P. Murali
-
ఏఐటీయూసీని ఎప్పుడు స్థాపించారు?
ట్రేడ్ యూనియన్ ఉద్యమం పారిశ్రామిక అభివృద్ధి భారతదేశంలో ఒక కొత్త వర్గాన్ని సృష్టించింది. అదే కార్మిక వర్గం. పారిశ్రామిక అభివృద్ధితో పాటు కార్మిక వర్గం కూడా పెరిగింది. ముఖ్యంగా రుణభారంతో సతమతమైన రైతులు, గ్రామీణ ప్రాంతాల్లో చేతివృత్తులవారు కార్మిక వర్గంగా రూపొందారు. మొదట్లో కార్మికులు ఎన్నో కష్టనష్టాలకు గురయ్యారు. పరిశ్రమలు, తోటల్లో తక్కువ వేతనాలు చెల్లించేవారు. అనారోగ్య, హానికరమైన పరిస్థితుల్లో పనిచేయాల్సి వచ్చేది. కార్మికుల శ్రేయస్సు కోసం పారిశ్రామిక వేత్తలు ఏ మాత్రం శ్రద్ధ చూపేవారు కాదు. 1931లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన పోర్ట్స యాక్ట్ (Ports Act), 1934లో వర్కమెన్స కాంపెన్సేషన్ యాక్ట్; కర్మాగారాల చట్టం, 1935లో గనుల చట్టం, 1936లో కనీస వేతనాల చట్టం మొదలైనవి చేసినప్పటికీ, అవి పూర్తి రక్షణ కల్పించలేకపోయాయి. ఈ పరిస్థితుల్లో కార్మిక ఉద్యమం అనివార్యమైంది. భారతీయ కార్మికులు నిరక్ష్యరాస్యులు, సాంస్కృతికంగా వెనుకబడినవారు కావడం వల్ల మొదట్లో ఉద్యమం అంత తీవ్రంగా విస్తరించ లేదు. 1918 తర్వాత క్రమంగా ఊపందుకుంది. 1908లో బొంబాయి దుస్తుల మిల్లు కార్మికుల సమ్మె మినహా ఏ విధమైన ఉద్యమాలు రాలేదు. బాలగంగాధర తిలక్‌ను కారాగారానికి పంపినందుకు నిరసనగా ఈ సమ్మె జరిగింది. అందువల్ల దీన్ని కచ్చితంగా కార్మికుల సమ్మె అనడానికి వీలులేదు. మొదటి ప్రపంచ యుద్ధానంతరం మారిన పరిస్థితుల్లో పూర్తిస్థాయి కార్మిక ఉద్యమాలు, సంస్థలు ప్రారంభమయ్యాయి. ఐరోపా దేశాల్లో ప్రజాస్వామ్య ఉద్యమాలు, రష్యాలో 1917 కమ్యూనిస్టు విప్లవం, భారత్‌లో యుద్ధానంతరం ఏర్పడిన ఆర్థిక మాంద్యం మొదలైన కారణాల వల్ల ఈ ఉద్యమం బలపడింది. 1918-20 మధ్యకాలంలో బొంబాయి, కలకత్తా, మద్రాసు, అహ్మదాబాద్, కాన్పూర్, షోలాపూర్, జంషెడ్పూర్ పారిశ్రామిక కేంద్రాల్లో వరుసగా అనేక సమ్మెలు జరిగాయి. ఈ సమ్మెలన్నీ కార్మికుల ఆర్థిక స్థితిగతులను మెరుగుపర్చుకోవడానికే. రౌలత్ శాసనానికి నిరసనగా కార్మికుల ప్రదర్శనలు, ఊరేగింపులు, బహిరంగ సమావేశాలను నిర్వహించారు. భారతదేశంలో కార్మిక వర్గం జాతీయ ఉద్యమంలో పాల్గొనడం అదే తొలిసారి. ఈ సమయంలోనే వివిధ పరిశ్రమల్లో అనేక కార్మిక సంఘాలను ఏర్పాటు చేయడానికి కూడా ప్రయత్నాలు చేశారు. బొంబాయి, మద్రాసు లాంటి పారిశ్రామిక కేంద్రాల్లో వీటిని స్థాపించారు. ఈ ప్రయత్నాలన్నీ 1920 అఖిల భారత కార్మిక సంఘం (ఏఐటీయూసీ) స్థాపించడంతో ఫలప్రదమయ్యాయి. ఈ ఉద్యమ స్థాపన నారాయణ్ మలహర్ జోషి, లాలా లజపతిరాయ్, జోసఫ్ బాప్టిస్టా ప్రయత్న ఫలితమే. అఖిల భారత కార్మిక సంఘం (ఏఐటీయూసీ) భారత కార్మికుల ఆర్థిక, సాంఘిక, రాజకీయ ప్రయోజనాలు స్థాపించడమే ఆశయంగా పెట్టుకుంది. ఇది అన్ని ఇతర కార్మిక సంఘాల కార్యకలాపాలను సమన్వయపర్చింది. ఉదారవాద నాయకులైన ఎన్.ఎం.జోషి ఆధ్వర్యంలో ఏఐటీయూసీ ఒక దశాబ్దంపాటు నడిచింది. కాలక్రమంలో నేషనలిస్టు నాయకులైన వి.వి.గిరి, సి.ఆర్. దాస్ దీని కార్యక్రమాల్లో పాల్గొన్నారు. 1922 తర్వాత సామ్యవాద, కమ్యూనిస్టు భావాలు మనదేశంలో ప్రచారంలోకి వచ్చాయి. అఖిల భారత జాతీయ కాంగ్రెస్‌లోనే వామపక్ష అభిప్రాయాలున్న వ్యక్తులు ఉండేవారు. వామ పక్షానికి జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ నాయకత్వం వహించారు. 1927 తర్వాత కార్మిక ఉద్యమంలోనూ వామపక్ష నాయకత్వం అభివృద్ధి చెందింది. కమ్యూనిస్టులకు వర్గ పోరాటంలో నమ్మకం ఉండగా, సామ్యవాదులు దాన్ని విశ్వసించేవారు కాదు. కానీ, కార్మిక సంఘాలను నిర్వహిస్తూ, రైతుల ప్రయోజనాలను కాపాడటానికి ప్రయత్నించారు. ఉదారభావాలు ఉన్న జాతీయ నాయకుల కంటే సోషలిస్టు నాయకులే కార్మికులను, రైతులను ఆర్థిక దోపిడీ నుంచి రక్షించడానికి ఎక్కువ శ్రద్ధ చూపారు. సామ్యవాదులు, కమ్యూనిస్టులు కార్మిక, రైతు సంఘాలను నిర్వహించారు. వీటిలో కొన్ని పక్షాలు వర్గ పోరాటం ప్రాతిపదికగా కార్మిక సంఘాలను నిర్వహించటం వల్ల కార్మిక ఉద్యమం బలపడింది. వీరే క్రమంగా అఖిల భారత కార్మిక సంఘ సంస్థలో పట్టు సంపాదించి చివరకు దాన్ని తమ ఆధిపత్యంలోకి తెచ్చుకున్నారు. ఏఐటీయూసీలో వామపక్ష భావాలున్నవారు ఇమడలేక 1929లో చీలిపోయారు. ఎన్.ఎం.జోషీ ఏఐటీయూసీని వీడి, భారతీయ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్‌ను స్థాపించాడు. ఇది 1931లో మరోసారి చీలింది. ఈ రెండు భాగాలు 1935లో మళ్లీ కలిశాయి. 