగే డ్రగ్స్, ఆల్కహాల్ సేవనం వల్ల 9-24 ఏళ్లు, హెవీ స్మోకింగ్ వల్ల 8-10 ఏళ్లు ఆయుర్దాయం హరిస్తుందట. అయితే.. మానసిక రోగుల్లో అతిప్రవర్తన వల్ల కూడా ముప్పు ఏర్పడి చనిపోయే అవకాశాలు పెరుగుతాయని పరిశోధకులు చెబుతున్నారు.