1938లో భారతీయ ట్రేడ్ యూనియన్ ఫెడరేషన్ (బీటీయూఎఫ్) కూడా ఏఐటీయూసీలో చేరాలని నిర్ణయించుకుంది. ఏఐటీయూసీ ఒక విస్తృత, బృహత్తరమైన పథకంతో ముందుకు వచ్చింది. దీని ప్రధాన ఉద్దేశాలు కిందివిధంగా ఉన్నాయి. భారతదేశంలో సామ్యవాద రాజ్యాన్ని ఏర్పాటు చేయడం. వస్తూత్పత్తిని జాతీయం చేయడం. మెరుగైన ఆర్థిక, సామాజిక పరిస్థితులను కల్పించడం. వాక్ స్వాతంత్య్రం, సంఘాలను ఏర్పాటు చేసుకునే స్వేచ్ఛ సాధించడం. జాతీయ పోరాటంలో కార్మికులు పాల్గొనేటట్లు చేయడం. కుల, వృత్తి, జాతి, మత వివక్షను రద్దు చేయడం. ఏఐటీయూసీ కీలకమైన పాత్రను నిర్వహించినప్పటికీ సభ్యత్వం మాత్రం చెప్పుకోదగినంతగా పెరగలేదు. క్రీ.శ. 1927 తర్వాత భారతదేశంలో కార్మిక వర్గం ఒక స్వతంత్ర ఆర్థిక, రాజకీయ శక్తిగా మారింది. 1928-30 కాలంలో బొంబాయి మిల్లు కార్మికుల సమ్మె లాంటి వాటిని అనేకం నిర్వహించింది. సైమన్ కమిషన్ బహిష్కరణ, శాసనోల్లంఘనోద్యమం, కాంగ్రెస్ నిర్వహించిన ఇతర ఉద్యమాల్లో కార్మికులు పాల్గొన్నారు. జాతీయోద్యమంలోనూ వీరి పాత్ర గణనీయమైంది. కమ్యూనిస్టు పార్టీ మాత్రం ఒక ప్రత్యేక కార్మిక వర్గాన్ని ఏర్పాటు చేసుకుంది. కార్మిక ఉద్యమ చర్యలు ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీకి అనుకూలంగా ఉన్న సంఘాలు ప్రభుత్వాన్ని బాగా ఇబ్బంది పెట్టాయి. ప్రభుత్వం వారిని అణచి వేయడానికి అనేక చర్యలు తీసుకుంది. కార్మిక వివాద చట్టం కార్మికుల హక్కులను పరిమితం చేసింది.1929లో రూపొందించిన పబ్లిక్ సేఫ్టీ బిల్లు ద్వారా సంఘ విరోధులైన వ్యక్తులను దేశ బహిష్కరణ చేసే అధికారం కూడా ప్రభుత్వానికి లభించింది. ప్రభుత్వం అనేకమంది వామపక్ష కార్మిక నాయకులను నిర్బంధంలోకి తీసుకుని , వారిపై ‘మీరట్ కుట్ర’ కేసును నమోదు చేసింది. 1937 ఎన్నికల్లో జాతీయ కాంగ్రెస్ విజ యం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కార్మికులు ఈ ప్రభుత్వాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వారికి లబ్ధి చేకూరుతుందనే ఆశయంతో జాతీయ ఉద్యమానికి సహకరించారు. కానీ, కాంగ్రెస్ మంత్రివర్గాలు వారి ఆశలను వమ్ము చేశాయి. పెట్టుబడిదారుల ప్రభావానికి గురైన కాంగ్రెస్... బాంబే కార్మిక వివాదచట్టాన్ని అమలు చేయడం, కార్మికులపై కాల్పులు జరపడం, సమావేశాలను నిషేధించడం, నాయకులను అరెస్టు చేయడం లాంటి చర్యలను చేపట్టింది. ఇవన్నీ కార్మిక వర్గాల ప్రయోజనానికి వ్యతిరేకమైనవే. అయినప్పటికీ ఉద్యమం చల్లారలేదు. 1938 తర్వాత భారతదేశంలో అనేక కార్మిక సంఘాలు ఏర్పడ్డాయి. ఏఐటీయూసీ కూడా తన సభ్యత్వాన్ని పెంచుకుంది. మొత్తం మీద భారత స్వాతంత్య్రానికి పూర్వం కార్మిక ఉద్యమం దాని ఆశయాన్ని చాలా వరకు నెరవేర్చుకోలేదనే చెప్పవచ్చు. -
దక్షిణాఫ్రికాలో గాంధీజీ ప్రారంభించిన పత్రిక?
గాంధీజీ ప్రాభవం స్వాతంత్య్ర పోరాటంలో గాంధీజీ తిరుగులేని నాయకునిగా ఆవిర్భవించారు. ప్రతికూల పరిస్థితులన్నింటినీ అధిగమించారు. సమకాలీన రాజకీయ, ఆర్థిక పరిస్థితులతోపాటు గాంధీజీ వ్యక్తిత్వం కూడా ఇందుకు దోహదపడింది. సమకాలీన రాజకీయ పరిస్థితులు 1915లో గాంధీజీ దక్షిణాఫ్రికా నుంచి తిరిగి వచ్చేనాటికి భారతదేశంలో నాయకత్వ సమస్య ఏర్పడింది. 1915లో మితవాద నాయకుడైన గోపాలకృష్ణ గోఖలే కన్నుమూశారు. ఆరేళ్లు కారాగారవాసం అనుభవించిన అతివాదుల నాయకుడు తిలక్‌లో మునుపటి ఉత్సాహం కొరవడింది. కాంగ్రెస్ పార్టీలో అనిబీసెంట్ నాయకత్వాన్ని బహిర్గతంగా ఒప్పుకునే పరిస్థితి లేదు. ఏ నాయకునికీ రాజకీయ అనుభవం లేదు. ఈ పరిస్థితుల్లో వలసవాదానికి వ్యతిరేకంగా అన్ని వర్గాలతో ప్రజాస్వామ్య పోరాటాన్ని నడిపిన ఏకైక నాయకుడు గాంధీజీ. గాంధీజీ భారతదేశానికి వచ్చిననాటి నుంచి సామాన్య ప్రజల్లో ఒకరిగా మెలిగారు. కార్మికుల, కర్షకుల సమస్యలకు పరిష్కారాలు చూపేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ పార్టీని సామాన్య ప్రజల వద్దకు చేర్చడంలో సఫల మయ్యారు. అహ్మదాబాద్ మిల్ వర్కర్స ఉద్యమాలు గాంధీజీని తిరుగులేని నాయకునిగా మలిచాయి. ఆర్థిక కారణాలు గాంధీజీ నాయకునిగా బలపడడానికి మొదటి ప్రపంచ యుద్ధం(1914-18) తర్వాత ఏర్పడిన పరిస్థితులు కారణమయ్యాయి. గాంధీజీ భారతదేశం వచ్చే నాటికి మొదటి ప్రపంచ యుద్ధం కొనసాగుతోంది. భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. పన్నుల భారం ఎక్కువైంది. పరిశ్రమలు మూతపడ్డాయి. నిరుద్యోగ సమస్య ప్రబలింది. ఈ ఆర్థికపరమైన నిస్పృహను గాంధీజీ చక్కగా వినియోగించుకోగలిగారు. వ్యక్తిత్వం - మేధస్సు తన రాజకీయ జీవితం ప్రారంభం అయినప్పటి నుంచి సమకాలీన రాజనీతి సిద్ధాంతాల న్నింటిలోనూ గాంధీజీ ఆరితేరారు. లియోటాల్ స్టాయ్ మానవతా వాదం, మాగ్జిమ్ గోర్కి విశ్వజనీన భావనలు, హెర్బర్‌ట స్పెన్సర్‌లో ఉన్న వ్యక్తి శ్రేయోవాదం, కార్ల మార్క్స సామ్యవాద సిద్ధాంతాలు గాంధీజీని ప్రభావితం చేశాయి. థోరో శాసనోల్లంఘన ఉద్యమంతో పాటు రస్కిన్ పెట్టుబడిదారీ విధానం గాంధీజీని గొప్పగా ప్రభావితం చేశాయి. ఇంతగా సమకాలీన రాజకీయ సిద్ధాంతాలపై అవగాహన ఆ కాలంలో ఏ ఒక్క నాయకునికీ లేదు. టాల్‌స్టాయ్ ’The kingdom of god is with in you' , Æý‡íÜP¯Œæ 'Unto this last', ఎడ్విన్ ఆర్నాల్డ్ ’Song Celestial’, ఫ్రెంచి తాత్వికుడైన థోరో ’Civil disobedience', మార్క్స ‘దాస్ కాపిటల్’ లాంటి గ్రంథాలు గాంధీజీలో విశిష్ట లక్షణాలు పెంపొందడానికి కారణ మయ్యాయి. భిన్న దృక్పథాలు కలిగిన వాదాల మధ్య గాంధీజీ సమతూకం సాధించగలడం ఆయన వ్యక్తిత్వంలోని గొప్ప లక్షణం. పలువాదాల మధ్య సమతూకాన్ని సాధించడం వల్ల మితవాదులకు మితవాదిగా, అతివాదులకు అతివాదిగా, ఇద్దరికీ ఆమోదయోగ్యమైన నాయకునిగా గాంధీజీ గుర్తింపు పొందారు. ఇది గాంధీజీ వ్యక్తిత్వానికి సంబంధించిన అద్భుత విజయం. భారతదేశంలోని విభిన్నమతాలు, సంస్కృతులు, వర్గాల మధ్య గాంధీజీ చక్కని సమతౌల్యాన్ని సాధించగలిగారు. రామరాజ్యం గురించి ఎక్కువగా ప్రస్తావించడం, భగవద్గీతను నిరంతరం పఠించడం వల్ల గాంధీజీ హిందువుల మద్దతును కూడగట్టుకోగలిగారు. అదేవిధంగా ఖిలాఫత్ సమస్యలో భారతీయ ముస్లింలను బలపర్చి వారి అభిమానాన్ని పొందగలిగారు. భిన్న మతాలకు చెందిన అఖిల భారత ఖిలాఫత్ సమావేశానికి (కమిటీ) అధ్యక్షుడు కాగలిగారు. ఈ విధంగా హిందువులు, ముస్లింలకు మధ్య గాంధీజీ సమతౌల్యాన్ని సాధించగలిగారు. భూస్వాములు, పెట్టుబడిదారీ వర్గాలకు కూడా గాంధీజీ నాయకత్వం సమ్మతమైంది. ఇందుకు కారణం వర్గ పోరా టం, రక్తపాతం లేని సామ్యవాదం గురించి గాంధీజీ మాట్లాడటం. దీన్నే ట్రస్టీషిప్ అంటారు. స్వచ్ఛందంగా భూస్వాములు తమ మిగులు భూమిని ఇవ్వాలని, పెట్టుబడిదారులు తమ లాభాన్ని సమాజంతో పంచుకోవాలని గాంధీజీ పిలుపు నిచ్చారు. అందువల్ల భూస్వాములకు, పెట్టుబడిదారులకు గాంధీ అనుకూలమైన నాయకుడు కాగలిగారు. అహ్మదాబాద్ మిల్ వర్కర్స పోరాటంలో పెట్టుబడిదారులకు, కార్మికులకు మధ్య సంధి కుదిర్చారు. ఈ విధంగా అన్ని వర్గాల నాయకునిగా గాంధీజీ ఆమోదం పొందారు. పోరాట విధానం గాంధీజీ తన పోరాటంలో అన్ని వర్గాలను భాగస్వాములను చేశారు. ఈ పోరాట విధానంలో మితవాదం ఉంది. అతివాదమూ ఉంది. గాంధీజీ తనదైన శైలిలో కొత్త పంథాను ప్రవేశపెట్టారు. ఈ విధానాన్నే పోరాటం - విరామం - తిరిగి పోరాటం అని నిర్వచించారు. ఉధృతంగా ఉద్యమాన్ని ప్రారంభించడం, ఒకదశలో నిలిపివేయడం, తిరిగి రెట్టించిన ఉత్సాహంతో ఉద్యమాన్ని ప్రారంభించడం గాంధీజీ పోరాట విధానంలో భాగమైంది. రాజకీయ పోరాటంలో చైనా నాయకుడు ‘మావో’ సూత్రాన్ని గాంధీజీ ఆచరించారు. జాతీయోద్యమం ఒక దశ నుంచి మరో దశకు బలపడేలా చేశారు. పోరాటాన్ని ఆపి బలహీనతలు ఎక్కడ ఉన్నాయో గుర్తించి, కాంగ్రెస్ పార్టీలో సంస్థాగత మార్పులు తీసుకువచ్చారు. దాంతో కాంగ్రెస్‌లో గాంధీజీ తిరుగులేని నాయ కునిగా చెలామణి అయ్యారు. మాదిరి ప్రశ్నలు 1. గాంధీజీ సిద్ధాంతం ఆధారంగా నిరాటం కంగా కొనసాగిన ఉద్యమం ఏది? 1) సహాయ నిరాకరణోద్యమం 2) స్వదేశీ ఉద్యమం 3) క్విట్ ఇండియా ఉద్యమం 4) శాసనోల్లంఘన ఉద్యమం 2. స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించి కింది సంఘటనల్లో వాస్తవం కానిది? 1) 1905లో బెంగాల్ విభజన 2) 1907లో ముస్లింలీగ్ ప్రారంభం 3) 1909లో మింటో-మార్లే సంస్కరణ లు, ముస్లింల డిమాండ్లను ఆమోదిం చడం 4) 1910 భారత రాజధానిని కలకత్తా నుంచి ఢిల్లీకి మారుస్తున్నట్లు ప్రకటన 3. దక్షిణాఫ్రికాలో గాంధీజీ ఆసియన్ల హక్కుల కోసం పోరాడడానికి కారణం? 1) నల్లజాతి పౌరుల రిజిస్ట్రేషన్ చట్టం 2) ఆసియన్ల రిజిస్ట్రేషన్ చట్టం 3) ది కలర్డ లెసైన్‌స చట్టం 4) ది అపర్థీడ్ చట్టం 4. గాంధీజీ సహాయ నిరాకరణోద్యమం ప్రాముఖ్యత? 1) పెద్ద ఎత్తున కొనసాగడం 2) {పజలు పెద్ద మొత్తంలో భాగస్వా ములు కావడం 3) తొలిసారిగా అహింసా పద్ధతిని శక్తిమం తమైన ఆయుధంగా ప్రయోగించడం 4) ఏవీకావు 5. ‘చాలా కాలం నుంచి మనం అదృష్టంపై విశ్వాసం ఉంచాం. ప్రస్తుతం మనం కష్టపడి పనిచేసి అన్ని రంగాల్లో స్వయం సమృద్ధి సాధించే దిశగా పయనిస్తున్నాం’. అని ఎవరు అన్నారు? 1) జవహర్ లాల్ నెహ్రూ 1947 ఆగస్టు 15న 2) మొదటి స్వాతంత్య్ర వార్షికోత్సవం రోజున జవహర్ లాల్ నెహ్రూ 3) భారత్ రిపబ్లిక్‌గా అవతరించిన సందర్భంలో రాజేంద్రప్రసాద్ 4) పార్లమెంట్ ఉభయసభల తొలి సంయుక్త సమావేశం రోజున డాక్టర్ రాధాకృష్ణన్ 6. కింది సంఘటనలను వరుస క్రమంలో సూచించండి? 1) సహాయ నిరాకరణోద్యమం 2) లక్నో ఒప్పందం 3) మాంటేగ్ సంస్కరణలు 4) మొదటి ప్రపంచ యుద్ధం 1) ఎ, బి, సి, డి 2) డి, సి, బి, ఎ 3) డి, సి, ఎ, బి 4) డి, బి, సి, ఎ 7. 1915లో సత్యం, అహింస పాటించడానికి మహాత్మాగాంధీ ఏం చేశారు? 1) సత్యాగ్రహ ఆశ్రమం స్థాపన 2) భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరడం 3) సత్యాగ్రహం ప్రారంభించడం 4) సబర్మతి ఆశ్రమం ప్రారంభం 8. క్విట్ ఇండియా ఉద్యమానికి సంబంధించి కింది ప్రకటనలో వాస్తవమైంది? 1) పూర్తిగా అహింసాయుతంగా కొన సాగిన ఉద్యమం 2) పై స్థాయిలోని మధ్య తరగతి ప్రజలు ఉద్యమం పట్ల ఉత్సాహం చూపలేదు 3) ముస్లింలు ఉద్యమంలో పాల్గొనలేదు 4) ఉద్యమ స్వరూపాన్ని గమనించి భారత్‌కు స్వాతంత్య్రం ఇవ్వాలని బ్రిటిషర్లు నిర్ణయించారు 9. దక్షిణాఫ్రికాలో మహాత్మాగాంధీ ప్రారంభిం చిన పత్రిక? 1) ఇండియా గెజిట్ 2) నవజీవన్ 3) ఇండియన్ ఒపీనియన్ 4) ఆఫ్రికనీర్ 10. 1931 మార్చి 5న గాంధీ-ఇర్విన్ ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందానికి సంబం ధించనిది ఏది? (2002 సివిల్స్) 1) కాంగ్రెస్ ఉప్పు సత్యాగ్రహాన్ని ఆపాలి 2) రెండో రౌండ్ టేబుల్ సమావేశానికి కాంగ్రెస్ హాజరు కావాలి 3) అఖిల భారత సమాఖ్యను ఏర్పాటు చేయాలి 4) రైతుల నుంచి బ్రిటిష్ ప్రభుత్వం ఎమ ర్జెన్సీ రెవెన్యూను డిమాండ్ చేయరాదు 11. సహాయ నిరాకరణోద్యమంలో కార్మికుల పాత్రపై ‘ఇండియా టుడే’ అనే గ్రంథాన్ని రచించినవారు? (1999 సివిల్స్) 1) రమేష్ చంద్రదత్ 2) రజనీ పామెదత్ 3) రమేష్ అరోరా 4) రమేష్ టాండన్ 12. ‘బెంగాల్ రాష్ట్రాన్ని చీల్చి, మన పాలనని ప్రతిఘటించే గట్టి ప్రత్యర్థుల్ని బలహీన పర్చడమే మన ధ్యేయం’ అని తన డైరీలో రాసిందెవరు? (1998 సివిల్స్) 1) లార్డ కర్జన్ 2) రాబర్ట సన్ 3) థామస్ర్యాలీ 4) రిస్లే సమాధానాలు 1) 2; 2) 3; 3) 2; 4) 4; 5) 4; 6) 1; 7) 1; 8) 4; 9) 2; 10) 4;11) 2; 12) 4. -
సివిల్స్‌లో భారత స్వాతంత్రోద్యమ ప్రాధాన్యం ఏమిటి?
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: ఈ పాఠ్యాంశాన్ని ఎలా అధ్యయనం చేయాలి? - టి.ఉమారాణి, సికింద్రాబాద్ సివిల్స్ సిలబస్‌లో భారత స్వాతం త్య్రోద్యమం ముఖ్య పాఠ్యాంశం. గాంధీయుగం, స్వాతంత్య్రం అనంతరం యుగాలపై అభ్యర్థులకు అవగాహన అవసరం. ముఖ్యంగా స్వాతంత్య్రోద్యమ సమయంలో వచ్చిన గ్రంథాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు కింది ప్రశ్నను పరిశీలించండి. 1. List–I, List–IIలలో గ్రంథాలు, గ్రంథకర్తలను జతపర్చండి? (2001, 2008, 2011 సివిల్స్) List–I a) సుభాష్ చంద్రబోస్ b) అబుల్ కలాం ఆజాద్ c) రాజేంద్రప్రసాద్ d) జవహర్ లాల్ నెహ్రూ List–II 1) భారతదేశం స్వాతంత్య్రం సాధిస్తుంది. 2) భారతదేశం ఎందుకంటే? 3) భారతదేశం స్వాతంత్య్రానికై పోరాటం 4) భారతదేశ విభజన A B C D 1) 1 4 3 2 2) 3 2 4 1 3) 3 1 4 2 4) 4 1 2 3 సమాధానం - 3 - వివరణ: ఆజాద్ రాసింది ‘భారతదేశం స్వాతంత్య్రం సాధిస్తుంది’ (ఇండియా విన్‌స ఫ్రీడం). ఏప్రిల్ 15, 1946లో రచించాడు. సుభాష్ చంద్రబోస్ - భారతదేశం స్వాతంత్య్రం కోసం పోరాటం, రాజేంద్రప్రసాద్ - భారతదేశ విభజన, నెహ్రూ - భారతదేశం ఎందుకంటే’ గ్రంథాలు రచించారు. ఇవన్నీ ‘ఇండియా’పై వచ్చాయి. ఇండియా స్ట్రగుల్ ఫర్ ఫ్రీడం, ఇండియా డివెడైడ్, వైదర్ ఇండియా. కాబట్టి ఇలా ఇండియాతో ముడిపడి ఉన్న గ్రంథాలన్నీ ఒకే చోట రాసుకోవడం ముఖ్యం. - 2000, 2007లలో స్వాతంత్య్ర ఉద్యమ కాలం నాటి సాంస్కృతిక కట్టడాలపై అడిగిన ప్రశ్న చాలా లోతైందిగా గమనించాలి. 2. వీటిలో సరైంది ఏది? 1) విక్టోరియా మెమోరియల్ హాల్ (కలకత్తా) - హార్బర్ట బేకర్ 2)సెంట్రల్ సెక్రటేరియట్ (న్యూఢిల్లీ) - ఎమర్సన్ డబ్ల్యూ 3) గేట్ వే ఆఫ్ ఇండియా (ముంబాయి) - ఆర్.ఎఫ్. చిస్లోమ్ 4) మద్రాస్ విశ్వ విద్యాలయ సెనేట్ హాల్ -ఆర్.ఎఫ్. చిస్లోమ్ 5) ‘చండీగడ్’ నగర నిర్మాత - ఎడ్విన్ లూయీటిక్స్ సమాధానం - 5 వివరణ: ఎడ్విన్ లూయీటిక్స్ ఢిల్లీలోని ‘పార్లమెంట్ భవనం, చండీగడ్ పట్టణం నిర్మించాడు. విక్టోరియా మెమోరియల్ హాల్‌ను (డబ్ల్యూ ఎమర్సన్), సెంట్రల్ సెక్రటేరియట్ భవనాన్ని (హార్బర్ట బేకర్), గేట్ వే ఆఫ్ ఇండియా (జార్జీ క్లార్క), మద్రాస్ విశ్వ విద్యాలయం (ఆర్.ఎఫ్. చిస్లోమ్)లు నిర్మించారు. దీన్ని బట్టి ప్రశ్నలను ఎంత లోతుగా అడుగుతున్నారో అర్థం చేసుకోవాలి. - స్వాతంత్య్ర ఉద్యమ కాలంలో వచ్చిన గిరిజన, రైతు, సాయుధ పోరాటాలపై(20వ శతాబ్దంలో) కూడా సంపూర్ణ అవగాహన ఉండాలి. ఉదా: 2009, 1999, 2011, 2001(సివిల్స్)లో అడిగిన కింది ప్రశ్నను పరిశీలించండి. 3. వీటిలో సరైంది ఏది? 1) పత్తర్‌ఘట్ ఉద్యమం - 1898 హైదరాబాద్ 2) తెభాగా ఉద్యమం - 1924 బీహార్ 3) ఏకా ఉద్యమం - 1912 పంజాబ్ 4) మోప్లా ఉద్యమం - 1921 కేరళ సమాధానం - 4 వివరణ: మోప్లా ఉద్యమం సహాయ నిరాకరణోద్యమంలో భాగంగా కేరళలో 1921లో హాజి మహ్మద్ నాయకత్వంలో ముస్లిం రైతులు చేసిన గొప్ప తిరుగుబాటు. ఇందులో వందలాది మంది రైతులు ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ ఈ ప్రాంతాన్ని గాంధీ సందర్శించకపోవటం అనేక విమర్శలకు తావిచ్చింది. పత్తర్‌ఘాట్ ఉద్యమం 1898-99లలో ‘అస్సాం’ ప్రాంతంలోని గిరిజనులు ఎల్జిన్-2 రాజప్రతినిధి కాలంలో తిరుగుబాటు చేశారు. 368మంది గిరిజనులు ప్రాణాలు కోల్పోయారు. గొప్ప గిరిజన ఉద్యమంగా ‘పత్తర్‌ఘాట్’ సంఘటన చరిత్రలో నిల్చిపోయింది. ‘తెబాగా’ ఉద్యమం 1945-1946లో బెంగాల్ రాష్ర్టంలో వచ్చిన సాయుధ రైతాంగ పోరాటం, ‘తెలంగాణలో’ కూడా ఇదే తరహా ఉద్యమం 1946-51 మధ్య కాలంలో జరిగింది. ‘ఏకా ఉద్యమం’ 1921లో ఉత్తరప్రదేశ్‌లో వచ్చింది. దీన్ని ‘మాదరిపాసి’ సితాపూర్ జిల్లాలో నిర్వహించారు. డాక్టర్ అజయ్ రాయ్ 1971 తెబాగా ఉద్యమంపై ముఖ్య విషయాలు సేకరించాడు. గాంధీ కూడా ఈ ఉద్యమంలో ముఖ్యపాత్ర పోషించాడు. 4. వీటిలో సరైంది? 1) బార్డోలి సత్యాగ్రహం - 1928 గుజరాత్ (వల్లభాయ్ పటేల్) 2) ఉత్కల్ ప్రోవెన్షియల్ కిసాన్ సభ (మాలతీ చౌదరి) 3) ఏటియాల నో-రెంట్ స్ట్రగుల్ - భగవాన్ సింగ్ ఉద్యమం 4) బీహారీ కిసాన్ సభ (యదునందన్ శర్మ) సమాధానం - 1 వివరణ: 1928లో గుజరాత్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో ‘బార్డోలి’ సత్యాగ్రహం జరిగింది. ఈ సందర్భంగానే పటేల్‌కు ‘సర్దార్’ అనే బిరుదును గాంధీజీ ఇచ్చారు. మాలతీ చౌదరి -ఉత్కల్ కిసాన్ సభ, కరుణసింధు రాయ్ ‘సుర్మావ్యాలీ’ ఉద్యమంలో భాగంగా నో-రెంట్ ఉద్యమం నిర్వహించారు. భగవాన్‌సింగ్ లాంగోవాలా ‘ముజారా’ ఉద్యమం, యదునందన్ శర్మ ‘బీహారీ కిసాన్ సభ’లు స్థాపించారు. 5. ‘ముస్లింలీగ్’ పార్టీ స్థాపకులెవరు? (1999, 2002 - సివిల్స్) 1) హస్రఫ్ మొహానీ 2)యూసుఫ్ మెహారోలి 3)ఫజుల్-హుక్ 4)చౌదరి ఖాతి ఖ్వాజామన్ సమాధానం: 4 వివరణ: హస్రఫ్ మొహానీ ప్రసిద్ధ గజల్స్ కవి ‘పూర్ణ స్వరాజ్, ఇంక్విలాబ్ జిందాబాద్’ మొదలైన పదాల సృష్టికర్త. యూసుఫ్ మొహారోలి కాంగ్రెస్సోషలిస్ట్ స్థాపకులు. ఫజుల్ హుక్ బెంగాల్ ప్రజాపార్టీ స్థాపకులు. పార్టీలు -స్థాపకులు, వాటి ముఖ్య నాయకులు లాంటి ప్రశ్నలపై అవగాహన పెంచుకోవాలి. అలాగే తీవ్రవాద సంస్థలు వాటి స్థాపకులు, వారు పాల్గొన్న కుట్ర కేసులపై కూడా కచ్చితమైన సమాచారం తెలుసుకోవాలి. 6. ‘అరబిందోఘోష్’కు సంబంధించిన కుట్రకేసు ఏది?(2000, 2001 సివిల్స్) 1) అలీపూర్ కుట్రకేసు 2) లాహోర్ కుట్రకేసు 3) కాకోరి కేసు 4) చిట్టగాంగ్ కేసు సమాధానం: 1 వివరణ: అరబిందో ఘోష్ ‘భందేమాతరం’ పత్రిక ఎడిటర్, సావిత్రి అనే గ్రంథ రచన చేశాడు. ఇంకా ‘న్యూలాంప్స్ ఫర్ ఓల్డ్’ వ్యాసాలు రచించాడు. అలీపూర్ కుట్రకేసులో ముద్దాయిగా ముద్రపడి, చివరికి పాండిచ్చేరిలో (1908) సన్యాస జీవితం గడుపుతూ మరణించాడు. (1929) లాహోర్ కుట్రకేసులో ప్రధాన ముద్దాయిలు 12 మంది. అందులో ముఖ్యమైన వారు భగత్‌సింగ్, రాజ్‌గురు, సుఖ్‌దేవ్, భతుకేశ్వర్దత్లు. చివరికి భతుకేశ్వర్ మినహా మిగతా వారికి 1931 మార్చి 23న ఉరిశిక్ష విధించారు. కాకోరి రైల్వే దోపిడీ కేసులో అశ్వయుల్లాఖాన్ ముద్దాయి. చిట్టగాంగ్ దోపిడీలో ‘మాస్టర్’గా ప్రసిద్ధి చెందిన సూర్యసేన్ ప్రధాన ముద్దాయి. ఇతడు ‘పోగ్రామ్ ఆఫ్ డేత్’ పేరుతో అనేక వ్యాసాలు రచించాడు. - - ఇన్పుట్స్: డా॥పి. మురళీ, ప్రొఫెసర్ నిజాం కాలేజీ, హైదరాబాద్ -
విచిత్రనామ రచయిత ఎవరు?
13, 14 శతాబ్దాల్లో భారతదేశం యూపీఎస్సీ సివిల్స్ పరీక్షల్లో ఈ చాప్టర్ నుంచి 2 మార్కులకు ప్రశ్నలు తప్పనిసరిగా వస్తాయి. ఈ కాలాన్ని ఢిల్లీ సుల్తాన్ల యుగంగా చెప్పవచ్చు. వీరి రాజకీయ, పరిపాలన, ఆర్థిక, సాహిత్య, సాంస్కృతిక రంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. సాహిత్యంలో సియాసత్ నామా- నిజాముల్క్ తుసీ, ఖజాయిస్ ఉల్ పితుహా - అమీర్‌ఖుస్రూ, ఖైర్ ఇ మాజల్స్ - హమీద్ కలందర్, తారీఖ్ ఇ ముబారక్ - షాయయ్యార్ రచించినవి, అమీర్‌ఖుస్రూ, బరాని రచనలు, శిల్పకళలో సాంకేతిక ఆర్చి, డోం, ఢిల్లీ 3వ, 4వ నగరాలు, ఉద్యానవనాలు, లాల్ దర్వాజా, అలై - ఇ- దర్వాజాలు ఎవరు నిర్మించారు? లాంటి అంశాలను చదవాలి. 2001లో కింది ప్రశ్నను అడిగారు. ప్రశ్న: కిందివాటిలో తప్పుగా జతచేసింది ఏది? ఎ) జాలువారే గోడలు - బాల్బన్ బి) సాంకేతిక పద్ధతిలో వచ్చిన డోం- ఖిల్జీలు సి) డబుల్ డోం పద్ధతిలో సమాధులు- లోఢీలు డి) ఢిల్లీకి మొదటి పట్టణం - ఐబక్ సమాధానం: (ఎ) జాలువారే గోడలు ఘియాజుద్దీన్ తుగ్లక్ తన సమాధిలో ప్రవేశపెట్టాడు. ఆర్థిక విధానంలో.. హకియా-ఇ-షాబ్, కిస్మత్, తకావి, ఉస్లుబ్ అంటే ఏమిటి? పరసియా, మైదాన్, ఉర్దు-ఇ-మౌల్ల లాంటి పారిభాషిక పదాల గురించి తెలుసుకోవాలి. హాజిమౌల్లా తిరుగుబాటు (1320), జఫార్‌ఖాన్ తిరుగుబాటు (1391), తైమూర్ దాడి (1398), అహ్మదాబాద్ రాజ్యస్థాపన(1411) లాంటి అంశాలతో పాటు, పగోడా (విజయనగరం) మహ్మది (గుజరాత్), ముజఫరి (మాళ్వా), సికిందరీ (ఢిల్లీ సుల్తాన్) బంగారు నాణేలు ముఖ్యమైనవి. 15,16 శతాబ్దాల్లో భారతదేశం 15, 16 శతాబ్దాల్లో దక్షిణ భారత విజయనగరం, బహ్మనీ రాజ్యాల సాంస్కృతిక వికాసం, ఢిల్లీ సామ్రాజ్య పతనం, మొగల్ రాజ్య స్థాపనాంశాలు, విజయనగరాన్ని సందర్శించిన యాత్రికులు, బహ్మనీ రాజ్య విచ్ఛిన్నం లాంటివి ప్రధానాంశాలు. ఉదా: షేర్షాకు సంబంధించి అవాస్తవమైన అంశం ఏది? (సివిల్స్ 1996) 1) 1/3 వంతు పన్ను వసూలు 2) రైతులకు కబూఅయత్ పట్టా ఇచ్చాడు 3) 1/4 వంతు భూమిపన్ను ముల్తాన్‌లో వసూలు 4) రూపాయి (వెండి) నాణెం ముద్రించాడు ఎ) 1, 2, 4 మాత్రమే బి) 1, 4, మాత్రమే సి) 1, 3,4 మాత్రమే డి) పైవన్నీ సమాధానం: (డి) మొగల్ సామ్రాజ్యానికి సంబంధించి బాబర్ సామ్రాజ్య స్థాపన, హుమాయూన్ షేర్షాతో చేసిన యుద్ధాలు, హుమాయూన్ శిల్పకళ, షేర్షా సంస్కరణలు, అక్బర్ కాలంనాటి మత విధానం, రాజపుత్ర విధానాలు, దక్కన్, మున్సబ్‌దారీ విధానాలు, జహంగీర్ కాలంలో బ్రిటిషర్ల స్థావరాలు, నూర్జహాన్ పాలన, షాజహాన్ స్వర్ణయుగం, ఔరంగజేబు దక్కన్ విధానాలు, చివరి మొగల్ పాలకులు లాంటి అంశాలు ముఖ్యమైనవి. మొగలుల సాంస్కృతిక, ఆర్థిక విధానాలు, సాహిత్య రంగం, చిత్రకళ, సంగీతం మొదలైన అంశాలు కీలకం. ‘తారీఖ్ ఇ అక్బరీ’- కాందహారీ, ‘తబాకత్ ఇ అక్బరీ’ - నిజాముద్దీన్, ‘ముంతకాబ్ జల్ తవారిక్’-బదాయని, ‘ఇక్బాల్‌నామా’- ముత్మద్ఖాన్ లాంటి గ్రంథాల పేర్లు గుర్తుంచుకోవాలి. మన్సూర్ అలీ పక్షి చిత్రకారుడు, అబ్దుల్సమద్-దస్తక్-ఇ- హమీరంజా, తాన్సేన్, మిత్ర సింహా, తులసీదాస్ లాంటి వారు సంగీత విద్వాంసులు. శివాజీ పరిపాలన, సాహిత్యం, బక్నర్ మరాఠా సాహిత్యం, కాయత్ రాజస్థాన్ సాహిత్యం, బురుంజీ అస్సాం సాహిత్యం లాంటి అంశాలపై పట్టు అవసరం. 2011లో యూపీఎస్సీ నిర్వహించిన పరీక్షలో మొగల్ సాహిత్యానికి సంబంధించి ఎంత లోతైన ప్రశ్న అడిగారో గమనించండి. ప్రశ్న: గ్రంథాలు, వాటి రచయితలకు సంబంధించి కింది వాటిలో సరికానిది? 1) జాఫర్‌నామా - ఔరంగజేబు లేఖలు 2) విచిత్రనామ - హిందూ హీరోల ఆత్మకథలు 3) ‘నక్ష ఇ దిల్ కుష్’ - బీమ్సేన్ 4) ‘తారీఖ్ ఇ షేర్షా’ - అబ్బాస్‌ఖాన్ ఎ) 1, 2 మాత్రమే బి) 1, 2, 3 మాత్రమే సి) 3, 4 మాత్రమే డి) పైవన్నీ సమాధానం: (డి) వివరణ: జాఫర్ నామా (ఔరంగజేబు లేఖలు) బహదుర్షా-2 రచించారు. హిందూ హీరోల చరిత్రలను (ఆత్మ కథలు) విచిత్రనామా పేరుతో దారాషికో రచించాడు. బ్రిటిష్ సామ్రాజ్య విస్తరణ బ్రిటిషర్ల ఆర్థిక, విద్యా విధానాల్లో వచ్చిన సంస్కరణలు, రాజ్యాంగ మార్పులు, పరిపాలనకు చెందిన వివిధ అంశాలు (సివిల్ సర్వీసెస్, పోలీస్, సైనిక, న్యాయవ్యవస్థ) కూలంకషంగా చర్చించాలి. బెంగాల్ గవర్నర్ జనరల్స్, భారత గవర్నర్ జనరల్స్, వైశ్రాయ్‌లు- వారి విధానాలు, బ్రిటిషర్ల నూతన చట్టాలకు వ్యతిరేకంగా రైతులు, గిరిజనులు, కార్మికులు చేసిన ఉద్యమాలు చాలా ముఖ్యం. భారత జాతీయ కాంగ్రెస్ స్థాపన, బ్రిటిష్ పాలనలో భారతదేశ సాంస్కృతిక, సామాజిక రంగాల్లో వచ్చిన మార్పులపై అవగాహన అవసరం. శంభుమిత్ర నాటక రంగంలో, రాంకిరణ్ శిల్పకళలో, రవివర్మ చిత్రకళలో, ప్రమతీష్ బౌర చిత్ర రంగంలో ప్రసిద్ధి. రుక్మిణీ దేవి క్లాసికల్ డ్యాన్సులో, అల్లావుద్దీన్ ఖాన్ హిందూస్తానీ రాగంలో పేరు పొందారు. బ్రిటిషర్ల నిర్మాణ రంగంలో విక్టోరియా మహల్, సెంట్రల్ సెక్రటేరియట్ (పార్లమెంట్), గేట్‌వే ఆఫ్ ఇండియా, మద్రాస్ యూనివర్సిటీ ముఖ్యమైనవి. ముస్లింల సామాజిక ఉద్యమాలు వాహాబీ, మహ్మదీయ, అహ్మదీయ మొదలైన వాటిపై దృష్టి సారించాలి. ప్రశ్న: ఎం.జి.రనడే ‘విధవ వివాహ మండలి’ని ఎవరితో కలిసి ప్రారంభించారు? (2002) ఎ) దారోగా పాండురంగ బి) విష్ణుశాస్త్రి సి) కె. నటరాజన్ డి) పండిత రమాబాయి సమాధానం: (బి) వివరణ: మహారాష్ర్టలో వితంతు వివాహాల కోసం రనడే, విష్ణుశాస్త్రి కలిసి దీన్ని ప్రారంభించారు. పుణేలో వితంతు గృహాలను పండిత రమాబాయి ‘శారదాసేవాసదన్’ పేరుతో ప్రారంభించారు. ముల్క్సదన్ అనేది వితంతువుల కోసం ప్రారంభించిన పాఠశాల. కామాక్షి నటరాజన్ ‘ఇండియన్ సోషల్ రిఫార్మర్’ (1890)ను ప్రారంభించారు.బిటిషర్లకు వ్యతిరేకంగా వచ్చిన సైనిక తిరుగుబాటును స్వాతంత్య్రోద్యమంలో నూతన అధ్యాయంగా చెప్పుకోవచ్చు. కున్వర్సింగ్ (బీహార్), అహ్మదుల్లా (ఫైజాబాద్), మంగళ్‌పాండే (బారక్పూర్), జినాత్ మహల్ (ఢిల్లీ)ల తిరుగుబాటును జేమ్స్ ఓరం, నికల్సన్, కాంప్‌బెల్, రోస్‌లు అణచివేయడం లాంటి అంశాలపై దృష్టిసారించాలి. స్వాతంత్య్రోద్యమ చరిత్ర దీంట్లో మితవాదయుగం (1885-1905), అతివాదయుగం (1905-1920), గాంధీయుగం (1920-1947), విప్లవ వీరుల యుగం (1913-1931) ముఖ్యమైనవి. మితవాదుల ఆలోచనలు, పోరాట పద్ధతులు, వారి విజయాలు, వారి వైఫల్యానికి కారణాలను అధ్యయనం చేయాలి.ఈస్టిండియా అసోసియేషన్ (లండన్), బెంగాల్ బ్రిటిష్ ఇండియా అసోసియేషన్, బ్రిటిష్ ఇండియా అసోసియేషన్ సంస్థల స్థాపకులు ఎవరు? వాటి ఆశయాలు ఏమిటి? లాంటివి ఒకసారి పునశ్చరణ చేసుకోవాలి. ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి దోహదపడిన పత్రికల పాత్ర కూడా శ్లాఘనీయం. వీటిలో చెప్పుకోదగినవి.. మద్రాస్ కొరియర్, బాంబే హెరాల్డ్, హిందూ పెట్రియాట్(1853), అక్బర్-ఓ-సౌదాగర్ (1852), ఇండియన్ మిర్రర్ (1862), స్టేట్స్‌మెన్ (1875), ట్రైబ్యూన్ (1862). కొన్ని సంస్థలు కూడా తమ వంతు పాత్ర పోషించి భారతీయుల్లో రాజకీయ చైతన్యం, జాతీయవాదం, హేతువాదం, సామ్యవాదాన్ని ప్రేరేపించడానికి తోడ్పడ్డాయి. అలాంటి వాటిలో కొన్ని.. బ్రిటిష్ ఇండియా సమాజం (1867) -విలియం ఆడమ్, నేషనల్ ఇండియన్ అసోసియేషన్ (1839)-మేరి కార్పెంటర్, ఇండియన్ సొసైటీ (1872) - ఆనందమోహన్ బోస్ స్థాపించారు. ఈ కాలంలో మహిళల పాత్ర కూడా మర్చిపోలేనిది. అలాంటి వారిలో సరళాదేవి తన ఆత్మకథ- జిబ్నర్ జరా పఠా, లైఫ్ ఫాలెన్ లీవ్స; పండిత రమాబాయి-ఆర్య మహిళా సమాజం, రామేశ్వరి నె్రహూ (బ్రిజ్‌లాల్ నె్రహూ భార్య)- స్త్రీల సమస్యలపై స్త్రీ దర్పణ్ అనే మాస పత్రిక ద్వారా (1909-1924) పోరాడారు. ఈ దశలో ముస్లింల పాత్రకు సంబంధించి సయ్యద్ అహ్మద్- తారీఖ్-ఇ-మహ్మదీయ, మహ్మద్ కాశీమ్ నేనతవిదారుల్-ఉల్-బెరైల్వి దియోబంద్, మిర్జా గులాం-అహ్మద్-బరాహిం, జకాఉలా ్ల-జిల్లి ఉర్దూ రినైసాన్స సంస్థలు జాతీయవాదంలో ప్రముఖ పాత్ర పోషించాయి. బ్రిటిషర్లు పత్రికలపై ఉక్కుపాదం మోపడానికి కింది చట్టాలను చేశారు. * వెర్నాక్యులర్ ప్రెస్ యాక్ట్ 1878 * న్యూస్‌పేపర్ (ఇన్సిట్మెంట్ టు ఆఫెన్స) యాక్ట్ (1905) * ఇండియన్ ప్రెస్ యాక్ట్ 1910 * ఇండియన్ ప్రెస్(ఎమర్జెన్సీ పవర్స్) యాక్ట్ 1931 మరోవైపు సామాజిక సంస్కరణల్లో భాగంగా రనడే-వితంతు గృహాలు (పుణేలో), జ్యోతిబాపూలే-ఇండియన్ నేషనల్ సోషల్ కాన్ఫరెన్స, పండిత రమాబాయి-శారదాసేవా సదన్, డి.కె. కార్వే-బాలికల పాఠశాలలను స్థాపించి తమ వంతు కృషి చేశారు. అతివాదుల కాలంలో వచ్చిన జాతీయోద్యమం, రాజకీయ పండుగ లాంటిదని చెప్పొచ్చు. దీనికి కారకుడు లార్డ కర్జన్. ఇతను రైల్వేలపై (రాబర్‌టసన్), వ్యవసాయంపై (మెక్ డొనాల్డ్), విశ్వవిద్యాలయాలపై (ర్యాలీ) కమిటీలు వేశాడు. చివరకు 1905 అక్టోబరు 16న బెంగాల్ రాష్ర్ట విభజన చేశాడు. ఇతడు తన గ్రంథం ‘ప్రాబ్లమ్స్ ఆఫ్ ఇండియా’లో భారతదేశంలో ఉద్యమాల్లో విద్యార్థుల పాత్రను వివరించాడు. బెంగాల్ రాష్ర్టంలో వచ్చిన పత్రికలు అక్కడి ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించాయి. వీటిలో కొన్ని.. జీ) న్యూ ఇండియా - బిపిన్ చంద్రపాల్ (అనిబిసెంట్ పత్రిక పేరు కూడా ఇదే) జీజీ) బందేమాతరం - అరబిందో ఘోష్ జీజీజీ) సంధ్య - బ్రహ్మోపాధ్యాయ జీఠి) డాన్ - సతీష్ చంద్ర ముఖర్జీ వీటితో పాటు పంజాబీ- లాలాలజపతిరాయ్, భారత్‌మాత-అజిత్‌సింగ్, కామ్రేడ్-మౌలానా మహ్మద్ ఆలీ, ఆల్ హిలాల్-మౌలానా అబుల్ కలాం ఆజాద్ పత్రికలు కూడా చెప్పుకోదగినవి. ఈ ఉద్యమం ఆంధ్ర రాష్ర్టంపై ప్రభావాన్ని చూపింది. గాంధీజీ రాకతో (1915 జనవరి 9న) స్వాతంత్య్రోద్యమ దశలో నూతన శకం ఆరంభమైనట్లుగా చెప్పుకోవచ్చు. దక్షిణా ఫ్రికాలో గాంధీజీ చేసిన తొలి సత్యాగ్రహం ఏది? అక్కడ స్థాపించిన గాంధీ, టాల్‌స్టాయ్, ఫ్యూనిక్స్ ఆశ్రమాల ఉద్దేశాలు ఏమిటి? ఆఫ్రికా అధ్యక్షుడు జనరల్ స్మట్స్, గాంధీ, గోఖలే మధ్య 1914లో జరిగిన ఒప్పందంలోని నిర్ణయాలు? ‘అన్ టు ది లాస్ట్’గ్రంథాన్ని గాంధీజీ ‘సర్వోదయ’ పేరుతో గుజరాతీలోకి అనువదించడంలోని ఉద్దేశం? 1909లో ‘హిందూ స్వరాజ్’ గ్రంథంలో న్యాయవాదులను, డాక్టర్లను, రైల్వేలను ఎందుకు విమర్శించారు? లాంటి ప్రశ్నలపై విద్యార్థులకు అవగాహన ఉండటం ముఖ్యం. భారత్‌లో గాంధీజీ చేపట్టిన సత్యాగ్రహాలు 1. చంపారన్ (1917)- నీలిమందు రైతుల కోసం (శాసనోల్లంఘనోద్యమం). 2. ఖేడా (1918)- గుజరాత్‌లోని గిరిజనుల కోసం (సహాయనిరాకరణోద్యమం). 3. అహ్మదాబాద్ (1918)-గుజరాత్‌లోని కార్మికుల కోసం (నిరాహార దీక్ష). 4. రౌలత్ చట్టం (1919) - దేశవ్యాప్తంగా ‘గాంధీజీ జన బాహుళ్య ఉద్యమం చేసి అన్ని విజయాలు సాధించారు. కానీ జాతీయ నాయకుడిగా చేసిన ఉద్యమాల్లో ఎందుకు విఫలం చెందారు? 1928-22 సహాయనిరాకరణోద్యమం: దీంతో గాంధీజీ దేశంలో తిరుగులేని నాయకునిగా నిల్చిపోయారు. ఈ ఉద్యమం ప్రారంభించడానికి కారణాలు? చౌరీచౌరా సంఘటన (1922 ఫిబ్రవరి 5న)తో ఎందుకు నిల్పివేశారు? స్వరాజ్య పార్టీ (1923), అఖిల భారత రాష్ర్ట ప్రజల సంస్థ (1927), కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ (1934), ఫార్వర్డ బ్లాక్ (1939), భారత కమ్యూనిస్ట్ పార్టీ (1925) ఎందుకు ఆవిర్భవించాయి? వాటి ముఖ్యాంశాలు మొదలైన వాటిపై దృష్టి పెట్టాలి. మాదిరి ప్రశ్నలు 1. ‘మహ్మదరన్ సాహిత్య సమాజం(1863)’ స్థాపకులు ఎవరు? (2001 సివిల్స్) 1) నవాబ్ అబ్దుల్ లతీఫ్ 2) సయ్యద్ అమీన్ ఆలీ 3) షరియతుల్లా 4) డాక్టర్ ముత్కార్ అహ్మద్ అన్సారీ 2. కింది వాటిలో సరైంది? (2002 సివిల్స్) 1) దీనమిత్ర - రామన్ పిళ్లై 2) మార్తాండ వర్మ-ముకుంద్‌రావు పాటిల్ 3) న్యూ ఇండియా- విష్ణు కృష్ణ చిప్లూంకర్ 4) నిబంధన మాల - బిపిన్ చంద్రపాల్ 5) మహానిర్వాణ్ తంత్ర - రాయ్ వివరణ: దీనమిత్ర: నీలిమందు రైతుల గురించి ముకుంద్‌రావు పాటిల్ వివరించాడు. మార్తాండ వర్మ: ట్రావెన్కోర్ రాజు వివరాలు సి.వి.రామన్ పిళ్లై రచించాడు. న్యూ ఇండియా: బిపిన్‌చంద్రపాల్ పత్రిక నిబంధన మాల- విష్ణుకృష్ణ చింప్లూకర్ రచన 3. కింది వాటిలో తీవ్రవాద సంస్థ - వాటి స్థాపకుల్లో సరికానిది? 1) యంగ్ ఇండియా - దామోదర్ సావర్కర్ 2) హిందూస్తాన్ ప్రజా తాంత్రిక్ సంఘ్ - సూర్యసేన్ 3) ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ - భగత్‌సింగ్ 4) భారతమాత - అజిత్‌సింగ్ వివరణ: ఇండియన్ రిపబ్లిక్ ఆర్మీని సచీంద్ర సన్యాల్ స్థాపించారు. భగత్‌సింగ్ ‘నవభారత జవాన్’ను స్థాపించారు. 4. గాంధీజీకి సంబంధించి సరికానిది? 1) తొలి శాసనోల్లంఘన ఉద్యమం - 1930 ఏప్రిల్ 6న 2) తొలి సహాయనిరాకరణోద్యమం - 1918 ఖేడా ఉద్యమం 3) తొలి నిరాహార దీక్ష 1918- గుజరాత్ అహ్మదాబాద్ మిల్లు కార్మికుల కోసం 4) తొలి ఆశ్రమం- సత్యాగ్రహ ఆశ్రమం 1915లో స్థాపించారు. వివరణ: తొలి శాసనోల్లంఘన ఉద్యమం గాంధీజీ 1917 చంపారన్ జిల్లా మోతీహారి గ్రామంలో (బీహార్ రాష్ర్టం) చేశారు. సమాధానాలు: 1) 1 2) 5 3) 3 4) 1